'ఒసే కమలా! ఉదయమే బి.పి. టాబ్లెట్, సుగర్ టాబ్లెట్టు
వేసుకోవాలి.త్వరగా ఏ టిఫినో తగలెట్టి, కాసిని కాఫీనీళ్ళు నా మొహాన పోస్తే, ఆ
టాబ్లెట్లేవో
మింగేడుస్తాను కదా! ఊ అబ్బా!'
ఉదయం మొదలవుతూనే మరీ అంత అనారోగ్యం లేకపోయినా ఏదో
ఉందనుకొని, ఎక్కువగా ఊహించేసుకుని బాధపడిపోతూ దీవాను మీద కూర్చుని
అనవసరమైన
మూలుగులు మూలుగుతూనే, ఓ చేత్తో రిమోట్ పట్టుకుని, టి.వి.లో వచ్చే
భక్తి ప్రోగ్రాముల దగ్గరనించి, వంట చెయ్యకపోయినా, మధ్యహ్నం
వంటల సందడులు,
రాత్రి సీరియల్స్ దాకా అన్నీ చూసేస్తుంది. ఆ రిమోట్ ఎప్పుడూ ఆవిడ
ఆధ్హెనంలోనే ఉంటుంది కనుక మిగతా వాళ్ళెవరికీ వాళ్ళకిష్టమైన ప్రోగ్రాములు
చూసే చాన్సే
లేదు.ఆవిడ చూసే సీరియల్సు అన్నీ ఆవిడ జీవిత కాలం దాటిపోకుండా
పూర్తి చేయాలనే కోరిక ఆవిడకున్నా, ఆ సీరియల్స్ ఎన్ని జీవితకాలాలకి
ముగుస్తాయో ఎవరూ
చెప్పలేని ప్రశ్న!
'ఒసే కమలా!లేచావ్? నాకు నీరసం వచ్చేస్తుందే..ఏమిటో, రోగిష్టి
బతుకైపోయింది.అందుకే అందరిమీదా ఆధారపడాల్సొస్తోంది.తిండి కన్నా
మందులెక్కువైపోయాయి.మందు మింగాలంటే తిండి తినే వేసుకోవాలంటారు
డాక్టర్లు.త్వరగా నా మొహాన్నింత తిండి పెట్టమ్మా.
ఎమొతో శుభప్రదంగా గడవాల్సిన ప్రతి శ్భోదయాన్ని తిట్లోదయంగా
చేసే, ఇంకా షష్టిపూర్తి వయసు కూడా రాని అత్తగారి సుప్రభాత పలుకులకి
ఉలిక్కిపడి
లేచి, 'ఆ చెప్పేదేదో కొంచెం సున్నితంగాను, ప్రేమగాను చెప్పచ్చు కదా!'
అని మనసులోనే అనుకుని, త్వరగా దంతధావనం చేసుకుని, చీరకొంగు
నడుముకి
దోపుకుని, అత్తగారికి కావలిసినవి నిముషాల్లో చేసిపెట్టింది కమల.
ఇంతలో తలుపు తోసుకుంటూ దూకుడుగా వస్తూనే, 'ఒసే కమలా! కాసింత
కారప్పొడి, ఓ నాలుగు చెంచాల నేచుక్క వేసి ఒక్క అయిదు ఇడ్లీలే
పెట్టమ్మా.అదివరకైతే
కనీసం పది ఇడ్లీలయినా లాగించేదాన్ని.కప్పుడు నెయ్యి పోసుకుని,
కొంచెం వెన్న రాసుకుని, కారప్పొడి అద్దుకుని, కొంచెం శెనగచట్నీ, సాంబారులో
కూడా నంచుకొని,
ఎంచక్కగా తిని, పెద్ద వెండి గిన్నెడు మీగడ కాఫీ పీట మీద
కూర్చుని కబుర్లు చెబుతూ కాఫీ తాగేదాన్ని.ఎవరి దిష్టి తగిలిందో
ఏమో!ఇప్పుదు బాగా తిండి
తగ్గిపోయిందే తల్లీ.మొన్న డాక్టరు దగ్గరికెళ్తే తిండి
తగ్గిచ్చాలన్నాడు.అందుకే ఒళ్ళు తగ్గించుకోవాలని రెండు చెంచాల నేతిబొట్లు చల్లుకొని,
అయిదిడ్లీలే
తిందామని అనుకుంటున్నాను.శనగచట్నీ, సాంబారు కూడా మానేశాను.తిండి
విషయంలో స్ట్రిక్టుగా ఉండాలే అమ్మా! ఏమిటో, ఈ పాడు పొట్టకి ఏదో ఒహటి
పడెయ్యకపోతే
బండి నడవదు.తింటే ఆయాసం,తినకపోతే నీరసం! అంటూ చినిమాలో
సూరేకాంతం డైలాగులు మాట్లాడుతూ, అక్కమీద ప్రేమ వంకతో వచ్చి,స్వయాన
అత్తగారి
చెల్లెలు, పిన్నత్త గారయిన సుకందరమ్మగారి దినవారీ
ప్రభాతపలుకులివి!ఆవిడకి తిండి రంధి ఎక్కువ.అందుకే వూబకాయమూ ఎక్కువే.నోటి ధాటీ
ఎక్కువే!
అందుకే ఆవిడ ఎన్ని మాటలన్నా తిరిగి అనే సాహసం చెయ్యలేక ఆవిడ
అడిగినట్లా చేసిపెడుతుంది నొప్పించక తానొవ్వక తప్పించుకునే కమల.
అసలత్తగారు ఒక్క సూరేకాంతంతో సమానమనుకుంటే, పిన్నత్తగారు రెండు
సూరేకాంతాల పెట్టు.పక్క ఇంట్లో ఒకావిడే వుంటుంది.ఆవిడ చేసుకోలేక
వారంలో అయిదు
రోజులు ఇక్కడే తిష్ట వేస్తుంది.
'ఒసే కమలా! కందిపొడి మిక్సీలో వేశాను.సగం అయింది.ఇంక తిరగనని
మొరాయించింది.కొంచెం ఈ కందిపొడి మిక్సీలో వేసిపెట్టమ్మా' అంటూ
పక్కవీధిలో వుండి
ఎప్పుడన్నా వచ్చే పెద్దాడపడుచు.
'ఒసే కమలా! ఒక్క రెండు చంచాల కాఫీపొడి ఇయ్యమ్మా.ఇంట్లో రెండు
చంచాల కాఫీ పొడే వుంది.కాఫీ చిక్కగా లేకపోతే మీ బాబాయిగారు అరుస్తారు
' అంటూ
గోడవతల నించి మొహమాట పడుతూ రెండు చంచాల కాఫీపొడే
అడగలేక, అడగలేక అడిగే పక్కింటి పిన్నిగారు.
'ఒసే కమలా!త్వరగా టిఫిన్ పెట్టు.ఈరోజు ఆఫీసుకి త్వరగా
వెళ్ళాలి.ఇన్‌స్పెక్షన్ వుంది.' అంటూ భర్త శేఖరం.
'ఒసే కమలా!అవతల కాన్వెంట్కి టైమవుతోంది.గమ్మున ఈ షూస్ వెయ్యవే'
అంటూ నాలుగేళ్ళ కొడుకు కూడా ఒసే కమలా అనేసరికి సహనం
నశించిపోయి, చింటూని
చిన్నగా ఒక దెబ్బ వేసింది.
'ఏరా బడుద్ధయ్! అమ్మా అని పిలవలేవు? నీక్కొడా ఒసే కమలానేనా? తప్పు
అలా పిలవకూడదు.అమ్మా అనే పిలు.'
'ఏం, అందరూ నిన్ను ఒసే కమలా అని పిలుస్తే తప్పులేదు కాని నేను
పిలిస్తే తప్పేంటి? నానమ్మ, సుందరమ్మ బామ్మ, పెద్దత్త, నీ పక్కింటి
పిన్నిగారు, ఎదురింటి
ఆంటీ, మామయ్య,అమ్మమ్మ,తాతయ్య అందరూ ఒసే కమలా అనే పిలుస్తున్నారు
కదా? వాళ్ళనేం అనవు గాని నా మీదే ఎందుకు అరుస్తావు? అసలు
చిన్నపిల్లలంటే అందరికీ
లోకువే.ఇకనుంచి ఈ పెద్దాళ్ళతో యమ స్ట్రిక్టుగా వుండాలి ' అంటూ వాడనే
ముద్దుమాటలకి వచ్చే నవ్వాపుకుని ఏం మాట్లాడలేక పోయింది.వాడికో
పట్టాన సమాధానం
ఎలా చెప్పలో తెలియక కమల బాధగా ఊరుకుంది.
ఒక్కోసారి అత్తగారు కొడుకుని శేఖరం అని పిలుస్తూంటే, 'ర ' వత్తు
పలకలేని వీడూ సేకలం అనే పిలుస్తాడు.అందరూ గట్టిగా కేకలేసి అలా
పిలవకూడంటే, నాన్నా అంటాడు.కానీ ఎంత చెప్పినా అమ్మా అని పిలవమంటే
మాత్రం, పనికిమాలిన తిక్క ప్రశ్నలువేసి వేధిస్తాడే కాని, ఎంత అరిచి
గీపెట్టినా అమ్మా
అని పిలవడు.కమలకి అమ్మా అని పిలిపించుకోవాలనే కోరిక
తీరటంలేదు.
రేపు పెళ్ళయినా, వాడి పెళ్ళాం ఎదురుగా ఒసే కమలాఅనే పిలుస్తాడో ఏమిటో
ఖర్మ! అయితే వీడికి తోడు మనవడు కూడా వస్తే....
'ఒసే కమలా నాకీ షూస్ వేసిపెట్టవే.మా జానకిని వెయ్యమంటే బొత్తిగా
నా మాట వినటం లేదు.'
జానకెవర్రా? బొడ్డుకోసి పేరు పెట్టావా?
'ఎవరా? అదేంటట్లా అడుగుతావు? నీకొడుకు పెళ్ళాం పేరు జానకి కాదా?
'తప్పురా.జానకి అనకూడదు.మమ్మీ అనాలి.లేకపోతే చక్కగా తెలుగులో
అమ్మా అను.ఇంకా బాగుంటుంది.'
'ఏం ? నువ్వూ జానకీ అనే పిలుస్తున్నావు కదా? అమ్మా అని అంటున్నావా? '
'ఒసే కమలగారూ! నే వేసుకోమన్న షూస్ వేసుకొవట్లేదు.అముకే వాడు
నీదగ్గరకొచ్చి ఇంకో షూ వెయ్యమంటున్నాడు. ఒసే కమలా వెయ్యకండి.
ప్రతిదీ వాడు చెప్పినట్లే చెయ్యాలంటాడు. '
'ఒసే కమలా! ఏమిటాలోచిస్తున్నావు? అఫీసు టైమవుతోంది. లంచ్‌బాక్స్
రెడీ చేశావా? '
'ఒసే కమలా!కఫీ చల్లగా వుంది.కొంచెం వేడి చేసియమ్మా' అత్తగారు.
'ఒసే కమలా!ఇవాళ శనివారం భోజనం ఎలాగూ చెయ్యను.కొంచెం
కొబ్బరికోరు, జీలకర్ర,అల్లం ముక్కలు వేసి ఉప్పుడుపిండి చెయ్యమ్మా.' ఓ పక్క
ఉదయం కంచం నిండా టిఫిన్ లాగిస్తూనే, సాయంత్రం ఫలహారం కోసం
ఆరాటపడే పిన్నత్తగారి తొండి పలుకులివి.
'ఒసే కమలా!మిక్సీ పాడవలేదమ్మా.నేను కంగారులో
చూసుకోలేదు.కరెంటు పోయింది.అందుకే కందిపొడి మధ్యలో ఆగిపోయింది.' అయోమయపు
ఆడపడుచు ఫోను చేసి చెప్పింది ఓ పక్క యమా బిజీలో వుంటే.
'ఒసే కమలా! మీ బాబాయిగారు కాఫీపొడి తెచ్చేశారు.ఇదిగోనమ్మా
నువ్విచ్చిన కాఫీపొడి.' అంటూ ఆ రెండు చెంచాల కాఫీపొడి నిజాయితీగా ఇచ్చేస్తూ,
ఇవిగో, వంకాయలు దొడ్లో కాశాయి. కూర వండు.లేతగా
వున్నాయి.గుత్తివంకాయ చేస్తే అదిరిపోతుందనుకో.' అంటూ దాతృత్వం వెళ్ళబోసుకుంటూ
పక్కింటి పిన్నిగారు.
'ఒసే కమలా! ఏమిటే ఆలోచిస్తున్నావు? నా వాచీ కనబడతంలా. త్వరగా
వెతికియ్యి.'
'ఒసే కమలా! ఏమిటే తెగ ఆలోచిస్తున్నావు? ఓ కాలికే షూ వేశావు.
రెండో కాలికేదీ? ఆటో వచ్చేసిందే.తొరగా నన్ను రెడీ చెయ్యవే.'
రేపు వాడు పెద్దయ్యాక, పెళ్ళయ్యాక కూడా 'ఒసే కమలా!' అని పిలవటమే
కాక, వాడి కొడుకు, పెళ్ళాం కూడా 'ఒసే కమలా! అనే పిలుస్తారా? అవన్నీ
ఊహించుకుని బాధ పడింది కమల.
వాచీ కోసం ఇల్లంతా వెతికి వెతికి ఆఫీసుకెళ్ళే కంగారులో వాచీ
చేతినే పెట్టుకుని, వాచీ దగ్గరనుంచీ కళ్ళజోడు దాకా ప్రతిపనీ పెళ్ళాం
మీదనే ఆధారపడే భర్తకి లంచ్‌బాక్స్ ఇచ్చి ఆఫీసుకి
పంపింది.సుపుత్రుడిక్కొడా ఇంకో కాలికి షూ వేసి వాడికి టిఫిన్ తినిపించి, లంచ్‌బాక్స్ ఇచ్చి
కాన్వెంట్‌కి పంపింది.
కమల అత్తగారి పని చూసి,పిన్నత్తగారికి కూడా ఇప్పుడే ఉప్పుడుపిండి
కూడా చేసిపెట్టేసి, ఇంట్లో పనంతా పూర్తి చేస్కునేసరికి
ఒంటిగంటయింది.మొన్ననే మూడేళ్ళు నిండి నాలుగో ఏడులోకి అడుగుపెట్టి, 'ర ' కూడా
సరిగా పలకలేని తన చంటికొడుకు చింటూగాడి చేత అమ్మ అనో, మమ్మీ అనో
పిలిపించుకోవట ఎలాగా అని ఆలోచిస్తూ, కొంచెంగా సరుకులు, కూరలు
తెచ్చుకుందామని బ్యాగ్ తీసుకుని బైటికి రాబోతుండగా .....
'ఒసే కమలా! అవాక్కయ్యార్రా ప్రోగ్రాంలో నాలుగువేలు ఖరీదుచేసే
డి.వి.డి ప్లేయరు తగిలిందే.ముందర నేను నమ్మలేదనుకో.నువ్వే సరదాగా
ఆట పట్టించావనుకున్నాను.ఎప్పుడన్నా నిన్ను 'కమ ' అని పిలుస్తుంటాను కదా!
అందుకే అప్పుడప్పుడు అవాక్కయ్యారా నుంచి 'కమ ' ని మాట్లాడుతున్నా
అంటుతావుగా? అందుకే నువ్వే అనుకుని 'ఏయ్ కమా! ఎందుకే నన్నేడిపిస్తావు?' అంటూ
ఏదేదో మాట్లాడేస్తుంటే, 'హలో వసుంధరగారూ! నేను కమని కాదండీ.
అవాక్కయ్యారా నించి సుమని మాట్లాడుతున్నాను కమ మీ ఫ్రెండా? అంటూ మన
స్నేహం గురించి వివరాలు అడిగింది.ఎంత బాగా మాట్లాడిందనుకున్నావు? ఆఖరికి
మీ కమ అనబడే కమలగార్ని అడిగినట్లు చెప్పండి అంది. ఒసే కమలా!
ఎందుకే అలా వున్నావు? నేనింత సంతోషంగా గిఫ్టు వచ్చిందని చెబుతూంటే
మాట్లాడకుండా ఏమిటలోచిస్తున్నావే?
అసలే చికాకుగా వున్న కమలని స్నేహితురాలు వసుంధర కూడా 'ఒసే
కమలా! అనేసరికి ఆమె మీద విరుచుకు పడింది.
'ఏం? నీకూ నేను ఒసే కమలా నేనా? ఉదయం లేచింది మొదలు, ఒసేయ్
కమలా! కాఫీ నా మొహాన తగలెయ్ ' అంటూ అత్తగారు, ఒసేయ్ కమలా! ఒక్క
అయిదిడ్లీలే పెట్టమ్మా, 'ఒసే కమలా! అంటూ కరెంట్ పోతే కూడా
తెలుసుకోలేక మిక్సీ పాడయిందనుకొని, కందిపొడి మిక్సీలో వేయమనె ఆడపడుచు,
'ఒసేకమలా! ఒక్క రెండు చెంచాల కాఫీ పొడో, కప్పు కంది పప్పో ఇమ్మని
గోడవతలనించి అరిచే పక్కింటి పంకజమ్మగారు, 'ఒసే కమలా!' నా వాచీ
చూసిపెట్టు, త్వరగా టిఫిన్ పెట్టు ' అంటూ ఆజ్ఞలు జారీచేసే భర్త
గారు,ఉసే కమలా! త్వరగా కాన్వెంతుకు వెళ్ళాలి. ఈ షూస్ వేసిపెట్టు అంటూ
సుపుత్రుడు..ఇప్పుడు 'ఒసే కమలా! అంటూ నువ్వూ,...అబ్బబ్బ!
విసుగొచ్చేస్తుంది.ప్రతివాళ్ళకీ 'ఒసే కమలా ' నైపోయాను.కొడుకు 'అమ్మా ' అని
పిలవట్లేదన్న బాధతో, చిన్నప్పటినుంచీ స్నేహంగా వుండే స్నేహితురాలు వసుంధర
మీద విరుచుకు పడింది కమల.
కమల కోపానికి తెల్లబోయింది. వెంటనే తేరుకుని కమలతో వున్న
స్నేహంతో ఆమె బాధని అర్థం చేసుకుని అంది.
'ఆదేమితి కమలా! ఈ మాత్రానికే అంత బాధపడిపోతావెందుకు, ఏదో
జరగరాని ఘోరం జరిగినట్టు?'
'ఏమిటీ? నీకు ఈ మాత్రంగా అనిపిస్తోందా? మీరందరూ 'ఒసే కమలా!'
అంటుంటే వాడూ అలాగే పిలుస్తున్నాడు. రేపు వాడి పెళ్ళయి, వాడి కొడుకు కూడా
ఇదే అలవాటయి, 'ఒసే కమలా!' అంటాడు. కోడలు కూడా, 'ఒసే
కమలగారూ!' అన్నా ఆశ్చత్ర్యం లేదు. అదే నా బాధ.ఊహించుకుంటేనే భయంగా
వుంది.ఇది నీకు చిన్న విషయంగా అనిపిస్తుందా?'
'అంత దూరం ఆలోచించకు కమలా! వీడింకా చిన్నపిల్లాడేగా? నిదానంగా
నేర్పచ్చులే.అయినా ఇది అందరిళ్ళలోనూ వుండే సంస్యే.పిల్లలందరూ
పెద్దవాల్లు ఎలా అంటే, వాళ్ళూ అలాగే నేర్చుకుంటారు.అయినా ఇప్పుడు
సినిమాల్లోనూ, సీరియల్స్‌లోనూ తండ్రుల్ని,తల్లుల్నీ పిల్లలు పేరుపెట్టే
పిలిస్తున్నారు.
ఆ మధ్య కురుక్షేత్రం సీరియల్‌లో పెద్దకొడుకే మరి, పెళ్ళయినా,
తల్లిని 'జానకీ ' అనే పిలిచాడు.ఏదో సినిమాలో కూడా చంద్రమోహన్ని
కూతురు 'సుబ్బూ' అని పిలుస్తుంది.ఇంకోటేదో సినింZఆలో హీరో 'ఋఅజేశ్వరీ!
మీ ఆయనెక్కడ? ' అని తల్లినడుగుతాడు. రోజులూ అలానే
మారిపోతున్నాయి.ప్రతిదానికిఈ నువ్వ్వు పట్టించుకుని అనవసరంగా బాధ పడకు.'
'ఏమోనే వసూ! సినిమాలు, సీరియల్సూ అంటే వేరు.వాళ్ళలా
తీస్తున్నారు.ఇంటో కూడా అలాగే పిలిచినా తప్పులేదని నువ్వెంత సమ్ర్థించినా నా
మనసు అంగీకరించట్లేదే.ఇప్పటికే అమ్మ,నాన్న అనే మన తెలుగు పిలుపులు
పోయి, మమ్మీ, డాడీ అని ఇంగ్లీషు పిలుపులొచ్చాయి.ముందర ముందర
ఇంగ్లీషు పిలుపులు కూడా పోయి అమ్మా, నాన్నలని పేర్లు పెట్టే పిలుస్తారేమో!
నీకో విషయం తెలుసా? ఫారిన్ కంట్రీస్‌లో ఉపాధ్యాయుల్ని పిల్లలు పేర్లు
పెట్టే పిలుస్తారట! రానురాను మన సంస్కృతి, సంప్రదాయాలు ఏవిధంఘా
మారబొతున్నాయో!సరే, ఇప్పుడవన్నీ ఎందుకుకానీ..వాడెదురుగా ఎవరూ నన్ను
'ఒసే కమలా ' అని పిలవకూడదు. దీనికేదో ఆలోచించాలి.
'ఐతే ఏం చేయమంటావు? నిన్ను మమ్మీ అనో, అమ్మా అనో పిలవమంటావా
నన్ను కూడా? అయితే అందరి చేతా అలాగే పిలిపించుకో, నీ కొడుకు చేత
అమ్మా అని పిలిపించుకోవటం కోసం.ఇప్పుడు నీ మనసేం బాగా లేదు కాని,
మళ్ళీ వస్తా. అంటూ కోపంగా వెళ్ళిపోయింది వసుంధర.
'మమ్మీ! కొంచెం కాఫీ ఇయ్యమ్మా మందులేసుకోవాలి.' అంది అత్తగారు.
'మమ్మీ ఇవాళ పూరీలు చేసినట్టున్నావు.ఆల్లొకూర కొంచెంగా వేసి నాలుగే
పూరీలు పెట్టమ్మా.' పినంత్తగారు.
'మమ్మీ! మా ఇంట్లో ఫ్యూజెందుకో పోయింది.నిన్నటినుంచి కరెంట్ లేదు.మీ
అన్నయ్యగారేమో కేంపు కెళ్ళారు.నాకేమో ఫ్యూజు వెయ్యటం రాదు.కొంచెం
ఈ ఇడ్లీపప్పు మిక్సీలో ఆదిపెట్టించమ్మా.' ఆడపడుచు.
'మమ్మీ! నా కళ్ళజోడు కనిపించటంల్లా.కొంచెం వెతికియ్యి.' కళ్ళజోడు
కళ్ళనే పెట్టుకుని ఆఫీసుకెళ్ళే కంగారులో మతిమరుపు భర్త.
'మమ్మీ! కాన్వెంటుకి టైమయింది.త్వరగా ఈ షూస్ వెయ్యి.' సుపుత్రుడు రవి.
అమ్మయ్యా! తనకొడుకు అమ్మా అనకపోయినా, ఒసే కమలా! అనటం మానేసి,
మమ్మీ అని పిలుస్తున్నాడు.
'అయితే అందరూ మమ్మీ అని పిలవాలా? అని విసుక్కుంటూ వెళ్ళిపోయిన
వసుంధర మాటల్ని అమలు పరిచింది కమల. అందరూ మమ్మీ అని పిలుస్తుంటే
వాడిచేత మమ్మీ అని పిలిపించుకోవచ్చిన ఆలోచించి, అందర్నీ 'మమ్మీ '
అని పిలవమంది.
కాని తన భర్త తనని మమ్మీ అని, తను భర్తని డాడీ అని
పిలవాల్సొస్తుంది.ఇప్పుడు ఆ పిలుపులే వాళ్ళకలవాటుగా మారాయి.
భర్తని డాడీ అని కమల, కమలని మమ్మె అని భర్త పిలుస్తుంటే
అందరికీ వింతగా అనిపించి, ఇంటికి కొత్తగా వచ్చిన అతిథులు 'అదేమిటలా
పిలిపించుకుంటున్నారు?' అని అడిగినదానికి, వాళ్ళకి భోజనం వడ్డిస్తూ, కమల
జరిగినదంతా చెప్పింది.




























