సారస్వతం  
       పుస్తక పరిచయం - పరిచయకర్త: శైలజామిత్ర  

 

'పరమ పావన గంగఅక్కిరాజు గారి "అగస్త్య లింగ ద్విశతి 

         

అక్కిరాజు సుందర రామ మూర్తి అంటేనే పద్యం గుర్తొస్తుంది. అర్థమయినా, లేకున్నా, ఉచ్చారణతో ఏదో మైమరుపు. తెలియని ఆనందం కలుగుతుంది. పద్యం రాకున్నా నాకు వీరి అగస్త్యలింగ ద్విశతి, సిలికానాంధ్ర రెండు పుస్తకాలు పంపారు.  అందుకున్న వాటిని నాకు అర్థమయినంతలో విశ్లేషించే ప్రయత్నం మాత్రమే..

సౌందర్యం వారిలోనిది కాదు..వారి పద్యాల వెలుగు వారి ముఖంలో ప్రతిఫలిస్తుంది.. విద్యా మనోవికాశానికి దారి తీస్తుంది. మంచి మనసు ముఖ సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తుంది..అనే మాటలు అక్కిరాజు గారికి చక్కగా అతికినట్లు ఉంటాయనేది అతిశయోక్తి కాదు..

శతకాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటాయి. ఆంధ్రవాగ్మయమున వివిధ రూపాలలో వికాసము నొందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. తెలుగు పన్నెండో శతకం ఆవిర్భవించింది. ఎనిమిది వందల సంవత్సరాలలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లి అటు స్వరుపంలోను, ఇటు స్వభావంలోను ఎంతో మార్పు నొందింది. భారతీయ భాషల్లో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగు లో వలె బహుముఖ వికాసాన్ని పొందింది కాని వైశిష్ట్యము పొందలేదు. శతకాన్ని ఒక ప్రక్రియగా పేర్కొన్న సంస్కృతాలంకారికుల్లో 13 శతాబ్ది అమృతానంద యోగి ప్రధముడు.సంస్కృతంలో త్రి శతులు, పంచ శతులు, కూడా శతకాలుగా పరిగణింపబడుతున్నాయి . కాకుంటే వేమన సంఖ్య నియమాన్ని పాటించలేదు. కాని తెలుగులో శతక కర్తలందరూ నూరు, నూట ఎనిమిది, నూట పదహారు అనే సంఖ్యా నియమాన్ని పాటించారనే చెప్పాలి.

శతక వర్గీకరణలో భక్తి శతకాలది మొదటి స్థానం.తర్వాత నీతి శతకం, అధిక్షేప శతకం, హాస్య శతక, శృంగార శతకం, అనువాద శతకాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి.  వీరి భక్తీ శతకం లో ఏముంది ఆంటే భక్తి ఉంది అని పుస్తకం చూసినవారు చెబుతారు. ఎంతో ఉందని చదివినవారు చెబుతారు. ఉదాహరణకు "శ్రీ గణాదిపునిం గన్న యోగి వర్య!

                    వీర యోధుండు 'కొమరయ్య' ప్రేమ జనక!

                    నిర్గుణా! దేవ! శూల పాణీ! నమోస్తు 

                    గగనగంగోత్తమాంగ! అగస్త్య లింగ! అంటూ 

అద్భుతమయిన ఎత్తుగడతో, అర్థవంతమయిన మకుటంలో  ప్రారంభించిన పద్యం శతకానికే వన్నె తెచ్చింది. భక్తి శతకాఉ మోక్షానికి విశిష్ట సాధనమని ఒక నమ్మకం. భగవంతుని కీర్తన, గుణ రుపాదుల వర్ణన, లీలా వర్ణన, వైరాగ్యం, ఆర్తి, పశ్చాత్తాపం, మొదలయిన అంశాలు భక్తి శతకాలలో ప్రధానం.  వీరి శతకంలో మకుటాలు రెండున్నాయి. ఒకటి గగనగంగోత్తమాంగ!  రెండు అగస్త్యలింగ! అన్నట్లు ఉన్నా, తొలి శతక స్తోత్ర కర్తలు పాటించిన తీరు తేటతెల్లమవుతుంది.. దీన్ని సమాస మకుటం అని కూడా అనచ్చు.శతకమంటే ఏదో ఉకడంపుడు రీతి అనుకుంటారు. కాని కొన్ని సుందర రామకృష్ణ గారు రచించినది చూస్తుంటే అధిక్షేప శతకం గా పరిణితి ఉంది. సమకాలీన సమస్యలను ఆధారంగా చేసుకుని ప్రజల్లో పేరుకుపోయిన మానవీయ చర్యలను వ్యంగ ధోరణిలో అధిక్షేపించుచు అందరికి అర్థమగు రీతిలో లిఖించబడినది శతకం.

"చాలా మంది మగాళ్ళు విశ్వంబు నందు

 నిన్ను పోలిన వారేరా! నీలకంట! (ఎంత ప్రయత్నించిన ఇక్కడ వత్తు రావడం లేదు)

అరయ మగవారి జీవితాలంతే లేరా!

గగన గంగోత్తమాంగ! అగస్త్య లింగ!

ఇందులో లోకరీతి, ఎంతో వ్యంగ్యంగా తొంగి చూస్తోందో గమనించవచ్చు. కవి అయినా తన సాధనలో సాధించి గెలవాల్సింది ఇక్కడే! విజయం ఖచ్చితంగా అక్కిరాజు గారిదే. భక్తిలో నమస్కరించినా, సంస్కరించినా, తూలనాడినా అది భక్తే! అందులో సందేహం లేదు ఉదాహరణకు ఇక్కడ గమనించండి 

" తలప ముండ మోపుల కడ కొలువు కంటే 

  కాటి కాపరి కొలువు నీ కడనే మేలు!

  పసిడికన్న నీ విడెడు అంబలియే మేలు

ఇందులో ఎంత వాస్తవం ఉంది. భక్తికి తగ్గట్లు తత్వం ఉంది. ఎంతో హృద్యంగా ఉంది.

మరోచోట  అడగనిదే అమ్మయినా పెట్టదు అనే మాటను ఎంత చక్కని పద్యంలో ఇమిడ్చేరో చూడండి 

"బిక్షతో జీవనం చేయు పిచ్చివాడ:

 అమ్మయే కాదు నడుగకుండా

మచ్చునకు, రాల్చ అత్త మామలను గూడ;" 

శతకంలోని పద్యాలన్నీ  ఒక విధంగా ముక్తకాల్లాంటివి. శతకంలోని పద్యాలు   పద్యానికి పద్యమే తప్ప ఒక పద్యానికి మరో పద్యానికి అన్వయం లేదు. పద్యాలు వేటికవి స్వాతంత్రాలు. కధ ఉండదు. కాబట్టి ఏక సూత్రానికి అవకాశం లేదు. వస్వైక్యము ఉండదు.

శతకాలు భావ ప్రధానములు. వీటి సంఖ్య బహుళ మగుటచే శతకములను భావ గీతములుగా పరిగణిస్తున్నారు. భక్తీ శతకములందే కాకుండా కొన్ని నీటి శతకములు, కూడా ఇందులో పొందుపరచ బడి ఉన్నవి  కనుక సుకవి వీరి ఆత్మానుభుతిని వ్యక్తీకరించియున్నారు. ఎందుకంటే శతక సాహిత్యమందు ఆత్మ పరమయిన కవిత్వం తరచు కన్పించుచుండును. ఉదాహరణకు 

"లీల, వెలిగిన నాటి దేవాలయాలు 

తద్దయుం ఖ్యాతి గనిన గ్రంధాలయాలు 

మరువగా లేము నిజమురా, మంగ ళా౦గ!"

ఇలా  శతకంలోని పద్యాలు పదబంధాలతో కట్టివేసినట్లు కాక చదివినా, వినినా హాయిగా మనసారా నవ్వుకోవచ్చును. "అక్కిరాజు సుందర రామకృష్ణగారి పద్య శీలి అందరికి సుపరిచితమే విజ్ఞులు, మేధావులు అయిన వీరిని అభినందించడానికి, కూడా నాకున్న విద్వత్తు చాలదేమో..! అభివాదములు ! 

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech