Sujanaranjani
           
  మనబడి కబుర్లు  
  ఆదర్శ కుటుంబం
పద్య గేయ కదంబ రూపకం
 
           
 

రచన : పి. బి. న్. కృష్ణవేణి.

 
 

                       
ఇది గతంలో మనబడిలో ప్రదర్శింపబడిన, ఒక సందేశాత్మక పద్య గద్య గీత హాస్య రూపకం
:
ఇందులో, తల్లి తండ్రి ,వారికి గంపెడు సంతానం .

తల్లి పేరు –పునీత తం డ్రి –హర్షిత్ ,
ఇం కా పదిమంది కొడుకులు పదిమంది కూతుళ్ళు
కొడుకులు:1రాజు, 2రవి ,3కిషోర్ ,4సురేష్,5విజయ్ ,6వినయ్,7రాము,8మనీష్, 9వసంత్, 10మోహన్;.

కూతుళ్ళు ; 1 లక్ష్మి, 2రాణి, 3వనజ ,4రాగిణి, 5లత, 6లలిత, 7విమల,8 సీత, 9గాయిత్రి ,10శ్రీవల్లి 11చిట్టి

1 వ అంకం ;

[పునీత ] అమ్మ ;ఏమర్రా లేచారా?లేదా?ఇం కా? ఏడవుతోం ది. తొమ్మిదింటికి, బడి అయితే ఇప్పటిదాకా యేమిటా మొద్దు నిద్దర్లు? లేవం డి, లేవండి .

[
హర్షిత్ ;-]నాన్న;అబ్బ ,లేస్తార్లేవే ,ఏమిటాకంగారు ?పాపం రాత్రం తా చదువుకుని, చదువు కునీ ,ఏ’’పన్నెం డు ,’’గంటలకో,ఒం టి గంట కో నిద్దరోయారా; లేస్తార్లే వాళ్ళ టైం వాళ్ళకు, తెలియదు గనకనా;
అమ్మ ;-ఏమిటీ ? వీళ్ళా? చదువులు కూడానా? పెద్దవాళ్ళం తా సినిమాలకి, చిన్నవాళ్ళంతా టి.వి,లకి అతుక్కు పోతున్నారు. వీళ్ళు, ;అర్థ రాత్రిదాకా చదివారా? నన్ను నమ్మించాలని చూడకండి.;

కోరస్; నమ్మకం,నమ్మకం ,న—మ్మకం--,నమ్మకమేలేకుం టే ,బతుకేదీ--

[కొన్నాళ్ళ క్రీందటి జేమినీ సీరియల్ టైటిల్సాంగ్ ]

నాన్న;సరే;ఏదో,ఒక్ఖ రోజు, సినిమా కెళ్ళినంత మాత్రాన రోజూవాళ్ళేం చదవడం లేదంటావా? అయినా, నాకు, తెలియకడుగుతాను ఈరోజేమిటే ? పొద్దున్నేవాళ్ళ మీద, దండయాత్ర మొదలెట్టావు?

అమ్మ ;మరే;నాకదేపని.

1 రాణి [పెద్దమ్మాయి ];;అమ్మా; లేస్తున్నాం లేవే; అవునూ, నాన్నగారూ ;మీరు చెప్పిందీ, అక్షరాలానిజం. అమ్మది నిజంగా దండ యాత్రే. /ఈ దండ యాత్రకీ ,కత్తులూ,కటా రులక్కరలేదు.శాంతి యుద్ధమే .

పద్యము;;
ఉ ;-అన్నువులేదు కుట్రలకు నక్కరలేదుకటారు లీటే లున్,
బన్నుట లేదు శాత్రవుల బ్రాణము దీయుట లేదు.నెత్తురున్
జున్ను విధాన బట్టి తెగజుర్రుట లేదు జగచ్చరిత్రలో
కన్నదిగాని విన్నదియుగాని రణం బిది విక్రమిం పుడీ.


[శ్రీ తుమ్మలసీతారామ చంద్రమూర్తిగారి మహాత్మకథ నుండి తీసుకొనబడినది .మహాత్మాగాంధీ సహాయనిరాకరణ ఉద్యమాన్నిగురించి చేబుతూజరిగేది ధర్మయుద్ధ మని దీనికి శస్త్రాస్త్రాలతో పనిలేదనిచే ప్పే సందర్భం లోనిదీపద్యం .ఈయన ఆధునిక కవి.]

అమ్మ; మొదలెట్టావా; పొద్దున్నే ;ఇదిగో,ఇదండీ వరస .;ఈమధ్యా ,వాళ్ళ తెలుగు ఉపాధ్యాయిని గారేదో పద్యాలపై అంత్యాక్షరీ, పెడుతోంద టా ; దానికోసం పద్యాలు చదవడం కాదుగానీ, నా ప్రాణాలు తోడే స్తున్నారు. ఈపిల్లలంతా ; మాట్లాడితే చాలు నోటంట; పద్యం పద్యం ,పద్యం; అది లేందే,మాట్లాడ్డం లేదు.
4 రాగిణి ; తప్పు,తప్పు.అమ్మా; మాఉపాధ్యాయిని, మంచి పనేచేస్తున్నారు. ఎక్కడ చూసినా మాతృభాష నేర్చుకోవడం, మానేశారోహ్, జనాలని టి,వి.లలో,గగ్గోలు,పెడుతున్నారు కదా; అందుకే,మా తెలుగు- ఉపాధ్యాయినిగారు, ఇలా ఒకపథకం వేశారు. ఇలాగైనా నాలుగుపద్యాలు వంటబడతాయని.

అమ్మ ;అవునేవ్,వంటంటే జ్ఞాపక మొచ్చింది. పొయ్యిమీదా, కూరమాడి పోతోంది. .నామతిమండా ;మిమ్మల్ని లేపడం లో అసలువిషయం మర్చేపోయాను. ఉండు, చూసివస్తాను.

నాన్న ;యేం కూరేవిటి ?

7 విమల ;ఏం కూరేమిటి నాన్నా, వీధి లోకివచ్చాయని, గం-- పెడు,వం కాయలు కొందికదా , మొన్న; అమ్మ ; అవే అయ్యుంటాయి. ఏమ్మా; అంతే, కదా;

7 రాము. ;
కం ;-వంకాయవం టి కూరయు
పంకజముఖి సీతవం టి భామామణి యున్
. శంకరునివంటి దైవము
లంకాధిపు వైరివం టి రాజునుగలడే . [చాటు పద్యం ]

5 లత;అలా చదివితే అమ్మకు కోపం వస్తుందిరా; నే చేప్తానుండు .
పాట ;
ఆహా;యేమి రుచి?అనరా-మైమరచి ,
రోజూతిన్నామరీ ---మొజేతీరనిదీ
ఇం కా చెప్పా—లా;వం --కా—యే నం డీ.//ఆహా //

అంటూ పాట లో –ఇలా చెప్పాలి. అ తేకానీ అమ్మకుకోపం తెప్పిస్తారా?
ఎవరైనా?
 

10 మోహన్ ;పోన్లేవేయేదో తప్పయిపోయిందీ. వాడుపద్యం లోచెప్పాడూ.
ఆట వెలది ;తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్విజనుల కెల్ల నుండుతప్పు .
తప్పులె న్ను వారు తమ తప్పు లెరుగరు,
విశ్వ దాభిరామవినురవేమ
.[వేమనకవి .యోగివేమనగాప్రసిద్ధి.17 వ శతాబ్దపువాడని,రెడ్డిరాజుల కాలపు అనవేమారెడ్డి రాజు గా చెప్పబడుచున్నాడు.]

3 కిషోర్ ;వాణ్ణి సమర్ధిమ చి,నువ్వూ పద్యం చదువుతావేరా? ఇంకాస్త అమ్మకు,కోపం తెప్పిస్తావా?
కందము;- కోపమునుబ్బునుగర్వము
నా పోవక యునికి దురభిమానము ని
ర్వ్యాపారత్వముమనిషికి
కాపురుష గుణ ములం డ్రు కౌరవనాథా ;
[భారతము ]

4 సురేష్ ;ఒరేయ్ నోరు మూసుకుని పదండి .స్నానాలకి.టై మవుతోంది.
6 లలిత ;ఆవాజ్ మై నదూం గీ –ఆవాజ్ మైనదూం గీ .
1 లక్ష్మి ;మౌనం గానే ఎదగమనీ, మొగ్గ నీకు చెబుతుంది,
ఎదిగినకొద్దీ, ఒదగమనీ అర్థ మందులో ఉం ది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్నిరాలిన చోటే కొత్తచిగురు కనిపిస్తుంది //మౌనం /
/ (రచన-చంద్రబోస్, గానం-చిత్ర)

3 వనజ;అమ్మా అన్నం లోకిపచ్చడి యేం చేస్తున్నావూ?
అమ్మ;కొబ్బరిగానీ, గోంగూరగానీ, చేద్దామనుకుంటున్నానే. ఇలావచ్చీ కాస్త సాయం చెయ్యండి.
పద్యం ;కం దం ; ఉపకారికినుపకారము
విపరీతముగాదు సేయవివరింపంగా
నపకారికినుపకారము
నెపమెన్నక సేయువాదేనేర్ప రి సుమతీ [బద్దెన గారిసుమతీశతకము ]

నిజమేనే కాస్తసాయం చేద్దాం. మరీ అ టీ ముట్టనట్టుంటే అమ్మొ క్కత్తీ చేసుకోవద్దూ? untuchbility are not allowed .

9 గాయిత్రి. ;అన్నమయములైనవన్నిజీవమ్ము లు
కూడులేకజీవకోటి లేదు
కూడు తినెడి కాడ కులభేదమేలొకో
కాళి కాంబ; హం స కాళి కాం బ ;
[పోతులూరివీర బ్రహ్మం గారి హంస కాళి కాంబ శతకం ]

10 శ్రీవల్లి ;అవునేవ్ ;ఈరోజు, టెస్టున్నట్టుంది, తెలుగు.?చదివామా?రాత్రె వరేనా?రాత్రేం చదివాం?

5 విజయ్ ;

విద్యనిగూడ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య, యశస్సు, భోగకరి,విద్య గురుండు,విదేశబంధుడున్
విద్య, విశిష్ట దైవతము ,విద్యకుసాటి ధనంబు లేదిలన్
విద్య, నృపాల పూజితము,విద్య నెరుంగనివాడు మర్త్యుడే.


[భర్తృహరి సుభాషితమునకు, ఏనుగు లక్ష్మణకవి అనువాదపుపద్యము] అంచేత చదివింది చెప్పరు. అది రహస్యంగా మైమ్డనే బ్యాంకులో దాచుకోవలసింది.

6 వినయ్ ;నీమొహం ;చదువుకున్నదీ ఇతరులకు కూడా చెప్పాలి. చెప్పకపోతే మర్చిపోతామని టీచర్ చెప్పలేదా ?

8 మనీష్ ;అవున్రోయ్ ;నిజమే మన టీచరెప్పుడూ అదే చె ప్తుంటారు.అం దుకే ఇతరులకు చెప్తున్నట్లు చదువుకో మంటుమ్టారుకూడా .

అమ్మ ;ఒరేయ్ ,నన్నుచంపక ,తొందరగా తెమలండి.;

4 రాగిణి. ; ఒకరిం జంపి పద స్తు లైబ్రతుక తామొక్కొక్కరూహిం తురే
లొకో,తామె న్నడుజావరో, తమకు,వోవో,సం పదల్ పుత్రమి
త్ర కళత్త్రాదుల,నిత్యసుఖ మందంగందురో ఉన్నవా
రికి లేదో మృతి యెన్న డుం గటగటా శ్రీకాళహస్తీశ్వరా ;
[శ్రీకాళ హస్తీశ్వరశతకం – ధూర్జటి - ౧౬వశతా బ్ది]
ఇతరులను చం ఫైనా ,పదవులను, పొందాలని,చూచే వారు,ఎప్పుడో ఒకప్పుడు అన్యాయముగా, పొం దిన ఆపదవులను పోగొట్టుకొనవలసి వస్తుందని, తాముకూడా యేదోరోజు చనిపోయే వారమేననీ ఊహిం చరదేమో యని కవిబాధపడు టఈపద్యమునకుభావము]
3 కిషోర్ ;సత్తేయేగోడ వాలేదు,సత్తేయేగోలాలేదు
పుట్టేప్రతివోడూ, సత్తాడో య్ .
కలకాలం కాకుల్లాగా బతికేస్తే యేమొస్తుంది?
హంసల్లే దర్జాగుం డా లోయ్.అం దమైన ఈ జీవితా నికీ అర్థమ్ వెత కాలోయ్  .


9 గాయత్రి ;అసలే అమ్మ చం పడ్డం తోం దా ;మళ్ళీ నీగోడవేమిట్రా ?ఈగోడవలోపడి,అమ్మ
కూరలో , ఉప్పేయడం ,మరచిపోయినా, మరచిపోతుంది.

10 శ్రీవల్లి;

పద్యం ;-ఉప్పుకప్పురం బునొ క్కపోలికనుం డు
చూడ ,చూడ ,రుచులజాడ వేరు ;
పురుషులం దు పుణ్య పురుషులువేరయా,
విశ్వ దాభిరామ వినురవేమ.

2 రవి ;ఉప్పు వెయ్యకపోతే కూరకు రుచేలేదు.
ద్యము;-చం పకమాల;-చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబగు గుణ సంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం
బదనుగ మం చికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచిపుట్టగనేర్చు నటయ్య భాస్కరా ; [


[భావము;-సద్గుణ వంతులు మెచ్చని చదువు యెంత చదివినా ఆచదువు, రసజ్ఞత లేనిదే అగును .మం చి కూర నలభీమపాకమువలె సకల పదార్థములువేసి వండిననూ, దానిలో ముఖ్యమైన రుచి కలిగించెడి ఉప్పు వేయనిచో ఆకూరరుచి కుదరనట్లే అగును. అట్లే చదువుకూడా .[భాస్కరశతకము –మారదవెం కయ్యకవి, దృష్టాంతాలంకారములకుపెట్టిదిపేరు ]

కిషోర్ ;ఒరేయ్ ఇంకా విసిగించామంటే అమ్మగరిటే పుచ్చుకొని వస్తుం ది జాగ్రత్త ; అమ్మా---కాఫీ .
విజయ్;

గంగి గోవు పాలు గరిటే డైనను చాలు,
కడివెడైననేమి ఖరముపాలు
భక్తికలుగు కూడు పట్టే డైన నుచాలు
విశ్వదాభిరామ వినురవేమ[
వేమనశతకం –వేమన ౧౭ వశతా బ్దివాడు అద్దం కి సీమలోని మూగచిం త పల్లెలో పుట్టి, సర్వాంద్ర ద్రవిడ దేశసంచారియై వేలకొలది ఆటవెలదులను, విజ్ఞుల జిహ్వ వేదికా రంగములపై నాట్యమాడించిన రెడ్డిరాజ జగజ్జ్యోతి. సహజ కవితా ధారలయూట గడ్డ]

-2వ అంకం;
వినయ్ ;-అమ్మా టిఫినేం చేశావే ?
అమ్మ;-యేముందీ చేయదానికీ ?దేవు డిచ్చి నుప్మా;
లలిత ;-అమ్మా ;జీడిపప్పులేస్తున్నావా?

లత;అమ్మా;ఉప్మాలో ఓ; నెయ్యీ,---టప్పూ----ట ప్పూ ---ట ప్పూ –అం టూ పడుతున్నట్లు
వేస్తే -- -ఆహా---ఎంత –రుచీ గా ఉంటుమ్దే.

రవి;ివాహ భోజనం బు ,విం తైనవంట కంబు,
వియ్యాలవారివిం దు ఓ హోహ్హో నాకె ముం దు.
ఆహాహ్హహహ్హ,-ఆహాహ్హహ్హ -ఆహాహ్హహ్హ -ఆహాహ్హహ్హహా //వివాహ//
అమ్మాపెళ్ళుప్మాలా చెయ్యవే బావుం టుమ్ది

[మాధవపెద్ది సత్యం పాట ;-మాయాబజార్ సినిమాలోపాడిన నేపధ్యగాయకుడు ]
అమ్మ;-ఒరే -యొరేయ్ ;మిమ్మల్నీ---[అం టూ --గరిటే పుచ్చుకునీవిసురుగా తరుముతుం ది]

నాన్న ;-పోన్లేవే;పిల్లలు,ముచ్చట పడుతున్నారు. పోనీ, అలాగేచేయరాదూ?బావుం టు మ్ది

అమ్మ;-అవునూ ఏవిటీ,? మీరుకూడా, వాళ్ళ కి బాగానే వం త పాడుతున్నారూ ,. యేం ? . అయ్యగారికివాళ ఆఫీసూ, పిల్లవాళ్ళ కివాళ స్కూళ్ళూ ,లేవా?ఏవిటీ ?అం దరూ కలిసి తానా అం టే తందానా అం టూ స్నానాలకి కదలడమే మానేశారు?
సీత ;-తం దనానా—ఆహి ,తం దనానా –పురే ,తం దనానా –భళా ,తంద --నా--ఆ –నాభళా తందనానా
భళా తం దనానా ;బ్రహ్మమోక్కటే -పర బ్రహ్మమొక్కటే--పరబ్రహ్మమోక్కటే –పరబ్రహ్మమోక్కటే---ఏయే ఏ //తం దనానా//[అన్నమాచార్యకీర్తన .]

నాన్న ;పద్యం ;-
చంపక మాల;- సరసునిమానసం బు సరసజ్ఞు డేరుంగును; ముష్కరాధముం
డేరిగిగ్రహిం చువాడే ;కొలనేక నివాసము గాగ దర్డురం
బరయగ నేర్చు నెట్లు వికచాబ్జమరంద రసైకసౌరభో
త్కరము మిళిం దమొందుక్రియ దాశరథీ కరుణా పయోనిథీ ;
[దాశర థీ శతకము-
కంచె ర్లగోపన్న కవిభావము;-పూలలోనిమకరందమును,తుమ్మెద గ్రహిమ్చి నట్లు ,నిత్యము కొలనులో నివసించు కప్పఎట్లు గ్రహించగలదు? అట్లే రసజ్ఞు డైన కవిగారి యొక్క,మనస్త త్వమును,,మరి యొక రసజ్ఞు డైన కవియే గ్రహిమ్చ గలడు.అని చెప్పెను.]

పిల్లల మనస్త త్వము తం డ్రి తోందరగా, కనిపెట్ట, గలిగినట్లు, నిత్యము, భర్తా,పిల్లల, సంరక్షణగురిం చే, ఆలోచించేతల్లి ,ఎట్లు గ్రహిం చగలదు.

చిట్టి;అమ్మా పాలు కావాలే;
అమ్మ ;రా—తల్లీ—రా –నువ్వోఖ్ఖ దానివేతక్కువయ్యావు. అలాగేకానీ;ఒసేయ్ రాణీ; దీనికి,కాసిని పాలుతీసుకురా;

రాణి ;పద్యం ; కందం
బాలురకు పాలులేవని
బాలెం తలు మొరలువెట్ట బకబకనగియీ
బాలుండాలము సేయుచు
నాలకు క్రేపులను విడిచే నంభోజాక్షీ
.[బమ్మెరపోతన ౧౫వ శతాబ్ది -భాగవతము-దశమ స్కంధము ]
[భావము;-అసలే పసిపిల్లలకు పాలులేవని బాలెంతరాళ్ళు ఆవుపాల కోసము గోలచేస్తుం టే ,క్రిష్ణయ్య,
ఆవు దూడలను వాటి తల్లులవద్ద విడిచి పిల్లలకుపాలు లేకుండా చేశాడని గోపకాం తలు యశోదమ్మతో
మొర పెట్టుకొం టున్నారట ]

రాగిణి;పాలున్ బువ్వాయు పెట్టెదన్ కుడుపరాపాపన్న రావన్నలే
లే లెమ్మన్న,అరటిపం డ్లుకొనితే లేకున్న నేనొల్లనం టే
లాలిం పరే తల్లిదండ్రులపుడ ట్లేతెచ్చివాత్సల్యలక్ష్మీ
లీలా వచనంబులన్ కుడుపరా; శ్రీ కాళ హస్తీశ్వరా;
[దూర్జతి ౧౬వశతా బ్ది -కాళ హస్తీశ్వరశతకం ].
[తల్లిదం డ్రు లు, తమపిల్లలకు, పాలు,బువ్వపెదతామురంమం టే, ఆపిల్లలు,అప్పటి కప్పుడే అరటిపం డ్లు
కొని తెమ్మన్నను,వారిపై వాత్సల్యముతో కొనితెచ్చి యిస్తారుకదా అట్లేకన్నతల్లిడం ద్రులవలే పార్వతీపరమేశ్వరులు తమభక్తులనుకూడ అ ట్లేచూచేదరని కవి చెప్తున్నారు. అనిభావము. ]

రాజు;అవునుకదా; అమ్మా; నాన్నగారూ;మమ్మల్నే పుడైనా, ఆపద్యం లోచేప్పినట్లు, అరటిపం డ్లు, తెచ్చిచ్చి లాలిం చారే?

లక్ష్మి;- లాలీలాలీలాలీలాలి
వట పత్రశాయికీ వరహాలలాలీ
రాజీవనేత్రునికీ రతనాలలాలీ
మురిపాలకృష్ణునికి ముత్యాలలాలీ
జగమేలుస్వామికి పగడాలలాలీ //వట /
/[కే.విశ్వనాధ గా రి,స్వాతిముత్యంసినిమా లో ది ]

నాన్న;-అలాగేనాన్నా; లాలించకుండానే ఇంతపెద్దవాడివయ్యావా? తాడిలా ఎదిగి 10th కోచ్చాడూ , ఇప్పుడడుగుతున్నాడు, చూడూ;

అమ్మ; దా; నాన్నాదా; అప్పుడేమోగానీ; ఇప్పుడు, లాలిం చడం కాదూ,వాయిస్తాను. ;మళ్ళీ మాట్లాడావం టే ;[అం టూ గరిట ఎత్తి పట్టుకుంటుమ్ది]

3 వ అం కం

వినయ్;నాన్నగారూ;ఈరోజూ పిక్నిక్ కి వెళ్దా మా ?
అమ్మ ;అవునర్రా ;ఇం తాకీ ఇందాకా,నామాటకి ,సమాధానం చెప్పారుకాదు .
వనజ ;-అవునమ్మా ;ఇవాళా ,ఏదోబం దుటా ;స్కూళ్ళే వీలేవుటా ;మాస్కూలుక్కూడా సెలవిచ్చారు.
అం దరూ ;హాలీడే---జాలీడే ---కోలాంబస్ –కోలాంబస్— ఇచ్చారూ --సెలవూ .
ఆనందం గా ,గడపదానికీ--కావాలోక --టీ . వీ—సెలవు,సెలవు, సెలవూకనుగోనుకోత్తటీ .వి, నీవూ.—

అమ్మ;అదీసంగతి ;అం దుకేనన్నమాట అం దరూ ,ఇంత,తా—పీ--గా,పద్యాలూ,పాటలూ తో ,ఇల్లుపేకి
పందిరేస్తూన్నారు.నేనిం కా ఎందుకు తేమలడంలేదు?,వీళ్ళం తా అనుకుంటున్నా.

నాన్న ;మరేమిట నుకున్నావు?నిన్నుకాస్త అల్లరి, పెట్టాలంటే,మాకం దరికీ, సమయం దొరకాలికదా ?
ఇప్పటి కి దొరికిం ది ;కానిస్తున్నాం ;---అవునర్రా ;పిక్నిక్ కీ ఎక్కడి కివెళ్దాం?మౌం టోపేరానా ?గం డి పేటా?
రామోజీ ఫిల్మ్ సిటీ నా ?
రాజు ;ఒద్దు.నాన్నగారూ. ;అవన్నీబోర్ ;జూపార్క్ కెళ్దాం .
రాము ,వనజ,చిట్టి ;-భలే,భలే,;అక్కడైతే జం తువులన్నింటినీ చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు.
లత;-అబ్బా;జూపార్కా ;బోర్ ;అవన్నీ,ఎప్పుడో చూసేశాం గా;ఇంట్లోనేఉం దామ్ ఇం చక్కా;
అమ్మ;ఎందుకూ, నన్ను ఈ పాటి కూ డా ప్రశాం తం గా బ్రతక నివ్వరా?
మోహన్ ;-అందుకేకదే అమ్మా ;చెల్లాయ్ ఇంట్లోనే ఉందామం టోమ్ది ;.మరెందుకనుకున్నావ్?
వినయ్ ;-అన్నయ్యా ;క్రికెట్ ఆడదాం రా ;

అం దరూ ;-సరే ;సరే ;[ఒక్కసారిగావుప్పేసుకుం టా రు.]
పల్లవి ;- ఆట—ఆట—నువ్ నిలబడి చూడకుఏచోటా ;
ఆట—ఆట –ఇదిగేలవకతప్పని బతుకాట .

అమ్మ;-హమ్మయ్య; నా ప్రాణం తీస్తే తీశారు గానీ ,కాస్త ప్రశాంతత దొరుకుతుం ది. కాస్సేపు రామా; కృష్ణా ; అనుకుం టూ యే రామాయణమో చదువుకోవచ్చు .
నారాయణనీనామము
సారార్ర్థము జిహ్వ కెపుడుచక్కనిరుచిగా
పారాయణ చేయిం చు మి
కారాదనియెం చ బోకు కారణ రామా ;


నాన్న;-ఏ మిటేవ్ పద్యాలు వం ట బట్టినట్టున్నాయే ;
అమ్మ;- యేం చేస్తాం ?సావా సదోషం; ఆర్నేల్లు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెతే ఉందికదా ; అలం తిది ఇన్నాల్టి నం చి , మీదగ్గరాపిల్లలదగ్గరావినీ వినీ నాక్కూడా వంట బట్టిం ది.
పద్యం;-ఆ .వె;-అనగననగ రాగమతిశయిల్లుచునుండు,
తినగతినగవేముతియ్యనుం డు.
సాధనమున పనులు సమకూరు,ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ ;[వేమనశతకం ]

[భావము;-పలకగా ,పలుకగా రాగము, తీయగా వినసొంపుగా ఉండును.తినగా,తినగా వేపాకుకూడా చేదు పోయితియ్యగామారును. [అనగా నేటి మదుమేహ రోగులవలె ఆచేదు కలవాటు పడి,దానినేతేపిగా ఆస్వాదిం- చగలము]చేయగా,చేయగా ,ఎటువంటి కష్ట మైనపనైనా సులభముగా చేసేయ గలము. ]

నాన్న;- మరయితే ఇంకెందుకాలస్యం.? అదే పాటలో పాడుకుంటే సరి.
పల్లవి ;- నారాయణ తే నమోనమో—ఓ—ఓ –ఓ
నారాయణ తేనమోనమో భవ
నారదసన్నుత నమోనమో –ఓ—ఓ—ఓ //నారా//


అమ్మ;- మరింకేం ?నన్నన్నారు? మీ రూ అదే దోవయ్యారుగా;
నాన్న;-యేం చేస్తాం ?నీవు చెప్పిం దే .నీవు చెప్పినవిద్యయే నీరజాక్ష
అన్నారుగా పెద్దలు. పద .పిల్లల్తోకలిసి, మనమూ ఎంజాయ్ చేద్దాం .
 

 
 

 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech