మా పెళ్ళి పల్లకి

--మొదుముడి చంద్రశేఖర్,
పద్మజ

అతడు

మాది మద్యతరగతి కుటుంబం. మేము ఐదుగురు పిల్లలము. మా అమ్మ, నాన్నగారు మా ఐదుగురిని పంచ ప్రాణాలు గా చూసుకునెవారు. నీను అందరికన్న చిన్నవాడిని.నాకు అన్ని విషయలలొ మా అన్నయ్యే రొల్ మోడల్. నేను మంచి రాంకు వచ్చి, బీ. టెక్. పూర్తి చెసి, ఎం. టెక్ కూడా ముగించి బెంగలూరు లొ పని చెస్తుండగా నాకు మచ్చి అవకాశం అమెరికాలొ వచ్చింది.

నేను మా అమ్మ, అన్నయ్యల సలహ తీసికొని ఆమెరిక లో ఉద్యొగానికి కి వెళ్ళాను. నేను వంటరిగ వుంటున్నానని అమ్మ వాళ్ళు పెళ్ళి చెసుకొ మని అంటే సరె అన్నాను. సంప్రదాయం ప్రకారం ముందు పెద్ద వాళ్ళు చూడటం తరువాత నేను చూడటం సబబు అనుకున్నాను. అందుకే మా అక్క బావగారు వెళ్ళి అమ్మాయిని చూసారు. ఫోన్ లొ అక్క 'అమ్మయి బావుంది, వాళ్ళ కుటుంబము కుడా బావుంది, నీకు సరి జొడి అవుతుంది, తొందరగ ఇండియా కి వచ్చి అమెను చూడూ అని చెప్తె, సరె అని జులై, 1997 లొ ఇండియా కి బయలుదేరాను.

హైదరాబాదు లొ దిగిన వెంటనె, అమ్మ వాళ్ళు అమె ఫొటొ, బయోడేటా చూపించారు. ఫొటో లొ ఆమె సాద సీదా గా వుంది, కాని, ఆమె నాన్న గారు తన బయోడేట ప్రెపేరు చెసిన విధానం నాకు నచ్చింది. యే సఫ్ట్ వేర్ జనరేషన్ లొ పెళ్ళి బ్రోషర్ లా రెస్యుమే లనివ్వడుం నన్ను ఆశ్చర్య పరచింది.

మర్నాడె, నేను, అమ్మ, పెద్ద అక్క కలసి పెళ్ళి చూపులకి వెళ్ళాము. 'ఛూపులు కలసిన శుభవేళ ' అంటె ఇదేనేమో. అమ్మాయి బావుంది, ఫొటొ లొ చుసిన లాగ లేదు - 'జొ బాత్ థుజ్ మె హై వొ తెరి తస్విర్ మై నహి ' అన్న ంఒహ్మద్ రఫీ పాట గుర్తుకు వచ్చింది. కాని, పెళ్ళిచుపులలొ అమెకు క్లాస్మట్ నుంచి ఫొనెకాల్ వచ్చింది. ఆమె చాల సేపు ఫొన్ లొ మాట్లాడింది. అది నాకు అంత నచ్చలెదు. కాని అన్ని బావుంది కదా ఫరవా లేదులే అనుకున్నము. తరువాత తెలిసింది ఆమెకు ఫొనె వస్తె అస్సలు వదలదు అని.

నాకు మా అన్నయ్య రొల్ మోడల్ కదా - వేరె ఏమి సంబంధాలు చూడకుండానె మొదటి పెళ్ళి చూపులల్లొ చూసిన ఈమెను సరే అనుకున్నాము. మళ్ళీ మాట్లడాలనిపించింది. సరే అని, ఒక వారం తరువత మళ్ళీ కలిసాను. రెండొ సారి కలిసి మాట్లాడినప్పుడు అనుకున్నాను - ఈమె నా జీవిత భాగస్వామి అని.

ఆమె

నేను చాల సెంటిమెంటల్ అమ్మాయిని. నేను MCA చదువు తున్నాను. చివరి సెమిస్టెర్ లొ వున్నాను. కాలెజి లొ కాంపస్ ఇంటర్వ్యూస్ మొదలైయ్యాయి. స్నెహితు లందరితొ నేను కూడా ఇంటర్వూస్ కి ప్రెపేర్ అవుతున్నాను. సత్యం లొ కాని విప్రొ లొ కాని రావాలి లేద అమెరిక కు వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి అని కల. నా కల గురించి మా అమ్మ నాన్న గారి కి చెప్పాను. నాన్న గారి కి అర్ధం ఇయ్యింది - నాకు అమెరికా వెళ్ళాలని వుంది అని. ఒక్క దాన్నె పంపించడం కంటె పెళ్ళి చేసి పంపించాలని నాన్న గారు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.

ఒక రొజు నాన్న గారి కి ఫొన్ కాల్ వచ్చింది. నన్ను చూడటానికి ఎవరొ వస్తారని అన్నారు. నీను ఇంటర్వ్యూకి లాగ ఏమి ప్రెపేర్ అవ్వలేదు. అతని అక్క బావగారు వచ్చారు. అబ్బాయి వచ్చాక మళ్ళి కలుస్తాము అన్నారు. ఆ రొజు 26, జులై 1997, శనివారము. ఆబ్బాయి వచ్చాడని ఫొన్ చేసారు. మా అమ్మేమో అబ్బాయి వస్తున్నాడు కదా అని చీర కట్టుకొమంది. నేను పసుపు, మరూన్ బార్డర్ బెనారెస్ చీర కట్టుకున్నాను. బాల్కని లో వైట్ చెస్తున్నాము. ఆటొ దిగుతున్న ఆతనిని చూస్తె అతను కూడా మెరూన్ రంగు టీ-షర్ట్ వేసారు. నీను 'what a coincidence' అని అనుకున్నాను. అతని తొ తన అమ్మ గారు, పెద్ద అక్క వచ్చారు. చూడటానికి కూడా బానేవున్నరే అనుకున్నాను.

పెళ్ళిచూపుల్లొ అతను నాతొ మట్లాడాలి అన్నారు. నేను ఎక్కువ మట్లాడక పోయినా అతనే మాట్లాడారు - చాల ఫ్రంక్ మనిషి అనిపించింది. తర్వత అతని అమ్మ గారు 'ఒక వారం అయ్యాక ఫొన్ చేస్తాము ' అన్నారు. సరిగ్గా మళ్ళీ శనివారం నాడు ఫొన్ వచ్చింది, అతను మళ్ళి కలుస్తారు అన్నారు. కాసేపు మట్లాడుకున్నాము. రెండొసారి వచ్చారు అంటెనే ఈ సంబంధమే కుదిరింది అన్నుకున్నాను. మర్నాడు యెప్పటి లాగె నీను ప్రాజెక్ట్ వర్క్ కి వెళ్ళాను. అతను అక్కడకు వచ్చి సర్ ప్రైజ్ చేసారు. ఎంగేజెమెంట్ రింగ్ కొనడానికి వచ్చాను అన్నారు. నాకు చాల నచ్చింది.

రెండు రొజుల్లొ ఎంగేజెమెంట్, తరువాత పది రొజులల్లొ పెళ్ళి అన్నారు. పెళ్ళి ముహుర్తం కూడా శనివారమే వచ్చింది. శనివారం మాకు చాలా కుదిరిన రొజు అన్నుకున్నాను.

పెళ్ళి కూతురిని చెయ్యడం, రిసెప్షన్ తరువాత రాత్రి అంతా పెళ్ళి. ఒక దాని తరువాత ఒకటి చక చకా అయిపొయాయి. మరునాడు సత్యనారాయణ వ్రతం. ఆ రోజు రాత్రి తిరుపతి కి ప్రయాణం. పెళ్ళి అవగానె అతను అమెరికా కి వచ్చేసారు. నేను సరిగ్గా ఏడు వారాల తరువాత అమెరికా లొ అడుగు పెట్టి అతని తొ క్రొత్త జీవితం మొదలుపెట్టాను.

అలా మా పెళ్ళి పుస్తకం మొదలైయ్యింది. ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. హైద్రాబాద్ తరువాత ఇదే నేను బయటకు రావడము. నాకు వంట నుంచి కారు డ్రైవింగ్ వరకు అన్నీ నేర్పించి ఒక కాలేజి అమ్మాయి నించి ఒక బాధ్యత గల అమ్మ గా మలిచారు.

పెళ్ళి ఆయిన నాలుగున్నర ఏళ్ళ తరువత మా అమ్మయి ప్రణతి పుట్టడంతొ మా పెళ్ళి పుస్తకములొ మరి ఒక అనందమైన కొత్త అధ్యాయం మొదలు అయ్యింది.

మొదుమూడి చంద్రశేఖర్, పద్మజ సాన్ హోసే, కాలిఫొర్నియా నివాసులు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె ప్రణతి. ఇద్దరూ సిలికానంధ్ర అభిమానులే కాకుండా మన 'భేతాళకథలు ' నాటకంలో నటించి మొప్పించారు. సున్నిత స్వభావులూ సన్నిహిత మిత్రులు! వారి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని మనసారా కోరుకుందాం.