పసందైన వంటలు

కోయ రొట్టెలు

- నిర్వహణ : సి. వి. ఆర్. సత్యశ్రీ    


 

అందరూ తినదగిన చిరుతిండి కోయ రొట్టెలు.

వీటిని తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్ధాలు:
 

బియ్యం నూక  (ఆడించినవి) - అర కేజి
నెయ్యి - తగినంత
సెనగపప్పు - 50 గ్రా.

జీలకర్ర - 2 స్పూన్లు

నూనె - కొద్దిగా
 

కోయ రొట్టెలు తయారీ విధానం:

సెనగప్పప్పును 3 గంటల సేపు నీటిలో నానబెట్టాలి.

తయారుచేసుకున్న బియ్యం నూకలో తగినంత నీటిని చేర్చి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి.

(ఒక గంట సేపు మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి)

సెనగపప్పుని నీటిలో నుండి తీసి వడగట్టి కలిపె పెట్టుకున్న బియ్యంపిండి మిశ్రమంలో కలపాలి.
జీలకర్ర తో పాటు 2 స్ఫూన్ల నూని వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి.

దళసరి మందమున్న గిన్నె (ఇత్తడి గిన్నెల్లో చేస్తే చాలా బావుంటుంది) స్టవ్ మీద పెట్టి వేడెక్కాక రెండు స్పూన్ల నెయ్యి గిన్ని లోపల అంతటా అంటేలా వేయాలి.

తర్వాత చేతితో బియ్యంపిండి మిశ్రమాన్ని మందపాటి రొట్టెల్లా చేసుకుని గిన్నెలో పెట్టి మూత పెట్టి మూత మీద కొంచెం నీళ్ళు వేసి ఉంచాలి.

స్టవ్ ను తక్కువ మంటలో ఉంచాలి. పన ప్లేట్ మీద వేసిన నీళ్ళు కింద గిన్నెల్లోకి చుక్కల్లా పడి రొట్టె మాడకుండా సరిగా కాలేలా చేస్తుంది.

కొద్ది సేపటి తర్వాత మూత తీసి బాగా రొట్టె తయారయ్యిందో లేదో చూసి చట్రంతో తిరగవేసి వెనుక వైపు కూడా కొద్దిగా వేగేదాక ఉంచాలి.

దీనిని వేడివేడిగా ఆవకాయతో నంచుకుని తింటే చాలా బావుంటాయి. లేదా టమాటా కెచప్ తోనయినా తీసుకోవచ్చు.


బియ్యం నూక తయారీ విధానం:

ముందుగా బియ్యాన్ని కడిగి ఎండలో ఎండబెట్టి, బాగా ఎండిన తర్వాత వాటిని మిక్సీ పట్టి జల్లెడతో జల్లించి పిండిని వేరుచేసి తీసేయాలి. ఇటువంటి బియ్యం పిండిని నిల్వ ఉంచుకోవచ్చు.  ఇటువంటి పిండితో పిండి పులిహార, పిండి వంటివి చేసుకోవచ్చు.


 
     
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)