1. కృష్ణశాస్త్రి గేయాలు -
గుండెల్లో ఉండాలి కులాసా
సంగీతం : డా. చిత్తరంజన్
రాగం : శుధ్ద బంగాళా
తాళం : తిశ్రగతి
ఆరోహణ ; సరిమపదస
అవరోహణ : సదపమరిగరిస
షడ్జము, చరుశ్రుతిరిషభము, శుద్ధ మధ్యమం,
పంచమం, చతుశృతిదైవతం ఆరోహణలోను, చతుశృతి దైవతం,
పంచమం, శుద్ధ మధ్యమం, చతుశృతిరిషభం, సాధారణ
గాంధారం, చతుశృతిరిషభం,
షడ్జము అవరోహనలోను ఉండే ఈ రాగంలోని స్వరాలు
అదనంగా కైసికి నిషాదం కూడా మిశ్రమం చేయబడింది.
ప.
గుండెల్లో ఉండాలి కులాసా - నిండాలి మనసులో
దిలాసా
ఐలెస్స్తా అంటు నావ అలల మీద నడవాలి
ఓలెస్సా అంటు నావ గాలిదారి కదలాలి
1 చ.
గాలికి కోపం రానీ - కడలికి వెర్రెత్తనీ
గాలి కడలి ఏకమై - బయలంతా రేగనీ
గాలి జూలు పట్టేది - కడలి నణగద్రొక్కేది
కనపడని సరం గొకడే - కనపడని సరం గొకడే ||
గుండెల్లో ||
2. చ.
చీకట్లో వెన్నెల్లూ చిలికేదెవరు
నీళ్ళల్లో దారులు నిలిపేదెవరు
అసలు పడవ నడిపేదీ ఆవలి ఒడ్డు చేర్చేది
అగపడని సరం గొకడే - అగపడని సరంగొకడే ||
గుండెల్లో ||
2. ఎంతకాలం వేచియుందును
రచన : కృష్ణశాస్త్రి
రాగం : కీరవాణి
సంగీతం : డా||చిత్తరంజన్
తాళం : మిశ్రచాపు
ఆరోహణ : సరిగమపదనిస
అవరోహణ : సనిదపమగరిస
షడ్జము, చతుశృతిరిషభం, సాధారణ గాంధారం, శుద్ధ
మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం యీ
రాగంలోని స్వరాలు.
ప
ఎంతకాలము వేచియుందును - ఎంతభారము మోసికొందును
ఇంత దవ్వైనీకు నా స్వామీ రేబవలు నన్నీ
చింతయే దహియించునాస్వామీ
1 చ.
బ్రతుకు బ్రతుకంతయును కన్నుల
బడి చరించుచు నెదురు చూతును
ఈనిశాగ్నులు చెదరరావోయీ నానాధ నాకై
యింకనైనా కదలిరావోయీ || ఎంత ||
2. చ.
తళుకు తారకలెందుకోయీ
కలలు కోరికలొల్లనోయీ
ఈవుగాకే ఆశలనలములు - ప్రాణేశ్వరా నా
కీవు గాకేవరము దుర్భరము || ఎంత ||
3. చ.
మౌని మస్తక భూషణమ్ములు
దీన శోక విదారణమ్ములు
ఏరికందని దివ్య భాగ్యములు - హృదయేశ్వరా నీ
గోరుకొసలే నాకు ప్రాణములు || ఎంత || |