అన్నమయ్య 605 జయంతి ఉత్సవం - జూన్ 1, 2013

 

-   తాటిపాముల మృత్యుంజయుడు   


 

శ్రీమహావిష్ణువు ఆదేశంతో నందకుడు అనే ఖడ్గం పాటలతో అవనిని పావనం చేయడానికి అన్నమాచార్యునిగా అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. 95 ఏళ్లు జీవించిన అన్నమయ్య 'తొలి వాగ్గేయకారుడు 'గా గుర్తించబడ్డాడు. ఆటు తర్వాత 'పదకవితామహుని 'గా పేరొందాడు. భక్తి, సంగీత, సాహిత్య సంగమంగా అన్నమయ్యను వర్ణించవచ్చు.

భక్తి తొమ్మిది విధాలుగా ఉంటూంది అని చెప్పబడింది.

శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం,

అర్చనం వందనం దాస్యం, సఖ్యమాత్మ నివేదనం

 

పైన పేర్కొనబడిన నవవిధానములను పాటిస్తూ 'భావములోన, బాహ్యమునందును...' అని ఒక కీర్తనలో చెప్పుకున్నట్లు అంతర్గత, బహిరంగాలలో వేంకటేశుని తత్త్వాన్ని చవిచూసాడు అన్నమయ్య. అనుక్షణం తను నమ్మిన భావాన్ని మనసావాచాకర్మణా ఆచరించాడు కాబట్టే వేలకొలది కీర్తనలను అలవోకగా రాయగలిగాడు. వాడుక భాషలోని పదాలు, సామెతలు, జాతీయాలను విరివిగా ఉపయోగిస్తూ తెలుగు నుడికారపు సొంపులతో 32 వేలకు పైగా కీర్తనలను రచించి గానం చేసాడు. యోగ, శృంగార, వైరాగ్య మార్గాలలో కృతులను రచించడమే కాకుండా మేలుకొలుపు పాటలు, లాలిపాటలు, యుగళగీతాలు, చందమామ పాటలు, తుమ్మెద పాటలు, కోలాటం పాటలు, సువ్వి పాటలు, జాజర పాటలు, ఉగ్గు పాటలు, ఉయ్యాల పాటలు మొదలైన దేశకవితా జానపదాలను కూడా రాసాడు.

 

సంవత్సరం సిలికానాంధ్ర వినూత్న ప్రయోగం చేయడానికి తలబెట్టింది. మహానగర సంకీర్తన, సహస్రగళార్చన - సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం తో పాటు అన్నమాచార్యుని కీర్తనలనలను ఉపయోగిస్తూ పెండ్లి తంతును అనుసరిస్తూ దేవదేవుని కళ్యాణం చేయాలని సంకల్పించింది. అన్నమాచార్య కీర్తనలలూ కళ్యాణానికి సంబంధించినవి కొన్నింటిని మనము వింటునే ఉంటాము.

ఉదాహరణకు:

 

పసిడియక్షింత్లివె పట్టరో వేగమే రారోరో, దెసల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని

శ్రీవెంకటేశ్వరునికి శ్రీమహాలక్ష్మికి, దైవిక పెండ్లి ముహూర్తము నేడు

పిడికెడు తలంబ్రాల పెండ్లికూతురు కొంత, పడమరలి నవ్వీనె పెండ్లికూతురు

పేరుకల జవరాలె పెండ్లికూతురు, పేరుల ముత్యాల మేడ పెండ్లికూతురు

పేరంటాండ్లు పాడరే పేండ్లివేళ, సారెసారె నిద్దరికి సంతోషవేళ

చిత్తజు త్ల్లికి వేగ సింగారించరే మీరు, తత్తరించేరిది ముహూర్తపువేళ

 

ఇన్ని రాసుల యునికి, ఇంతి చెలువపు రాశి

కన్నె నీ రాశి, కూటమి కలిగిన రాశి

నవరసములదీ నళినాక్షీ

జవ కట్టి నీకు జవి చేసి

చెలులారా చూడరే ఈ చెలి భాగ్యం, అలమేళుమంగ యికే కబ్బెను ఈ భాగ్యం

పతిదయ కలిగిన పడతిదీ భాగ్యం, అతడు మాత మీరనీదది భాగ్యము

 

అమెరికా దేశంలోని సన్నివేల్ పురవీధుల్లో 'మహానగర సంకీర్తన ' భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వేయి గొంతుకలు కలిపి ఆలపించే 'సప్తగిరి సంకీర్తనల గోష్ఠి గానం' శిక్షణ త్వరలో మొదలు కాబోతుంది. మరింకెందుకు ఆలస్యం! ఈ అపూర్వఘట్టంలో పాల్గొని తరిద్దాం రండి. ఆలస్యం చేయకుండా మే, 5 లోపు ఈ మహత్తర కార్యక్రమానికి నమోదు చేసుకోండి. చరిత్ర సృష్టించబోయే స్వరార్చనలో భాగస్వామ్యులు కండి. వినూత్నంగా జరబోయే 'శ్రీ వేంకటేశ్వర కల్యాణ సంకీర్తనం ' తిలకించండి. మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన కరపత్రిక చూడండి. 

మంగళమమ్మకున్, సకళ మంగళమంబుజ నేత్రికిన్

జయమంగళామిందిరా సతికి, మంగళమీ అలమేలు మంగకున్

మంగళమందునే మరియు, మంగళమందును

దేవలోక దివ్యాంగనలెల్ల ఈ సతికి ఆరతులిత్తురు వేంకటేశ్వరా!

 

శుభం భూయాత్!!!

 

 
 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)