తొలిపలుకు  
    

రచన : రావు తల్లాప్రగడ

 
   సంపాదకవర్గం:
ప్రధాన సంపాదకులు:
రావు తల్లాప్రగడ 

సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
సి. కృష్ణ

వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ, హైదరాబాద్.
 

 

 అందరికీ  శుభాకాంక్షలు.

మొన్న ఏప్రిల్ 5వ తారీఖున జైనులు మహావీరజయంతి జరుపుకున్నారు. అలాగే ఏప్రిల్ 24న అక్షయ తృతియ జరుపుకున్నారు. హిందువులకు అదే ఏప్రిల్ 24న పరశురామ జయంతి వచ్చింది. అలాగే అదే రోజున సింహాచలం నరసింహస్వామి చందనోత్సవం కూడా జరిగింది. ఐనా కూడా చాలా మంది హిందువులు ఆ రోజుని (ఏప్రిల్ 24ని) అక్షయ తృతియగానే గుర్తించి పండుగ జరుపుకోవడం గమనార్హం. ఆ నాడు పరుశురామ జయంతి జరుపుకున్నవారు నిజానికి చాలాచాలా తక్కువమందే అనడం అతిశయోక్తి కాదు. అలగే మరొక విష్ణుమూర్తి అవతారమైన నృసింహస్వామి చందనోత్సవం జరుపుకున్నవారు (సింహాచలంలో తప్ప) ఎంతమంది కనపడతారు? జైనుల ఆదినాదుడు (లేక రిషభ భగవానుడు) తన ఉపవాసదీక్షను ఆ రోజు మానాడని, జైనులు పండుగ చేసుకుంటువుంటే, వారితో కలిసి, వారిని మించి పండుగ చేసుకుంటున్నారు హిందూమిత్రులు.

ఇది ఏదో సెక్యులరిజాన్ని నిరుపించుకోవడానికి లేక చూపించుకోవడానికి, హిందువులు చేసుకునే ఒక సాధారణ జైనుల పండుగ కాదు. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి, ప్రపంచ రికార్డు స్థాయిలో ఎంతో బంగారాన్ని కొనుక్కుని జరుపుకునే ఏకైక పండుగ ఇది. అంటే అక్షయ తృతియ  హిందువుల పండుగలలో ఎలా ముఖ్యమైన పండుగగా కలిపోయిందో అని చెప్పటమే ఇందులోని సారాంశం. ఇలా అనేక శతాబ్దాలుగా దగ్గిరయిపోయాయి హిందూజైనమత సంప్రదాయాలు, పండుగలు. అలాగే హిందూజైనమత మందిరనిర్మాణ శాస్త్రాలు కూడా కలిసిపోయాయి. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ , తాజమహల్ హిందూదేవాలయమే ఐనా, అందులో జైనుల ప్రభావం ఎలా కనిపిస్తోందో వివరిరిస్తోంది ఈ నెల సుజననీయం. ఆ వివరాలకు సుజననీయం తప్పక చదవాల్సిందే.

ఈ మే నెల 5వ తారీఖున సిలికానాంధ్ర, తన 604వ అన్నమాచార్య సంకీర్తనోత్సవాన్ని, ఒక జైనమందిరంలోనే నిర్వహించడానికి సంకల్పించడం కూడా ఈ హిందూజైనుల సమైఖ్యతా భావాన్నే సూచిస్తోంది. కాలిఫోర్నియలోని మిల్పిటాసునగరంలో ఉన్న జైన మందిరంలో ఈ అన్నమాచార్యసంకీర్తనోత్సవ కార్యక్రమం జరుగనుంది. అందరూ తప్పక వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.

అలాగే అదే రోజున (మే 5, 6 తారీఖులలో) హైదరాబాదులోని లాల్ బహద్దూర్ స్టేడియంలో, "అంతర్జాతీయ మంగళవాద్యసమ్మేళనం" ఘనంగా, భారీ ఎత్తున జరుగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మన వెబ్బు సైటునుంచీ గ్రహించగలరు. ఈ కార్యక్రమానికి కూడా అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా సుజనరంజని అందరికీ పత్రికాముఖంగా కోరుకుంటోంది.

మీ
రావు తల్లాప్రగడ


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

 
     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 

 

 

 

 

 

 

 

 

 


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech