స్వప్నాల పుష్పాలు
రాలుతున్నాయి స్వప్నాలు
రాసులుగా
మనసుముంగిట
కసుకందులల్లె
విచ్చుకోనికుసుమాలల్లె !
ఒక్కొక్క
మొగ్గా తొడిగి ఎన్నెన్నిఊహలు
ఊహల్లో ఆశలు
ఆశల్లో రంగులు !
ఆకసాన సగమంటూ
అరవిరిసిన అందాలై
ఆత్మగౌరవపు
దరహాసాలై
నిజాయితీ
నిబ్బరాలు నిలువెల్లా సొత్తులై
జీవననాదానికి
నిండైన అర్ధమై
వెలుగుకే
వెలుగై వెలుగొందే
వనిత మనసు
ముంగిట
రాలుతున్నాయి
స్వప్నపుష్పాలు
సరిగా
విచ్చుకోకమునుపే !
చెమరుస్తోంది
గుండె కన్నీటి చిలకరింపై !
ఆత్మవిశ్వాసమే
నింపి పన్నీరుగాచేసి
పదిలంగ చూడాలి
విరబూయగా !
ఒడుపుగా
కట్టాలి విజయాల మాల
విజయనామసంవత్సరాన !
|