సుజననీయం

-- తల్లాప్రగడ రావు

సంపాదక బృందం:

తల్లాప్రగడ రావు

కూచిభొట్ల ఆనంద్

తాటిపాముల మృత్యుంజయుడు

శంకగిరి నారాయణ స్వామి

డా. జుర్రు చెన్నయ్య

ప్రఖ్య వంశీ కృష్ణ

శ్రీమతి తమిరిశ జానకి

శీర్షికా నిర్వాహకులు:

కాకుళవరపు రమ

పసుమర్తి బాలసుబ్రహ్మణ్యం

సాంకేతిక సహకారం:

తూములూరు శంకర్

మద్దాలి కార్థీక్

వక్కలంక సూర్య

లొల్ల కృష్ణ కార్తీక్

అక్షర కూర్పు:

మహేశ్వరి మద్దాలి

అనంత్ రావు

ప్రచార విభాగం:

అయ్యగారి లలిత

కొండా శాంతి


ముఖచిత్రం:

ఇటీవల కీర్తి కాయులైన ప్రఖ్యాత రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు


సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.


కంప్యూటర్ సహకార భాషాధ్యయనం- తెలుగు పఠనం

సీ// ఆర్ట్సు చదువులైన, ఆర్టిస్టు పనులైన, ఆర్టిసీ బస్సైన, అరిశ కొన్న,

సివిలింజినీరింగు సవి చూడ వెళ్ళిరా, టెలెకాము చదువులే వెలగ బెట్టు,

ఈ లెర్నింగులకైన ఏ లెర్నింగులకైన, కంప్యూటరేలేని క్లాసు రూము

ఎందెందు వెదకిన నూ దొరకకనుండె! క్షామ కాలమ్మయా రామచంద్ర!

మొన్న ఫిబ్రవరి సంచిక సంపాదకీయంలో, బహుళభాషా ప్రయోగ ప్రాముఖ్యతను గురించి చర్చించాం. ఇప్పుడు కంప్యూటర్ సహకార భాషాధ్యయనం (Computer Assisted Language Learning -CALL) గురించి ఆలోచిద్దాం. దినినే ఆంగ్లంలో కాల్ (CALL) అని వ్యవహరిస్తారు.

ఇప్పుడు ఏమి నేర్చుకోవాలన్నా, చెయ్యాలన్నా కంప్యూటర్ లేకుండా ఏమి చెయ్యలేని పరీస్థితి మనది. ఇలాంటి స్థితిలో మనం విద్యాభ్యాసం నుంచీ పురాణపఠనం వరకూ అన్నిటికీ కంప్యూటర్ ల పైనే ఆధారపడి ఉన్నామంటే అతిశయోక్తికాదు. మన విద్యాభ్యాసం, వికాసం, వినోదం, సమాచారం, సంభాషణం, సహజీవనం, అన్నీ కంప్యూటర్ల తోటే జరుగుతోంది కాబట్టి మన భాషా అధ్యయనం కూడా దిని తోటే జరగాలి అని అనుకోవడమేమీ అంత ఆశ్చర్యకరం కాదు. అందువల్ల కాల్ గురించి తెలుసుకోవడం, దానిలోని లోతుపాట్లను గ్రహించడం ఎంతైనా అవసరం.

ముందుగా CALL చరిత్రను పరిశీలిద్దాం. కాల్ పై గత 30 ఏళ్లగా అనేక విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయి. ఇది మూడు దశలలో అభివృద్ధిచెందుతూ వచ్చింది.

ప్రవర్తక కాల్ (Behavioristic CALL): 1950-60లలోని సంవత్సరంలోని మఔలిక సిద్ధాంతాలకి అనుగుణంగా 1960-70 ప్రాంతాలలో దీని పై అనేక పరిశోధనలను జరిపి, కాల్ ని మొట్టమొదటగా రూపొదించారు. ఇందులో మళ్ళీ మళ్ళి, నేర్చినదానినే మరల నేర్చుట (Drill and Practice) అనేది ముఖ్యాంశం. కంప్యూటర్ ఉండటంవల్ల పున: అభ్యాసం తేలికవుతుంది. మొదటిలో ప్లాటో అనే కంప్యూటర్నీ దీనికొరకు ఉపయోగించారు. ఇది విద్యార్థిని వేరు వేరు రకాలుగా అవే ప్రశ్నలను వేసి, సమాధానాలు బాగా వంటబట్టేటట్టు చేస్తుంది. అంటే బట్టీయం వేయిస్తుంది అనుకోవచ్చు. ఇది ఉపాధ్యాయులిచ్చే పాఠ్యాశాలను విద్యార్ధులకు అందచేసే మాధ్యమంగా కూడా బాగా ఉపయోగపడుతుంది.

సంభాషణాయుత కాల్ (Communicative CALL) : ముందున్న ప్రవర్తక కాల్ లో మాటని విద్యార్థి గుర్తించగలడుగానీ, వాటిని సరిగా ఉపయోగించలేడు. అలాగే మాటలను సరిగా పలుకటం నేర్పలేదన్న సంశయంతో ఈ పరిశొధనాదశ 1970 నుండి 90ల వరకు జరిగింది. అందుచేత శాస్త్రవేత్తలు భాషా ఉచ్చారణపై, భాషా ఉపకరణపై జోరుని పెట్టారు. పాఠ్యప్రభావిక భాషపైకాక స్వాభావిక సిద్దమైన అనుకరణే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అంటే drill కన్నా skill ముఖ్యమని వీరి వాదన. అలాగే భాషాభ్యాస క్రీడలను ప్రవేశ పెట్టారు. విద్యార్థి ఇచ్చే సమాధానము అక్కడున్న వాటిలో ఒకదానిని ఎంచుకోవడం కాకుండా, తన ఇష్టాన్ని బట్టి ఇస్తాడు. అనేక విద్యార్థులమద్యన, సహాద్యాయ వైఖరికి సృష్టించారు. దానితో పోటిలూ, గెలుపులూ, ఆనందాలనూ పంచి ఇచ్చారు. ఈ పద్దతి కొంత వరకూ విజయవంతమైనదనే చెప్పుకోవాలి. ఈ దశలోనే కంప్యూటర్ని ఉద్యోగావసారానికి వాడుకునే విధాలని రూపొందించడం జరిగింది. వర్డ్ ప్రోసెసర్స్, స్ప్రెడ్ షీట్లు, మున్నగునవి ఇప్పుడు మన కార్యాలయాలలో అత్యవసర భాగమైకూర్చున్నాయి. కానీ ఇది అనుకున్నంతగా పూర్తిగా భాషా ప్రవేశాన్ని తేలేకపోయింది.

సమన్వయ కాల్ (Integrative CALL): ఈ అభివృద్ది అనేక దిశలలో గత దశాబ్దం నుంచీ జరుగుతోంది. కంప్యూటర్ ల అభివృద్ది అధిక వేగతరంగా అనేక రంగాలలో జరగడమే దినికి ప్రధానమై తోడ్పడుతూ వచ్చింది. మొదటీ రంగం మల్టీమీడియాలో (టెక్స్టు, వీడియో, ఆడియో, గ్రాఫిక్సు, ఆనిమేషన్లు) సాధించిన ప్రగతి మూలకంగా, అన్నిటినీ ఒకేసారి చూసి, మున్నెన్నడూ చేయలేని పనులను చేయగలుగుతున్నారు. అధ్యయనంలో భాగంగా దృశ్య శ్రవణోపకరణాలను ప్రయోగించి, ఒక కృత్రిమ (లేక virtual) తరగతికి రూపకల్పన చేసి, సహాద్యాయ పద్దతిని తయారు చేయటమే కాకుండా, ప్రతి విద్యార్థీ తరగతిలోని నలుగురిలో ఒకడుగా ఉంటూ కూడా, మళ్ళీ తనకి ఇష్టమైన గతిలో కూడా నేర్చుకునేటందుకు కావలసిన సదుపాయాన్ని కూడా సమకూర్చగలుగుతున్నారు. హైపర్ మీడియా ద్వారా భోధనతోపాటుగా, సమగ్ర భాషాకోశాలనూ, ఉచ్చారణ స్మృతులనూ, వ్యాకరణ దోషాలనూ, పరిభాషా వ్యాక్యలనూ, సంబంధిత గ్రంధాలనూ, సమన్వయం చేసి అన్నిటినీ ఒకేచోట దొరికేటట్టు చేయడం సాధ్యమయ్యింది. ఇన్ని సదుపాయాలున్నా హైపర్మీడిYఆ అనుకున్నాంత విజయం సాధించలేదు. ఎందుకంటే, పాఠ్యాంశ నాణ్యతా లోపమే కాకుండా, కంప్యూటర్ యొక్క స్వయంసిద్ద తెలివితేటలు, human interactivity of computer లో కూడా ఉన్న లోపాలే కారణం కావచ్చు. అలాగే Artificial Intelligence (AI) మరికొంత అభివృద్ధిచెందితేగానీ, కాల్ కి సార్ధకత రాదు.

ఈ లోపాలను సరిదిద్దుతూ అంతర్జాల (Internet ) రంగం ముందుకు వచ్చింది. 1960 నించీ ఉన్నదైనా, అభివృద్ధిని ఇటీవలే సాధించిన Computer-mediated communication (CMC), internet జననంతో మళ్ళీ ఊపిరిపోసుకుని, ఎంతో ఉపయోగకారిగా రూపుదిద్దుకుంటొంది. దీని వల్ల విద్యార్థి తన గురువుతోటి, తోటి విద్యార్ధులతోటి, ఎప్పుడుకావాలంటే అప్పుడు, ఎక్కడ కావలంటే అక్కడనుంచీ సంభాషించగలగుతున్నాడు. ఈ సంభాషణ ఏక కాలంలో చేయొచ్చు, లేక అనువు ఎవరి బట్టి వారు చేయచ్చు. దీనితో ఒకరి-నుంచి- ఒకరికి లేక, ఒకరి-నుంచి- అనేకులకి, సహాధ్యాయనం సంభవించే అవకాశాలున్నాయి. అలా గురుశిష్య సంబంధం కూడా ఏర్పడే అవకాశం ఉంది. CMC, అంతర్జాలముల(Internet) సమన్వయంటో ఉపాధ్యాయుల పాఠాలను వినడం, చూడటం, హోం వర్కులు చేయడం వంటి పనులేకాక, వెబ్ లో నున్న, పలు గ్రంధాలను, తతిమా సమాచారాన్ని, ఆడియోలను, వీడియోలనూ, శోధించగలిగి, సరియైన పరిశోధకులుగా తయరవ్వడానికి సహాయపడుతున్నాయి. అందుకని దీనిని సమన్వయ కాల్ అనవచ్చు. కాని రోజు రోజుకీ, వీటికి అధికమైన బాండ్ విడ్త్ అవసం పెరిగుతూ వచ్చింది. కొంతవరకు బ్రాడ్ బాండ్ మూలంగా పరిస్థితి మెరుగయ్యిందికానీ Internet band width ఇప్పుడు ఒక క్రొత్త సమస్యగా ఉందని అనేకుల అభిప్రాయం.

ఈలా కంప్యూటర్ల ద్వారా మనం మన భాషను కూడా నేర్చుకోవచ్చని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనివల్ల ఉపయోగాలను చూసాం, అలాగే లోపాలనూ పరిశీలిద్దాం.

  • 1) కాల్ ఒక మాద్యమమే కానీ పద్ధతి కాదు. ఆంటే ఇది నిజంగా దానంతట అది ఏమీ నేర్పలేదు. ఇది అనేక రకాలైన విద్యాభోధనా పద్దతులకు సరిక్రొత్త మాద్యమం మాత్రమే.
  • 2) ఇది సామాన్య విద్యా ప్రదానానికి ప్రత్యామ్నాయం కాదు కానీ, ఈ రెండు విధానాలు కలిస్తే దాన్ని మించిన పద్దతి లేదు అన్న విషయం ప్రస్పుటం అవుతోంది.
  • 3) ఒక యూరోపియన్ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే--- భాషాభోధనకీ, మిగితా సబ్జక్టులు(science, history, etc) నేర్పడానికీ చాలా తేడా ఉన్నదట. భాషను నేర్పడంలో ఒక జ్ఞాన ప్రసారమే(knowledge transfer) కాకుండా నేర్పరితనం (skill) కూడా చాలా ముఖ్యమనీ, ఇది సంగీతం నేర్పడం వంటి విద్యేననీ తేలింది. అంటే గురుముఖంగా నేర్చుకుంటే ఫలితం ఎక్కువ ఉంటుంది.
  • 4) కాల్ విద్యార్దులకు వీడియోలు, ఆడియోలు మున్నగునవి అందుబాటులోకి తెచ్చినా, విద్యార్థులు వాటిపై నిజంగా ఎంత శ్రద్ద చూపుతున్నారు లేక చూపగలుగుతున్నారు అనేది సరికొత్త పరిశోధనాంశం. ఎంతో చర్చనీయాంశం కూడానూ. దీనిని తరువాతి సంపాదకీయంలో చర్చిద్దాం..

కాబట్టి వీటన్నిటి బట్టీ తేలేదేమిటంటే, భాష నేర్చుకోవడానికి, గురోన్ముఖంగా నేర్చుకోవాడం కన్నా మించిన విద్యావిధానం ఇంకోటి లేదు. కానీ, గురువుకు, కాల్ ని కలిపితే అది అత్యుత్తమమన్నది ఇప్పటి పరిశోధకుల పరిశీలన. అందుకని మన సిలికానంధ్ర పెట్టిన "మన బడిలో" గురోన్ముఖంగా నేర్పటమేకాక, కంప్యూటర్ సహకార అధ్యయన పద్దతులను కూడా ప్రవేశ పెట్టాలని ప్రయత్నిస్తున్నాం. నిజానికి ఈ సుజనరంజని కూడా అందులో ఒక భాగమే అనుకోవచ్చు. సుజనరంజనిలో పద్యం హృద్యంతో పాటు, వీరతాళ్ళు, కొత్త కెరటం, పదవిన్యాసం వంటి శీర్షికలను మీముందుకు తీసుకురావడంలో నున్న ముఖ్య ఉద్దేశ్యం ఇదేనని ఇప్పటికే మీరు గ్రహించే ఉంటారు.

ఈ బృహుత్ యజ్ఞానికి మీ అందరి సహకారం ఎప్పటిలాగే అందిస్తారని ఆశిస్తూ,

మీ

తల్లాప్రగడ