లేఖిని సమావేశం

- రచన : తమిరిశ జానకి    


 

మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ "లేఖిని"2006 లో కొంతమంది రచయిత్రులము కలిసి స్థాపించాము. ఏనిమిది సంవత్సరాల క్రిందత డా.వాసా ఫ్రభావతి గారు అధ్యక్షురాలుగా [ఫ్రెసిడెంట్] "లేఖిని" సంస్థ స్థాపించడం జరిగినది. ఇందులో చాలామంది సభ్యులుచేరి ఉన్నారు.ప్రతి నెలా సాహిత్య కార్యక్రమములు వివిధ రకములైనవి జరుపుతూఉంటాము .కధా సదస్సులు కవిసమ్మేళనములు పుస్తకావిష్కరణలు మొదలైనవి మాత్రమే కాక తెలుగుభాషాభివౄద్ధికై రచయిత్రుల బాధ్యత,ఆర్ధిక సామాజిక రాజకీయ రంగాలలో మహిళల అభివౄద్ధి మొదలైన ఎన్నో చర్చా వేదికలు, సాహిత్యంలో ప్రముఖులైన ఎందరో పెద్దలతో ముఖాముఖీ చర్చలు తరచుగా చేస్తూ ఉంటాము. ఉగాదికి ప్రత్యేక కార్యక్రమం స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య సమరయోధులకి సత్కారం, మహిళాదినోత్సవ సందర్భంలో వివిధ రంగాలలో ప్రసిద్ధులైన మహిళలకు సన్మానాలు మాతౄభాషా దినోత్సవం రోజున " పలుకే బంగారమాయెనా"లాంటి విశిశ్టమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కార్యక్రమాలలో ముందుగా లలిత సంగీతములు కూచిపూడి భరతనాట్యములు వంటివి చిన్నపిల్లలు పాల్గొని ప్రదర్శించేలా చూస్తాము.

అష్టమ వార్షికొత్సవానికి ముఖ్య ఆతిథిగా రాష్ట్ర మహిళా కమీషన్ సెక్రటరీ శ్రీమతి కె.రాజ్యలక్ష్మి గారిని ఆహ్వనించాము.

 
   

మాతృదేవో భవ పురస్కార గ్రహీతల వివరాలు:

డా|| వాసా ప్రభావతి  - విమర్శనా రంగానికి - డా|| కాత్యాయని విద్మహే

డా|| అరుణా వ్యాస్ - విశిష్ట మహిళగా - శైలజా సుమన్, డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం

శ్రీమతి తమిరిశ జానకి - అనువాద రంగానికి - అంబికా అనంత్

శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి - కథ, నవలా రంగానికి - ఇంద్రగంటి జానకిబాల

శ్రీమతి ముక్తేవి భారతి - కవిత్వానికి - డా|| చిల్లర భవానీ దేవి

శ్రీమతి శ్రీపాద స్వాతి - నాటక రంగానికి - అత్తలూరి విజయలక్ష్మి

శ్రీమతి ఎమ్.ఎస్.కామేశ్వరి దేవి - నాట్యము, నటనా రంగానికి - డా||సబిత

శ్రీమతి ఉంగుటూరి శ్రీలక్ష్మి - సంగీతానికి - యెర్రమిల్లి రమాప్రభ, ప్రిన్సిపల్, ఆంధ్రమహిళా సభ, మ్యూజిక్ కాలేజి.

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)