తెలుగు మాట్లాట బే ఏరియా ఫ్రీమాంట్ పోటీలు


 

 సిలికానాంధ్ర మనబడి నిర్వహిస్తున్న తెలుగు మాట్లాట కార్యక్రమం బే ఏరియా లోని ఫ్రీమాంట్ నగరంలో ఏప్రిల్ 20వ తేదీన జరిగింది. తెలుగు భాషను అమెరికాలోని తెలుగువారి పిల్లలు మరింతగా ఉపయోగించుకొనుటకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పదరంగం మరియు తిరకాటం అనే పోటీలు జరిపారు. ఈ పోటీలకు 6 నుండి 11 వయస్సులోని పిల్లలు, నలభై మందికి పైగా పాల్గొన్నారు. బే ఏరియాలో నాలుగు ప్రాంతాలలో జరుగుతున్న పోటీల్లో ఫ్రీమాంట్లో ప్రథమంగా జరిగాయి.

ఈ పోటీలను ప్రారంభిస్తూ సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ, తెలుగు భాష వ్యాప్తికి సిలికానాంధ్ర చేస్తున్న వివిధ ప్రయత్నాలలో ఈ పోటీలు పిల్లలకి బాగా చేరువ అవుతాయని ఆకాంక్షించారు. భారత దేశంలోని ఏ ఇతర భాషలలోను ఇటువంటి పోటీలు నిర్వహించడం లేదని, తెలుగు భాషలో ఈ ప్రయత్నం సాగించడం సిలికానాంధ్ర వారి అదృష్టం అని తెలియచేసారు.

మొదటగా పదరంగం (తెలుగు పదాల స్పెల్లింగ్ బీ) పోటీ జరిగింది. ఇరవై ఆవృత్తాలలో జరిగిన ఈ పోటీలో, సరళ పదాల నుంచి ద్విత్వాక్షరాలు, వత్తులు కలినిగిన పదాలపై పోటీ జరిగింది. ఇందులో శ్వేత మల్యాల మొదటి బహుమతి పొందగా, రెండవ బహుమతి భవ్య సాయి సరస్వతుల గెలుచుకొంది. మాధవి కడియాల, రత్నమాల వంక, మహేశ్వరీ మద్దలి, హేమలత వరద గార్లు ఈ పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

భోజన విరమాంతరం, జరిగిన తిరకాటం పోటీ (అమెరికన్ టీవీ క్విజ్ షో జేపర్డి ఆధారం) పిల్లలని విశేషంగా ఆకట్టుకుంది. 5 ఆవృత్తాలలో విజేతలు ఎంపిక కాగా, భవ్య సాయి సరస్వతుల మొదటి బహుమతి, శ్వేత మల్యాల రెండవ బహుమతి గెలుచుకొన్నారు. పూర్ణిమ కంచుమర్తి, వసంత మంగళంపల్లి ఈ పోటీ నిర్వహించారు.

విజేతలకు మనబడి డీన్ చమర్తి రాజు, సిలికానాంధ్ర అధ్యక్షుడు విజయ సారధి మాడభూషి ప్రశంసా పత్రం, నగదు బహుమతి అందజేసారు. బే ఏరియాలో తదుపరి కార్యక్రమాలు, లివర్ మోర్ లో ఏప్రిల్ 27, సన్నీవేల్ లో మే 4, కుపెర్టినో లో మే 5న జరుగుతాయని, ఉత్సాహవంతులు ఈ పోటీలకు నమోదు చేసుకోవచ్చు అని బే ఏరియా సంచాలకుడు ఆనంద్ బండి తెలియజేసారు. శ్రీరామ్ కొట్ని, జయంతి కొట్ని, శ్రీదేవి గంటి, జానకి హోత , మొహమ్మద్ ఇక్బాల్, రాజశేఖర్ మంగళంపల్లి ఫ్రీమాంట్ కార్యక్రమ నిర్వహణచేసారు.


 

 

 
 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)