ప్రత్యేక కథనం

- తాటిపాముల మృత్యుంజయుడు


'జీవన సమరం'లో 'పాకుడురాళ్ల 'ను విజయానికి మెట్లుగా మలచుకొన్న రావూరి భరద్వాజ!
 

 

 
 

గురుముఖంగా కూర్చుని చదువుకున్నది ఎనిమిదో తరగతి వరకే. అయితేనేం, మూడు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసాయి. కాలేజీల్లో కోర్సుల్లో ఆయన రచనలు బోధింపబడతాయి. ఎంతోమంది విద్యార్థులు ఆయన సాహిత్యాంశాలపై పీ.హెచ్ డీ. చేసారు. 

మొదట్లో బ్రతుకుతెరువు కోసం పొలాల్లో, ఫాక్టరీల్లో కూలీగా చేసారు. మంచినీళ్లతో కడుపు నింపుకొన్నాడు. కటికనేలపై నిద్రపోయాడు. అవేమీ నామోషి కాలేదు. ఎన్నేన్నో పురస్కారాలు, బిరుదులు అతన్ని 'ఏడి? ఎక్కడున్నాడు?' అంటూ వెదుక్కుంటూ వచ్చాయి. 

అతనే, తెలుగుతల్లి చేతుల్లో ఎత్తి గర్వంగా చూపే ముద్దుబిడ్డ, డా. రావూరి భరద్వాజ. భరద్వాజగారికి జ్ఞానపీఠం లభించిన సందర్భంగా మరికొన్ని వివరాలను కింద ఇస్తున్నాము. అలాగే భరద్వాజ గారితో సుజనరంజని జరిపిన ముఖాముఖిని దృశ్యరూపంలో చివరన ఇస్తున్నాము. తప్పక వీక్షించండి.

పేరు: రావూరి భరద్వాజ

తల్లితండ్రులు: మల్లికాంబ, కోటయ్య

జననం: 5 జూలై, 1927. అప్పటి హైద్రాబాద్ రాష్ట్రంలోని మొగులూరు గ్రామం

చదువు: పాఠశాలలో 8 తరగతి. ఆంధ్ర, నాగార్జున, మరియు JNTU విశ్వవిద్యాలయనుండి గౌరవ డాక్టరేట్ పట్టాలు

వృత్తి మరియు అనుభవం: రెండవ ప్రపంచ యుద్ధంలో టెక్నీషియన్ గా పనిచేసారు. పోలాల్లో, ఫాక్టరీల్లో కూలీగా మరియూ ముద్రణాలయాల్లో, అనాధాశ్రమాల్లో పనిచేసారు. అటుపిమ్మట 'జమీన్ రైతు ', 'దీనబంధు ', 'జ్యోతీ, 'సమీక్ష ', 'అభిసారిక ', 'చిత్రసీమ ', 'సినిమా', 'యువ ' పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేసారు. 1959లో ఆకాశవాణి రేడియోకేంద్రంలో Junior Script Writerగా చేరి పదోన్నతులు పొందుతూ 1987లో Program Producerగా పదవీ విరమణ చెందారు. 

రచనా వ్యాసంగం: 17 ఏట కథారచనతో ప్రారంభమైన సాహితీప్రయాణంలో కథలు, నవలలు, నాటికలు, వ్యాసాలు, సైన్స్ పుస్తకాలు, మరియూ బాలసాహిత్యం తో కలిపి దరిదాపు 130 పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. 

తనకు నచ్చిన స్వీయరచన: జీవన సమరం 

పురస్కారాలు: 1968లో అంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి పురస్కారం

                 1968లో గోపిచంద్ సాహిత్య పురస్కారం

                       1980లో ఆంధ్ర విశ్వవిద్యాలం నుండి కళాప్రపూర్ణ

                       1983లో కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం

                       1986లో సోవియట్ నెహ్రూ లాండ్ పురస్కారం

                       1987లో JNTU నుండి గౌరవ డాక్టరేట్

                      1987లో రాజ్యలక్ష్మి పురస్కారం

                      1991లో నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్

                      1993లో భారతీయ భాషా పరిషత్తు పురస్కారం

                      2013లో 'పాకుడురాళ్లు ' నవలతో 2012 సంవత్సరపు జ్ఞానపీఠం పురస్కారం 

Interview with Jnanapeeth Awardee Dr. Ravuri Bharadwaj - Part-1

 

Interview with Jnanapeeth Awardee Dr. Ravuri Bharadwaj - Part-2

 

 


 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)