తెలుగు తేజోమూర్తులు

- రచన : ఈరంకి వెంకట కామేశ్వర్.

 

అంతర్జాతీయ రేడియాలజిస్ట్ - పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు 


ఐదు దశాబ్దాల పాటు వైద్య, విద్యా క్షేత్రాలలో తనదంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకుని, నిరంతర సాధనతో క్షేత్రాభివృద్ధికి తోడ్పడుతూ వస్తున్నారు - ప్రపంచ విఖ్యాత రేడియాలజిస్ట్ - పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు. అంతర్జాతీయ రేడియాలజిస్ట్ గా అనేక వైద్య సమావేశాలను, వర్క్ షాపులు, సెమినార్లు నిర్వహించారు; తన సుధీర్ఘ పయనంలో అనేక మన్ననలను అందుకున్నారు. సేవ, జీవిత మిషగా ఏర్పడింది. " జన్మ ఒకసారే. అందుకనే సాధ్యమైనంత మంచి, సాధ్యమైనంత మందికి చేయడమే " అని భావించారు.
డాక్టర్ కాకర్ల సుబ్బారావు ఎం బి బి ఎస్, ఎం ఎస్, ఎఫ్ ఆర్ సి ఆర్, ఎఫ్ ఏ సి ఆర్, ఎఫ్ ఐ సి పీ, ఎఫ్ ఎస్ ఏ ఎస్ ఎం ఏ, ఎఫ్ సి సి పీ, ఎఫ్ ఐ సి ఆర్, ఎఫ్ సి జి పీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కృష్ణా జిల్లాలో, జనవరి 25, 1925 లో ఓ రైతు కుటుంబంలో జన్మించారు శ్రీ కాకర్ల సుబ్బారావు గారు. ఎస్ ఆర్ హై స్కూల్ లో ప్రాధమిక విద్యాభ్యాసం చేశారు. తరువాత మచలిపట్నం లోని హిందూ కాలేజిలో చవివారు. అటుపిమ్మట విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజిలో ఎం బి బి ఎస్ పట్టభద్రులైయ్యారు. 1950లో వీరి వివాహం ఝాన్సి లక్ష్మి భాయి గారితో జరిగింది. కే జి ఆసుపత్రిలో ఇంటెర్న్ షిప్ ముగిసిన తరువాత పై చదువులకు, అమెరికా మెడికల్ బోర్డ్ పరీక్షలో ఉత్తీర్నులై, ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వచ్చారు.
ఉస్మానియా మెడికల్ కాలేజిలో ఆచార్యుడిగా, ముఖ్య రేడియాలజిస్టుగా కొంత కాలం పనిచేశారు. 1973లో " ఫెల్లో ఆఫ్ రాయల్ కాలెజ్ ఆఫ్ రేడియాలజిస్ట్ " మన్నన అందుకున్నారు. కొన్నేళ్ళ పాటు అమెరికా లోని పలు వైద్య విద్యా సంస్థలలో పనిచేసి, అమూల్యమైన సేవలను అందించి ఎంతో పేరు గడించారు. " స్కెలిటల్ రేడియాలజీ " అంశం మీద వీరి పట్టు ఎక్కువ. ఈ అంశం మీద అనేక పత్రాలను ప్రకటించారు. అమెరికాలో ప్రప్రధమ గణేష దేవాలయ నిర్మాణంలో, తెలుగు వారిని కలుపుతూ తానా వ్యవస్థాపనలో కీలక పాత్ర పోషించారు డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు.
1986, నాటి ముఖ్య మంత్రి శ్రీ ఎన్ టి రామారావు గారి పిలుపు మేరకు, స్వదేశం తిరిగి వచ్చి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాదు సంస్థ సంచాలకుడిగా చేరి, ఈ సంస్థ అత్యున్నత వైద్య సదుపాయాలు అందించే మేటి వైద్య విద్యా సంస్థగా రూపుదిద్దారు డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మెడిక ఎక్స్పర్ట్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త వైద్య, దంత కళాశాలల రూపకల్పన పై అధ్యయనం చేశారు. ఏ పి ప్లానింగ్ బోర్డ్ సభ్యుడిగా పనిచేశారు. ఇండియన్ రేడియాలజీ అండ్ ఎమేజింగ్ అస్సోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. శ్రీ వేంకటేశ్వరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి - అధ్యక్షుడిగా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖల సలహాదారుగా పనిచేశారు. ఉస్మానియా, నిమ్స్, శ్రీ వెంకటేశ్వరా వైద్య సంస్థలలో ఎమెరిటుస్ ఆచార్యుడిగా పనిచేశారు. అమెరికా తరపున చైనా, తైవాన్ వెళ్ళిన అధ్యయన వైద్య బృందానికి నేతృత్వం వహించారు.
పుస్తక రచనలు:
డాక్ట సుబ్బారావు గారు అనేక ప్రచురణలు ప్రకటించారు. వీటిలో కొన్ని ముఖ్యమైనవి:
- డయాగ్నోస్టిక్ రేడియాలజీ (సంపాదకులు)
- మాన్యువల్ ఆఫ్ రుగ్మటాలజీ పుస్తక భాగం " ఇమేగింగ్ మోడాలిటీస్ ఆఫ్ అర్తరైటిస్ " రచించారు
- డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ ఆసియా పాసిఫిక్, లో " స్పీడ్ ప్రూవ్స్ క్రిటికల్ ఇన్ స్పైనల్ ట్రౌమా కేసెస్ "
తన క్షేత్ర రంగంలో రెండు వందలకు పైగా పత్రాలను ప్రకటించారు. దాదాపు నాలుగు వందల ఉపన్యాసాలు చేశారు.
అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో విభిన్న పదవులలో, సభ్యుడిగా ఉన్నారు:
- అమెరికా అసోసియేషన్ ఆఫ్ రేడియాలజిస్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు
- ఫెల్లో, రాయల్ కాలేజ్ ఆఫ్ రేడియాలజిస్ట్స్, యు కే
- ఫెల్లో, అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజి
- ఫెల్లో, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఇంటర్నేష్నల్ ఫిజీషియన్స్
- ఫెల్లో, ఇండియన్ కాలేజ్ ఆఫ్ చెస్ట్ ఫిజీషియన్స్
- ఫెల్లో, సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కెలిటల్ సొసైటీ, సంపాదకుడిగా ఉన్నారు (1975-1988)
అవార్డులు - గౌరవాలు:
- భారత ప్రభుత్వం పద్మశ్రీ గౌరవం ఇచ్చింది
- నేషనల్ యూనిటి అవార్డు (1991)
- వైద్య రంగానికి విశిష్ట సేవలు అందించినందుకుగాను రాజీవ్ రత్న అవార్డు (1992) ప్రదానం చేశారు.
- ఆసుపత్రి నిర్వహణ, వైద్య విలువలను పటిష్టం చేసినందుకు, ఐ ఎఫ్ ఎస్ ఐ నుండి "గ్లోరీ ఆఫ్ ఇండియా" అవార్డు అందుకున్నారు
- ఛాతి వైద్యుల సంఘం "సన్ ఆఫ్ ఇండియా " అవార్డు ఇచ్చి గౌరవించింది.
- డాక్టర్ పి శివారెడ్డి స్మారక పురస్కారం - " ఎమినెంట్ మెడికల్ మాన్ - స్టేట్స్ మన్ " అవార్డు అందుకున్నారు (1999)
- "రేడియాలజిస్ట్ ఆఫ్ ది మిలీనియం " పురస్కారం
సేవా దృక్పథంతో ఐదు దశాబ్దాల పాటు వైద్య, విద్యా క్షేత్రాలలో కృషి చేశారు. విదేశాలలో బాగా గడించే అవకాశాలున్నా స్వదేశం మీద మమకారంతో దేశానికి తిరిగి వచ్చి నిమ్స్ సంస్థని అంతర్జాతీయ ప్రమాణాలు గల వైద్య సంస్థగా రూపుదిద్దారు. కామన్ వెల్త్ స్కాలర్ గా రాణించారు. వైద్య రంగానికి గణనీయమైన సేవలు అందించారు, ఇంకా అందిస్తున్నారు. వీరి శిష్య, ప్రశిష్య బృందం నేడు ప్రముఖ వైద్యులుగా రూపు దిద్దుకుంటున్నారు. దేశ, రాష్ట్ర వైద్య విద్యా క్షేత్రాలు ఇంకా భివృద్ధి అవుతాయని ఆశిద్దాం.
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech