సుజననీయం

- తాటిపాముల మృత్యుంజయుడు


 
 

 

 

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:
తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
చెన్నాప్రగడ కృష్ణ

తెలుగు లెస్స!

'ఒకే జాతి - రెండు రాష్ట్రాలు ', 'ఒకే భాష - రెండు రాష్ట్రాలు ' తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యసభ ఆమోదముద్ర లభించినప్పుడు 'ఆంధ్రజ్యోతి ' దినపత్రికలో ప్రచురింపబడిన పతాకశీర్షిక వార్తలు ఇవి. ఈ రెండు మాటలు లేశమాత్రము సత్యదూరము కావు. 'తెలుగు భాషాభిమాని ' ఎవ్వడైనను నూరు శాతం ఈ అభిప్రాయంతో అంగీకరిస్తాడు. ఈ సందర్భంలో సహస్రావధాని శ్రీ గరికపాటి నరసిం హారావు గారు ABN ఇంటర్వ్యూలో చెప్పిన పద్యం కింద ఉటంకిస్తున్నాను.

విడదీయగానౌనే వెయ్యేండ్ల పద్యసుగంధంబు నన్నయ్య బంధమిపుడు
పంచి ఈయగనౌనే పశులకాపరికైన పాడనేర్పిన మన భాగవతము
పగులగొట్టగనౌనే బండనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తీ డాలు
పాయ చీల్చగనౌనే బంగారు తోటలో ఘంటసాలగ బారు గానచరిని

ప్రాంతములు వేరుబడినను బాధలేదు
స్వాంతనములు వేరుపడకున్న చాలునదియే
తెలుగు విడిపోదు చెడిపోదు తెలుగు వెలుగు
రెండు కన్నులతో ఇకనుండి వెలుగు

ఏ యాస, ఏ రాష్ట్రము, ఏ దేశమైనను తెలుగు సాహిత్యానికి సంబంధించిన రచనలకు పెద్దపీట వేస్తున్నది సుజనరంజని. కాబట్టి, అన్నిప్రాంతాల నలుమూలలనుండి తెలుగువారు ఇతోధికంగా రచనలు పంపి తెలుగు వికాసానికి తోడ్పడవలసిందిగా మనవి.

ఇట్లు,
తాటిపాముల మృత్యుంజయుడు

 

 

 

 

 

 

 

 

 

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)