మంచి గంధపు తావి
మన తెలుగు మాట
మంచి నడకల తీరు
మన తెలుగు పద్యం,
దేశభాషలందు
తెలుగులెస్సయని
కృష్ణదేవరాయని
మెప్పుపొందిన భాష,
తేనెలూరు తీయందనాలు
తెలుగులోన కలవని
తెలపాలి నేటి బాలలకు
చాటిచెప్పాలి చిన్నారులకు,
కలకోయిల కూజితాలు
కలబోసుకున్న సొంపు
కదలాడే తెలుగు మనదని
తెలియజెప్పాలి యువతరానికి,
దేశాన ఎటువెళ్ళినా
విదేశాల ఎటుసాగినా
పొగడాలి మన మాతృభాషని
గౌరవించాలి మన తెలుగుతల్లిని
పరిమళించాలి
పలుకుపలుకున
పిల్లతెమ్మెరల తెలుగందనాలు
శరత్ పున్నముల చలువందనాలు




























