ధారావాహికలు - వనమాలి (5వ భాగం)

- రచన : కొండగుండ వెంకటేష్   


     
   "అయిన నా మనస్సుకు శాంతి కలగలేదు. మీరు కూడా నన్ను మనిస్తే కాని నా మనస్సులో
భారం తగ్గదు. మీ ఆచూకి తెలుసుకోవటానికి ఎంతో ప్రయత్నించాను. కాని లాభం లేకపోయింది. మీరు ఊరు
విడిచి వెళ్ళి పోయారని తెలిసింది. ఎంతో నిరుత్సాహం కలిగింది. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మీరు తప్పుకుండ
కనిపిస్తారు. నా కోరిక తీరుతుంది. ఆ నమ్మకంతోనే ఇలా జీవచ్ఛంలా బ్రతుకుతున్నాను. నా నమ్మకం వీగిపోలేదు.మీరు కనిపించారు. ఎంతో కాలంగా నేను అడగాలని అనుకుంటున్న క్షమాపణ ఇప్పుడు అడుగుతున్నాను.
"వనమాలిగారు దయచేసి నన్ను క్షమించండి"అని అతని రెండు చేతులు పట్టుకుంది.""
"ఏమిటిది జాహ్నవి గారు. ఎప్పుడో జరిగిపోయినదాని గురించి ఇంకా బాధపడుతున్నారా.
“ఆ విషయం నేను ఎప్పుడో మరచి పోయాను. మీరు కూడా మరచిపోయారని అనుకున్నాను. పరిస్ధితిని బట్టి మనిషిప్రవర్తన మారుతుంది. మీ స్ధానంలో ఇంకేవరున్నా అలాగే ప్రవర్తించేవాళ్ళు. ఇప్పటికైన మించిపోయింది ఏం లేదు.అంతా మరచిపోండి. అదంతా ఒక పీడకలగా తుడిచెయ్యండి. అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది"అంటు తన చేతులను వెనక్కి తీసుకున్నాడు.
"మీరు మాములు మనిషి కాదు వనమాలి గారు. మీకు చెడు చేసిన వాళ్ళను కూడా క్షమించే
గుణం మీ సొంతం. అందుకే ఇంత గొప్పవారైయ్యారు. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండు చాలు. నా మనస్సు తేలికపడుతుంది"అంది .
"తప్పదంటారా" ఇబ్బందిగా చూస్తూ అడిగాడు వనమాలి.
"తప్పదు" అంది.
"అలాగే మిమ్నల్లి క్షమించాను"అన్నాడు.
జాహ్నవి బరువుగా నిటుర్టి నవ్వింది. దాంతో వాతావరణం తేలికఅయింది. రాత్రి అక్కడే భోజనం చేశాడు. జాహ్నవి కొసరి కొసరి వడ్డించింది. భోజనం అయిన తరువాత ఇద్దరూ టెర్రస్ మీద
కూర్చున్నారు.
"మీ గురించి చెప్పండి" అంది జాహ్నవి.
వనమాలి ఏం దాచకుండ అంతా చెప్పాడు. అంతా విని చాల బాధపడింది.
"సారీ గతం గుర్తుకుతెచ్చి చాల బాధపెట్టాను"అపాలజటిక్ గా అంది.
"గతం నేను ఎప్పుడు మరచిపోలేదు. అది నా మనస్సులో అలాగే నిక్షిప్తమైపోయింది.
మరచిపోతేకదా బాధపడటానికి. నా విషయం ప్రక్కన పెట్టండి. మీ గురుంచి చెప్పండి. పిల్లలు ఎంత మంది.
ఏం చదువుతున్నారు."
"ఆ ఆదృష్టం మాకు లేదు. మేము చేసిన పాపం ఇంకా మమ్మల్ని వెంటాడుతుంది. పీడిస్తునే ఉంది. అందుకే దేవుడు మాకు సంతానం ఇవ్వలేదు. పిల్లల కోసం మేము చెయ్యని పూజలు లేవు. తిరగని
గుడి లేదు. పెద్ద పెద్ద డాక్టర్లను కలిశాం. వాళ్ళు చెప్పిన పరీక్షలు చేయించుకున్నా. రాసిన మందులు వేసుకున్నాం.ఆయిన భగవంతుడు మమ్మల్ని కరుణించలేదు. పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాం. అందుకే దేవుడు మాకుపిల్లలు ఇవ్వలేదు. నేను ఎలోగో తట్టుకోగలుగుతున్నాను. కాని ఆయన మాత్రం భరించలేకపోతున్నాడు. తను మీకుఅన్యాయం వల్ల దేవుడు ఈ శిక్ష విధించాడని కుమిలిపోతున్నాడు. దేవుడు మాకు అన్ని ఇచ్చాడు. ఒక సంతానం తప్ప. ఇంత ఆస్ధికి ఒక్క వారసుడు కూడా లేడు. అందుకే బాధగా ఉంది."అంది.
వనమాలి ఏం మాట్లాడలేకపోయాడు.చేదు మాత్ర మింగినట్టుగా ఉంది అతనికి. ఇద్దరి మద్య కొన్ని క్షణాలు నిశబ్ధం నిండుకుంది. తరువాత వనమాలి తన గదిలోకి వచ్చి పడుకున్నాడు. కాని ఎందుకో
నిద్ర మాత్రం రావటం లేదు. మనసంతా బరువుగా ఉంది. చాల సేపు జాహ్నవి గురించి అలోచిస్తూ ఉండిపోయాడు. తరువాత కళ్ళు భారంగా మూతలు పడ్డాయి.
ఎంత సేపు నిద్రపోయాడో తెలియదు. ఏదో చప్పుడయ్యేసరికి మేలుకున్నాడు. చక్ చక్
మంటు వినిపిస్తుంది. కొరడాని ఝలిపించినప్పుడు అలాంటి చప్పుడే వస్తుంది. గదిలోంచి బయటకు వచ్చాడు.
భవనం అంతా చీకటి నిండుకుంది. ఒక గదిలో మాత్రం వెలుతురు కనిపించింది. మెల్లగా ఆ గది దగ్గరకు వెళ్ళాడు.కిటికిలోలోంచి లోపలికి తొంగి చూశాడు.
గది మద్యలో పెదిరెడ్డి నిల్చుని ఉన్నాడు. అతని చేతిలో ఒక పెద్ద కొరడా ఉంది. చాతి
మీద ఎలాంటి బట్టలు లేవు. కొరడాతో బలంగా తన వీపు మీద కొట్టుకుంటున్నాడు. ఆ దెబ్బలకు అతని వీపంతా
రక్తసిక్తమైంది. అతనికి ఎదురుగా జాహ్నవి ఉంది. భర్తని అలా హింసించుకోవద్దని బ్రతిమాలుతుంది. కాని పెదిరెడ్డిమాత్రం వినిపించుకవటం లేదు. తన దోరణిలో తాను సాగిపోతున్నాడు.
"నన్ను ఆపకు జాహ్నవి. నేనుచేసిన తప్పుకు శిక్ష అనుభవించని. ఆ రోజు ఏ పాపం తెలియని వనమాలిని దారుణంగా కొట్టాను. నిజం తెలుసుకోకుండు హింసించాను. పసివాడని చూడకుండ గొడ్డునుబాదినట్టను బాదాను. నేను చేసిన పాపానికి ఇదే ప్రాయశ్చిత్తం"అన్నాడు.
వనమాలికి ఎంతో జాలివేసింది. వెంటనే వెళ్ళి పెదిరెడ్డిని సముదాయించాలని అతృత కలిగింది.కాని దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కవ. అతన్ని చూస్తే పెదిరెడ్డి ఇంకా బాధపడతాడు. సిగ్గుతో
కుంచించుకుపోతాడు. క్షమించమని కాళ్ళ మీద పడిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది వనమాలికి ఇంకా
ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే అతను లోపలకు వెళ్ళలేదు.
ంంంంంంంం
మరునాడు వనమాలి పెదిరెడ్డి స్ధలం చూడటానికి వెళ్ళారు. వనమాలిని పెదిరెడ్డి
గుర్తుపట్టాడో లేదో తెలియదు. కాని గుర్తుపట్టనట్టుగానే ప్రవర్తించాడు. బహుశా జాహ్వని కూడా చెప్పిఉండదు.
అప్పుటి పెదిరెడ్డికి ఇప్పటి పెదిరెడ్డికి చాల తేడా కనిపిస్తుంది. అప్పుడు అతనిలో గర్వం అహంకారం మోటుతనం
కనిపించేవి. ఇప్పుడు వాటి స్ధానంలో గాంభీర్యం చూపులలో చల్లదనం కనిపిస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవలసిన
పనిలేదు.
కాలం ఎవరిలో అయిన మార్పు తెస్తుంది. కాలంతో పాటు మనిషి ఎదుగుతాడు.జ్ఞానం సంపాదించుకుంటాడు. ముఖ్యంగా మానసిక పరిపక్వత పెంపోందించుకుంటాడు. దీనికి పెదిరెడ్డి మినహహింపు కాదు. అరగంట తరువాత వాళ్ళ కారు ఆగింది. ఆ ప్రాంతం చాల నిర్మానుష్యంగా ఉంది.
సిటికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ స్ధలం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతుంది.
వనమాలికి ఆ స్ధలం ఎంతో నచ్చింది. ఒక సూపర్ స్పేషాలిటి హాస్పటల్ కు కావల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. జనసంచారం అంతగా లేదు. చుట్టు చెట్లు. గాలి దారాళంగా వుంటుంది.రోగులకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
"నాకు స్ధలం నచ్చింది. అగ్రిమెంట్ తయారుచెయ్యండి"అన్నాడు వనమాలి.
అలాగే అన్నాడు పెదిరెడ్డి. తరువాత ఇద్దరూ తిరుగు ప్రయణం అయ్యారు.
ఆ రోజు అగ్రిమెంట్ పూర్తిచేసుకున్నారు. అది తీసుకుని వనమాలి బయలుదేరాడు. వెళ్ళేముందు జాహ్నవికి ఒక చీటి వ్రాసి ఇచ్చాడు.
అందులో ఒకే ఒక వాక్యం వ్రాసి ఉంది.
"దయచేసి పెదిరెడ్డిని హింసించుకోవద్దని చెప్పండి. నా మాటగా చెప్పండి."
ంంంంంంంంంంం
హైదరాబాదు చేరుకున్న తరువాత వనమాలి తిన్నగా హాస్పటల్ కు వెళ్లాడు.మల్హోతకు అగ్రిమెంట్ కాగితాలు ఇచ్చాడు. తరువాత తన చాంబర్స్ కు వచ్చి కూర్చున్నాడు. అయిదు నిమిషాల వరకు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. తరువాత ఏదో తట్టినట్టు నాయక్ నెంబర్ డయల్ చేశాడు.
"యస్ నాయక్ హియర్ " అంటు అవతలనుంచి నాయక్ గొంతు వినిపించింది.
"నేను వనమాలిని మాట్లాడుతున్నాను" అన్నాడు.
"మీరా డాక్టర్. చెప్పండి ఏమిటి విషయం".
"ఫోన్ లో చెప్పలేను. మనం విడిగా ఎక్కడైన కలుసుకుందా. అప్పుడే
ఫ్రీగా మాట్లాడుకోవచ్చు."
"ఎక్కడ కలుసుకుందామో మీరే చెప్పండి."
"జూ పార్క్ లో కలుసుకుందాం. అక్కడ ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టరు."
"అలాగే ఎన్ని గంటలకు రమ్మంటారు."
"సాయంత్రం మూడు గంటలకు" అని చెప్పి లైన్ కట్ చేశాడు వనమాలి.
సరిగ్గా మూడు గంటలకు ఇద్దరూ జూ పార్క లో కలుసుకున్నారు. కొంచం కూడా ఉపోద్ఘాతం లేకుండ తన పధకం గురించి చెప్పాడు.
"ఎక్స్ లెంట్ మీ ప్లాన్ చాల పకడ్భందీగా ఉంది. ఎవరికి మీ మీద
అనుమానం రాదు. హత్య చేసింది అతని శతృవులు అనుకుంటారు. వాళ్ళలో వాళ్ళకుగ్యాంగ్ వార్ జరగటం మామలుకనుక ఎవరికి మీ మీద అనుమానం రాదు"అన్నాడు నాయక్.
"ద్యాంక్స్. మీరు ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డాను. మీరు అంగీకరించినందుకు నాకు చాల ఆనందంగా ఉంది. సాధ్యమైనంత తొందరగా ఈ పని పూర్తిచేస్తాను."
"అంతా బాగానే ఉంది. కాని ఒక విషయం మీరు మరచిపోయారు"అన్నాడు నాయక్.
"ఏమిటది."
"మీరు సంధ్యను కాపాడిన తరువాత జాన్ డేవిడ్ ఇంకా జాగ్రత్తపడ్డాడు. తన ఇల్లు మార్చేశాడు. ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లో ఉంటున్నాడు."
"మైగాడ్. ఆ విషయం నాకు తెలియనే తెలియదు. మీరు గుర్తుచెయ్యటం మంచిదయింది. కొత్త ఇంటి అడ్రస్సు మీకు తెలుసా" అడిగాడు వనమాలి.
"ప్రతి క్షణం వెయ్య కళ్ళతో అతన్ని గమనిస్తున్నాను. అందుకే ఇల్లు మారిన విషయం నాకు తెలిసిపోయింది. ప్రస్ధుతం అతను లవర్స్ ప్యారడైజ్ ఏరియాలో ఉంటున్నాడు. ఇంటి నెంబర్ ఇరవై నాలుగు. అతనితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాను. గేటు దగ్గర ఒక
సెక్యరిటి గార్డ్ ఉన్నాడు. లోపల ఇంకేంతమంది ఉన్నారో తెలియదు. అందుకే మీరు చాల జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు ఎవరు అపరిచితులు అతని ఇంట్లోకి వెళ్ళలేదు. చివరకు పోలీసులు కూడా ఆ ధైర్యం చెయ్యలేకపోయారు.కాని మీరు వెళ్లారు. వెళ్ళటమే కాకుండ ఒక అమ్మాయిని కూడా రక్షించారు. జాన్ డేవిడ్ కు ఇది షాక్ లా తగిలిఉంటుంది. అందుకే ముందు జాగ్రత్త పడ్డాడు. వెంటనే ఇల్లు మార్చేశాడు. సెక్యురిటిని కూడా పెంచుకునిఉంటాడు. మీరు చాల జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అడుగు తూచి తూచి వెయ్యాలి. తన ఇంట్లోకి దొంగ
తనంగా చొరబడింది మీరే అని తెలిస్తే జాన్ మిమ్నల్ని విడిచిపెట్టడు. మిమ్మల్ని చంపటానికి ప్రయత్నించవచ్చు.మీ వాళ్ళను కూడా టార్గట్ చెయ్యవచ్చు. అందుకే అందరిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి"
"మీ సలహ తప్పకుండ గుర్తుంచుకుంటాను. నేను అడగకపోయిన
చాల సహయం చేశారు. మీ మేలు జన్మలో మరచిపోను." అన్నాడు వనమాలి భారంగా.
"అధికారిగా ఉన్నప్పుడు మీక సహయం చెయ్యలేకపోయాను.
కనీసం ఇప్పుడైన చేస్తున్నందుకు చాల సంతోషంగా ఉంది. నా మాటలు గుర్తుపెట్టుకోంది. విజయం
మీదే. ఇక బయలుదేరండి"అన్నాడు నాయక్.
నాయక్ వెళ్ళిపోయిన తరువాత వనమాలి బయలుదేరాడు. అతను
ఇంటికి వెళ్ళలేదు. ఒక పెద్ద బొమ్మల దుకాణంలో కి వెళ్ళాడు. ఆ షాపులో బొమ్మలే కాకుండ ఆటవస్తువులు కూడా అమ్ముతారు.
"ఏం కావాలి సార్" అడిగాడు సేల్స్ మెన్.
"రిమోట్ కంట్రోల్ తో నడిచే బాల్ కావాలి" అన్నాడు వనమాలి.
సేల్స్ మెన్ రకరకాల బాల్స్ చూపించాడు. వాటిని రిమోట్ కంట్రోల్ తో ఎలా ఆపరేట్ చెయ్యాలో చేసి చూపించాడు. వాటిలో ఒక దాన్ని ఎన్నుకున్నాడు. బిల్ పే చేసి కారులో కూర్చున్నాడు. అక్కడనుంచి కాలాబజార్ కు వెళ్ళాడు. అంతకుముందు తుపాకి కొన్న షాపుకు వెళ్ళాడు. బాల్ రిమోట్ కంట్రోల్ చూపించి ఏం కావాలో చెప్పాడు.
"ఒక గంట పడుతుంది. అంతవరకు కాచుకుంటారా."
"గంట కాదు. రెండు గంటలు కూడా కాచుకోగలను. పని మాత్రం చాల
ఖచ్చితంగా ఉండాలి. తరువాత ఎటువంటి సమస్యలు రావటానికి వీల్లేదు".
"మీరు మా పాత కస్టమర్. మా పనితనం గురించి మీకు మళ్ళి చెప్పవలసిన పనిలేదు. మీరే చూస్తారుగా "అంటు బంతి రిమోట్ కంట్రోల్ తీసుకుని లోపలకు వెళ్ళాడు. అరగంటతరువాత వాటిని తెచ్చి వనమాలి కి ఇచ్చాడు.
వనమాలి ఇంటికి చేరుకునేసరికి ఇల్లంతా నిశబ్ధంగా ఉంది. అందురు
ఎక్కడికి వెళ్ళారని నాయర్ ని అడిగాడు. గుడికి వెళ్ళారని చెప్పాడు నాయర్. అది ఒకందుకు మంచిదని అనుకున్నాడు. చేతలో ఈ సామానులు చూస్తే ఊరుకోరు. యక్షప్రశ్నలు వేసి తికతిక పెడతారు. అందవాటిని జాగ్రత్తగా బీరువాలో పెట్టి తాళం వేశాడు.
ంంంంంంంం""
"గుడ్ మార్నంగ్ డాక్టర్ ఏమిటి ఇలా వచ్చారు"వనమాలి ని మర్యాదగా
అహ్వానిస్తూ అన్నాడు పర్సనల్ మేనేజర్.
"చిన్న సమాచారం కావాలి" అన్నాడు వనమాలి నవ్వుతూ.
"అఫీషియల్ ఆర్ అన్ అఫీషియల్".
"పాజిటివ్ లీ పర్సనల్."
"ఏం కావాలో అడగండి. నాకు తెలిసినంతవరకు చెప్తాను."
"డాక్టర్ వెంకటరమణ పర్సనల్ బయేడేటా కవాలి."
"రూల్స్ గురించి మీకు తెలియంది కాదు. కారణం లేకుండ
ఎవరి గురించి సమాచారం ఇవ్వకూడదు. కారణం చెప్పండి. అది సహేతుకమైతే తప్పకుండ ఇస్తాను".
"అతనికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్ళి చెయ్యాలనకుంటున్నాను. ఈ
విషయం అతనికి తెలియదు. అతని అభిప్రాయం తెలుసుకోకుండ ఈ విషయం అడగటం బాగుండదు.
అందుకే మీ దగ్గరకు వచ్చాను"అన్నాడు వనమాలి.
"ఓస్ ఇంతేనా. తప్పకుండ ఇస్తాను"అంటు వెంకరమణ వివరాలు
ప్రింటవుట్ తీసి ఇచ్చాడు. అది తీసుకుని తన చాంబర్స్ లోకి వచ్చి కూర్చున్నాడు వనమాలి.
వెంకటరమణ తన తల్లి తండ్రికి ఒక్కడే సంతానం. చాల తెలివైనవాడు
చురుకైన వాడు. మెడిసన్ లో మంచి ర్యాంకు సంపాదించుకున్నాడు. మల్హోత్ర హాస్పటల్ లో అసిస్టెంట్ ఫిజీషియన్గా చేరాడు. ఒక వైపు ఉద్యోగం చేస్తునే యం.డి చదువుతున్నాడు. ఈ సంపత్సరం అది కూడా పూర్తవుతుంది. తరువాత అతని భవిష్యత్తు చాల బాగుంటుందు. అందులో సందేహం లేదు. మంచి హోదా వస్తుంది. దాంతో పాటు జీతం కూడా పెరుగుతుంది. తండ్రి ఈ మద్యన కలెక్టర్ గా రిటైర్ అయ్యాడు. తల్లి హోంమేకరు. మంచి సంప్రదాయమైన కుటుంబం. సంధ్య ఈ ఇంటికి కోడలుగా వెళితే చాల సుఖపడుతుంది.
అతనికి ఎందుకో ఈ సంబంధం బాగా నచ్చింది. వెంటనే సెల్ తీసి
తనకు తెలిసిన పెళ్ళిళ్ళ పేరయ్యకు కాల్ చేశాడు.
" మీరా డాక్టర్ గారు. చాల కాలం తరువాత ఫోన్ చేశారు. ఇప్పటికైన
మీ మనస్సు మారినందుకు చాల ఆనందంగా ఉంది. మీకు తగిన సంబంధాలు నా దగ్గర చాల ఉన్నాయి. అమ్మాయిల ఫోటోలు తీసుకుని సాయంత్రం మీ ఇంటికి వస్తాను" అన్నాడు పేరయ్య.
" అసలు విషయం తెలుసుకోకుండ ఏదేదో మట్లాడకండి. సంబంధం
నాకు కాదు. నా చెల్లెలి కి . అబ్బయిని మీరు చూడాల్సిన పనిలేదు. నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు. అతని పేరువెంకటరమణ. మా హస్పటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అతని చిరునామా ఇస్తాను. మీరు వెళ్ళి అతని అమ్మ నాన్నతో మాట్లడండి. అమ్మాయిని చూసుకోవటానికి ఎప్పుడు వస్తారో అడగండి. ఏ విషయం నాకు ఫోన్చేసి చెప్పండి "అన్నాడు వనమాలి.
" అలాగే తప్పకుండ. మీరింతగా చెప్పాలా.."
" మీ కమీషన్ గురించి దిగులుపడకండి. సాయంత్రం ఇంటికి వచ్చి
తీసుకువెళ్లండి. ఎలాగైన ఈ సంబంధం కుదిరేలా చూడండి. "అన్నాడు వనమాలి.
ంంంంంంంం
" నాన్న సంధ్య కు మంచి సంబంధం తెచ్చాను" అన్నాడు వనమాలి తండ్రితో.
ఆ మాట వినగానే రావు మొహం సంతోషంతో వెలిగిపోయింది. వెంటనే
ఏం మాట్లాడాలో ఆయనకు తోచలేదు. ఒక్క క్షణం పాటు వనమాలి వంక తదేకంగా చూస్తూండిపోయాడు. తరువాత తేరుకుని అడిగాడు.
"అబ్బాయి ఎవరు. ఏం చేస్తుంటాడు."
" అబ్బాయి పేరు వెంకటరమణ. చాల బుద్ధి మంతుడు. తెలివైన వాడు. మా హాస్పటల్ లోనే డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. మన సంధ్య అతనికి తప్పకుండ నచ్చుతుందని నాకు నమ్మకంగా ఉంది. అని విషయాలు చెప్పి పేరయ్యను పంపించాను. ఈసాయంత్రం లోగా
పేరయ్య కాల్ చేస్తానని చెప్పాడు. ఈ లోగా నీ అభిప్రాయం చెప్పు నాన్న. నీ కిష్టమైతేనే ఈ పెళ్ళి జరుగుతుంది."
అన్నాడు వనమాలి,.
"అన్ని తెలిసిన వాడివి. నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే. కాని ఒక్కటే సందేహం. అబ్బాయి బాగా చదువుకున్నాడు. పైగా డాక్టర్.
కట్నం ఎక్కవ అడుగుతారేమో" అంటు సందేహం వెలిబుచ్చాడు రావు.
"డబ్బు గురించి మీరు అలోచించకండి నాన్న. అంతా నేను చూసుకుంటాను. వాళ్ళు ఎంత కట్నం అడిగిన ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. సంధ్య పెళ్ళి అట్టహాసంగా చేస్తాను. అబ్బాయి ఫోటో కూడా తెచ్చాను. సంధ్యకు చూపించి తన అభిప్రాయం కూడా తెలుసుకోండి." అన్నాడు వనమాలి.
రావు ఇంకేం మాట్లాడలేదు. వనమాలి ఇచ్చిన ఫోటో తీసుకుని లోపలకు వెళ్ళాడు. కొన్ని క్షణాలపాటు తండ్రి వెళ్ళిన వైపు చూశాడు. తరువాత నింపాదిగా తన గదిలోకి వెళ్లాడు. అతనికి చాలసంతోషంగాను ఆనందంగాను ఉంది. సంధ్యకు ఇంత తొందరగా ఇంత మంచి సంబంధం కుదురుతుందని అతను అనుకోలేదు. ఆమె తప్పకుండ వెంకటరమణను చేసుకోవటానికి ఒప్పుకుంటుంది. అందులో సందేహంలేదు. వెంకటరమణ గురించి కూడా వనమాలి కి కొంచం కూడా సందేహం లేదు. సంధ్యను ఎవరైన కళ్ళకు అద్దుకుని చేసుకుంటారు.
ఈ పెళ్ళి ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. దానికి కారణం
లేకపోలేదు. అతను జాన్ డేవిడ్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు. దానికి కావల్సిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. ఈ హత్య చాల తెలివిగా జరుగుతుంది. ఎవరికి అతని మీద అనుమానం రాదు. గ్యాంగ్ వార్
వల్ల చనిపోయాడని భావిస్తారు కాని హత్య చెయ్యబడ్డాడని ఎవరు అనుమానించరు. అదే వనమాలికి కావల్సింది.అలాగని అతను రిస్క్ తీసుకోవలనుకోవటం లేదు. పోలీసులను తక్కవ అంచన వెయ్యటం అతనికి ఇష్టం లేదు.అందుకే తన బాద్యతలను ఒకోక్కటి తీర్చుకుందామని అనుకుంటున్నాడు. అందులో ముఖ్యమైంది సంధ్య పెళ్ళి.
సంధ్య పెళ్లి జరిగిపోతే ఇంకా అతనికి ఏ సమస్య లేదు. తరువాత ఏం
జరిగిన అతనికి బాధ ఉండదు. అందుకే సంధ్య పెళ్ళికి అంత తొందరపడుతున్నాడు. తన పధకం గురించి ఇంకో
సారి బేరీజు వేసుకున్నాడు. అందులో లొసుగులు ఉన్నాయా అని తర్జన బర్జన చేసుకున్నాడు. ఏం కనిపించలేదు.
అతను ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రావు లోపలకు వచ్చాడు. ఆయన మొహం ఆనందంతో వెలిగిపోతుంది. దానికి కారణం ఊహించాడు వనమాలి. అతనికి కూడా చాల సంతోషంగా ఉంది.
"అబ్బాయి. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఈ సంగతి చెప్పటానికి తను చాలసిగ్గుపడుతుంది. అందుకే నన్ను చెప్పమంది. "అన్నాడు రావు.
ంంంంంంంం
సంధ్యకు సంబంధం కుదిరిందని తెలిసి ఇంట్లో వాళ్ళందరు ఎంతో సంతోష
పడ్డారు. ముఖ్యంగా రోసి ఆనందానికి అంతులేకుండ పోయింది. ఆ రోజు అందరు చాల సరదాగా గడిపారు.నవ్వులు కేరింతలతో సమయం తెలియలేదు. చాల సంవత్సరాల తరువాత అందరితో సరదాగా
గడిపాడు వనమాలి. ఎంతో ధ్రిల్లీంగ్ గా ఫీలయ్యాడు.
ఆ రోజు ఆదివారం. అమ్మాయిని చూసుకోవటానికి వస్తున్నామని
వెంకటరమణ తండ్రి కబురు చేశాడు. అందరు పొద్దునే లేచారు. కాబోయే వియ్యంకుడిని ఆహ్వానించటానికి
అన్ని ఏర్పాట్లు చేశారు. గుమ్మానికి మామిడి ఆకులు కట్టారు. ఇల్లంతా శుభ్రం చేశారు. పోర్టికోలో అందంగా
పెద్ద పెద్ద ముగ్గులు వేసింది రోసి. ఇల్లంతా మంగళకరంగా తయారైంది.
సరిగ్గా పదిగంటలకు పోర్టికోలో కారాగింది. మందు వెంకటరమణ దిగాడు. తరువాత అతని తల్లి తండ్రి దిగారు. వనమాలి అతని అమ్మా నాన్నలు వాశ్శకు ఎదురువెళ్ళి సాధరంగా
లోపలకు ఆహ్వానించారు. అందరు హాల్లో కూర్చున్నారు. వెంకటరమణ తండ్రితో వనమాలి తండ్రి రావు నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నారు. రాజ్యలక్ష్మి వెంకటరమణ తల్లి వసుంధరాదేవితో తన కూతురు గురించి గొప్పగా చెబుతుంది.
లోపల గదిలో రోసి సంధ్యను ముస్తాబుచేస్తుంది. వెంకటరమణ మాటి
మాటికి గది వైపు దొంగచూపులు చూస్తున్నాడు. ఈ విషయం వనమాలి గ్రహించాడు. తనలో తాను నవ్వుకున్నాడు.పది నిమిషాల తరువాత రోసి సంధ్యను వెంకటరమణకు ఎదురుగా కూర్చోపెట్టింది. ఆ రోజు సంధ్య చక్కగా అలంకరించుకుంది. వేసుకున్న బట్టలు ఆమె అందాన్ని ఇంకా ఇనుమడింపచేస్తుంది.
మాములు తతంగం మొదలైంది. తరువాత వెంకటరమణ సంధ్యను
కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటికి ఆమె చక్కగా జవాబు చెప్పింది.
ంంంంంంంంంం
పదిహేను రోజుల తరువాత సంధ్య వెంకటరమణ పెళ్ళి వైభవంగా
జరిగింది. చాల మంది పెద్ద పెద్ద వాళ్ళందరు వచ్చారు. మల్హోత్ర కూడా వచ్చాడు. అన్నిటి కంటే ఆశ్చర్యం
కలిగించిన విషయం గుంటూరు నుండి జాహ్నవి పెదిరెడ్డి వచ్చారు. అందరి సమక్షంలో వెంకటరమణ సంధ్య
మెడలో తాళి కట్టాడు.
మూడు నిద్రలు అయిన తరువాత సంధ్య అత్తవారింటికి బయలుదేరింది.
ఆమెకు తోడుగా రావు రాజ్యలక్ష్మి కూడా వెళ్ళారు. వెళ్ళే ముందు సంధ్య భక్తితో అన్న కాళ్ళకు నమస్కారం
చేసింది. ఆమెను ఆప్యాయంగా పైకి లేపాడు వనమాలి. ఏదో మాట్లాడాలని అనుకున్నాడు. కాని గొంతుకు
ఎదో అడ్డం పడినట్టు మాట పెగిలి బయటకు రాలేదు.
చాల సంవత్సరాల తరువాత సంధ్య అతనికి చెల్లెలు రూపంలో కనిపించింది.ఆ సంతోషం ఆనందం ఇంకా పూర్తిగా ఆస్వాదించలేదు. ఆమెతో పట్టుమని కొన్ని నెలలు కూడా గడపలేకపోయాడు. ఇంతలో ఆమె అత్తవారింటికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకు ముందు ఆమెకు పెళ్ళి చేసి
తన బాధ్యత తీర్చుకుందామని అనుకున్నాడు. కాని తీరా పెళ్ళి జరిగి వెళ్ళిపోతుంటే బాధపడుతున్నాడు. మనిషి మనస్సు చంచలమైందని చెప్పటానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది.
నిజానికి ఆమె ఊరు విడిచి వెళ్ళటం లేదు. ఈ సిటిలోనే ఉండబోతుంది.
ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసి రావచ్చు. అయిన ఏదో తెలియని బాధ అతన్ని ఇబ్బంది పెట్టింది.
అందరు కారులో కూర్చున్నారు. కారు బయలుదేరింది. వనమాలి
గేటు దగ్గర నిల్చుని వాళ్ళకు వీడ్కోలు చెప్పాడు. రోసి కూడా వెళ్ళింది. కారు కనిపించనంతవరకు గేటు దగ్గర
నిలబడ్డాడు వనమాలి. తరువాత తన బెడ్ రూంలోకి వెళ్లాడు. బీరువాలోంచి బంతి రిమోట్ కంట్రోల్ ను
బయటకు తీశాడు. రిమోట్ కంట్రోల్ తో బంతిని కంట్రోల్ చేస్తూ కొంచం సేపు ప్రాక్టిస్ చేశాడు.తరువాత తిరిగి
వాటిని బీరువాలో పెట్టేశాడు.
అప్పుడే పోర్టికోలో కారాగిన చప్పుడు వినిపించింది. రోసి లోపలకు వచ్చింది. వెళ్ళి నీరసంగా సోఫాలో కూర్చుంది.
" ఏమైంది అక్కా." ఒంటో బాగాలేదా మెట్లు దిగుతు అడిగాడు వనమాలి.
" ఉన్నట్టుండి తల తిరిగింది. ఒళ్ళు కూడా వేడిగా ఉంది. కారులో
స్ధిమితంగా కూర్చోలేకపోయాను. అందుకే మద్యలో దిగిపోయాను. టాక్సి మాట్లాడుకుని వచ్చేశాను." అంది
రోసి.
" ఏది నన్ను చూడని అంటు రోసిని పరీక్ష చేశాడు.
" నిజమే అక్కా. కొంచం జ్వరం వచ్చి నట్టుగా ఉంది. పెళ్ళి పనుల వల్ల
వేడి చేసింది. మాత్ర ఇస్తాను. వేడి కాఫీ త్రాగి పడుకో. రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుంది."
అన్నాడు.
రోసి మాత్ర వేసుకుని తన గదిలోకి వెళ్ళి పడుకుంది. ఏం తోచక టీవి
ఆన్ చేశాడు వనమాలి. వార్తలు వస్తున్నాయి. అప్పుడే స్క్రీన్ మీద ఒక ఫోటో కనిపించింది. న్యూస్ రీడర్
ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి వివరాలు చెప్పుతుంది.
"ఈ ఫోటోలో ఉన్న మనిషి పేరు తేజాసింగ్. కరుడు కట్టిన ఉగ్రవాధి.
ఆల్ ఖైదా తీవ్రవాధ సంస్ధలో సబ్యుడు. మానవత్వం కొంచం కూడా లేని రాక్షసుడు. అమాయకులను చంపటం
అతనికి చాల సరదా. ఇంతవరకు దాదాపు రెండు వందల మందిని దారుణంగా చంపాడు. అతన్ని పట్టుకోవటానికి
నిఘా సంస్ధలు తీవ్రంగా ప్రయత్నస్తున్నాయి. ఇటివలే అతను భారత్ లో అడుగుపెట్టడని ముఖ్యంగా హైదరాబాదులో రహస్యంగా తిరుగుతున్నాడని ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ సమాచారం పంపించింది. ఇతని గురించి ఎవరికైన తెలిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యండి. అతని ఆచూకి చెప్పిన వారికిలేదా పట్టుకుని అప్పగించిన వారికి యాబై లక్షలు బహుమానంగా ఇవ్వబడుతుంది. మీరురిపోర్ట్ చెయ్యవలసిన ఫోన్ నెంబర్లు " అని రెండు ఫోన్ నెంబర్లు స్క్రీన్ మీద ప్రత్యేక్షమయ్యాయి.
తేజాసింగ్ ఫోటో వంక పరీక్షగా చూశాడు వనమాలి,.ఎందుకో కారణం
తెలియదు కాని అతని ఫోటో వనమాలి మవస్సులో బలంగా ముద్రించుకుపోయింది.
ంంంంంంంంంంంంంం
వనమాలి లవర్స్ కాటేజి చేరుకునేసరికి రాత్రి ఏడుగంటలైంది.
కార దిగి చుట్టు చూశాడు. వరుసగా కాటేజీలు కనిపించాయి.అవన్ని ఒక దానికొకటి సంబంధం లేకుండ దూరంగావిసిరేసినట్టుగా ఉన్నాయి. ప్రతి కాటేజి ముందు ఏపుగా పెరిగిన అశోకా చెట్లు ఉన్నాయి. పైగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.
తన కారుని మూలగా ఉన్న ఒక చెట్టు దగ్గర పార్క్ చేశాడు. బంతిని రిమోట్ కంట్రోల్ తీసుకుని ముందుకు నడిచాడు. ఇన్ని కాటేజిలలో జాన్ డేవిడ్ ఇల్లు తెలుసుకోవటం అతనికి కష్టం కాలేదు. నాయక్ కొన్ని గుర్తులు చెప్పాడు. వాటి సహయంతో తేలికగా తెలుసుకున్నాడు.
కాటేజి చుట్టు దాదాపు ఆరడుగుల ఎత్తు ఉన్న కాంపౌండ్ వాల్ ఉంది.
మెయిన్ గేటు ముందు ఒక సెక్యురిటి గార్డ్ ఉన్నాడు. అతని చేతిలో సబ్ మెషిన్ గన్ ఉంది. లోపలకు వెళ్ళాలంటే సెక్యురిటి గార్డ్ ముందు నుంచి వెళ్ళాలి.ముక్కు మొహం తెలియని మనిషిని అతడు లోపలకు పంపించడు..ఏం చెయ్యలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు. కాంపౌండ్ వాల్ కు అనుకుని ఒక మర్రి చెట్టు కనిపించింది.ఆ చెట్టు ఎక్కి కాంపౌండ్ వాల్ మీద చేరుకోవచ్చు.
అదే చేశాడు వనమాలి. రెండు క్షణాలలో కాంపౌండ్ వాల్ మీదకు చేరుకున్నాడు. లోపల లైట్లు దేదిప్యమానంగా వెలుగుతున్నాయి. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. నీళ్ళు నీలం రంగులో ఉన్నాయి. పోర్టికోలో లేటస్టు హోండా కారు పార్క్ చేసి ఉంది. అది జాన్ డేవిడ్ పర్సనల్ కారు. నాయక్ వనమాలికి ఈ విషయం ముందే చెప్పాడు. కారు లోపల ఉంది కనుకు జాన్ డేవిడ్ కూడా లోపల ఉన్నాడు.వనమాలికి కావల్సింది అదే.
ఇంతలో ఒక అమ్మాయి తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది.
చాల అందంగా సెక్సిగా ఉంది. టూపీస్ బకిని సూట్ వేసుకుంది. వయ్యరంగా నడుచుకుంటు వచ్చి పూల్ లోకి
దిగింది. ఆమె వెనుకు ఒక వ్యక్తి వచ్చాడు. పొడ్డుగా బలంగా ఉన్నాడు. బెర్ మూడా నిక్కర్ దాని మీద పూల షర్ట్
వేసుకున్నాడు. అతను ఎవరో వనమాలి గుర్తుపట్టాడు.
అతను జాన్ డేవిడ్. వనమాలికి అతన్ని చూడగానే శరీరం వణికింది.
అది ఒక్క క్షణం మాత్రమే. వెంటనే తేరుకుని బంతిని విసురుగా లోపలకు విసిరేశాడు. రిమోట్ ని ఆన్ చేశాడు.
బంతి మెల్లగా దొర్లుకుంటు వెళ్ళి జాన్ డేవిడ్ కు నాలుగడుగుల దూరంలో ఆగింది. అకస్మాతుగా ఎదురుగా
బంతి కనిపించసరికి జాన్ డేవిడ్ కు ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా వేసింది. అటు ఇటు చూశాడు.
ఎదురుగా ఏపుగా పెరిగిన అశోకా చెట్లు కనిపించాయి. అవి అడ్డంగా ఉండటం వల్ల గోడమీద ఉన్న వనమాలి
కనిపించలేదు.
చుట్టుప్రక్కల కూడా ఎవరు కనిపించలేదు. జాన్ డేవిడ్ కు
అనుమానం వేసింది. అందుకే అతను ముందుకు కదలలేదు. ఉన్నచోటనే నిలబడి బంతి వంక చూశాడు.
వనమాలి ఉద్వేకంతో గమనిస్తున్నాడు. అతని గుండెలు రాకేట్ వేగంతో కొట్టుకుంటున్నాయి. టెన్షన్ తో
ఒళ్ళు సన్నగా కంపిస్తుంది.
జాన్ డేవిడ్ బంతి దగ్గరకు వెళితేనే అతని పధకం ఫలిస్తుంది. లేకపోతే
పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది. ఇంకో క్షణం భారంగా గడిచింది.
జాన్ డేవిడ్ ఏదో నిశ్చయించుకున్నట్టు బంతి దగ్గరికి వెళ్ళాడు. క్రిందికి
వంగి బంతిని తీసుకున్నాడు. ఏదో పరీక్షిస్తున్నట్టు కళ్ళ ముందు పెట్టుకున్నాడు. అదే వనమాలికి కావల్సింది.
వెంటనే రిమోట్ తో బాంబును యాక్టివేట్ చేశాడు. బంతి మీద ఉన్న ఎర్ర లైటు వెలిగింది. అప్పుడు అనుమానం
కలిగింది జాన్ డేవిడ్ కు. బంతిని విసిరేయ్యబోయాడు. కాని స్ప్లిట్ సెకండ్ ఆలస్యమైంది. బంతి ఒక్కసారిగా
ఢాం అంటు పేలిపోయింది.
ంంంంంంంంంంంం
కారు పోర్టికోలో పార్క్ చేసి లోపలకు వెళ్ళాడు వనమాలి. ఇంకా అతనిలో
ఉద్వేగం తగ్గలేదు. ఆ కంగారులో ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి డ్రైవ్ చేశాడు. అదృష్టవశతు పోలీసులు ఎవరు
చూడలేదు. లేకపోతే చాల ఇబ్బందిలో పడేవాడు.హాల్లో అతనికోసం ఎదురుచూస్తూ కుర్చుంది రోసి.
" ఇంత సేపు ఎక్కడికి వెళ్ళావు. నీ కోసం ఇల్లంతా వెతికాను. నీ కారు కూడా
కనిపించలేదు. కంగారుపడ్డాను" అఁది.
" అర్జంట్ పనుంటే బయటకు వెళ్ళాను. ఏమిటి విషయం. అయిన నేనేం
చిన్న పిల్లవాడినా తప్పిపోవటానికి" అన్నాడు వనమాలి నవ్వుతూ.
" సంధ్య ఫోన్ చేసింది. నీతో మాట్లాడాలని చెప్పింది. నీ గదిలోకి వచ్చాను. నువ్వు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావో తెలియదు. కొంచం కంగారుపడ్డాను. నీ సెల్ ఫోన్ కు రింగ్ చేశాను. కాని రెస్పాన్స్ లేదు. ఇంకేం చెయ్యలో తోచక నీ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను."
" సంధ్య ఏం చెప్పింది. అందరు ఎలా ఉన్నారు"
" తను చాల ఆనందంగా సంతోషంగా ఉందట. అత్తగారు మామగారు కన్నకూతురులా చూసుకుంటున్నారట. తన గురించి కంగారుపడవద్దని మరి మరి చెప్పింది. ముఖ్యంగా నీకో సలహా
ఇచ్చింది."
" ఏమిటది."
"నిన్ను మళ్ళి పెళ్ళి చేసుకోమని చెప్పింది. నువ్వు ఒంటరిగా ఉండటం తనకు చాల బాధగా ఉందని వాపోయింది. సంధ్య చెప్పింది నాకు సబబుగానే ఉంది. నువ్వు మళ్ళి పెళ్ళి చేసుకుంటే చాలబాగుంటుంది"వనమాలి.
" ఈ వయస్సులో నాకు పెళ్ళేమిటి. అన్నాడు వనమాలి పేలవంగా.
" నీకేమంత వయస్సు మించిపోయింది. ఈ కాలంలో చాల మంది ఈ వయస్సులో పెళ్ళిచేసుకుంటున్నారు. కాలం మారుతుంది. కొన్ని విషయాలలో కాలంతో పాటు మనము మారాలి.లేకపోతే కాలగతిలో కలసి పోతాం."
" సమస్య వయస్సుకు సంబంధిచింది కాదు. మనస్సుకు సంబంధించింది.
ఈ మనస్సులో మిత్రవిందకు ఇంకో తప్ప అమ్మాయికి స్ధానం లేదు. జన్నలో ఆమెను మరచిపోలేను. ఈ జీవితంఇలా గడిచిపోవలసిందే. దయచేసి ఇంకేప్పుడు నా పెళ్ళి ప్రస్ధావన తీసుకురావద్దు." అన్నాడు వనమాలి కట్టే విరిచినట్టు.
"నీ భార్యను నవ్వు ఎంతగా పేమిస్తున్నావో నాకు తెలుసు. ప్రత్యేక్షంగా చూశాను కూడా "అంది రోసి.
" చూశావా ఎప్పుడు" ఆశ్చర్యంగా అడిగాడు వనమాలి.
"ఒక రోజు రాత్రి నాకు నిద్రపట్టలేదు. ఏం తోచక గదిలోంచి బయటకు వచ్చాను. నీ గదిలో ఇంకా లైట్లు వెలుగుతుండటల గమనించాను. చాల ఆశ్చర్యం వేసింది. ఇంత రాత్రి వేళ నిద్ర
పోకుండ ఏం చేస్తున్నావో తెలసుకుందామని అసక్తి కలిగింది. మెల్లగా నీ గది దగ్గ రికి వచ్చాను. తలుపులు
దగ్గరగా వేసి ఉన్నాయి. చప్పుడు కాకుండ తెరిచి చూశాను."
"నువ్వు మంచం మీద పడుకున్నావు.చేతిలో మిత్రవింద ఫోటో ఉంది.
నీ దృష్టిలో ఆమె ఇంకా బ్రతికే ఉంది. ఆ ఉద్ధేశంతోనే ఆమెతో మట్లాడుతున్నావు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సంఘటనలు చెప్పుతున్నావు. నువ్వు కలసుకున్నవాళ్ళగురించి చెప్పావు. వాళ్ళతో మాట్లాడిన విషయాలు కూడా వివరంగా చెప్పావు. ఒకటేమిటి ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన ప్రతి చిన్న సంగతి పూసగుచ్చినట్టు చెప్పావు. నేను చూస్తుంది కలో నిజమో అర్ధం కాలేదు. ఒక రకమైన ట్రాన్స్ లో ఉండిపోయాను. అద్భుత దృశ్యం చూస్తున్నట్టుగా అచేతనమయ్యాను. నా జీవితంలో ఎంతో మంది మగవాళ్ళను చూశాను. భార్య పోయి నెలరోజులు కాకముందే మళ్ళి పెళ్ళి చేసుకున్న వాళ్ళున్నారు. భార్య జీవించి ఉండగానే ఇంకో స్త్రీ తో అక్రమసంబంధం పెట్టుకున్న వాళ్ళను చూశాను. కాని నీలాంటి మగవాడిని మాత్రం చూడలేదు."
"నీ భార్య పోయి పదిసంవత్సరాలు దాటిపోయింది. అయిన ఆమెను
నువ్వు మరచిపోలేదు. ప్రతి క్షణం ఆమె నే తలుచుకుంటున్నావు. ఆమె నిజంగానే జీవించిఉన్నట్టు భావిస్తున్నావు.ఆ నమ్మకంతోనే రోజు రాత్రి ఆమెతో మాట్లాడుతున్నావు. ఒక్క క్షణం కూడా నవ్వు మిత్రవిందను మరచిపోలేదని ఈ సంఘటన నిరూపిస్తుంది."
"ఆ దృశ్యం చూడగానే నా కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి. ఆనందం సంతోషం
నన్ను కలసి కట్టుగా కదిపేశాయి. పురుషులలో పుణ్యపురుషులు ఉంటారని పుస్తకాలలో చదివాను. పెద్దవాళ్ళు అంటే విన్నాను. కాని మెదటి సారి ఇప్పుడు ప్రత్యేక్షంగా చూస్తున్నాను. ఆ పురుషుడు నా తమ్ముడు కావటం నాకు చాల గర్వంగా ఉంది" అంది రోసి.
వనమాలికి చాల సిగ్గు వేసింది. రోసి మొహం చూడలేక తలదించుకున్నాడు. ఇంతకాలం ఆ రహస్యం కాపాడుకుంటు వచ్చాడు. కాని ఇప్పుడు రోసికి తెలిసిపోయింది. ఏదో తెలియని సిగ్గుతో అతని శరీరం కుంచించుకుపోయింది.
రోసి అతని పరిస్ధితి గమనించి అంది.
"ఈ విషయం తెలిసి కూడా నిన్ను మళ్ళి పెళ్ళి చేసుకోమని ఎందుకు బలవంతం చేస్తున్నానో తెలుసా. ప్రస్తుతం నీకు ఒక తోడు అవసరం. ఇంకా ఎంత కాలం ఒంటరిగా ఉంటావు.
ఇంకో పెళ్ళి చేసుకున్నంతమాత్రన్న మిత్రవింద మీద ప్రేమ తగ్గిపోయినట్టు కాదు. బాగా ఆలోచించు. సత్యం
బోధపడుతుంది."
"నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను. కాని పెళ్ళి మాత్రం చేసుకోను. ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. నన్ను క్షమించు. దయచేసి నన్ను అర్ధం చేసుకో. ఇంకేప్పుడు మళ్ళి ఈప్రస్తావన తీసుకురావద్దు "అన్నాడు వనమాలి గంభీరంగా.
రోసి దెబ్బతిన్నట్టు చూసింది. వనమాలి పట్టించుకోకుండ మేడమీదకు వెళ్ళాడు. బాల్ రిమోట్ కంట్రోల్ ఉన్న బ్యగ్ ని బీరువాలో పెట్టి తాళం వేశాడు. శభ్రంగా స్నానం చేసి
కిందికి వెళ్ళాడు. రోసి ప్రక్కన కూర్చున్నాడు. అప్పుడే టీవిలో న్యూస్ వస్తుంది. న్యూస్ రీడర్ వార్తలు చదువుతుంది. స్క్రీన్ మీద జాన్ డేవిడ్ ఫోటో పడింది. రెండు గంటలకు ముందు అతని మీద జరిగిన బంబు దాడిగురించి చప్పుతుంది.
వనమాలి ఒరగా రోసి వైపు చూశాడు. అమె మొహం సున్నం
కొట్టినట్టు తెల్లగా పాలిపోయింది. భర్త మరణం ఆమెను బాధపెడుతుంది. జాన్ డేవిడ్ దుర్మార్గుడే కావచ్చు.
మూర్తీభవించిన రాక్షసుడే కావచ్చు. కాని అతను ఆమె కట్టుకున్న భర్త. భారతీయ స్త్రీకి భర్త కంటే వేరే దైవం
లేదు. ఈ విషయం రోసి చెప్పకనే చెప్పింది. ఒక సగటు స్త్రీలా ప్రవర్తించింది.
వనమాలికి అక్కని చూస్తే జాలి వేసింది. వెళ్ళి ఓదార్చలను
కున్నాడు. కాని ఈ లోగా ఆమె లేచి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. దాదాపు రెండు గంటల వరకు
గదిలోంచి బయటకు రాలేదు. నాయర్ భోజనానికి పిలిచాడు. వనమాలి వెళ్ళి తలుపు తట్టాడు. నాలుగు
సార్లు కొట్టిన తరువాత తలుపు తెరిచింది రోసి. దుఖ్ఖానికి ప్రతికలా ఉందామే. వనమాలి ఏదో చెప్పబోయాడు.
ఈ లోగా రోసి అందుకుని అంది.
"అతను చెడ్టవాడే కావచ్చు. నీచుడే కావచ్చు. కాని నా భర్త.
మనస్సులో ఇంకా ఏదో మూల అతని మీద అభిమానం మిగిలిపోయింది. అది ఇప్పుడు కన్నీళ్ల రూపంలో
బయటకు వచ్చింది.

                                                                                                                 

 

 

 

 

 

 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)