సారస్వతం / పుస్తక పరిచయం

విదేశీ కోడలు

పరిచయ కర్త - తాటిపాముల మృత్యుంజయుడు


 

 

 
 

 

ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని, తెలుగు రచయితలను ప్రోత్సాహిస్తూ గత రెండు దశాబ్దాలుగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. ఎన్నో పుస్తకాలను ప్రచురించింది. ఆ ఒరవడిలో వచ్చిన కథాసంపుటి కోసూరి ఉమాభారతి రచన 'విదేశి కోడలు '.

జీవితంలోని వివిధ పార్శాలను తాకుతూ రచించిన కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. చాలావరకు ప్రవాసాంధ్రుల జీవితాన్ని కథాంశాలుగా ఎత్తుకొని మంచి కథలను ఇచ్చే ప్రయత్నం చేసారు. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లల పెళ్లి, వైవాహిక జీవితం గురించి తల్లితండ్రుల ఆలోచలను, ఆవారు పడే ఆందోళనలను చక్కగా చిత్రికరించింది 'ముళ్లగులాబీ' కథ. 'అమ్మ 'కు ఔచిత్యమైన స్థానం కల్పిస్తూ రెండు కథలున్నాయి. 'నాన్న ' పాత్రను రిటైర్డ్ మిలిటరీ అఫీసర్లో చూపించారు 'మా నాన్న పిచ్చోడు ' కథలో. రెండు తరాలకు, రెండు సంస్కృతుల మధ్య జరిగే సంఘర్షణ కథయే 'విదేశీ కోడలు '. ఈ సంపుటిలో కొన్ని అంధ్రప్రదేశ్ వాతావరణానికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయి.

రచయిత్రికి మొదటి సంపుటమైన ఈ పుస్తకం శుభారంభంగా కనిపిస్తున్నది. ముందు ముందు లోతైన కథలు ఈ కలం ద్వారా రావాలని ఆశిద్దాం.

విదేశీ కోడలు (కథాసంపుటి)
రచయిత్రి: కోసూరి ఉమాభారతి
ప్రచురణ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
ధర: $25, రూ: 150
దొరుకు చోటు: vangurifoundation@gmail.com కు ఈ-మెయిల్ పంపండి

 

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)