జగమంత కుటుంబం - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ఉత్తర అమెరికా పర్యటన

- పంపినవారు : కూచిభొట్ల శాంతి   


 

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు ప్రఖ్యాతి గాంచిన పండితులు మరియు గొప్ప ప్రవచనకర్త. ఆయన తన అసమాన ప్రతిభతో, సామాన్య ప్రజానీకానికి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను చక్కని ఉదాహరణలుగా చూపుతూ, మన ఇతిహాసాల అంతరార్థాలను మరింతగా అర్థం చేసుకునేందుకు తన ప్రసంగాల ద్వారా వారిని ప్రభావితం చేస్తున్నారనడం అతిశయోక్తి కాదు. శివపురాణం,  రుద్రభాష్యం, శివలీలావిలాసం,  శ్రీకృష్ణతత్వం,  సౌందర్యలహరి ప్రసంగాలు ఆయన చేసిన చాల ప్రసంగాలలోని కొన్ని మచ్చు తునకలు.  

2009లో జాతీయ వార్తాపత్రిక, 'ది హిందూ' లో ప్రచురింపబడిన విధంగాఆధ్యాత్మిక ప్రచారములో వారు ఆదిశంకరులు మరియు వివేకానందుల వారిని తలపింప చేయుచున్నారు అన ిఅనడంలో సందేహం లేదు.కవి, గ్రంథకర్త అయిన శ్రీ శర్మ గారి కలం నుండి చక్కని పాటలు, గ్రంథములు వెలువడ్డాయి. శ్రీ శర్మగారు నిర్వహిస్తున్న 'ఋషిపీఠం' సకలాంధ్ర జనానీకానికి విశేషంగా వేదవిజ్ఞానాన్ని అందిస్తున్న మాసపత్రిక. 

ఉత్తర అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు రెండున్నర నెలల పాటు (మే 30వ తేదీ నుండి ఆగస్ట్ 11వ తేదీ వరకు) బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి  ఆధ్యాత్మిక, సాహిత్య, కవితా, విజ్ఞాన ప్రవచనాల ద్వారా మరోమారు ధన్యులు కాబోతున్నారు. వారి ప్రవచనాల ద్వారా ప్రతి తెలుగు శ్రోత హృదయం స్పందించబోతోంది. దాదాపు రెండు సంవత్సరాల తరువాత గురువుగారు ఇక్కడి వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు వస్తున్నారు. 

ఉత్తర అమెరికాలో గురువుగారి ప్రవచనా వివరములు:

మే 30వ తేదీ,  ఫీనిక్స్, అరిజోనా (Phoenix, AZ)

మే 31వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు, పోర్ట్లాండ్, ఆరెగన్ (Portland, OR)

జూన్ 5వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు, శానోసె, కాలిఫోర్నియా (San Jose, CA)

జూన్ 12వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు, అర్వైన్, కాలిఫోర్నియా (Irvine, CA)

జూన్ 15వ తేదీ, నార్త్ హాలీవుడ్, కాలిఫోర్నియా (North Hollywood, CA)

జూన్ 16వ తేదీ, శాండియాగో, కాలిఫోర్నియా (San Diego, CA)

జూన్ 18వ తేదీ నుండి జూన్ 23వ తేదీ వరకు, డెట్రాయిట్, మిచిగన్ (Detroit, MI)

జూన్ 24వ తేదీ, రాలీ, నార్త్ కరోలినా (Raleigh, NC)

జూన్ 25వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు, వర్జీనియా/వాషింగ్టన్ డిసి (Virginia/Washington D.C.)

జులై 1వ తేదీ నుండి జులై 2వ తేదీ వరకు, ఆర్లండో, ఫ్లోరిడా (Orlando, FL)

జులై 3వ తేదీ నుండి జులై 4వ తేదీ వరకు, టాంపా, ఫ్లోరిడా (Tampa, FL)

జులై 5వ తేదీ నుండి జులై 7వ తేదీ వరకు, అట్లాంటా, జార్జియా (Atlanta, GA)

జులై 11వ తేదీ నుండి జులై 12వ తేదీ వరకు, సియాటిల్, వాషింగ్టన్ (Seattle, Washington)

జులై 13వ తేదీ నుండి జులై 14వ తేదీ వరకు, సెయింట్ లూయీ, మోంటానా (St. Louis, MN)

జులై 15వ తేదీ నుండి జులై 21వ తేదీ వరకు, చికాగో, ఇల్లినాయీ (Chicago, IL)

జులై 22వ తేదీ నుండి జులై 28వ తేదీ వరకు, డల్లస్, టెక్సాస్ (Dallas, TX)

జులై 29వ తేదీ నుండి ఆగస్ట్ 4వ తేదీ వరకు, హ్యూస్టన్, టెక్సాస్ (Huston, TX)

ఆగస్ట్ 7వ తేదీ నుండి ఆగస్ట్ 8వ తేదీ వరకు, బోస్టన్, మాసచ్యూసెట్స్ (Boston, MA)

ఆగస్ట్ 9వ తేదీ నుండి ఆగస్ట్ 11వ తేదీ వరకు, న్యూజెర్సీ 

వివరములకు సంప్రదించండి:

శ్రీ రవి జంధ్యాల

విద్యుల్లేఖ చిరునామా: ravijandhyala@gmail.com or samavedamtour@gmail.com

ఫోన్: 949 307 6457

 
 

విజ్ఞప్తి

జగమంత కుటుంబం సిలికానాంధ్ర కుటుంబ సభ్యుల, స్నేహితుల వివాహాది వేడుకలు, విజయాలు మొదలైనవి అందరితో పంచుకోవడానికి జగమంత కుటుంబం ఓ చక్కని అవకాశం

మీ రచనలకు ఫోటోలను జతపరచి sujanaranjani@siliconandhra.org కి పంపగలరు.


 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)