ప్రేరణకీ ప్రతిచర్యకీ మధ్య సంబంధం
స్పర్శకీ స్పందనకీ నడుమనున్న చైతన్యం
మరణం నుంచి వైతరిణిదాకా ప్రయాణం
జమ్మి చెట్టుకొమ్మనుంచి ఓ అమ్మ కడుపుదాకా ఆరాటం
అనుభూతి-కర్మ-అనుభవాల అనంత జీవన చక్రం
తానే నీటిబిందువైతే తామరాకు కోసం తాపత్రయం
కండరాలలో కలిగే కోరికల కదలిక - కర్మా? కామమా?
పార్ధివ శరీర ధర్మమా? పురావాసనలకు దాస్యమా?
పూర్తి చైతన్యంతో పునరపి జననమా
జరామరణాలు లేని జన్మరాహిత్యమా
ఏది నిర్వాణం? ఏది నిరర్ధకం?
ఎందుకీ ప్రయత్నం?
ఎక్కడికీ ప్రయాణం?




























