సుజనరంజని మూలస్థంభాలైన సాహిత్య, సంగీత,నృత్య నటనలలో ప్రతి నెలా వివిధ అంశాలను ప్రస్తుతపఱచడమే మా ధ్యేయం. అందులో భాగంగా ఈ నెల స్వరసంగమం శీర్షికలో తల్లాప్రగడ రావు గారిచే రచింపబడి, శ్రీ శాయి మానాప్రగడ గారిచే స్వరపరచబడిన ఓ మధురమైన గజల్ గానం మీకోసం...
నీతొ స్నేహం కూడా కష్టమే
ఒక్కసారే అంత అందం చూస్తె, మూర్చవచ్చేస్తుంది నాకు!
అంత అందంగ నవ్వాల్సిన, అవసరమేమొచ్చింది నీకు!
నీతొ స్నేహం కూడా కష్టమే
చేయకున్నా కూడా నష్టమే
నీతొ మాటైన కలుపలేనీ
నా గుండె దడా కష్టమే
నీతొ స్నేహం కూడా కష్టమే
చేయకున్నా కూడా నష్టమే
నీవు ఎదురుంగ కూర్చునున్నా,
ఈ దూరం చూడా కష్టమే
నీతొ స్నేహం కూడా కష్టమే
చేయకున్నా కూడా నష్టమే
నీవు దూరం ఎంత వెళ్ళినా,
నీ తలపులు వీడా కష్టమే!
నీతొ స్నేహం కూడా కష్టమే
చేయకున్నా కూడా నష్టమే
నీవు క్షేమంగ లంకనున్నా
రామచంద్రుడికీ ఈడా కష్టమే!
నీతొ స్నేహం కూడా కష్టమే
చేయకున్నా కూడా నష్టమే
సాయి మనాప్రగడ గారు, తన తండ్రి స్వర్గీయ నరసింహ మూర్తి గారి నుంచీ వారసత్వంగా సంగీత స్వర సంపదను పొందారు. రేడియో లోనూ దూరదర్శన్ లోనూ అనేక సార్లు పాడారు. రాష్ట్రపతీ భవన్ లో జాతీయ సమైక్యతా అవార్డును పొందారు. కె.వి. మహదేవన్, ఇళయరాజాలకు రంగస్థలం పై కీ బోర్డ్ సహకారం అందించారు. కొన్ని సినిమాలకి కూడా సంగీత సహకారం అందించారు. అనేక వాణిజ్య ప్రకటనలకు కూడా సంగీత సహకారం అందించారు.