శీర్షికలు  
     మాస ఫలాలు
 

- రచన :  బుద్ధవరపు శ్రీ 

 

మార్చి 2012

 

బుద్ధవరపు శ్రీ గారు, జ్యోతిష్కుల కుటుంబంలో పుట్టి, ఇలవేల్పు శ్రీవీరభద్రుల వారి అశీర్వాదంతో, బాబాయి శ్రీక్రిష్ణశర్మ సిద్దాంతి గారి దగ్గర జ్యోతిష్యం లో ఓనమాలు నేర్చుకొని, తండ్రి గారు లక్ష్మి నరసింహం గారి దగ్గర మెళకువలు నేర్చుకుంటూ గత 16 సంవత్సరముల నుండి జ్యోతిష్య, హస్తసాముద్రిక శాస్త్రములను అభ్యసిస్తున్నారు

 

http://www.jagjituppal.com/images/2aries.gif

            మేషరాశి

అశ్విని (అన్ని  పాదాలు), భరణి (అన్ని  పాదాలు), కృత్తిక (మొదటి పాదం) 

 

నెల ప్రథమార్ధంలో ఉద్యొగంలో జయం, నూతన ద్యోగం ప్రారంభించుటకు మంచి సమయం. తలచిన అన్ని పనులు జయప్రదంగా జరుగుతాయి. మీరు అనుకున్న పనులన్నీ నెలలో చేయటం జయం. పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి. ఆప్తులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలి. మీ చుట్టూ వున్నవాళ్ళ వల్ల మీకు కొంచెం ఆపద/అందోళనగా వున్నట్లు అనిపించినా, చివరకు అంతా బాగానే ఉంటుంది. ద్వితీయార్ధం లో ఉద్యోగ వ్యాపార విషయాలలో జాగ్రత్త అవసరం. 

 

   
 

http://www.jagjituppal.com/images/2taurus.gif

వృషభరాశి

కృత్తిక (2,3,4 పాదములు), రోహిణి (అన్ని పాదాలు), మృగశిర (1,2 పాదాలు

 

నెల ఉద్యోగం వలన ధన లాభం. కొత్త ద్యో అవకాశాలు వస్తాయి. ఆస్థి వ్యవహారాలు అన్నీ సర్దుకుంటాయి. ద్యో విషయంలో కొంచెం అప్రమత్తత అవసరం. మీ స్థానం కోసం చాలా మంది పొటీ పడుతుంటారు. వ్యాపారం విస్తరించడానికి అనువైన సమయం. పిల్లలమీద మీరు ఎంత శ్రద్ధ పెదితే అంత అభివృద్ధి లోకి వస్తారు. ధన సంపాదన విషయంలో అందోళన ఉన్నా చివరకు లాభం లోనే ఉంటారు.

 

 
   
 

http://www.jagjituppal.com/images/2gemini.gif

మిథునరాశి

మృగశిర (3,4 పాదాలు), ఆరుద్ర (అన్ని పాదాలు), పునర్వసు (1,2,3 పాదాలు

 

ఈ నెల పూర్వర్ధంలో మనస్సుకు చికాకు, ఆత్మీయుల ఎడబాటు మనస్పర్ధలు కలుగును. నెల ఉత్తరర్ధంలో అంతటా జయం. ఆకస్మికంగా వచ్చిన లాభాలతో బంగారు ఆభరణముల కొనుగోలు ఇతర మంచి విషయములు జరుగును. మీ కృషి ఫలించి ఉద్యోగ వ్యాపార విషయాలలో విజయంతో ఇంకా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు.

 

   
 

http://www.jagjituppal.com/images/2canc.gif

కర్కాటక రాశి

పునర్వసు (4వ పాదం, పుష్యమి (అన్ని పాదాలు),ఆశ్లేష (అన్ని పాదాలు) 

 

ఈ నెల ఉద్యోగస్థులు కొంచెం జాగ్రత్తగా వుండాలి. పని ఎక్కువ అవ్వటం వలన అధిక శ్రమ వత్తిడి దాని వలన యజమానితో కలహం సంభవం. అన్ని పనులు చాలా జగ్రత్తగా చెయ్యాలి. దూకుడు కి ఇది సంయమనం కాదు, సంయమనం పాటించండి. కళత్రమునకు (spouse) ఆరోగ్య లోపం సంభవం.

 

   
 

http://www.jagjituppal.com/images/2eo.gif

సింహరాశి

మఖ(అన్ని పాదాలు), పూర్వ ఫాల్గుణి(అన్ని పాదాలు), ఉత్తర ఫాల్గుణి (1వ పాదం)

 

ఈ నెల మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో తిప్పట అధిక శ్రమతో కూడిన ప్రయాణాలు సంభవం. రక్త సంభంధ రుగ్మతలు ఉన్నవాళ్ళూ అశ్రద్ధ చేయకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. ఉద్యోగ పూర్వకంగా ధన లాభం మరియు ఉద్యోగ విషయంలో అన్నింటా జయం.

 

   
 

http://www.jagjituppal.com/images/2virgo.gif

కన్యా రాశి

ఉత్తర ఫాల్గుణి (2,3,4 పాదాలు), హస్త (అన్ని పాదాలు), చిత్ర (1,2 పాదాలు)

 

ఈ నెల పూర్వర్ధంలో అంతకు ముందు ఉన్న అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది, విచారములు తొలగి అనందం కలుగుతుంది. అధిక ఖర్చు శ్రమ సంభవం, అధిక శ్రమతో కూడుకున్న ప్రయాణాలు కలుగుతాయి. ప్రయాణంలో ఆహారం విషయం లో శ్రద్ధ వహించండి. కుటుంబంలో అభిప్రాయ భేధాలు వచ్చే అవకాశం ఎక్కువ జాగ్రత్త వహించండి.

 

   
 

http://www.jagjituppal.com/images/2libra.gif

తులారాశి

చిత్ర (3,4 పాదాలు), స్వాతి (అన్ని పాదాలు), విశాఖ (1,2,3 పాదాలు) 

 

ఈ నెల ప్రారంభంలో కలిగిన చికాకులు ఆరోగ్య సమస్యలు అన్నీ నెల మధ్యకి వచ్చేటప్పటికి సర్దుకుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మీ అదృష్టం చేత ప్రతికూల సందర్భంలో కూడా వ్యాపరంలో విజయం కలుగుతుంది. భార్య ఆనారోగ్యం కొంచెం అందోళన కలిగిస్తుంది.

 

   
 

http://www.jagjituppal.com/images/2scorp.gif

వృశ్చికరాశి

విశాఖ (4వ పాదం), అనూరాధ (అన్ని పాదాలు), జ్యేష్ట (అన్ని పాదాలు)

 

ఈ నెలలో ఎక్కువ శ్రమిస్తే కాని పనులు సకాలంలో పూర్తి చెయలేరు. అకస్మిక అవరోధాలతో పనులు మందకొడిగా జరుగుతాయి. భార్యా పిల్లలతో సంయమనం పాతించండి. మనస్సుని అదుపులో పెట్టుకుని దైవ చింతన చేయండి. ఆప్తులు అక్కరకు వస్తారు.

 

   
 

http://www.jagjituppal.com/images/2saggi.gif

ధనూరాశి

మూల (అన్ని పాదాలు), పూర్వాషాడ (అన్ని పాదాలు), ఉత్తరాషాడ (1వ పాదం)

 

ఈ నెల చాలా లాభదాయకంగా వుంటుంది. ఉద్యోగ రీత్యా ధనలాభం ఉన్నత పదవి ప్రాప్తి సంభవం. ఫిల్లల విషయంలో అనందకరమైన వార్తలు వింటారు. ఫిల్లల ఉన్నత విద్యభ్యాసానికి అభివృద్దికి అనువైన సమయం. ఫూర్వార్ధం లో ఆరోగ్య లోపం, శరీరానికి విశ్రాంతి అవసరం.

 

   
 

http://www.jagjituppal.com/images/2capricon.gif

మకరరాశి

ఉత్తరాషాడ (2,3,4 పాదాలు), శ్రావణ (అన్ని పాదాలు), ధనిష్ట (1,2 పాదాలు)

 

ఈ నెల పూర్వార్ధం లో చాలా అప్రమత్తంగా వుండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా మోసం వలన ధన నష్టం జరిగే అవకాశం కలదు. జంతువుల కారణంగా అనారోగ్యం/ఆపద సంభవం. నెల ఉత్తరార్ధం లో ఉద్యొగంలో జయం అకస్మిక ధన లాభం కలుగును.

 

   
 

http://www.jagjituppal.com/images/2aqua.gif

కుంభరాశి

ధనిష్ట (3,4 పాదాలు), శతభిష (అన్ని పాదాలు) , పూర్వాభాద్ర (1,2,3 పాదాలు)

 

ఈ నెలలో మనసిక శారీరక శ్రమ ఎక్కువ. ఉద్యోగస్తుల కన్నా వ్యాపరస్తులకు కొంత అనువైన సమయం. ఉద్యొగంలో అధిక శ్రమ, అలసట. ప్రయాణలు సాఫీగా జరగవు. భార్యతో అభిప్రాయ భేధాలకు అస్కారం ఎక్కువ, జాగ్రత్త వహించండి.

 

 

   
 

http://www.jagjituppal.com/images/2psices.gif

మీనరాశి

పూర్వాభాద్ర (4వ పాదం), ఉత్తరాభాద్ర (అన్ని పాదాలు), రేవతి (అన్ని పాదాలు)

 

ఈ నెల ధన సంపాదనకి మిక్కిలి అనువైన సమయం. వ్యాపార లావాదేవేలు భూమి సంబంధ స్తిరాస్థి క్రయ విక్రయాలకు అనువైన సమయం. ఈ నెలలో పెరిగిన సంపాదనకు తగ్గట్టు గానే ఖర్చు కూడ అధికం. సాంఘికంగా పలుకుబడి పెంచుకోవటానికి, ఆడంబరాలకు ఖర్చు చెస్తారు.

 

   
   

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech