కవితా స్రవంతి  
      Save Us from Stupidity

రచన:  తాటిపాముల మృత్యుంజయుడు

 
 

 

 

నా దేశాన్ని రక్షించు నందనా, నా
ప్రజల్ని మూఢత్వాన్నుండి, అవిటిమాలిన ఆలోచనలనుండి
పచ్చని జీవితాల్ని బుగ్గిపాల్జేస్తున్న ప్రేమోన్మాదం నుంచి
అందమైన ముఖాల్ని వికారం చేస్తున్న ఆసిడ్ దాడుల్నుంచి
 
నా దేశాన్ని రక్షించు నందనా, నా
సోదరుల్ని బుద్ధిమాద్యం నుండి, శోషపోయిన మస్తిష్కాల్నుంచి
సిగరెట్ బాబాను భుజాలపై మోస్తున్న అమాయకత్వం నుంచి
కాల్చి రాల్చిన బూడిద ప్రసాదమని అరచేతిన నాకే అవివేకాన్నుంచి
 
విగ్రహాలతో ఆడుకునే రాజకీయ దుష్టగ్రహాలనుంచి
ఆగ్రహావేశాలతో కూల్చే ప్రజల్ని తొందరపాటునుంచి
వేలకోట్లు గోల్ మాల్ చేసే అవకతవక నాయకులనుండి
వారికొరకు మనస్తాపం పొందే ప్రజల్ని ఆత్మహత్యల బారినుండి
 
నా దేశాన్ని రక్షించు నందనా, మా
రాష్ట్ర అసెంబ్లీలను బ్రష్టత్వాన్నుండి, రౌడీగూండాలనుంచి
వాళ్లు సృష్టించే వీరంగాలనుండి, అల్లరిచేసే ఆకతాయితనాల్నుండి
సభలో నీలిచిత్రాలు వీక్షించే బలహీన మనస్తత్వాలనుండి
 
ఈ సంవత్సర ఫలితాలను కొద్దిగా మార్చు నందనా, నా
సోదరులకు వివేకం వంద, బుద్ధిహీనత సున్న, మా
దొంగనాయకులకు పూజలు సున్న, అవమానం వంద
నా డేశానికి పుష్టిగా నవగ్రహాల బలాన్నివ్వు, నా
ప్రజలకు దోషాల పరిహారాన్నివ్వు
తమోఘ్నం సర్వపాపఘ్నం, తం నందనాం ప్రణమామ్యహం!
 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech