Sujanaranjani
           
  కవితా స్రవంతి  
  తెలుగు ఉగాది
 

రచన:  రమాకాంతరావు చాకలకొండ  

 
 

పల్లవి. చిరు లత పల్లవ సోయగ చందముతో,
తరలి వచ్చెను మరల తెలుగు ఉగాది. ||చిరు||

అనుపల్లవి. మరు మాస నవ వధువై, మధుర గంధముతో,
మరల వచ్చెను మనకై విజయ ఉగాది. ||చిరు||

1. చైత్ర శుద్ధ శుభ పాడ్యమి ఘడియలో,
అతి దివ్య ఆనంద జ్యోతులు వెలిగించ,
ప్రతి ఎదన సంతోష, సౌఖ్యములు పండించ,
కదలి వచ్చెను తెలుగు విజయ ఉగాది. ||చిరు||

2. యిమ్ముగ వనములలో తరు, శాఖ, లతలపై,
కమ్మని రంగులతో కొమ్మ కొమ్మన విరిసి,
సొమ్ముగ సిగ్గుల పల్లవ పైటతో,
కోమలి లక్ష్మిలా వచ్చె ఉగాది. ||చిరు||

3. హిమ శైలము పైన ముక్కంటి సతి జడలో,
ఘుమ ఘుమ చల్లను, మరుమల్లె కుసుమమై,
కమల కంఠము లోన కుసుమ మాలికయై,
అమల రూపము నొచ్చె విజయ ఉగాది. . ||చిరు||

4. విజయ ధుంధుభులతో విశ్వ జను లెల్లరు,
నిజ వైభవానంద డోలికల ఊగగ,
అజులు అమర వీధి నాశీర్వదింపగ,,
విజయ పతాకముతో వచ్చె ఉగాది. ||చిరు||
5. పుల్ల మామిడి చెరకు, బెల్లము తోటి,
తెల్ల వేప పూత, చింత, నిమ్మ వేసి,
కలిపి లవణముతో, కమ్మగ అందించ,
కలికి క్రొత్త వధువై వచ్చె ఉగాది. ||చిరు||

6. కవి, గాయక, నృత్య, శిల్పి, వైతాళికులు,
భావములు పొంగగ, భాష రంగరించి,
నవ కవిత గానముకు, నటనలు కలుప,
హావ భావములతో వచ్చి ఉగాది.. ||చిరు||

7. సాటి లేని మేటి దైవ శిఖామణి ,
ఏడు కొండల స్వామి వేంకటేశ్వరుడు,
పాటవము చూపి ప్రార్ధనలు వినుచూ,
దీటుగ దీవించ వచ్చె ఉగాది. ||చిరు||

అజులు = బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 





సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech