పదవిన్యాసం

నిర్వహణ: కూచిభొట్ల శాంతి

ఆధారాలు :

నిలువు:

1. చక్కని మధురమైన ధ్వని... (5)

2. శీతోష్ణస్థితి తెలిపేది... (7)

3. ఆకాశం చెంగావి రంగు అలముకునే సమయం... (4)

4. దీపజ్వాల... (3)

5. చెప్పిన మాట వినకుండా అల్లరిచేస్తే వచ్చే బహుమతి... (10)

6. గంపగయ్యాళికి బిరుదోపమానము... (6)

7. ఇదిలేని బొంగరం పనికిరాదు... (3)

13. అధిక ఓట్లతో ప్రత్యర్థిపై "తిరుగులేని గెలుపు" సాధించారు.. (6)

15. మొరటు లేక మోటు... (3)

17. కళ్ళప్పగించి చూస్తుంటే ఈ పక్షితో పోలుస్తారు... (4)

19. చాలా ఇష్టమైన... (2)

20. డబ్బుపెట్టిక్ని, ముందరపెట్టుకుని ఏడిచే కూర... (3)

21. అన్నీ తెలిసినవారు. "మీకు" ఇంకేం చెప్పాలి? (3)

22. అంత "నెమ్మదిగా పరిగెత్తి" ఎప్పటికి చేరుకుంటావు? (3)

అడ్డం:

1. ఇంటి గుమ్మం 'ఇదీ లేకుండా ఉండదు... (4)

2. ఒక రకం పూలు... (5)

8. "తీగ"లాగడం కొంచెం ఎక్కువైంది... (2)

9. దేవునికి దీనితోపాటు గంటకూడా మోగిస్తారు... (3)

10. బుగ్గలోపలి భాగము.. (3)

11. నవరత్నాలలో ఒకదానితో చేసిన నగ... (6)

12. ఊపిరి అట్టిట్టయితే ఇంకెలా? (3)

13. ఒక సముద్రరాజపత్ని.... (5)

14. ఇది సరిగాలేని విలుకాడికి పక్షీ, పండూ ఏదీ దక్కదు.. (4)

16. మడత బొందుకీలు మడతపడింది... (3)

18. వచ్చింది తాటినుంచి అయినా పూలతో చక్కగా అమరింది... (3)

20. ఆత్రేయగారి బిరుదు మన నుంచి వేరుచేస్తే... (3)

21. ఇది ఒక గుణం... (4)

23. "హిరణ్యం" మీద వ్యామోహం అందరికీ... (3)

24. మంచి జరగాలని కోరుతూ అశీర్వచనం.... (5)

25. చురుకైన బుధ్ధిమంతుని బుర్ర దీనితో పోలుస్తారు... (3)

26. దీపం "కొండెక్కు"తోందోచ్... (4)

ఇక మీరు చేయవలసినదల్లా...

అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
మే 25, 2007

ఈ-మెయిలు: santhi@siliconandhra.org

చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014

గత మాసపు పదవిన్యాసం సమాధానాలు:

క్రితం మాసం విన్యాసపు విజేతలు:
1. శ్రీలక్ష్మి పోలంరెడ్డి, పిట్స్‌బర్గ్, పెన్సిల్వేనియా
2. సుమతి నరేంద్ర పాల్వాయ్, బ్రూక్లిన్, ఒహాయొ
3. విజయజ్యోతి రెడ్డివారి, కాంకర్డ్, కాలిఫోర్నియా

సరిగా పూరించిన వారు:
1. నిరంజన్ ఇందూర్, జర్మన్ టౌన్, మేరిలాండ్
2. సుందర లక్ష్మి, హైదరాబాద్, భారతదేశం
3. శుభ వల్లభ, టారి టౌన్, న్యూయార్క్

విజేతలకు పుస్తకాలు పంపిస్తాము.