తొలిపలుకు  

తొలిపలుకు

రచన : రావు తల్లాప్రగడ

 
   సంపాదకవర్గం:
ప్రధాన సంపాదకులు:
రావు తల్లాప్రగడ 

సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
సి. కృష్ణ

వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ, హైదరాబాద్.
 

 

 

ముందుగా అందరికీ శ్రీనందన నామ ఉగాది  శుభాకాంక్షలు.

అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని సిలికానాంధ్ర ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ జూబ్లీ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, సమాచార సాంకేతిక శాఖామంత్రి శ్రీ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రివర్యులు శ్రీ మండలి బుద్ద ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. సిలికానాంధ్ర చైర్మెన్ శ్రీ కూచిభొట్ల ఆనంద్ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు యూనికోడ్ ఫాంట్లను ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా సిలికానాంధ్ర విడుదల చేసింది. అంతర్జాలంలో తెలుగు వాడకాన్ని విరివిగా ప్రోత్సహించే క్రమంలో భాగంగా సిలికానాంధ్ర ఈ ఘనతను సాధించింది. పొన్నాల, రవిప్రకాష్, లక్కిరెడ్డి ఫాంట్లను అంతర్జాలానికి అందించిన సిలికానాంధ్రను వక్తలు అభినందించారు. అన్ని తెలుగు మరియు ఆంగ్ల పత్రికలు సిలికానాంధ్ర కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. తెలుగు భాషాభివృద్దికి నిర్విరామంగా పనిచేస్తున్న సిలికానాంధ్రకు జాతీయంగా, అంతర్జాతీయంగా విశేష ప్రశంసలు అందుతున్నాయి.

గతంలో సిలికానాంధ్ర చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. ఇటీవలి ప్రపంచ తెలుగు అంతర్జాల సదస్సులో ప్రకటించినట్టుగా మూడు సరికొత్త ఫాంటులను సృష్ఠించిన సిలికానాంధ్ర వాటిని http://fonts.siliconandhra.org  వెబ్‌సైట్ ద్వారా అందరికీ ఉచితంగా అందిస్తోంది. వీటిని ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. అందరికన్నా ముందుగా సిలికానాంధ్ర సుజనరంజని ఈ ఫాంట్లను అంతర్జాలంలోవినియోగించడం ప్రారంభించిందని తెలపడానికి సంతోషిస్తున్నాము

గతమాసం సిలికానాంధ్ర మనబడి వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. సిలికాన్ వేలీలోని ఉత్సవాలతో పాటుగా, డల్లాస్ లోనూ, లాస్ ఏంజిలిస్ నగరాలలో కూడా వీటిని నడపటం ఒక ప్రత్యేకత.

తాజమహల్ షాజహానే కట్టించాడా అన్న వ్యాసపరంపరకు వస్తున్న విశేష స్పందనకు మా హృదయపూర్వక కృతజ్ఞతాపూర్వకవందనాలు. ఈ నెల తాజమహల్ పైన ఉన్న బల్బు డోము గోపురాలపైన వస్తోంది. ఇటువంటి గోపురాలు కేవలం మహమ్మదీయులే కట్టుకుంటారనే అపోహే కాదు, ఈ గోపురాలను భారతావనిలోకి మహమ్మదీయులే తెచ్చారని కూడా చరిత్ర పుస్తకాలు చెప్పడం సమంజసం కాదు. వివరాలకు ఆ వ్యాసం సుజననీయంలో తప్పక చదవండి

అలాగే వాజ్ఙయచరిత్రలో వ్యాస ఘట్టాలు అన్న పరిశోధనాత్మక వ్యాస పరంపరనందిస్తున్న ఏల్చూరి మురలీధర రావు గారి వ్యాసాలకు కూడా విశేష ఆధరణ లభిస్తోంది. అయాచితం నటేశ్వర శర్మగారు మనకోసం అందిస్తున్న పద్య కావ్యం శకుంతల కూడా ఆ నాటి కవుల స్థాయికి ధీటుగా నిలుస్తూ, పండితుల ప్రశంసలనందుకుంటోంది. సుజనరంజని ఇటువంటి ఉత్తమ స్థాయి రచనలను అందించ గలుగుతున్నందుకు గర్విస్తూ, ఇటువంటి మరిన్ని ఉత్తమ రచనలను మీకు అందించాలని ఆకాంక్షిస్తూ,

మళ్ళీ అందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలుపుకుంటూ,

మీ

రావు తల్లాప్రగడ


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

 

 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

 
     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 

 

 

 

 

 

 

 

 

 


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech