సుజననీయం  
 

 

 

                                                            రచన: రావు తల్లాప్రగడ

 
 
     
 

ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు! రుద్రుడు ఉగ్రుడని ఆ రుద్రుడిని చల్లపరచమనే మన వేదం చెబుతోంది. అలాగే మనం చేస్తూ వచ్చాం. రుద్రాభిషేకాలు చేస్తూనే వచ్చాం. కానీ ఎన్నాళ్ళు రుద్రుడిని ఇలా శాంత పరచడం? నీళ్ళుపోసి చల్లార్చడం? 'అహం బ్రహ్మాస్మి' కనుక రుద్రుడంటే వేరే ఎవరో కారు. మనలోని ప్రతి ఒక్కరూ స్వయంగా రుద్రులే. ఈ అభిషేకాలు మనుజులలో స్వాభావికంగా దాగున్న కిరాతక భావాన్ని చల్లార్చడానికే.

నమోభగవతే రుద్రాయ

నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమో

నమః కకుభాయ నిషంగిణే” స్తేనానాం పతయే నమో

నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో

నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే నమో

నమో నిచేరవే పరిచరా యారణ్యానాం పతయే నమో

నమః సృకా విభ్యో జిఘాగ్ం సద్భ్యో ముష్ణతాం పతయే నమో

నమో సిమద్భ్యో నక్తం చరద్భ్యః ప్రకృంతానాం పతయే నమో

నమ ఉష్ణీషినే గిరిచరాయ కులుంచానాం పతయే నమో

నమః ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో

నమ ఆతన్-వానేభ్యః ప్రతిద ధానేభ్యశ్చ వో నమో

నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్-భ్యశ్చ వో నమో

నమో స్సద్భ్యో విద్యద్-భ్యశ్చ వో నమో

నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో

నమః స్వపద్భ్యో జా+గ్రద్-భ్యశ్చ వో నమో

నమః స్తిష్ఠద్భ్యో ధావద్-భ్యశ్చ వో నమో

నమః స్సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో

నమో అశ్వేభ్యో శ్వపతిభ్యశ్చ వో నమః

అన్నీ ఓర్చుకుంటూ అన్నిరకాలుగా కూడా బాధించగలిగినవానికి, అందమైన వాడై అమ్ములపొదిని కలిగినవానికి, కన్నపుదొంగయై చేతిలో బాణమును వీపున అమ్ములపొదిని ధరించిన అతిమోసగానికి, వంచకుడైన ఇంటిదొంగకు, దోంగతనముకై కనిపెట్టుకునియున్న సేవకునివోలే కలిసిపోయి సంచరించే గజదొంగకు, ఆటవీకునకు, వాడియైన ఆయుధాలతో తిరిగే మనిషుల చంపి నిలువుదోపిడి చేయగలిగిన సృకావజాతునకు, కత్తులు ధరించి రాత్రి వేళల నరుకుతూ సంచరించేవానికి, దొరలాగా తలపాగా ధరించి కొండలందు తిరిగుతూ మోసగించి నరకగల వానికి, అమ్ములు ధనువులు ధరించినవానికి, చాపాన్ని సంధించి ఎక్కుపెట్టేవానికి, ఆకర్ణాంతం లాగి విడవబడిన బాణాంతో సూటిగా శత్రువును ఛేదించగలిగిన గురి ఉన్నవానికి, కూర్చునేయున్నా పరుండగలిగిన వానికి, కలలుగంటున్నా మెలుకొనే వుండగలిగిన వానికి, సర్వవ్యాపకుడై నిలిచిన వానికి, స్వయం సభాపతియై సభాసదుడై కూడా యున్నవానికి, స్వయం ఆశ్వమైనా అశ్వపతిగా కూడా కాగలిగిన ఆ రుద్రునకు నమస్కారములు!

ఇవన్ని మనుషులకి స్వాభావికసిద్ధంగా సంక్రమించిన కిరాతగుణాలే. కానీ సమసమాజానిర్మాణానికై సంస్కారానికి ఓదిగుండడం నేర్చుకుని కిరాతభావాలను చల్లార్చుకున్నాడు నేటి మానవుడు. లేకుంటే మనిషి అంత ప్రళయకారుడై విలయతాండవం చేసే రుద్రుడైతే ఆతడు శాంతిస్తే కానీ సమాజం బతకదని ఇన్నాళ్ళుగా మనం భావించడం వల్ల, ఆ రుద్రుడిని శాంతపరుచుకుంటూ వస్తున్నాము. వేదఘోషతో మనలోని రుద్రుడు శాంతించి శివుడై పోయినట్లున్నాడు. అది అలుసుగా తీసుకుని తక్కువ శక్తులన్నీ విజృంభిస్తే ఇక ఆ రుద్రుడిని మేల్కొనపక తప్పదేమో!? అంటే ఆత్మసంరక్షణార్థమై మనలని మనం మేల్కొనక తప్పదు!

- - -

గతమాసం హైదరాబాదు దిల్షుక్నగరులో జరిగిన దారుణ హింసాకాండను ఖండిస్తూ, దుర్ఘటనలో మృతులైన వారికి, గాయపడినవారికి, ప్రగాడ సంతాపాన్ని వెలిబుచ్చుతూ, తోటి తెలుగువారిని బలితీసుకున్న విధ్వంసకాండను నిరసిస్తోంది సుజనరంజని. మతం పేరిట చెలరేగిన మతోన్మాదాన్ని, దానిలో పాలు పంచుకున్న ప్రతివారినీ, దానికి సహకరించిన  ప్రతివారినీ, దానిని ప్రోత్సహించిన  ప్రతివారిని ద్వేషిస్తోంది సుజనరంజని. ఇటువంటి దుర్ఘటనలను ఎన్ని చేసినా హైందవ సంస్కారసాంప్రదాయాలు ఎన్నటి ఓడిపోలేదనీ, చరిత్ర ఎన్ని సార్లు తెలిపినా అర్థంచేసుకోలేని మూడత్వాన్ని ఎలా అసహ్యహించుకున్నా పరవాలేదు.

కానీ ఇంత అనర్థం జరిగిన తరువాత కూడా, ఒక్కో రాజకీయ పక్షము అధీకారపార్టీని దుయ్యపట్టడం తప్ప, తమవంతు కర్తవ్యంగా మతోన్మాదాన్ని ఎవ్వరూ నిలదీయక పోవడం ఆశ్చర్యకరమె. మతోన్మాదానికి ఉగ్రవాదమనే పేరు తగిలించి అసలు విషయాన్ని ప్రశ్నించకపోవడం ఎంత సబబు? నిలదీస్తే తమను ఎక్కడ సెక్యులర్ పార్టీ కాదంటారో అని, కళ్ళకు కనిపించే దానిని కూడా పట్టించుకుపోవడం ... ఒక మహానేరమే. ఇది హైందవమతము పైన జరిపిన యుద్ధమే, అని నిజంగా తెలియని వారెవరు? కానీ, ఎవ్వరూ ఊసు కూడా ఎత్తడానికి భయపడటం విచారకరమే. హిందూధర్మపు ఆత్మరక్షణ గురించి మాట్లాడే  నాథుడే లేడు మన నాయకులలో.

'దేనికైనారెడీ' అన్న సినిమాలో భ్రాహ్మణులను కించపరిచారయ్యా అని మొత్తుకుంటే, .....  ప్రజాస్వామ్య వ్యవస్థలో  ఎవరిష్టం వారిది, వేరే వారిని ప్రశ్నించే అధికారం మీకు లేదని, బ్రాహ్మణుల నోరు మూయించారే మన నేతలు. అదే నేతలు 'విశ్వరూపం' అన్న సినిమా వచ్చేటప్పటికి ఎలా ప్లేటు ఫిరాయించారో తెలియదు. 'విశ్వరూపం'లో మహమ్మదీయులను కించపరిచారు కనుక సినిమాను నిషేదించాలని పట్టుబడతారు. ఇప్పుడు ఎందుకు పట్టలేదు ప్రజాస్వామ్యవ్యవస్థ? ఒక్కొక్క మతానికి ఒక్కొక న్యాయమెలా చెల్లిస్తారో మన నేతలకే అంతు పట్టదుఒక ప్రక్కన ఇలా మతపరమైన ఓట్ల బురదగుంటలో తాము ఈదులాడుతారు; మరొక పక్క ఎవరైనా తప్పు జరుగుతోందని గుర్తుచేస్తే వారిపైన మతపరమైన బురద చల్లి అవమానం కూడా తలపెడతారుఇటువంటి స్యూడోసెక్యులర్ ప్రజాస్వామ్యమా మనం కోరుకున్నది, ఇటువంటి అసమాన మతరక్షణా మనం ఆశించినది?

అందరూ కలిసి ఆలోచించి మతపరమైన దాడులని నిర్భయంగా ఎదుర్కోవాలి. కనీసం మన మతం పైన దాడి జరిగింది అని బహిరంగంగా చెప్పుకోగలగాలి. అందులో తప్పేమీ లేదు.  ముసుగులో గుద్దులాటలు అనవసరము. ఇది మొదటి దాడీ కాదు, ఇకపైన జరగవని కూడా కాదు. అమెరికావంటి దేశాలు కూడా వీటిని అరికట్టలేకపోతున్నాయి, కానీ నిజాన్ని పలుకడానికి సెక్యులరిజం ముసుగులో ఎప్పుడూ వెనుకాడలేదు. ఎప్పుడూ ఏదో ఒక విదేశీ సంస్థ పేరు చెప్పి దాటేయడం కాదు. విదేశీ సంస్థకు కూడా స్థానిక సహకారము, స్థానిక సదుపాయము, స్థానికబలము లేక పోతే ఇటువంటి అరాచకాలను సృష్ఠించలేవని మనకు తెలియదా? ఒక్కసారి హైందవ సంస్కారసాంప్రదాయాలను సామాజిక బాధ్యతను దృష్టిలో పెట్టుకుని, ఓట్లబాంకుని పక్కకు పెట్టి, నిర్భయంగా, ఒక భారతీయుడిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కేవలం ప్రభుత్వాన్ని తిడుతూ కాలయాపన చేస్తూ, దృష్ఠి మళ్ళించే బదులు, ఇది మనపైకి రుద్దబడిన యుద్ధమే అని నేరుగా ప్రకటించుకోగలిగితే, తదుపరి కర్తవ్యం సరిగ్గా అర్థమవుతుంది, కర్తవ్యపాలన జరుగుతుంది.

When do we learn to call a spade a spade?

మీ

రావు తల్లాప్రగడ

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

 

 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

 
     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech
 
Sujanaranjani