పరోపకారం - స్వచ్ఛంద సేవ

నేను ఈ మధ్య అమెరికాలో వెలువడుతున్న ఓ ఇండియన్ మాసపత్రికలోని ఒక వ్యాసం చదవడం జరిగింది. చదవడం పూర్తయిన తర్వాత కొన్ని నిమిషాలు దానిలో రాసిన కొన్ని అంశాల గురించి అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాను. ఆ వ్యాస రచయిత్రి అమెరికాలో పుట్టిపెరిగిన భారతసంతతికి చెందిన అమ్మాయి. వయస్సు ఇరవైలో ఉంటుందేమో. చదివింది ఏడ్యుకేషన్ రంగంలో. పనిచేసేది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ గా అమెరికాలో. ఈ మధ్య స్వచ్ఛంద సేవ చెయ్యటానికి ఇండియా వెళ్ళింది. మనదేశ రాజధాని ఢిల్లీలో ఒక సేవాసంస్థతో కలిసి మురికివాడల్లో నివసిస్తున్న పిల్లలను, రోడ్డుమీద బిచ్చమెత్తుకునే పిల్లలను కొన్ని నెలలు బడికి రప్పించి చదువు చెప్పింది. ఆవిడికి భారతదేశం వెళ్ళడం అదే మొదటిసారి. అక్కడ పనిలో తనకు కలిగిన అనుభవాలను, పెంచుకొన్న అభిప్రాయాలను సులభమైన భాషలో ఆ వ్యాసంలో క్రోడీకరించింది. వయస్సులో చిన్నదే అయినా కొన్ని ఆణిముత్యల్లాంటి మాటలను చెప్పింది. 'వినదగునెవ్వరు చెప్పిన...' అనే సుమతీ సూక్తి ఆధారంగా నేను ఆ మాటలని సుజనరంజని పాఠకుల కోసం కింద ఉటంకిస్తున్నాను.

 • అలాంటి పిల్లలు మరుసటిరోజు బడికి రప్పించగలిగేటట్టు చేస్తే అదే ఘనకార్యం సాధించినట్టవుతుంది. అదే నేను చేసే పెద్ద సేవ.
 • ఈ అనుభవం అమూల్యమైనది. ఈ జ్ఞాపకం జీవితకాలం నెమరువేసుకునేలా తోడు ఉంటుంది.
 • ప్రతిఒక్కరు తమ జీవనచట్రంలో నుండి బయటకు అడుగిడి కొంత కాలం పరోపకారసేవకు వెచ్చించగలిగితే, అది ఎంతతక్కువ కాలమైనా కావచ్చు, ఎంత చిన్న పనైనా గావచ్చు, కాని అది మనమీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.
 • నేను ఆ అభాగ్యుల ప్రతీ సమస్యను పరిష్కరించ లేకపోవచ్చు. కాని వారికి చూపించిన 'నేనున్నాను ' అనే భావన, ప్రేమను నా అదృష్టంగా భావిస్తున్నాను.
 • The best way of find yourself is to lose yourself in service of others. - Mahatma Gandhi అంటూ ఇంకో చోట చెప్పిన మాట గమనార్హం. అదేమిటంటే, భారతదేశంలోని స్వచ్చంద సేవాసంస్థలు ఎక్కువ సమయం నిధులను సమకూర్చుకోవటంలో, ప్రముఖులతో సంబంధబాంధవ్యాలను పెంచుకోవటలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ తమ సంస్థల మూల ధర్మాల్ని విస్మరిస్తున్నాయని. ఇది మనందరికి విదితమే కాబట్టి ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు.

  ఈ మధ్యకాలంలో భారతదేశం అభివృద్ధి పథంలో శరవేగంగా ముందుకు దూసుకెళ్ళుతున్నదని ప్రపంచమంతా కోడై కూస్తున్నది. అందులో లేశమాత్రం సందేహం లేదు. కాని మనం భారతదేశ జనజీవితాల లోతుల్లోకి తొంగిచూస్తే బయటపడే నిజాలు ఏవిటంటే, దాదాపు 300 మిలియన్ల ప్రజలు దారిద్ర్యరేఖ దిగువున బ్రతుకుతున్నారనీ, వాళ్ళంతా నిరక్షరాస్యులనీ. అలాగే, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఫలాలు నిరక్ష్యరాస్యులకి, అట్టడుగున ఉన్న బీదవారికి, మారుమూల గ్రామాలకి చేరువ కావాలంటే ఇంకా చాలా దశాబ్దాలు పట్టవచ్చు. వారిని పైకి తేవటానికి నిర్వహించే ప్రభుత్వపథకాలు, ఇతర సంస్థల చేసే సేవలు నూటికి నూరుపాళ్ళు ఆ అభాగ్యులను చేరాలాంటే ఎన్నో అడ్డంకులు ఉన్నాయని మనందరికి తెలుసు. మరి మిగిలిన కర్తవ్యం ఏమిటంటే, ఈ ఉపాధ్యాయురాలిలా ప్రతిఒక్కరు తమ శాయాశక్తులా ఏదోకొంత చేయూతనివ్వడమే.

  "అష్టాదశపురాణానాం, సారం సారం సముద్దృతం
  పరోపకారః పుణ్యాయ, పాపాయ పరపీడనం"

  పై శ్లోకం ఏమి చెపుతున్నదంటే, పద్దెనిమిది పురాణాల్లోని సారమొక్కటే, అది పరోపకారం చేస్తే పుణ్యమనిన్నీ, ఇతరులను బాధించడం పాపమనీన్ను. కాబట్టి, భవిష్యత్తులో నేను ఎంతో కొంత మన బడుగు వర్గాల సోదరులకు సేవ చెయ్యటానికి ఎదురుచూస్తూ, మీరందరూ ఇలాగే ఆలోచిస్తున్నారని ఆశిస్తూ...

  మీ

  తాటిపాముల మృత్యుంజయుడు


  సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.

 • ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
       ఫర్వాలేదు
  మీమాట ఒక్క మాటలో.... Page Title
      
  Test Page

  మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
  దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
  వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
  (Please leave your opinion)

  పేరు(Name):

  విద్యుల్లేఖ (Email):

  అభిప్రాయం (Opinion):


   

  గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
  (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)