కవితా స్రవంతి  

      నందన

- రచన : జగన్నాథ రావు కె.ఎల్.,

 
 
 

వసంత కాల  సంతకాల  నందుకొనిన  'నందన',
నలుపెక్కి  వెక్కి వెక్కి  ఏడ్చిన  'ఖర'   ఆక్రందన పై
మనందరి  స్పందన  పొందిన  'నందన' ,
ఆనంద మైనందున  కుందన  చందన  'నందన',
నందీశుని  సేవకు   చెందిన
మన  దైనందిన  కార్య కలాపములకు
గురక లెయ్యడం  మాని  ఉరక లెయ్యండిక ,
విధి  నాటకంలో తన వంతు పాత్ర పోషించడానికి  వచ్చింది నందన

దూసుకు  పోతున్న వాహనం వెనుక  లైట్లు  కనుమరుగై
వేరొక  వాహనం ముందు లైట్లు  మెరిసి  పోతున్నట్లు ,
 
జెమినీ టీ  తాగుతూ జెమినీ టీవీ  చూస్తూ
కోడి  కూయడానికి  ముందే  CPU ఫాను  రొద మొదలెట్టి
పక్షుల  కిలకిలారావాలకి  ముందే  చేతి వేళ్ళు  కీ బోర్డు  మీద  నాట్యం చేస్తుంటే ,
ఉగాది  ఉదయం తో లేచి
ఇంటి కప్పు ఖాళీ లోంచి  ప్రవేశించిన  సూర్య రశ్మిలా ,
రోజూ నడిచే ఉదయపు  నడకే , ఇవాళ కొత్త  తలపాగా బిగించి ,

వందనమిదె  అందుకొనుము  ఆనంద నంద 'నందన'
ఆశల ఆషాడాదిగ ఆశయాల యేడాదిగ

 

   

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech