కవితా స్రవంతి  

       ప్రపంచ మాతృభాషా దినము

- రచన : వేదుల బాలకృష్ణమూర్తి

 
 

21.2.2012 తేదీన జరిగిన ప్రపంచ మాతృభాషాదినము సందర్భంగా...

సీ || అలనన్నయ కవీంద్రుడాంధ్ర భారతమును

రాణ్మహేంద్రపురిని వ్రాయునాడు

నరహరికేగాని నరులకీయను కావ్య

మంచు పోతన నిర్ణయించినాడు

శ్రీనాథు కవితకు దీనారటంకాల

స్వర్ణాభిషేకంబు జరుగునాడు

అల్లసాని కృతికి ఆంధ్రభోజుడు కృష్ణ

రాయలు పల్లకిన్ మోయునాడు

 

|| వె|| చెక్కుచెదరలేదు మొక్కవోలేదాంధ్ర

భాష ప్రాభవంబు, ప్రక్కదారి

పట్టి క్షీణదశకు వచ్చుచున్నది నేడు

దిద్దుకొనుము సుతుల తెలుగుతల్లి||

 

|| పద్యము తెలుగు వారలకు భాగ్యఫలంబగ లభ్యమౌటచే

గద్యము కన్న ఎక్కుడగు గౌరవమిచ్చుచు పండితోత్తముల్

సేద్యము సేయరే హృదయసీమలయందున, హృద్యపద్య నై

వేద్యములిత్తు గైకొనుడు వేడుక మీరనవాబ్ది వేళలన్

 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech