Sujanaranjani
           
  కథా భారతి  
 


ది డైరీ ఆఫ్ డాక్టర్ వనమాలి. (నవల).. 3

 

                                                                                                                             రచన: కొండగుంట వెంకటేశ్.

 

వనమాలి టేబుల్ డ్రాయర్ తెరిచి చూశాడు. రెండు ఫైల్స్ కనిపించాయి మొదటి ఫైలులో ఏవో అగ్రిమెంట్ కి సంబంధించిన కాగితాలు ఉన్నాయి. వాటిని చదవగానే వనమాలికి అంతా అర్ధమైంది.

 

పోలీస్ డిపార్ట్ మెంట్ అనుకున్నట్టు డేవిడ్ మాములు నేరస్ధుడు కాడు మాఫియాతో బాగా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి ధన్ బాద్ లో ఉన్న కోల్ మాఫియాతో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇసుక మాఫియాతో చాల సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రెండు గ్రూపులకు ఏజంటుగా వ్యవహరిస్తున్నాడు. మాఫీయతో సంబంధం మాములు విషయం కాదు వాళ్ళు సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్నారని ఏదో పుస్తకంలో చదివాడు వనమాలి. అందుకే పోలీస్ డిపార్టమెంట్ కాన్నీ చట్లం కాని డేవిడ్ ను ఏం చెయ్యలేకపోయింది..

అందుకే  స్వేచ్చగా తిరుగుతున్నాడు.

 

రెండో ఫైలులో ఉన్న వివరాలు చదవగానే వనమాలికి చేదు మాత్ర మింగినట్టుగా ఉంది ఉన్న వ్యాపారాలు చాలవన్నట్టు ఆడపిల్లలను దొంగచాటుగా విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారం కూడా డేవిడ్ చేస్తున్నాడు అమాయకులను, బీదవాళ్ళైన  అందమైన అమ్మాయిలను మాయ మాటలు చెప్పి వాళ్ళను లొంగదీసుకుని డుబాయ్, మస్కట్ లాంటి దేశాలకు పంపిస్తున్నాడు అందంగా ఉంటాడు. పైగా బాగా డబ్బు ఉంది. ఇంతకంటే పెళ్ళికాని అందమైన అమ్మయిలకు ఏం కావాలి. ఒకసారి అతని వలలో పడిన అమ్మాయిలకు మోక్షం లేదు. వాళ్ళ శేషజీవతం అంతా పడుపు వృత్తిలో మగ్గి పోవాలి. ఇంతవరకు అతని వలలో ఎంతో మంది అమ్మాయిలు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు.

 

కాని దీని కంటే ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఇంతవరకు వాళ్ళ తల్లి తండ్రలు ఒక్కరు కూడా పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు బహుశా డేవిడ్ వాళ్ళను డబ్బుతో లొంగదీసుకుని ఉండాలి. డబ్బుకు లొంగనివాళ్ళను తన రౌడీలతో బెదిరించి ఉంటాడు.

 

ఒక గంటముందు తన ఇంట్లోంచి బయలుదేరుతున్నప్పుడు తను చేస్తుంది తప్పేమో అని సంధిగావస్ధలో ఉన్నాడు. ముందువెనుక ఆలోచించకుండ కేవలం ఆవేశంతో ప్రవర్తిస్తున్నాడని అనుకున్నాడు.

 

ముఖ్యంగా రోసి భర్తకు హాసి చేస్తున్నాడని లోపల బాధపడ్డాడు కాని ఫైల్స్ చదివిన తరువాత తను  తప్పు చెయ్యటం లేదని సమాజానికి మంచిపని చేస్తున్నాడని నమ్మకం కలిగింది. డేవిడ్ లాంటి నేరస్ధులు ఆడపిల్లలతో వ్యాపారం చేసే వాళ్ళు సభ్య సమాజంలో ఉండటానికి అనర్హులు. అలాంటి వాళ్ళను నాశనం చెయ్యటమే మంచిది.

 

ఆలోచన రాగానే వనమాలిలో ఉత్సహం ఎక్కువైంది. గదిలో ముఖ్యమైంది ఇంకేం కనిపించలేదు.

అతను గదిలోంచి బయటకు వస్తుంటే అప్పుడే ఎవరో సన్నగా మూల్గిన చప్పుడు వినిపించింది. ముందు అది  తన భ్రమ అనుకున్నాడు కాని మళ్ళీ వినిపించేసరికి తను విన్నది నిజమని నమ్మకం కలిగింది.

 

శబ్ధం పక్క గదిలోంచి రావటం గమనించి వెళ్ళాడు. లోపల చీకటిగా ఉంది. ఒక జీరోవాట్ బల్బ్ మాత్రం గుడ్డిగా వెలుగుతుంది. వెలుగులో మంచం మీద ఒక అమ్మాయి కనిపించింది ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. నోటికి టేప్ అంటించిఉంది వనమాలి వెంటనే కట్లు ఊడతీశాడు. నోటికి అంటించిన టేప్ తీసేశాడు. అప్పుడు ఆమెను గుర్తుపట్టాడు. ఆమె జాహ్నవి. అతని ఇంటర్వు తీసుకున్న అమ్మాయి.

 

నువ్వా, ఇక్కడికి ఎలా వచ్చావ్ ఆశ్చర్యంగా అడిగాడు వనమాలి.

 

విషయం తరువాత చెప్తాను. ముందు మనం ఇక్కడనుంచి వెంటనే వెళ్ళిపోవాలి. లేకపోతే రాక్షసుడు వస్తాడు అంది జాహ్నవి.

సరేపద అంటు జాహ్నవిని తీసుకుని కిందికి దిగాడు వనమాలి. అదృష్టవశాత్తు గేటు దగ్గర వాచ్ మెన్  కనిపించలేదు ఇద్దరు భవనంలోంచి బయటపడి వనమాలి కారు దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు కాని జాహ్నవి భయం పోలేదు.

 

ఇంతకి డేవిడ్ చేతిలో నువ్వేలా చిక్కావ్ అడిగాడు వనమాలి.

 

అంతా నా మంచితనం వల్ల జరిగింది నిన్న సాయంత్రం మాములుగా ఆఫీసు నుంచి ఇంటకి బయలుదేరాను మద్య దారిలో ఒక పార్క్ ఉంది. అటువైపు నుంచి ఎవరో బాధతో మూల్గుతున్న చప్పుడు విని లోపలికి వెళ్ళాను నేలమీద ఒక ముసలి వ్యకి పడి ఉన్నాడు అతని తలమీద ఎవరో బలంగా కొట్టినట్టున్నారు. విపరీతంగా రక్తం కారుతుంది అతని జేబులు వెతికినప్పుడు ఐడింటి కార్డ్ ఇంటి అడ్రస్సు దొరికింది ముందు నాకెందుకులే తంటా అనుకుని వెళ్ళిపోవాలని అనుకున్నాను కాని ఎక్కడో ఏదో మూల ఉన్న మానవత్వం నన్ను పని చెయ్యనివ్వలేదు.

 

ఆటోలో అతన్ని ఇంటికి తీసుకువెళ్ళాను. అప్పుటికే వ్యకి కొంచం కోలుకున్నాడు. నాకు ద్యాంక్స్ చెప్పి లోపలికి వచ్చి కాఫీ తాగి వెళ్ళమని అన్నాడు. పెద్ద మనిషి మాట కాదనలేక వెళ్ళాను. అప్పుడే అతని నిజస్వరూపం బయటపడింది మెరుపు వేగంతో జేబులోంచి సీసా తీసి నా ముక్కు కింద పెట్టాడు. నిజంగా అతనికి గాయం కాలేదని కావాలని అలా నాటకమాడాడని అర్ధమైంది. వెంటనే తప్పించుకోవటానికి ప్రయత్నించాను. కాని అప్పుటేకే మందు ప్రభావం నన్ను ముందుకు కదలనివ్వలేదు వెంటనే సృహతప్పాను.

 

తిరిగి కళ్ళు తెరిచేసరికి గదిలో ఉన్నాను నా కాళ్ళుచేతులు కట్టేసి ఉన్నాయి. అరవకుండ నోటికి టేప్ అంటించి ఉంది. గేటు దగ్గర వాచ్ మెన్ అప్పుడప్పుడు నన్ను చూడటానికి వస్తుండేవాడు భోజనం చేసేటప్పుడు మాత్రం టేప్ తీసేవాడు. ముసలి వ్యకి నన్ను ఎందుకు బంధించాడో అర్ధం కాలేదు. తప్పించుకోవాలని ఎంతో ప్రయత్నించాను. కాని వీలుకాలేదు. రాక్షసుడు నన్ను ఏంచేసేవాడో తెలియదు, కాని సమయానికి మీరు రావటం వల్ల పెద్ద ప్రమాధం నుంచి బయటపడ్డాను. తలుచుకుంటే ఇప్పుడు కూడా భయంగా ఉంది. మీరు చేసిన సహాయం జన్మలో మరిచిపోలేను. వెరీ ద్యాంక్స్ డాక్టర్ అంది జాహ్నవి.

 

సమయానికి నేను రావటం వల్ల సరిపోయింది. లేకపోతే నీ జీవితం సర్వనాశనమయ్యేది అంటూ డేవిడ్ గురించి అంతా చెప్పాడు.

 

అసలు విషయం వినగానే జాహ్నవి మొహం పాలిపోయింది. శరీరం సన్నగా జలధరించింది. సమాయానికి వనమాలి రాకపోయి టే ఏం జరిగేదో తలుచుకుంటే ఆమె గుండెలు రాకేట్ వేగంతో కొట్టుకున్నాయి భయం వల్లో షాక్ వల్లో తెలియదు కాని ఒక్క క్షణం ఏం మాట్లాడలేదు జాహ్నవి తరువాత తేరుకని అంది.

 

మీకు ఎన్ని సార్లు ద్యాంక్స్ చెప్పిన తక్కువే. మైగాడ్ ఎంత ప్రమాధం నుంచి తప్పించుకున్నాను.

 

జరిగిందేదో జరిగింది. దాని గరించి లోచించకు. మరచిపోవటమే మంచిది. సరే ఇప్పటికే ఆలస్యమైంది. ఇక బయలుదేరుదాం అన్నాడు వనమాలి కారులో కూర్చుంటూ.

 

మీరు వెళ్ళండి డాక్టర్. నేను ఏదో ఆటో పట్టుకుని వెళ్తాను అంటు వెళ్ళబోయింది జాహ్నవి.

ఇంత జరిగిన తరువాత నిన్ను ఒంటరిగా ఎలా వెళ్ళనిస్తాను. పద కూర్చో. నిన్ను మీ ఇంట్లో దిగపెట్టి నేను వెళతాను అంటూ ఫ్రంట్ డోర్ తెరిచిపట్టుకున్నాడు వనమాలి. జాహ్నవి గత్యంతరం లేక వెళ్ళి కూర్చుంది.

 

అరగంట తరువాత కారు మిడిల్ క్లాస్ ఏరియాలో ఒక ఇంటి ముందు ఆగింది. జాహ్వవి లోపలకు వెళుతూ వనమాలిని కూడా రమ్మని చెప్పింది. నిజానికి వనమాలి చాల ఉద్వేకంగా ఉన్నాడు. రోసికి చెప్పకుండ వచ్చాడు. ఆమె తన గురించి ఎంత కంగారుపడుతుందో. అది తలుచుకుంటే అతనికి చాల టెన్షన్ గా ఉంది.

 

మాములుగా అయితే జాహ్నవిని డ్రాప్ చేసి వెళ్ళిపోదామనుకున్నాడు. కాని ఆమె మరి మరి రమ్మని చెప్పటంతో గత్యంతరంలేక వెళ్ళాడు.

 

జాహ్నవి లోపలకు వెళ్ళి తన తల్లిని తీసుకువచ్చింది. ఆవిడ వచ్చిరావటంతో వనమాలిని పొగడ్తలతో ముంచేత్తింది.

 

బాబు నీ సహయం మేము జన్మలో మరచిపోలేం అమ్మాయి అంతా చెప్పింది. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకోవటం వల్ల మా అమ్మయిని తిరిగి చూడగలిగాం. సమాయానికి నువ్వు రాకపోయి ఉంటే ఏం జరిగిందో ఊహించుకుంటే చాల భయంగా ఉంది. సమయానికి ఆయన కూడా ఊళ్ళో లేరు. జరగింది వింటే చచ్చిన అమ్మాయిని ఉద్యోగానికి పంపించరు. ఏది ఏమైన నీ సహయం జన్మలో మరిచిపోలేం అందామే నమస్కారం చేస్తూ.

 

వనమాలి ఆవిడ మాటలు వినటం లేదు. నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. ఎక్కడో మనస్సు పొరల్లో కొంత జ్ఞాపకం మిగిలిఉంది. ఆవిడను చూడగానే అది లావాలా బయటకు పొంగింది. ఆవిడ ఎవరో తెలియగానే అతని శరీరాన్ని ఆనందం ఆశ్చర్యం కలిసికట్టుగా కుదిపేశాయి.

 

అమ్మ: అంటు ఆర్తిగా పిలిచాడు.

 

పిలుపు విని ఆవిడ ఒక్కసారిగా తుళ్ళిపడింది. గొంతు పిలుపు ఎక్కడో విన్నట్టుగా తోచింది.

నువ్వు అంటుసందిగ్ధంతో ఆగిపోయింది.

ఇంకా నన్ను గుర్తుపట్టలేదా అమ్మ నేను నీ వనమాలిని అన్నాడు.

 

                                                            ంంంంంంంంంంంంంంం

 

తరువాత తతంగం చాల వేగంగా జరిగిపోయింది చాల సంవత్సరాల తరువాత కనిపించిన తల్లిని చూసి వనమాలి ఎంతో సంతోషపడ్డాడు. ఇంతకాలం తనకు ఎవరు లేరని ప్రపంచంలో ఒంటరివాడని బాధపడేవాడు. కాని ఇప్పుడు బాధ లేదు. తల్లి తండ్రి మాత్రమే కాదు అతనికి చెల్లెలు కూడా ఉంది. అందరి కంటే బాగా స్పందించింది జాహ్నవి వనమాలి తనకు అన్నయ్య అంటే ఆమె ఇంకా నమ్మలేకపోతుంది. వనమాలి లాంటి గొప్ప అన్నయ్యను ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియచేసుకుంది.

 

రోజు రాత్రి తన తల్లిని తండ్రిని చెల్లెలును తీసుకుని తన ఇంటికి వచ్చేశాడు. రోసికి జరిగిన దంతా చెప్పాడు. ఆమె కూడ చాల సంతోషించింది.

 

వనమాలికి అయితే ఆవందం ఆగటం లేదు. అంతమందిని తన వాళ్ళను ఒకే చోట చూసేసరికి  అతనికి కడుపు నిండినట్లయింది. ఇంతకంటే సంతోషం ఆనందం ఇంకే అవసరం లేదని తోచింది. రెండు రోజులు గడిచాయి. రోజు రాత్రి అందరు కలసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. భోజనం అయిన తరువాత వనమాలి తన బెడ్ రూంలో ఉన్న బాల్కనిలో నిల్చున్నాడు.

 

రోజు వాతావరణం చాల అహ్లాదకరంగా ఉంది. పైన చంద్రుడు దేదిప్యమానంగా వెలిగిపోతున్నాడు. దూరంగా నక్షత్రాలు తమ ఉనికిని చెప్పుతున్నట్టు సన్నగా వెలుగుతున్నాయి. గాలిచల్లగా వీస్తుంది. అప్పుడే గతం అతనికి గుర్తుకువచ్చింది.

 

వనమాలి పుట్టిన వెంటనే అతని కన్న తల్లి గుడిమెట్ల మీద విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడే అటుగా వచ్చిన నారాయణరావు దంపతులు వనమాలిని చూసి ముచ్చటపడి పెంచుకున్నారు దంపతులకు పెళ్ళి అయి పది సంవత్సరాలు గడిచాని పిల్లలు కలగలేదు. వాళ్ళు తిరగని గుడి లేదు. మొక్కని దేవుడులేడు. అయిన విసగుపడకుండా గుళ్ళు చుట్టు తిరుగుతునే ఉన్నారు . వేపద్యంలో నే గుడికి వచ్చిన దంపతులకు వనమాలి కనిపించాడు. దేవుడే బిడ్డను తమకు ఇచ్చినట్టు భావించి పాపను ఇంటికి తీసుకువచ్చి పెంచుకున్నారు.

 

రోజునుంచి వనమాలి జీవిత చక్రం పూర్తిగా మారిపోయింది. నారాయణరావు దంపతులు బాబును కన్న బిడ్డలా చూసుకున్నారు. బాబు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. దంపతులు బాబుకు వనమాలి అని పేరు పెట్టారు.

 

పద్నాలుగు సంవత్సరాలు వనమాలి జీవితం యవరాజులా సాగిపోయింది. తరువాత అతడి కష్టాలు మొదలయ్యాయి. ఎన్నో సంవత్సరాలు బిడ్డలు లేని దంపతులకు వయస్సులో ఒక ఆడపిల్ల కలిగింది. వనమాలికి ఎంతో సంతోషం కలిగింది. తనకు ఒక బుల్లి చెల్లెలు పుట్టినందుకు ఎంతో సంబరపడిపోయాడు.

 

శభవార్త తన తోటి పిల్లలకు చెప్పాడు. తమకు సొంత కూతురు కలగటంతో దంపతులలో మార్పు వచ్చింది. వనమాలిని పట్టించుకోవటం మానేశారు. కనీసం పాప దగ్గరకు కూడా రానివ్వలేదు

 

అమ్మ నాన్న ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో వనమాలికి కొంచం కూడా అర్ధం కాలేదు. రోజులు గడుస్తున్నాయి. రోజు  వనమాలి మాములుగా స్కూలుకు వెళ్ళాడు. ఆరోజు ప్రోగ్రస్ రిపోర్ట్ ఇచ్చారు. వనమాలికి అన్నింటిలోను ఫస్ట్ మార్కులు వచ్చాయి. విషయం అమ్మ నాన్నతో చెప్పాలని ఆతృతతో ఇంటికి వచ్చాడు.

 

లోపలకు వెళ్ళబోతుంటే అమ్మ నాన్న తన గురించి మాట్లాడుకోవటం వని అక్కడే ఆగిపోయాడు. అమ్మ తన గురించి చెప్పిన మాటలు విని నివ్వెరపోయాడు. తను చాల చెడ్డవాడని చెల్లెలంటే పడదని పాపని రెండు సార్లు చంపటానికి ప్రయత్నించాడని ఇంకా ఏవేవో చెప్పింది. మాటలు వినగానే వనమాలిలో విరక్తి కలిగింది. ఇంట్లో ఒక్క క్షణం కూడ ఉండకూడదని నిర్ణయించుకున్నాడు.

 

రోజు రాత్రి అందరు నిద్రపోయినతరువాత ఎవరికి తెలియకుండా ఇంటి నుంచి బయలుదేరాడు. వెళ్ళే ముందు తల్లి తండ్రి గదిలోకి వెళ్ళి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేశాడు. ఉయ్యాలలో ఆదమరిచి నిద్రపోతున్న చిట్టి చెల్లెలిని ముద్దు పెట్టుకుని ఇంటినుంచి బయటపడ్డాడు. అతని చేతిలో ఒక చిన్న సంచి మాత్రం ఉంది. అందులో ఒక జత బట్టలు క్లాసు పుస్తకాలు ఉన్నాయి.

 

అలా వెళ్ళిన వాడు మిషనరి అనాధ ఆశ్రమంలో చేరి చదువుకున్నాడు. రెండు మూడు ఉత్తరాలు తండ్రికి రాశాడు. కాని ఒక్కదానికి జవాబు రాలేదు. తరువాత అది మానేశాడు. అతని గురించి వాళ్ళకు కాని వాళ్ళ గురించి అతనికి కాని తెలియలేదు. మళ్ళి ఇన్ని సంవత్సరాల తరువాత కనిపించారు. అతని ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ నారయణరావు వచ్చాడు.

 

బాబు వనమాలి నీ ఎదుట పడటానికే నాకు, మీ అమ్మకు చాల సిగ్గుగా ఉంది. మేము ఎంత నీఛంగా ప్రవర్తించామో తలుచుకుంటే మా మీద మాకే అసహ్యంగా ఉంది. నువ్వు ఇంటి నుంచి వెళ్ళపోయిన తరువాత నేను మీ అమ్మ చాల బాధపడ్డాం మీ అమ్మ నీగురించి అంతా నిజం చెప్పి చాల బాధపడింది. నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకురావాలని నేను మీ అమ్మా ఎంతో ప్రయత్నించాం.

 

పోలీస్ రిపోర్ట్ కూడ ఇచ్చాం. ఎంత వెతికినా నువ్వు కనిపించలేదు. పసివాడివని చూడకుండ అనవసరంగా నీ మీద లేనిపోని నిందలు వేసినందుకు రోజూ కుమిలిపోయాం. నువ్వు తప్పుకుండ తిరిగిరావాలని రోజు దేవుడికి మొక్కుకునేవాడిని. కాని నవ్వు మాత్రం తిరిగిరాలేదు. రోజులు సంవత్సరాలు గడిచిపోయాయి. చివరకు ఇప్పుడు కలుసుకున్నాం. జాహ్నవి నీకు చెల్లెలు అవుతుందని తెలియకుండా నువ్వే ఆమెను కాపాడావు. ఆమె జీవితం నాశనం కాకుండా రక్షించావు.

 

నిజానికి మేము నీకు ఎంతో ద్రోహం చేశాం. అయిన అదంతా మనస్సులో పెట్టుకోకుండా అందరిని ఇంటికి తీసుకువచ్చావు. క్షమించమని నిన్ను ఎలా అడగాలో తోచటం లేదు. అయినా అడుగుతాను. దయచేసి మమ్మల్ని మన్నించగలవా అంటూ వనమాలి రెండు చేతులు పట్టుకున్నాడు రావు.

 

ఏమిటిది నాన్నగారు. మీరు పెద్దవారు. అంత మాట అనకండి. నిజానికి విషయం నేను ఎప్పుడో మరిచిపోయాను. మిమ్మల్నందరిని కలుసుకోవాలని మీతో సంతోషంగా ఉండాలని ఎంతో ఆశతో ఎదురుచూశాను. అది ఇప్పుడు నెరవేరింది. ఎప్పుడో పసిపాపగా ఉన్నప్పుడు జాహ్నవిని చూశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఆమె అంతకు ముందే ఒక రిపోర్టర్ గా పరిచయం అయింది. చాలేంజ్ చేసి నన్ను ఓడించినప్పుడే అనుకున్నాను. జాహ్నవికి నాకు ఎదో దగ్గర సంబంధం ఉందని. నా ఊహ నిజమైంది. దేవుడు నాకు అపురూపమైన చెల్లెలిని ఇచ్చాడు. ఇంతకంటే నాకు మాత్రం కావల్సింది ఏముంది. చెల్లెలు విషయంలో మీరు బెంగపడవలసిన అవసరం లేదు. మంచి సంబంధం చూసి నేనే పెళ్ళి చేస్తాను. తను ఇంకా చదవాలనుకుంటే ఇంకా చదివిస్తాను. ఏమంటారు నాన్నగారు

 

నేనేమంటాను. అంతా నీ ఇష్టప్రకారమే చెయ్యి. అక్షింతలు మాత్రం వేస్తాం అన్నాడు రావు.

దాంతో వాతావరణం తేలికపడింది.

 

                                                ంంంంంంంంంంంంంంంంం

 

ఏమిటి డాక్టర్ గారు ఇలా వచ్చారు వనమాలిని చూసి నవ్వుతూ అడిగాడు పర్సనల్ మేనేజర్.

ఒక చిన్న సమాచారం కావాలి. అందుకే మీ దగ్గరికి వచ్చాను అన్నాడు వనమాలి.

చెప్పండి

డాక్టర్ వెంకటరమణ గురించి వివరాలు కావాలి.

 

పర్సనల్ మేనేజర్ సందిగ్ధంగా చూశాడు. నిజానికి ఒక ఎంప్లాయి వివరాలు బయటకు చెప్పటానికి వీలులేదు. అందుకు మల్హోత్ర అనుమతి కావాలి. కాని అడుగుతుంది వనమాలి. చాలా సీనియర్ డాక్టర్ పైగా మల్హోత్రకు బాగా కావలసిన వాడు. అతను అడిగితే కాదంటే తరువాత చాలా సమస్యలు ఎదుర్కోవలసివస్తుంది. విషయం పర్సనల్ మేనేజర్ కు తెలుసు. అందుకే ఏం మాట్లాడకుండ డాక్టర్ వెంకటరమణ వివరాలు ప్రింట్ అవుట్ తీసి ఇచ్చాడు. వాటిని తీసుకుని వనమాలి తన చాంబర్స్ లో కూర్చున్నాడు.

 

వెంకరమణ చాలా తెలివైన డాక్టర్. మెడిసన్ లో గోల్డ్ మెడల్ సంపాదించాడు. చదువైన వెంటనే మల్హోత్ర హాస్పటల్ లో అసిస్టెంట్ ఫీజిషయన్ గా ఉద్యోగం వచ్చింది. అతనిది మద్యతరగతి కుటుంబం. తండ్రి పెద్ద ఉద్యోగం చేస్తున్న పెద్దగా ఆస్ధి పాస్ధులు లేవు. కాని వెంకటరమణకు మాత్రం ఇంకా పై చదువులు చదివి కంటి డాక్టర్ గా స్ధిరపడాలని అతని ఆశయం. అందుకే ఒక వైపు ఉద్యోగం చేసుకుంటునే చదువుకుంటున్నాడు.

 

అతని వివరాలు చదివిన వనమాలి చాల సంతృప్తి పడ్డాడు. తన చెల్లెలు అతన్ని చేసుకుంటే తప్పుకుండా సుఖపడుతుందని నమ్మకం కలిగింది. వెంటనే పంతులుగారితో మాట్లాడి సంబంధం ఖయం చెయ్యమని మరిమరి చెప్పాడు.

 

అప్పుడే నర్స్ మేరి వచ్చింది. రోజు చాల ప్రత్యేకంగా అలంకరించుకుందామే. తెల్లచీర తెల్లజాకేటు వేసుకుంది. అచ్చు మళయాళి అమ్మాయిలా ముస్తాబయింది. వనమాలి ఏమిటి విషయం అన్నట్టు ప్రశ్నార్ధకంగా చూశాడు.

 

రోజు నా పుట్టిన రోజు డాక్టర్. ఇంట్లో చిన్న గెట్ టూ గెదర్ ఏర్పాటు చేశాను. చాల ముఖ్యమైన వాళ్ళను మాత్రం పిలిచాను. మీరు తప్పుకుండ రావాలి స్వీట్ అతని చేతిలో పెడుతూ అంది.

తప్పుకుండ వస్తాను. నువ్వు ఇంతగా పిలుస్తుంటే రాకుండ ఎలా ఉండగలను. ఫంక్షన్ ఎన్ని గంటలకు అడిగాడు వనమాలి.

సాయంత్రం సరిగ్గా ఆరుగంటలకి. నేను వస్తాను డాక్టర్. రోజు సెలవు పెట్టాను. మీరు మాత్రం తప్పకుండ రావాలి అని మరిమరి చెప్పి వెళ్ళిపోయింది మేరి.

 

ఇంతలో పంతుగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వెంకరమణ తల్లి తండ్రికి జాహ్నవి బాగా నచ్చిందని ఆదివారం అమ్మాయిని చూసుకోవటానికి వస్తున్నారని చెప్పాడు. వనమాలి ఆనందంతో ఊగిపోయాడు. జాహ్నవి పెళ్ళి జరిగిపోతే అతని బాధ్యతలు దాదాపు తీరిపోయినట్టే. తరువాత తను ఏం చేసినా ఎవరికి ఇబ్బంది ఉండదు. రోసి భవిష్యత్తుకి కూడ తగిన ఏర్పాటు చేసి తరువాత డేవిడ్ పని పట్టాలి. ప్రయత్నంలో అతను ఓడిపోవచ్చు లేదా డేవిడ్ చేతికి పట్టుబడవచ్చు లేదా అతని చేతిలో చచ్చిపోవచ్చు. అయిన వనమాలికి భయం కలగటం లేదు. భార్య కూతురు చనిపోయినప్పుడే అతను సగం చచ్చిపోయాడు.

 

రోజు ఎంగేజిమెంట్స్ ఏం లేకపోవటంతో వనమాలికి చాల తీరిక చిక్కింది. డేవిడ్ ను చంపిన తరువాత ఏం చెయ్యాలి ఎలా ఏసుపాదాన్ని పట్టుకోవాలి మొదలైన విషయాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు.

 

సాయంత్రం సరిగ్గా అయిదు గంటలకు హాస్పటల్ నుంచి బయలుదేరాడు. మద్య దారిలో పెద్ద గిఫ్ట్ షాపులో మేరికి ప్రజెంటేషన్ కొనుక్కుని ఆమె ఇంటికి చేరుకున్నాడు.

కారు బయట పార్క చేసి లోపలికి వెళ్ళాడు ఇల్లంతా నిశబ్ధంగా నిస్తేజంగా ఉంది. అక్కడ పార్టి జరుగుతున్న సూచనలు ఏం కనిపించలేదు. కనీసం మేరి స్నేహితులు ఒక్కరు కూడా రాలేదు. వనమాలికి ఏం అర్దం కాలేదు. అతను రకమైన ఆలోచనలో ఉంటే లోపలనుంచి మేరి అభిసారికలా వచ్చింది.

రండి డాక్టర్ అంటు వనమాలిని బెడ్ రూంలోకి తీసుకువెళ్ళింది. లోపల ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయాడు వనమాలి,    

ఏమిటిదంతా మంచం మీద చల్లిన పూలను చూస్తూ అడిగాడు.

తరువాత చెప్తాను ముందు ఫంక్షన్ కానివ్వండి అంటూ కేక్ చుట్టు ఉన్న కొవ్వొత్తులను ఆర్పింది. తరువాత చిన్న కేక్ ముక్క కోసి వనమాలికి అందించింది. వనమాలి దాన్ని ఆమె నోటికి అందించాడు.

 

అప్పుడే అతను కొంచెం కూడా ఊహించని సంఘటన జరిగింది. మేరి విసురుగా వనమాలిని దగ్గరుకు లాక్కుంది. ఊహించని ఈచర్యకు వనమాలి బిత్తరపోయాడు. ముందు అతనికి ఏం అర్ధం కాలేదు. కాని మేరి మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న మార్పు చూసిన తరువాత అంతా అర్ధమైంది. ఆమె ఆడిన నాటకం కూడా తెలిసింది. నిజానికి ఇక్కడ ఎలాంటి పార్టి జరగడంలేదు. కేవలం అతనితో ఒంటరిగా గడపటానికి మేరి అతనితో అబద్ధం చెప్పి ఇంటికి రప్పించింది.

 

జరిగింది తెలిసేసరికి వనమాలి మొహం కోపంతో ఎర్రబారింది. అతను షాక్ నుంచి తేరుకునేలోగా మేరి ఇంకా గట్టిగా అతన్ని కౌగలించుకుంది. అప్పుడు రియాక్ట్ అయ్యాడు వనమాలి. ఆమెను విసురుగా వెనక్కి తోసి బలంగా చెంప మీద కొట్టాడు. దాంతో మేరి మత్తు దిగిపోయింది. ఆమెను ఆవహించిన కామ పొరలు తొలగిపోయాయి. తను ఎంత తప్పు చేసిందో అర్ధమైంది.సిగ్గుతో చితికిపోయింది. రోజు లేనిది రోజు మాత్రం ఎందుకిలా అయిందో ఆమెకు కూడా అర్దం కాలేదు. ఒక్క క్షణం పాటు అచేతనంగా ఉండిపోయింది. తిరిగి తేరుకునేసరికి వనమాలి గదిలో లేడు. అతను ఎప్పుడో అక్కడనుంచి వెళ్ళిపోయాడు. మేరి ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది.

 

కారులో కూర్చున్న వనమాలికి మాత్రం చేదు మాత్ర మింగినట్టుగా ఉంది మేరి ఎందుకిలా ప్రవర్తించిందో ముందు అతనికి కూడా అర్ధం కాలేదు. అందుకే అసహ్యంతో కోపంతో ఆమెను కొట్టాడు. కాని అక్కడనుంచి వచ్చిన తరువాత మేరి ప్రవర్తనకు కారణం అతనికి చూచాయిగా అర్ధమైంది. దానితో ఇందులో ఆమె తప్పు ఏం లేదని తెలిసింది. రేపు హాస్పటల్ లో ఆమెతో విషయం చర్చించాలని నిర్ణయించుకున్నాడు.

 

రాత్రి పన్నెండు గంటలు కావస్తుంది. వనమాలి గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడే సెల్ ఫోన్ రింగైయింది. ఇంత రాత్రివేళ ఎవరు చేస్తున్నారా అనుకుంటు ఆన్ చేశాడు.

 

సారీ డాక్టర్ ఇంత రాత్రి వేళ ఇబ్బంది పెడ్తున్నందుకు మన్నించండి. మీరు కొట్టిన చెంప దెబ్బ నాలో పరివర్తన తీసుకువచ్చింది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలిసింది. మీరు వెళ్ళిపోయిన తరువాత ఎంతో బాధపడ్డాను. మీ లాంటి గొప్ప అమృతమూర్తితో ఇంత నీఛంగా ప్రవర్తించినందకు నన్ను నేను చాలసేపు తిట్టుకున్నాను. మీకు క్షమాపణ చెప్పాలని అనుకున్నాను. పని హాస్పటల్ లో చెయ్యవచ్చు. కాని అంత సేపు ఆగలేకపోయాను. అందుకే సమయంలో మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తున్నాను. నన్ను క్షమించండి డాక్టర్.

 

రోజు నాకేమైందో తెలియదు. చాల అసహ్యంగా ప్రవర్తించాను. బజారు మనిషిలా దిగజారిపోయాను. దయచేసి నన్ను క్షమించండి. నన్ను క్షమించాను అనండి. అదే పదివేలు. లేకపోతే రేపు మీకు నా మొహం చూపించలేను అంది మేరి.

 

ఎదురుగా ఆమె కనిపించకపోయిన మేరి ఎంత బాధపడ్తుందో వనమాలికి అర్ధమైంది. చల్లగా నవ్వి అన్నాడు.

 

విషయం నేను ఎప్పుడో మరిచిపోయాను. ఎందుకు కొట్టానా అని ఇంటికి వచ్చిన తరువాత చాల బాధపడ్డాను. అసలు ఇందులో నీ తప్పేం లేదని నాకు తోచింది వయస్సులో ఉన్న దానివి. వయస్సులో వచ్చే సహజమైన కోరికలు అణుచుకుంటూ యంత్రంలా పనిచేస్తున్నావు. చాలా సంవత్సరాల నుంచి మోనోటనస్ గా జీవిస్తున్నావు. సహజమైన కోరికలు ఎంత అణుచుకున్నా అవి ఎప్పుడో ఒకప్పుడు బయట పడక తప్పదు. నీ  విషయంలో అది రోజు బయటపడింది. దీనికి ఒక్కటే పరిష్కారం. మంచి అబ్బాయిని చూసి చక్కగా పెళ్ళి చేసుకో. మీ అమ్మనాన్నను మంచి సంబంధం చూడమని చెప్పు. తొందరలో నే నీ పెళ్ళి శభలేఖ అందుకుంటానని ఆశిస్తున్నాను అన్నాడు వనమాలి.

 

తప్పుకుండ డాక్టర్. మీ సలహ తప్పకుండ పాటిస్తాను ఇప్పుడు నా మనస్సు శరీరం ప్రశాంతంగా ఉన్నాయి. నిద్ర కూడా వస్తుంది. పడుకుంటాను. గుడ్ నైట్ డాక్టర్ అంటూ సెల్ ఆఫ్ చేసింది మేరి. వనమాలి కూడా సెల్ ఆఫ్ చేసి పడుకున్నాడు.

 

                                                            ంంంంంంంంంంం

 

డాక్టర్ నేను నాయక్ ని మాట్లాడుతున్నాను. మీకు ఒక ముఖ్యమైన సమాచారం చెప్పాలని ఫోన్ చేశాను అంటూ అవతలనుంచి నాయక్ గొంతు వినిపించింది.

 

చెప్పండి. కొంపతీసి ఏసుపాదం ఆచూకి గాని తెలిసిందా ఆసక్తితో అడిగాడు వనమాలి.

లేదు అంతకంటే ముఖ్యమైన సంగతి చెప్పటానికి ఫోన్ చేశాను.

అదేమిటో తొందరగా చెప్పండి.

డేవిడ్ తన అడ్రస్సును మార్చేశాడు. ఇప్పుడతను ముందు ఉన్న ఇంట్లో ఉండటంలేదు. ఎవరో తన ఇంటికి రహస్యంగా వచ్చి జాహ్నవిని తీసుకువెళ్ళటం చూసి జాగ్రత్త పడ్డాడు బహుశా అది మీరని అతనికి తెలియకపోవచ్చు. కాని ఎందకైనా మంచిది, మీరు కొంచం జాగ్రత్తగా ఉండండి. డేవిడ్ చాల తెలివైనవాడు ఇప్పటికే తన ఇంటికి వచ్చింది ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నాలు మొదలు పెట్టి ఉంటాడు. సరే అసలు విషయం చెప్తాను. ప్రస్తుతం డేవిడ్ లవర్ ప్యారడైజ్ ఏరియాలో ఒక పెద్ద భవనం కొనుక్కని అందులో ఉంటున్నాడు. ఇంట్లో దాదాపు పది మంది బాడిగార్డ్స్ ఉన్నారు. వాళ్ళ అనుమాతి లేకుండా ఎవరు లోపలికి వెళ్ళలేరు. అంత సెక్యురిటి ఉన్న మనిషిని చంపటం అంత సులభం కాదు. అందుకే మీకు ఫోన్ చేశాను. దయచేసి నాకు చెప్పుకుండా అలాంటి ప్రయత్నాలు మాత్రం చెయ్యకండి. అది మీకే కాదు మీ కుటుంబానికి కూడా ప్రమాధమే. అన్నాడు నాయక్.

 

మీ ఇన్ఫర్మేషన్ కు చాల ద్యాంక్స్ నాయక్ గారు. మీ సలహా గుర్తుపెట్టుకుంటాను. ప్రస్తుతం నేను డేవిడ్ ను చంపే ఆలోచన మానుకున్నాను. నా చెల్లెలుకు ముందు మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యాలి. ఇంకా కొన్ని బాధ్యతలు పూర్తిచెయ్యాలి. అవన్ని అయిన తరువాత అప్పుడు డేవిడ్ గురించి ఆలోచిస్తాను.

అంతవరకు డేవిడ్ ను తాత్కాలికంగా మరిచిపోతాను. మళ్ళి డేవిడ్ గురించి ఆలోచించివప్పుడు మీకు తప్పకుండ ఫోన్ చేస్తాను.ఎనివే ద్యాంక్స్ వన్స్ ఎగైన్ అన్నాడు వనమాలి.

ఏసుపాదం గురించి కూడా తెలుసుకోవటానకి ప్రయత్నిస్తున్నాను. తొందరలోనే తెలుస్తుందని అనుకుంటున్నాను. కాని మీరు మాత్రం జాగ్రర్త ఉంటాను అంటు లైన్ కట్ చేశాడు నాయక్.

 

వనమాలి కూడా సెల్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. డేవిడ్ గురించి నాయక్ చెప్పిన విషయం అతన్ని కొంచం డిస్ట్రబ్ చేసింది. జాహ్నవిని రక్షించాడని సంతోషపడ్డాడు కాని డేవిడ్ గురించి ఆలోచించలేదు ఇప్పుడు నాయక్ చెపుతుంటే అంతా నిజమే అనిపిస్తుంది. రోజు నుంచి తను చాల జాగ్రర్తగా ఉండాలి. జాహ్నవి పెళ్ళేయ్యేంతవరకు నిభందన వర్తిస్తుంది. ఆమె పెళ్ళయిన తరువాత అతను ఫ్రీ బర్డ్. డేవిడ్ ని ధైర్యంగా ఎదురుకోగలడు.

 

అతని ఆలోచనకు బ్రేక్ వేస్తూ మేరి వచ్చింది. ఆమె మొహం చాల ప్రశాంతంగా కళగా ఉంది. రోజు సంఘటన తరువాత ఆమె పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా బట్టల విషయంలో చాల జాగ్రర్తలు తీసుకుంది.

 

చక్కగా డ్రస్ చేసుకుని డిగ్నిఫైడ్ గా కనిపిస్తుంది.

 

డాక్టర్ మీరు కోరుకున్నట్టుగానే నా పెళ్ళి నిశ్యయమైంది. అబ్బాయి ఇంజీనీర్. రూర్ కేలాలో పనిచేస్తున్నాడు. రెండు నెలల్లో మా పెళ్ళి జరిగిపోవాలని పెద్దలు నిశ్చయించారు. రోజే అమ్మ దగ్గర నుంచి కాల్ వచ్చింది. మొదట విషయం మీకే చెప్పుతున్నాను అంది మేరి.

చాల సంతోషం మేరి మంచి శుభవార్త చెప్పావు. నీ పెళ్ళికి తప్పకుండ వస్తాను. బహుశా మీ ఊళ్ళో చేస్తారనుకుంటాను అన్నాడు వనమాలి.

అవును డాక్టర్. కొచ్చిన్ లో చెయ్యాలని మావాళ్ళు నిశ్చయించారు.మిమ్మల్ని దగ్గరుండి నేను మా ఊరికి తీసుకువెళ్తాను.

వనమాలి నవ్వి తప్పకుండ అన్నాడు.

 

పేషంట్ రావటంతో సంభాషణ తాత్కాలికంగా ఆగిపోయింది. సాయంత్ర వరకు చాల బిజీగా ఉండిపోయాడు. డ్యూటి అయిన తరువాత వనమాలి తిన్నగా ఇంటికి వెళ్ళలేదు. సిటిలో ఉన్న ఒక పెద్ద స్పోర్ట్స్ దుకాణంలోకి వెళ్ళాడు. గంట సేపు అయిన తరువాత ఒక ఫుట్ బాల్ తీసుకుని బయటకు వచ్చాడు. అది రిమోట్ కంట్రోల్ తో నడిచే బంతి. దాదాపు రెండు వందల అడుగుల దూరంలోంచి కూడా రిమోట్ తో బంతిని ఆపరేట్ చెయ్యవచ్చు. వాటిని తీసుకుని కాలాబజార్ కు వెళ్ళాడు., అంతకుముందు అతనికి తుపాకి అమ్మిన షాపుకు వెళ్ళి బంతిలో బంబ్ ఏర్పాటు చెయ్యలని చెప్పాడు.

 

దుకాణంనాడు ఎందుకు ఏమిటి అని అడగలేదు. అది అతనికి అనవసరం. బంతిని రిమోట్ ను తీసుకుని లోపలకి వెళ్ళాడు. సరిగ్గా గంట తరువాత వాటిని తెచ్చి వనమాలికి ఇచ్చాడు. వనమాలి అతనికి డబ్బు ఇచ్చి కారులో కూర్చున్నాడు. బంతిని రిమోట్ ను పక్కన పెట్టుకుని కారు స్టార్ట్ చేశాడు. కారు వేగంగా ముందుకు కదిలింది కారు డ్రైవ్ చేస్తునే అప్పుడప్పుడు బంతి వైపు చూస్తున్నాడు. అతని గుండెలు రాకేట్ వేగంతో కొట్టుకుంటున్నాయి. శరీరం సన్నగా జలధరిస్తుంది. అతను చేసింది మాములు పని కాదు. బాల్ బాంబుతో డేవిడ్ ను చంపబోతున్నాడు. వనమాలి వేసిన పధకం ప్రకారం అంతా సవ్యంగా జరిగితే డేవిడ్ దారుణంగా చనిపోతాడు. పోలీస్ పరిశోధనలో అతను బాంబ్ బ్లాస్ట్ తో చనిపోయాడని తెలుస్తుంది. కాని నేరం వనమాలి చేశాడని ఎవరు చెప్పలేరు. చెప్పినా నిరూపించలేరు. డేవిడ్ ఒక మాఫీయా లీడరు. అలాంటివాడికి వృత్తి పరంగా ఎంతో మంది శతృవులు ఉంటారు. వాళ్ళలో ఎవరో డేవిడ్ ను చంపారని అనుకుంటారు.

 

నిజంగా డేవిడ్ చనిపోతే ఏసుపాదం గురించి తెలుసుకునే అవకాశం వనమాలికి పూర్తిగా పోతుంది. అతనికి తప్పు ఏసుపాదం గురించి ఇంకేవరికి తెలియదు. అయిన వనమాలి బాధపడటం లేదు. నిజం చెప్పాలంటే అతను డేవిడ్ కోసం వెతకలేదు. అకస్మాతుగా అతనే కనిపించాడు. దానికి తోడు నాయక్ డేవిడ్ గురించి కొన్ని వివరాలు చెప్పాడు. అలాగే ఏసుపాదం గురించి కూడా తెలుస్తుంది. రోజు కాకపోయిన రేపైనా ఏసుపాదం గురించి తెలుస్తుంది. దేవుడి దయఉంటే అతనే తనకి ఎదురుపడవచ్చు. లేదా తన దగ్గరకు ట్రీట్ మెంట్ కోసం రావచ్చు. ఇందులో ఏదో ఒకటి జరిగే అవకాశం తప్పకుండ ఉంది. నమ్మకం వనమాలికి ఉంది. అందుకే ఏసుపాదం గురించి ఆలోచించలేదు.

 

అరగంట తరువాత ఇంటికి చేరుకున్నాడు వనమాలి, అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరులేరు. అందరు సరదాగా బయటకు వెళ్ళారు. నాయర్ వంటింట్లో బిజీగా ఉన్నాడు వనమాలి రిమోట్ కంట్రోల్ బాంబ్ ను తీసుకుని తన బెడ్ రూంలోకి చేరుకున్నాడు. తలుపులు మూసుకుని అరగంటసేపు వాటితో ప్రాక్టిస్ చేశాడు.

 

తరువాత వాటిని జాగ్రత్తగా బీరువాలో దాచి తాళం వే్శాడు. డేవిడ్ ను చంపటానికి వేసిన పధకంలో మెదటి అంకం సిద్దం అయింది.

 

                                                ంంంంంంంంంంంంంంంంం

 

రోజు ఆదివారం. జాహ్నవిని చూసుకోవటానకి అబ్బాయి అతని తల్లి తండ్రి వస్తున్నారు. వార్త వినగానే ఇంట్లోవాళ్లంతా ఎంతో సంతోషపడ్డారు. ముఖ్యంగా వనమాలి ఆనందం వర్ణించలేనిది. శభకార్యం ఆటంకంలేకుండ జరగాలని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాడు. అందరి కంటే బాగా సంతోషపడింది రోసి. అన్ని పనులు తన నెత్తి మీద వేసుకుని చేసింది. ముందు ఇల్లంతా శుభ్రం చేసింది. ఇంటిగుమ్మానికి తోరణాలు కట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లంతా మంగళకరంగా తయారు చేసింది.

 

సరిగ్గా పదిగంటలకు ఒక కారు వచ్చి గుమ్మం ముందు ఆగింది. ముందు వెంకటరమణ దిగాడు. తరువాత అతని తల్లి తండ్రి దిగారు. వారయణరాపు దంపతులు వాళ్ళందరిని సాధరంగా లోపలికి ఆహ్సానంచాడు. అందరు హాలులో కూర్చున్నారు రోసి జాహ్నవిని గదిలో ముస్తాబు చేస్తుంది. మాములు ఫార్మాలిటిస్ పూర్తయిన తరువాత జాహ్నవి ని  వెంకటరమణ ఎదురుగా కూర్చపెట్టారు. ఆమెను చూడగానే అతని కళ్ళలో కనిపించిన మెరుపు గమనించిన వనమాలి లోపల నవ్వుకున్నాడు.

 

కాబోయే పెళ్ళికూతురిని చూసిన తరువాత రోసి జాహ్నవిని లోపలకి తీసుకువెళ్ళిపోయింది. వనమాలి  వెంకటరమణను పక్కకు పిలిచి అతని అభిప్రాయం సూటిగా అడిగాడు.

 

నాకు కట్నం వద్దు డాక్టర్. మీ చెల్లెలికి ఏం ఇవ్వాలనుకుంటున్నారో అవి మాత్రం ఇచ్చి పంపించండి. వాటిలో కూడా నాకు పట్టింపులు లేవు. పెళ్ళయిన తరువాత తనకు ఇష్టమైతే ఉద్యోగం చెయ్యవచ్చు లేకపోతే ఆమె ఇష్టం. కాని ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పుతున్నాను. ఆమెకు ఎలాంటి కష్టం రానివ్వను. పుప్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఇది మాత్రం నిజం అన్నాడు వెంకటరమణ.

 

వనమాలి చల్లగా నవ్వు అతని చేతులు పట్టుకుని అన్నాడు.

విషయం మీరు ప్రత్యెకంగా చెప్పాలా. మీ గురించి మీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. మీ గొప్ప సంస్కారానికి ఎంతో ఆనందపడుతున్నాను. మీరు వద్దన్నారని నా చెల్లెలిని ఉట్టి చేతులతో మీ ఇంటికి పంపించలేను. నా హొదాకు తగినట్టు నా శక్తి మేరకు మీ పెళ్ళి ఘనంగా చేయిస్తాను. విషయంలో మాత్రం మీరు నా మాట వినాలి.

 

అలాగే మీ కిష్టమైనట్టు చెయ్యండి. ఇందులో మాకు ఎలాంటి పట్టింపులులేవు అన్నాడు వెంకటరమణ తను కూడా నవ్వుతూ.

 

మిగత తతంగం ముగిసింది వచ్చే నెల పదిహేను తారీఖున మంచి ముహుర్తాలు ఉన్నాయని పంతులు చెప్పాడు. తేదిని ఖయం చెయ్యమని చెప్పాడు వనమాలి. అరగంట తరువాత వెంకటరమణ కుటుంబం వెళ్ళిపోయింది. రోసి రోసితో పాటు మిగత వాళ్ళు కాబోయే పెళ్ళికొడుకు గురించి మాట్లాడుకుంటున్నారు. వనమాలి మాత్రం చర్చలో పాల్లోనలేదు. తన బెడ్ రూంలో కొచ్చి బాల్కనిలో నిల్చున్నాడు. అతని మనస్సు స్తుబ్దుగా ఉంది. జాహ్నవి పెళ్ళి జరిగిన తరువాత తను చెయ్యబోయే పని తలుచుకుంటే అతనికి వాసిలేటింగ్ గా ఉంది. తన నిర్ణయంలో ఏదైన తప్పుందేమోనని అనుమానంగా ఉంది.

 

డేవిడ్ అతని కుటుంబాన్ని నాశనం చేశాడు. రోసి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు. అంతే కాకుండ ఎంతో మంది ఆమాయకులైన ఆడిపిల్లలను సర్వనాశనం చేశాడు. సమాజంలో పైకి పెద్ద మనిషిలా కనిపిస్తూ లోపల చీకటి వ్వాపారాలు చేస్తున్నాడు డేవిడ్. అయిన పోలీస్ డిపార్ట్ మెంట్ కాని చట్టం కాని అతని గురించి కొంచం కూడా పట్టించుకోలేదు. అతని ఇలాగే స్వేచ్ఛగా విడిచిపెడితే ఇంకా చాల మంది ఆడపిల్లలను వ్యభిచారులుగా మారుస్తాడు. అతన్ని చంపితే సమాజానికి మేలు కలుగుతుంది కాని నష్టం రాదు.

 

ఇలా తర్జనబర్జన పడుతూ చాల సేపు ఆలోచిస్తూఉండిపోయాడు వనమాలి. చివరకు అతన్ని నాశనం చెయ్యటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు. ప్రయత్నంలో అతని ప్రాణాలు పోవచ్చు లేకపోతే పోలీసులకు పట్టుబడవచ్చు. అయిన ఫర్వలేదు. ఒక మంచి పని చెయ్యాలనుకున్నప్పుడు కష్టాలు భరించకతప్పదు.

 

నిర్ణయానికి రాగానే వనమాలి మనస్సుకు శాంతి కలిగింది.

 

                                                            ంంంంంంంంంంంంంంం

 

రాత్రి పదకొండు గంటలు దాటింది. వనమాలి మెడికల్ జర్నల్ తిరగేస్తూ కూర్చున్నాడు. ఇంట్లో వాళ్ళంతా గాఢంగా నిద్రపోతున్నారు. రోజు పగలు చాల బిజీగా ఉన్నాడు వనమాలి. డేవిడ్ విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న వెంటనే అతను తన పని మొదలుపెట్టాడు. హాస్పటల్ పని పూర్తయిన తరువాత తనకు బాగా తెలిసిన లాయర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరు పరాంకుశం. సిటిలో ఒక పెద్ద లీడింగ్  లాయర్ మల్హోత్ర మూలంగా ఒక పార్టిలో పరిచయం అయ్యడు.

 

మాములు పలకరింపులు అయిన తరువాత;చెప్పండి డాక్టర్. ఏమిటి ఇలా వచ్చారు. కొంపదీసి ఏదైన విల్లు రాయాలనుకుంటున్నారా అన్నాడు పరాంకుశం నవ్వుతూ.

 

మీరు నవ్వులాటకు అన్నా అది నిజమే లాయర్ గారు. నేను విల్లు తయారుచెయ్యాలని అనుకుంటున్నాను. కాగితంలో కొన్నిపాయింట్లు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకుని విల్లు తయారుచెయ్యాలి.అన్నాడు వనమాలి.

 

ఇప్పుడు ఉన్నఫళంగా విల్లు తయారుచెయ్యవలసిన అవసరం ఏమోచ్చింది.ఆశ్చర్యంగా అడిగాడు పరాంకుశం.

 

సారీ లాయర్ గారు. విషయం మాత్రం అడగకకండి. అది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. ఏం అనుకోకండి.

నేను అర్ధంచేసుకోగలను. ఇంతకి మీకు విల్లు ఎప్పుడు కావాలి.

ఎంత తొందరగా అయితే అంత మంచిది. మీరు తయారుచేసిన తరువాత నాకు ఫోన్ చెయ్యండి. వచ్చి సంతకం పెడ్తాను.ఇదిగో కాగితంలో వివరాలు ఉన్నాయి. ఫీజు ఎంతకావాలో చెప్పండి. ఇస్తాను.

అంటు చెక్ బుక్ తీశాడు వనమాలి.

 

ఫీజు విషయం తరువాత ఆలోచిద్దాం. ముందు విల్లు తయారు చెయ్యనివ్వండి. ఎల్లుండి ఇదే సమాయానికి రండి. మీ విల్లు సిద్ధంగా ఉంటుంది.అన్నాడు పరాంకుశం.

 

చాల ద్యాంక్స్ లాయర్ గారు. వస్తాను. ఎల్లుండి ఇదే టైంకు వస్తాను అని చెప్పి బయటపడ్డాడు వనమాలి. ఇప్పుడతని మనస్సు చాల ప్రశాంతంగా ఉంది. రేపు ఒకవేళ అతను పట్టుబడితే అతన్ని నమ్ముకున్న వాళ్ళు ఇబ్బందిలో పడకూడదు. అందుకే ముందు జాగ్రత్త కోసం విల్లు తయారుచేశాడు. అతనినే నమ్మకున్న రోసి, నారయణరాపు దంపతులు జీవితాంతం హాయిగా బతకటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. దీనితో అతని బాధ్యత తీరిపోతుంది.

 

ఇప్పుడు అతని మనస్సు చాల ప్రశాంతంగా ఉంది. డేవిడ్ గురించిన ఆలోచనలు తప్పు ఇంకేలాంటి ఆలోచన అతని మెదడులో లేదు. జాహ్నవి పెళ్ళైన తరువాత డేవిడ్ ను చంపాలని అతను నిర్ణయించుకున్నాడు. దానికి తగిన పధకం కూడా సిద్దం చేశాడు. దాన్ని అమలుపరచటమే మిగిలిఉంది.

 

                                                ంంంంంంంంంంంంంంంం

 

పదిహేనురోజులు గడిచాయి జాహ్నవి వెంకటరమణ పెళ్ళి చాల అట్టహాసంగా ఆడంబరంగా జరిగింది వనమాలి హాస్పటల్ స్టాఫ్ మాత్రమే కాకుండ మల్హోత్ర లోకల్ యంయల్ఏ యం.పీ లు కూడా శుభకార్యానికి వచ్చారు ముఖ్యంగా నాయక్ వర్మ రావటం వనమాలికి ఎంతో సంతోషం కలిగించింది

 

వెంకటరమణ జాహ్నవి మెడలో తాళి కడుతుంటే నారయణరావు దంపతుల కళ్ళు చెమ్మగిల్లాయి వనమాలి వైపు కృతజ్ఞతో చూశారు. అందరికంటే వనమాలి ఎంతో సంతోషంగాను ఉద్వేకంగాను ఉంది రోజుతో అతని ముఖ్యమైన బాధ్యత తీరిపోయింది. అందుకు సంతోషం. చాల సంవత్సరాల తరువాత అనుకోకుండ కలిసిన చెల్లెలు దూరమవుతున్నందుకు ఉద్వేకం రెండు భావోద్వేగాలు అతన్ని కలసికట్టుగా కుదిపేస్తున్నాయి.

 

మూడు నిద్రలు అయిన తరువాత జాహ్నవి అత్తవారింటికి బయలు దేరింది తోడుగా తను వెళ్తానని అంది రోసి. అలాగే అన్నాడు వనమాలి అందురు వెళ్ళి కారులో కూర్చున్నారు ఒక జాహ్నవి మాత్రం గదిలో ఉండిపోయింది. ఆమె ఎదురుగా వనమాలి ఉన్నాడు రెండు నిమిషాలు వరకు ఇద్దరిలో ఎవరు మాట్లాడలేదు.

 

తరువాత ముందుగా జాహ్నవి తేరుకుని అంది.

 

అన్నయ్య వెళ్ళోస్తాను నాకు పెళ్ళినిశ్చయమైన రోజు నుంచి నీతో ఒక విషయం చెప్పాలని అనుకున్నాను. కాని ధైర్యం చెయ్యలేకపోయాను అందుకే నా మనస్సులో మాట రోసి అక్కయ్యతో చెప్పాను. అది నా ఉద్దేశం మాత్రం కాదు అందరి అభిప్రాయం కూడా. ముఖ్యంగా రోసి అక్కయ్య కూడా అలాగే భావిస్తుంది.

నువ్వు తప్పకుండ ఒప్పుకుంటావని అనుకుంటున్నాం.

 

వనమాలి నవ్వి ఏమిటమ్మా అంత ముఖ్యమైన విషయం అని అడిగాడు.

నేను చెప్పలేను అన్నయ్య. అక్క చెబితే బాగుంటుంది పైగా తన మాట నువ్వు కాదనలేవు వస్తాను అన్నయ్య నీ ఆరోగ్యం జాగ్రర్త వేళకు భోజనం చేసి నిద్రపో. గతం గురించి పూర్తిగా మరిచిపోమని చెప్పను కాని ఎక్కువగా గుర్తుచేసుకోకు అని మాత్రం చెప్పగలను. అమ్మ నాన్న నాతో నాలుగు రోజులు ఉండి వస్తారు. నన్ను ఆశీర్వదించు అంటు వనమాలి కాళ్ళకు నమస్కారం చేసింది జాహ్నవి.

వనమాలి చప్పున ఆమెను లేపి అన్నాడు.

 

ఏమిటిది. నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది పిల్లా పాపలతో నీ కుటుంబం చల్లగా ఉండాలి. పెళ్ళైపోయిందని అన్నయ్యను మరిచిపోకు. అప్పుడప్పుడు ఇంటికి వస్తుండు. కనీసం రోజుకు ఒకసారైనా ఫోన్ చెయ్యి. నీ కేం కావాలన్న అన్నయ్య ఉన్నాడని మరిచిపోకు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రా.

 

అలాగే అంటు తలూపింది జాహ్నవి. వనమాలికి మరోసారి వీడ్కోలు చెప్పి వెళ్ళి కారులో కూర్చుంది వెంటనే కారు వేగంగా ముందుకు దూసుకుపోయింది గుమ్మం ముందు నిల్చున్న వనమాలి కారు కనిపించేంతవరకు చేతులు ఊపాడు. తరువాత మెల్లగా లోపలికి వెళ్ళాడు. తన బెడ్ రూంలోకి వెళ్ళి రిమోట్ కంట్రోల్ బంబ్ తో కొన్ని నిమిషాలు ప్రాక్టిస్ చేశాడు. తరువాత దాన్ని లోపలికి పెట్టబోతుంటే అప్పుడే పోర్టికోలో ఏదో వాహనం ఆగిన చప్పుడు వినిపించింది. వనమాలి కిటికిలోంచి చూశాడు. టాక్సి లోంచి హాడావిడిగా దిగి లోపలకు వస్తుంది రోసి.

 

ఆమె మొహం పాలిపోయింది. బట్టలు చమటతో తడిసిపోయాయి పది లంకణాలు చేసిన దానిలా నీరసంగా ఉంది.

 

ఏం జరిగింది అక్కా. అలా ఉన్నావేం కంగారుగా అడిగాడు వనమాలి కిందికి దిగుతూ.

 

కొంచం దూరం వెళ్ళేసరికి తలతిరిగింది. ఒళ్ళంతా చెమట పట్టింది. ఉన్నట్టుండి విపరీతమైన నీరసం ఆవహించింది. అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఇబ్బంది కలిగించటం కంటే దిగిపోవటం మంచిదనిపించింది. అందుకే టాక్సి పట్టుకుని వచ్చేశాను అంది రోసి నీరసంగా.

 

ఏది నన్ను పట్టుకుని చూడనీ అంటు ఆమె చెయ్యి పట్టుకుని చూశాడు. తరువాత రోసి వైపు తిరిగి  పెళ్ళిపనులు అంతా నీ ఒక్కదాని భుజం మీద వేసుకుని చేశావు. తగిన విశ్రాంతి లేకపోవటంవల్ల ఒంట్లో ఉన్న శక్తి అంతా హరించుకుపోయింది. అందుకే అలా జరిగింది. కంగారుపడవలసింది ఏం లేదు. రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. లోగా రెండు మాత్రలు ఇస్తాను. అవి వేసుకుని హాయిగా కళ్లు మూసుకుని పడుకో. మళ్ళి పని అంటు బయలుదేరకు అన్నాడు వనమాలి చిరుకోపంగా.

 

జాహ్నవి నీకు మాత్రం చెల్లెలు కాదు. నాకు కూడా. చెల్లెలు పెళ్ళికి మాత్రం పని చెయ్యకపోతే ఏం బాగుంటుంది. అయిన నేను పెద్దగా ఏం కష్టపడలేదు. నాయర్ తో పాటు ఇంకో ముగ్గరు పనివాళ్ళు నాకు సహయం చేశారు. అంది రోసి బలహీనంగా నవ్వి.

 

అక్కా నీతో వాదించటం చాల కష్టం. సరే ముందు నేను చెప్పినట్టు మాత్రలు వేసుకుని విశ్రాంతి తీసుకో. సాయంత్రం మరో సారి పరీక్ష చేస్తాను.

అలాగే అంటు బుద్ధిగా మాత్రలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది రోసి. వనమాలి భారంగా నిటుర్చి తన బెడ్ రూంలోకి వెళ్ళాడు.

 

                                                ంంంంంంంంంంం

 

రోసి ఆదివారం చర్చ్ కు వెళుతూ మాములుగా అలవాటు ప్రకారం వనమాలిని పిలిచింది యధాప్రకారం వనమాలి రానని చెప్పాడు. కాని సారి మాత్రం రోసి ఒప్పుకోలేదు. వనమాలి తప్పకుండ రావాలని పట్టుబట్టింది.

నిన్ను చూడాలని ఒక గొప్ప మనిషి కాచుకుని ఉన్నాడు. ప్రతి ఆదివారం నిన్ను తీసుకురమ్మని నాతో చెప్పుతునే ఉన్నాడు. కాని విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆయనకు నా మీద కోపం వచ్చింది. ఆదివారం నిన్ను వెంట తీసుకువస్తేకాని నాతో మాట్లాడనని పంతం పట్టి కూర్చున్నాడు. అందుకే నువ్వు నాతో బయలు దేరక తప్పదు. లేకపోతే నేను చాల ఇబ్బందిలో పడతాను తమ్ముడు.

 

ఇంతకి నన్ను చూడాలనుకుంటున్న వ్యక్తి ఎవరు ఆశ్చర్యంగా అడిగాడు వనమాలి.

తినబోతూ రుచులు అడగటం ఎందుకు. నువ్వే చూస్తావుగా అంటు అసలు విషయం చెప్పకుండ నవ్వుతూ కొట్టిపారేసింది.

నిజానికి వనమాలికి ఎక్కడికి వెళ్ళలని లేదు. ఇంట్లో కూర్చుని డేవిడ్ గురించి ఇంకా డీప్ గా ఆలోచించాలని ఉంది. అతన్ని ఎప్పుడు చంపాలో వనమాలి ఇంకా నిర్ణయించుకోలేదు. ఆదివారం దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసకుని నాయక్ తో మాట్లాడాలని అనుకున్నాడు. కాని అనుకోకుండ రోసి చర్చ్ కు రమ్మని మరిమరి అడగటంతో పనిని తాత్కాలికంగా వచ్చే ఆదివారానికి వాయిదా వేశాడు. ఒక గంట తరువాత ఇద్దరు తయారయి చర్చ్ కు వెళ్ళారు.

 

కారు పోర్టికోలో ఆపుతుంటే అప్పుడే లోపలనుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆయన్ని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు వనమాలి ఆయన ఫాదర్. ఎక్కడో మిషినరి స్కూలులో ఉండాల్సిన ఫాదర్ చర్చ్ లో కనిపించేసరికి సహజంగానే అతనికి షాక్ తగిలింది. బొమ్మలా అలాగే నిలబడిపోయాడు. రోసిలో కొంచం కూడా స్పందన లేదు. పరిణామం తను ముందే ఊహించినట్టు ఆమె ఇద్దరి వైపు చూసి చిరునవ్వు నవ్వుతుంది