కవితా స్రవంతి  

      నందననామ సంవత్యర ఉగాది శుభాకాంక్షలతో


 - రచన: రమాకాంతరావు చాకలకొండ.

 
 

 

 

పల్లవి.      నందన వత్యర చైత్ర పాడ్యమి మనకు,

నంద చందనము అందించు గాక.                     ||నందన|| 

అనుపల్లవి.   నంద నందనుడు,  యశోద బాలుడు,

డెందములు అందరివి చల్ల చేయు గాక!            ||నందన|| 

 

1.       కులుకు లొలుకు చిగురు కొమ్మలతో వనములు,

ఫల, పుష్ప, పరిమళ గంధముల నిచ్చుచూ,

కలన్నది లేక అన్నపూర్ణగ మనకు,

చల్లని నీడను అందించు గాక!                  ||నందన|| 

2.       వేపూత, మామిడి, చెఱకు, తేనెల వలె,

తీపి, చేదులు ఉండు బ్రతుకుల బాటలో,

ఓపిక, ఉత్యాహ, ధీరతతో  శ్రీ జనులు,

కాపురము దిద్దుకొని  కమ్మ గుందురు గాక!         ||నందన|| 

3.      షడ్రుచుల పచ్చడి సంతృప్తి సేవించి,

రిష్డవర్గముల జ్వాల మదినణిచి,

'డ్రుచో పేత సుగుణ సాంద్రతతో,

వేడుకగ అందరు వసియింతురు గాక!              ||నందన|| 

4.       ప్రతి యింట, ప్రతి క్షణము, రేతిరి, పగలు,

ఈతి బాధలు లేక, సుఖ, శాంతులు నిండి,

భూతల స్వర్గముగ భారద దేశము,

మేదిన మహా దివ్య ప్రభలొందు గాక!             ||నందన||  

5.       కవులు, గాయకులు, పంచాగ కర్తలు,

భువిలోని జనులకు  శుభములు పల్కుచూ,

దేవుడిచ్చిన తమ దివ్య ప్రతిభలతో,

రవి తేజ మలరగ రాణింతురు గాక!     ||నందన|| 

6.      చీకటి,  వెలుగుల చిన్ని యీ జీవితము,

శోక సాగరమనే భావన వదలి,

ప్రగతి పథమును జూపు చక్క నవకాశమను,

ఆకళింతతో  జనులు సాగుదురు గాక!             ||నందన|| 

7.       ఆలు, మొగలు,  అతి ఆప్యాయత నిండ,

పిల్లలు, పౌత్రులతో, పరమ  సంతోషముగ,

ఎల్ల లోకము లేలు వేంకని మరువక,

చల్లగ సుఖముగ జీవింతురు గాక!               ||నందన|| 

8.       బృందావన చారి యదుకుల చంద్రుడు,

కందర్ప దర్పుడు కమనీయ హృదయుడు,

సుందరి రాధతో ప్రతి యింట వెలసి,

అందరిని చల్లగ కాపాడు గావుత!                ||నందన||

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech