రామాయణంలో రత్నాలు

రామయణంలో సుందరకాండ అతిప్రశస్థమైనది. ఇందులో హనుమపాత్ర చాల విశిష్టమైనది. హనుమని వాల్మీకి రామాయణంలో “రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం” అని అన్నారు. అంటే ఒక మాలలో మణి, మధ్యలోఉంటుందికదా , అట్లే హనుమ కూడామధ్యలోవస్తాడు. అది కిష్కిందకాండ. రామాయణం ఉత్తరకాండతో కలిపి ఏడు కాండలనుకొంటే, కిష్కింధ మధ్యలోఉన్నట్లేకదా! ఇచట కనిపించిన హనుమ హారంలో మణి వంటివాడేకదా!

అట్లే హనుమ శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించెను అని వాల్మీకి వర్ణించేడు. ఇచట చెప్పిన శత సంఖ్యను పరిశీలించుదాం. శతమంటే 100 కదా ఇందులోఒకటి భగవంతునికి సంకేతం, రెండు సున్నలు ప్రకృతి, జీవులకు సంకేతం . ఒకటిలేకుంటే రెండు సున్నాలకి విలువలేదు.పరమాత్మపక్కన ఉంటేనేప్రకృతి,జీవులకు విలువ ఉంటుంది అని తెల్ప డానికే వాల్మీకిశ త యోజన సంఖ్యను తెల్పేడు. అట్లే రమాయణం లోని 24వేల శ్లోకాలు 24 అక్షరాల గాయత్రి మంత్రానికి ప్రతిరూపంగా చెప్తారు.కానివాల్మీకికి ముందు రామాయణం "చరితం రఘు నాధస్య శతకోటి ప్రవిస్తరం"అని శతకోటిసంఖ్యగ విస్తరించిఉంది అనితెలుస్తోంది. శతకోటికి, ఇరువదినాలుగు వేలకి పొంతన కుదరదు. దానికి పెద్దలు ఇలావివరణ ఇచ్చేరు. సంఖ్యా స్ధానాలలో శతసంఖ్య 3వ స్ధానంలో వస్తుంది.కోటి సంఖ్య 8వ స్థానంలో వస్తుంది.ఇప్పుడు మూడుచేత ఎనిమిదిని గుణిస్తే 3*8=24. వస్తుంది.24 వేల శ్లోక సంఖ్య సరిపోతుంది.శత కోటీ అనేది విస్తారమైనది అని చెప్పటానికి మాత్రమే అని,అనుకోవచ్చు.

ఇలా రామాయణంలో ఎన్నో విశేషాలు కన పడతాయి.హనుమ సముద్రం దాటేటప్పుడు నాలుగు దుష్కర కర్మలువాల్మీకి తెల్పేడు.అవి 1.సముద్ర లంఘనం,2మైనాక పర్వత శ్పర్శనం,3సురస అవరోధనం,4సిం హిక సం హ ర ణం . ఇంకా హనుమ సుందర కాండలోగురువుగా కన బడతాడు.సీత జీవాత్మ,రాముడు పరమాత్మ వీరిని కలిపే హనుమది గురు స్థానం. ఇక సుందర కాండ పేరులో సౌందర్యం చూద్దాం.సుందర కాండనాయకుడుహనుమ సుందరుడు.ఇట ఆత్మ సౌందర్యం ప్రధానం.అట్లే సీతమ్మలక్ష్మీస్వరూపం.అశోక వనంలోశొకంలో ఉన్నా రామనామ జపం మాన లేదు .రమయతే ఇతి రామః.ఆయన పుంసాం మోహనరూపుడు.స్వర్ణమయమైన లంకానగరం మిక్కిలి సుందరమైనది.

ఇక అశోకవనం.అదిసీతమ్మశోకాన్నిపోగొట్టిన వనం.మిక్కిలి సుందరం.ఈకాండలోఇలా అంతటా సౌందర్యం కనపడుటచే సుందర కాండ అన్నపేరు సార్ధఖ్యాన్ని పొం దింది. ఇక రామ శబ్దం లోని గొప్పదనాన్నిచూద్దం.పార్వతి పరమ శివుణ్ణి ఇలా అడుగుతుంది.స్వామి !విష్ణు సహస్ర నామాల్ని సులభంగా ఎలాపలకవ చ్చు అని."కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం, ఫట్యతై ర్పండితైర్నిత్యం శ్రో తుం ఇచ్హామి అహం ప్రభో "అని. అపుడు శివుడు ఇలచెప్తాడు. "శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే" అన్న ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణుసహస్రనామాలుచదివిన ఫ లితం వస్తుంది అని. పై శ్లోకంలో "రమే రామే,వరాననే,మనోరమే"అన్న పదాలు,పార్వతిని ఉద్దేసించి తెల్పినవి.ఇంక మిగిలిన వాటిలో శ్రీరామ,రామ, రామేతి అన్న మూడుపదాలే సహస్ర నామాలికి సమానాలు అని.

దీనిని గూర్చి పెద్దల చెప్పినవివరణ చుద్దాం.రామ పదంలో మొదటి అక్షరం'రా'ఇది య,ర,ల,వల్లో ర రెండవ అక్షరం.రామలో రెండవ అక్షరం మ ఇది ప,ఫ,బ,భ,మ వర్గలో మ ఐదవ అక్షరం.సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి రెండుచేత ఐదుని గుణిస్తే 2*5=10 అవుతుంది .అలాగే రెండవ రామ శబ్దానికి పది ని పది చేత గుణిస్తే 10* 10 = 100 అవుతుంది. ఇప్పుడు మూ డవరామ శబ్దా న్ని పది చేత వందని గుణిస్తే 10*100 = 1000 అవుతుంది .ఇలా ' శ్రీ రామ ,రామ , రామ ఇతి అన్న ఒక్క శ్లోకం చదివితే వెయ్యి నామాలు చదివిన ఫలితం వస్తుంది .అని పరమ శి వుడు పార్వతికి తేల్పేడు .

ఇంకా రామనామాన్ని జపించి "ఋక్షకుడు" అనే ఒక సాధారణ వ్యక్తి వాల్మీకిగామారుతాడు,రామ నామం వల్ల శబరి,గుహుడు,హనుమ,సీతామాత,ఇలా ఎందరోపునీతులౌతారు. ఇంకా 'రా' అన్న అక్షరం పలికేటప్పుడు పెదవులు తెరుచు కొంటాయి. అంటేమనలో ఉన్న పాపాలు బైటికి పోతాయి,అన్నమాట.ఇక 'మా'పలికేటప్పుడు పెదవులు మూసుకొంటాయి.బైటికి పోయిన పాపాలు లోపలకిచేరకుండా చేస్తాయి. ఇలా రామ నామాన్నిగూరించి ఎంతైనాచెప్పవచ్హు.వశిష్టుడు "ఓం నమో నారాయణాయ"అన్న అష్టాక్షరి మంత్రం నుండీ’రా'అన్న అక్షరాన్ని,"నమశ్శివాయ"అన్న పంచాక్షరి మంత్రం లోంచి 'మ'అన్న అక్షరాన్ని గ్రహించి "రామ" అని పేరుపెట్టేడు. కనుక రామ అని అంటే చాలు,అష్టాక్షరి,పంచాక్షరిమం త్రాలు జపించినట్లే. ఈవిధంగా రామాయణంలో రత్నాల వంటి విషయాలు ఎన్నైనా చెప్పుకోవచ్హు."స్ధాలీపులాక" (అన్నం ఉడికిందా,లేదా అనితెలుసుకొందుకు ఒక్క మెతుకు పట్టుకు చూసినట్లు.)న్యాయంగకొన్నిమాత్రమేతెలుసుకొన్నాం.స్వస్తి.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)