శీర్షికలు  
     మాస ఫలాలు
 

- రచన :  బుద్ధవరపు శ్రీ 

 

 

 

బుద్ధవరపు శ్రీ గారు, జ్యోతిష్కుల కుటుంబంలో పుట్టి, ఇలవేల్పు శ్రీవీరభద్రుల వారి అశీర్వాదంతో, బాబాయి శ్రీక్రిష్ణశర్మ సిద్దాంతి గారి దగ్గర జ్యోతిష్యం లో ఓనమాలు నేర్చుకొని, తండ్రి గారు లక్ష్మి నరసింహం గారి దగ్గర మెళకువలు నేర్చుకుంటూ గత 16 సంవత్సరముల నుండి జ్యోతిష్య, హస్తసాముద్రిక శాస్త్రములను అభ్యసిస్తున్నారు

 

            మేషరాశి

అశ్విని (అన్ని  పాదాలు), భరణి (అన్ని  పాదాలు), కృత్తిక (మొదటి పాదం) 

ఈ నెల లో అధిక ఖర్చులు, అలసట, శారీరక మానసిక శ్రమ కలుగుతాయి. పిల్లల్ల విషయం కొంచెం ఆందోళన ఆత్రుత కలుగుతాయి. ఫ్రయాణములు శ్రమతో లాభిస్థాయి. ఉద్యోగ రీత్యా ధన వృద్ధి సంభవం. ఈ నెల ఉద్యోగస్థులు కొంచెం జాగ్రత్తగా వుండాలి. పని ఎక్కువ అవ్వటం వలన అధిక శ్రమ వత్తిడి దాని వలన యజమానితో కలహం సంభవం. అన్ని పనులు చాలా జాగ్రత్తగా చెయ్యాలి.
   
 

వృషభరాశి

కృత్తిక (2,3,4 పాదములు), రోహిణి (అన్ని పాదాలు), మృగశిర (1,2 పాదాలు

ఈ నెల ఉద్యోగం వలన ధన లాభం. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆస్థి వ్యవహారాలు అన్నీ సర్దుకుంటాయి. ఉద్యోగ విషయంలో కొంచెం అప్రమత్తత అవసరం.. ఈ నెల బంధు మిత్రుల కలయిక తో ఆనందంగా ప్రారంభం అవుతుంది. సంతానం వలన ఆనందం సంభవం. ఉద్యోగ విషయం లో కొంచెం జాగ్రత్త అవసరం. చిన్న చిన్న అరోగ్య సమస్యలు కలుగుతాయి, అశ్రద్ధ వహించవద్దు. ఆస్థుల విషయం లో అందోళన కలుగవచ్చు.. ఆత్రుతలో నిర్ణయం తీసొకొకుండా ఓర్పు వహించండి.

 

 
   
 

మిథునరాశి

మృగశిర (3,4 పాదాలు), ఆరుద్ర (అన్ని పాదాలు), పునర్వసు (1,2,3 పాదాలు

 

ధన సంపాదనకి మిక్కిలి అనువైన సమయం. వ్యాపార లావాదేవేలు భూమి సంబంధ స్తిరాస్థి క్రయ విక్రయాలకు అనువైన సమయం. ఈ నెలలో పెరిగిన సంపాదనకు తగ్గట్టు గానే ఖర్చు కూడ అధికం. ఆకస్మికంగా వచ్చిన లాభాలతో బంగారు ఆభరణముల కొనుగోలు ఇతర మంచి విషయములు జరుగును.. సాంఘికంగా పలుకుబడి పెంచుకోవటానికి, ఆడంబరాలకు ఖర్చు చేస్తారు. ఈ నెల ఉత్తరర్ధంలో ఉద్యొగంలో జయం, నూతన ఉద్యోగం ప్రారంభించుటకు మంచి సమయం. తలచిన అన్ని పనులు జయప్రదంగా జరుగుతాయి. మీరు పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి.

 

   
 

కర్కాటక రాశి

పునర్వసు (4వ పాదం, పుష్యమి (అన్ని పాదాలు),ఆశ్లేష (అన్ని పాదాలు) 

 

ఈ నెల పూర్వర్ధంలో మనస్సుకు చికాకు ఆత్మీయుల ఎడబాటు మనస్పర్ధలు కలుగును. నెల ఉత్తరార్ధంలో అంతటా జయం.. మీ కృషి ఫలించి ఉద్యోగ వ్యాపార విషయాలలొ విజయంతో ఇంకా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. దూకుడుకి ఇది సమ్యమనం కాదు, సంయమనం పాటించండి.

 

   
 

సింహరాశి

మఖ(అన్ని పాదాలు), పూర్వ ఫాల్గుణి(అన్ని పాదాలు), ఉత్తర ఫాల్గుణి (1వ పాదం)

 

ఈ నెల ఉద్యోగస్థులు కొంచెం జాగ్రత్తగా వుండాలి. పని ఎక్కువ అవ్వటం వలన అధిక శ్రమ వత్తిడి దాని వలన యజమానితో కలహం సంభవం. అన్ని పనులు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. దూకుడు కి ఇది సమయం కాదు, సంయమనం పాటించండి. చిన్న చిన్న ఆరొగ్య సమస్యలు కలుగుతాయి, అశ్రధ వహించవద్దు.

 

   
 

కన్యా రాశి

ఉత్తర ఫాల్గుణి (2,3,4 పాదాలు), హస్త (అన్ని పాదాలు), చిత్ర (1,2 పాదాలు)

 

 ఈ నెల మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో త్రిప్పట అధిక శ్రమతో కూడిన ప్రయానలు సంభవం. రక్త సంభంధ రుగ్మతలు ఉన్నవాళ్ళు అశ్రద్ధ చేయకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. ఉద్యోగ పూర్వకంగా ధన లాభం మరియు ఉద్యోగ విషయంలో అన్నింటా జయం.
 

 

   
 

తులారాశి

చిత్ర (3,4 పాదాలు), స్వాతి (అన్ని పాదాలు), విశాఖ (1,2,3 పాదాలు) 

 

ఈ నెలలో స్త్రీ మూలకంగా ఆనందం అభివృద్ధి కలుగుతాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. మీ అదృష్టం చేత ప్రతికూల సందర్భంలో కూడా వ్యాపరంలో విజయం కలుగుతుంది. ఉద్యొగంలో జయం, నూతన ఉద్యోగం ప్రారంభించుటకు మంచి సమయం. తలచిన అన్ని పనులు జయప్రదంగా జరుగుతాయి. పిల్లల అబివృద్ధి చూసి మీరు అనంద పడతారు.

 

   
 

వృశ్చికరాశి

విశాఖ (4వ పాదం), అనూరాధ (అన్ని పాదాలు), జ్యేష్ట (అన్ని పాదాలు)

ఈ నెల పూర్వర్ధంలో అంతకు ముందు ఉన్న అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది, విచారములు తొలగి అనందం కలుగుతుంది. అధిక ఖర్చు శ్రమ సంభవం, అధిక శ్రమతో కూడుకున్న ప్రయాణాలు కలుగుతాయి. ప్రయాణంలో, ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి. కుటుంబంలో అభిప్రాయ భేధాలు వచ్చే అవకాశం ఎక్కువ జాగ్రత్త వహించండి.
   
 

ధనూరాశి

మూల (అన్ని పాదాలు), పూర్వాషాడ (అన్ని పాదాలు), ఉత్తరాషాడ (1వ పాదం)

 

 ఈ నెల ప్రారంభంలో కలిగిన చికాకులు ఆరోగ్య సమస్యలు అన్నీ నెల మధ్యకి వచ్చేటప్పటికి సర్దుకుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మీ అదృష్టం చేత ప్రతికూల సందర్భంలో కూడ వ్యాపరంలో విజయం కలుగుతుంది. భార్య ఆనారోగ్యం కొంచెం అందోళన కలిగిస్తుంది.

 

   
 

మకరరాశి

ఉత్తరాషాడ (2,3,4 పాదాలు), శ్రావణ (అన్ని పాదాలు), ధనిష్ట (1,2 పాదాలు)

ఈ నెలలో ఎక్కువ శ్రమిస్తే కాని పనులు సకాలంలో పూర్తి చేయలేరు. అకస్మిక అవరోధాలతో పనులు మందకొడిగా జరుగుతాయి. భార్యా పిల్లలతో సంయమనం పాటించండి. మనస్సుని అదుపులో పెట్టుకుని దైవ చింతన చేయండి. ఆప్తులు అక్కరకు వస్తారు.

 

   
 

కుంభరాశి

ధనిష్ట (3,4 పాదాలు), శతభిష (అన్ని పాదాలు) , పూర్వాభాద్ర (1,2,3 పాదాలు)

 

 ఈ నెల చాలా లాభదాయకంగా వుంటుంది. ఉద్యోగ రీత్యా ధనలాభం ఉన్నత పదవి ప్రాప్తి సంభవం. ఫిల్లల విషయంలో ఆనందకరమైన వార్తలు వింటారు. ఫిల్లల ఉన్నత విద్యభ్యాసానికి అభివృద్దికి అనువైన సమయం. ఫూర్వార్ధంలో ఆరొగ్య లోపం, శరీరానికి విశ్రాంతి అవసరం ఈ నెలలో మనసిక, శారీరక శ్రమ ఎక్కువ. ఉద్యొగస్తుల కన్నా వ్యాపారస్తులకు కొంత అనువైన సమయం. ఉద్యోగంలో అధిక శ్రమ, అలసట. ప్రయాణాలు సాఫీగా జరగవు. భార్యతో అభిప్రాయ భేధాలకు అస్కారం ఎక్కువ, జాగ్రత్త వహించండి.

 

   
 

మీనరాశి

పూర్వాభాద్ర (4వ పాదం), ఉత్తరాభాద్ర (అన్ని పాదాలు), రేవతి (అన్ని పాదాలు)

ఈ నెల పూర్వార్ధంలో చాలా అప్రమత్తంగా వుండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా మోసం వలన ధన నష్టం జరిగే అవకాశం కలదు. జంతువుల కారణంగా అనారోగ్యం / ఆపద సంభవం. నెల ఉత్తరార్ధంలో ఉద్యోగంలో జయం అకస్మిక ధన లాభం కలుగును.

 

   
   

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech