తెలుగు తేజోమూర్తులు

- రచన : ఈరంకి వెంకట కామేశ్వర్.

 


నాలుగు దశాబ్దాలకు పైగా గ్రాఫిక్స్ తీరిస్ట్ గా, సుప్రసిద్ధ సంస్థ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐ ఎస్ ఐ) ఆచార్యుడిగా, సంచాలకుడిగా, డీన్ గా, ముఖ్య పరిపాలనాధికారిగా, అధ్యక్షుడిగా తన అమూల్య సేవలు గణిత సంఖ్యా శాస్త్ర క్షేత్ర రంగానికి అందిస్తూ వచ్చారు డాక్టర్ సిద్ధాని భాస్కరరావు గారు. లైన్ గ్రాఫ్స్, ఫ్రీక్ వెన్సి పార్టిషన్స్, డిగ్రీ సీక్వెన్సెస్ అంశలలో దిట్ట.

భారత దేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో మేటి సంస్థ ఐన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, సంచాలకుడిగా వ్యవహరించారు.
ఇలా తెలుగు తేజం డాక్టర్ సి ఆర్ రావు, తర్వాత డాక్టర్ సిద్ధాని భాస్కర రావు గారు తమ ప్రజ్ఞా పాటవాలతో గణిత, సంఖ్యా శాస్త్రాలలో తన పాండిత్య ప్రకర్షలతో ఉత్తమ పీఠాన్ని అధిష్టించారు. ఇలాటి ఉదాహరణలు ఇతిహాసంలో దొరకడం కష్టం. గురువు తరువాత, వారి శిష్యుడు (డాక్టర్ సి ఆర్ రావు వీరికి డాక్టరేట్ గైడ్) అఖండ కృషితో, దీక్షతో, ప్రజ్ఞా, ప్రతిభ ప్రదర్శించి డైరెక్టర్ పదవిని అలంకరించారు.

డాక్టర్ ఎస్ బి రావు గారు మంచి పరిపాలనా దక్షత కలిగి ఉన్నవారు. ప్రస్తుతం ఏ ఐ ఎం సి ఏ ఎస్ డాక్టర్ సి ఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాతమాటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ (హైద్రాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం) వ్యవస్థాపక సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ సర్వతో ముఖ్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.

డాక్టర్ ఎస్ బి రావు గారు ఎస్ వి జి హై స్కూల్, మారుటేరు నుండి ఎస్ ఎస్ ఎల్ సి ఉత్తీర్నులై, 1960-63 లో బి ఎస్ సి లో పట్టభద్రులైయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం ఏ (1965) పట్టా సాదించారు. 1971 లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐ ఎస్ ఐ), కోల్కతా సంస్థలో లివింగ్ లెజెండ్, సంఖ్యా శాస్త్ర దిగ్గజం డాక్టర్ సి ఆర్ రావు పర్యవేక్షణలో పీ హెచ్ డి పట్టా సాదించారు. తరువాత ముంబై విశ్వవిద్యాలయం చేరి ఎస్ ఎస్ శ్రీఖండె తో కలసి పరిశోధన చేశారు. ఈ తరుణంలో రిసర్చ్ స్కాలర్ గా కింగ్స్ కాలేజి (అబెర్దీన్) సందర్సించి క్రిస్పిన్, నాష్ విలీంస్ తో కలసి పనిచేశారు.

కూవైట్ విశ్వవిద్యాలయం, ఒహాయో స్టేట్ విశ్వవిద్యాలయం, హరిశ్చంద్ర పరిశోధనా సంస్థలొలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు.

యూనివెర్సిటి గ్రాంట్స్ కమీషన్ నేష్నల్ పేనెల్ ఆఫ్ మాతమాటిక్స్ సభ్యుడిగా ఉన్నారు
డెపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రోగ్రాం అడ్వైసరీ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు (2001 - 2007)
ఫెల్లో, మహారాష్ట్ర అకాడమి ఆఫ్ సైన్సెస్
లైఫ్ మెంబెర్, రామానుజన్ మాతమాటిక్స్ సొసైటీ
లైఫ్ మెంబెర్, ఒడిషా మాతమాటికల్ సొసైటీ
లైఫ్ మెంబెర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్
లైఫ్ మెంబెర్, అకాడమి ఆఫ్ డిస్క్రీట్ మాతమాటిక్స్, మైసూర్

రచనలు, ప్రకటనలు:

నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన వీరి పరిశొధనలలో అనేక ప్రకటనలు చోటు చేసుకున్నాయి. దాదాపు డెబ్బై పరిశోధనా పత్రాలు, జాతీయ, అంతర్జాతీయ సమావేశాలలో, సదస్సులలో ప్రకటించారు.

ఎర్డోస్, శ్రీఖండే, డి కే రాయ్ చౌధరి, ఎన్ ఎం సింఘి, కే ఎస్ విజయన్, ఏ ఆర్ రావు, బి డి ఆచార్య, విజయ కుమార్ తదితరులతో, విభిన్న పరిశోధనా అంశాలపై కూలంకషముగా పనిచేశారు. వీరు ప్రకటించిన పత్రాలు డిస్క్రీట్ మాతమాటిక్స్, కాంబినేటోరియల్ తీరీ, గ్రాఫ్, డైగ్రాఫ్ తీరీ తదితర క్షేత్ర గణిత అంశాలకు సంభందించినవి.

లెక్చర్ నోట్స్ ఇన్ మాతమాటిక్స్, కాంబినేటోరిక్స్ అండ్ గ్రాఫ్ తీరీ, స్ప్రింగర్ వెర్లాగ్
ప్రొసీడింగ్స్ ఆఫ్ ఆర్ సి బోస్ మెమోరియల్ కాంఫెరెన్స్, సంఖ్యా
సెలెక్టెడ్ పేపర్స్ ఆఫ్ సి ఆర్ రావు; సంపుటాలు 3, 4, 5 (జే కే ఘోష్ తదితరులు)
ప్రొసీడింగ్స్ ఆఫ్ నేష్నల్ కాంఫెరెన్స్ ఆన్ గ్రాఫ్స్, కాంబినేతొరిక్స్, అల్గారితంస్ అండ్ అప్ప్లికేషన్స్, నరోశ పబ్లిషింగ్ హౌస్

1971 లో ఎస్ బి రావు గారు గ్రాఫిక్ డిగ్రీ సీక్వెన్సెస్ కు సంభందించి చేసిన " కంజెక్చర్ ", 2008 లో మారియా చడ్నోవ్స్కి పాల్ సేయ్ మూర్ తమ సిద్ధాంతాలు ప్రతిపాదించి నిరూపించారు. రెండవ " కొంజెక్ చర్ " డాక్టర్ ఎస్ బి రావు గారే స్వమ్యంగా దాదాపు ముప్పై యేళ్ళ తరువాత నిరూపించారు. ఇవి స్ట్రక్చర్ తీరీ ఆఫ్ డైరెక్టెడ్ సెల్ఫ్ క్లాంపిమెంటరీ గ్రాఫ్స్ అంశానికి దారితీసింది.

వీరి కృషి శ్లాఘనీయం. దాదాపు ఐదు దశాబ్దాల పాటు గణితం, ప్రత్యేకించి సంఖ్యా శాస్త్ర అభివృద్ధికి విశిష్ట సేవలు అందిస్తూ వస్తున్నారు. వీరి అవిరళ కృషితో ఈ సంస్థ అంతర్జాతీయ ప్రమణాలతో ఇంకా అభివృద్ధి చెందుతుందని నిస్సంకోచముగా చెప్పవచ్చు. దీనికి వీరి శాస్త్రీయ పరిజ్ఞానం, ఈ క్షేత్ర రంగం పట్ల ఆయనకు ఉన్న తదైక భావం, పరిపాలనా దక్షత ముఖ్య కారణాలు.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech