me.jpg

జ్యోతిష్యులు - డా. పిడపర్తి సుబ్రహ్మణ్యం.

బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో ఆచార్య(MA) మరియు చక్రవర్తి(Ph.D) పట్టాలను పొంది రాష్ట్రీయ సంస్కృత సంస్థానంలో జ్యోతిష్య శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.               జ్యొతిష్య శాస్త్ర సంబంధిత అధ్యయనంలో విశేషమైన కృషిని, సేవలను అందిస్తున్న డా. పిడపర్తి సుబ్రహ్మణ్యంగారిని సుజనరంజని పాఠకులకు పరిచయం చేయడానికి గర్విస్తున్నాము..

  

http://www.jagjituppal.com/images/2aries.gif

            మేషరాశి

అశ్విని (అన్ని  పాదాలు), భరణి (అన్ని  పాదాలు), కృత్తిక (మొదటి పాదం) 

 

ఇది సరిసమానమైన మాసము. ఈ రాశివారికి ఈ మాసపు పూర్వార్థము పూర్తిగా అనుకూలముగా ఉండి ఉత్తరార్థములో కొన్ని రంగములయందు ప్రతికూలత పెరుగును. పూర్వార్థములో ఉల్లాసము మరియు ఉత్సాహముగా కార్యములను నెరవేర్చుకోగలరు. అన్ని రంగములయందు కార్యములు త్వరిత గతిన పూర్తయ్యే అవకాశములు ఉన్నవి. ప్రతిష్ఠ పెరుగుతుంది. ధనలాభము కారణముగ, మితృలవలన, బంధువుల కారణముగ మరియు వాహనముల కారణముగ సంతృప్తికరమైన సమయమును గడిపెదరు. కార్యస్థానమునందు ఉన్నతస్థానములను పొందుటకు మరియు ప్రభావమును పూర్తిగా చూపుటకు ఇది అనువైన సమయము.

ఉత్తరార్థములలో కార్యములయందు ప్రతిష్ఠంభన ఏర్పడు అవకాశములున్నవి. అయిననూ ప్రయత్నము మీద మరియు సాహసించుట వలన కార్యములు పూర్తి అవగలవు. విరోధులవలన వ్యాపారరంగమునందు మరియు కార్యక్షేత్రమునందు సమస్యలు ప్రారంభమయ్యే సమయము కావున జాగ్రత్త అవసరము. ప్రస్తుతసమయములో కారణరహితమైన ఒత్తిడులు వీరిని వెన్నంటి ఉంటాయి. శివార్చన వీరికి మానసికశాంతిని కలుగజేయు ఉపాయము.

http://www.jagjituppal.com/images/2taurus.gif

వృషభరాశి

కృత్తిక (2,3,4 పాదములు), రోహిణి (అన్ని పాదాలు), మృగశిర (1,2 పాదాలు

 

కొత్తగా పనులను ప్రారంభించుటకు ఇది అనువైన సమయము కాదు. కార్యములయందు అవరోధములు ఎక్కువగా ఉండగలవు. ఖర్చులు మరియు విరోధుల ప్రాబల్యము వీరికి తలనొప్పిగా మారగలవు. ఈ సమయములో కలహములు మంచివి కావు. శారీరకముగ కూడ పరిస్థితులు కొంత ఇబ్బందికరముగ ఉండగలవు. మానసికాందోళనలు ఎప్పటివలె ఈ మాసమునందు కూడ ఈ రాశివారిని అంటిపెట్టుకుని ఉండగలవు. వ్యాపారాలావాదేవీలకు ఈ మాసము అనువైనది కాదు.

ఉత్తరార్థము శారీరకముగ మరియు మానసికముక ఉద్రిక్తము మరియు ఆవేశపూరితముగా గడిచే సమయము. సూర్యప్రభావకారణముగ ఉగ్రత్వము అధికమయ్యే అవకాశమున్నది. అకారణ కోపము మరియు చిరాకుపడుట వీరి సంబంధములను దెబ్బతీయు అవకాశమున్నది. ఆదిత్యహృదయస్తోత్రము యొక్క పారాయణ ఈ రాశివారికి ఆరోగ్యమును మరియు సత్ఫలితములను పొందుటలో సహకరించగలదు.

 

http://www.jagjituppal.com/images/2gemini.gif

మిథునరాశి

మృగశిర (3,4 పాదాలు), ఆరుద్ర (అన్ని పాదాలు), పునర్వసు (1,2,3 పాదాలు)

 

 

ఈ మాసము ఈ రాశివారికి పూర్తిగా తటస్థముగా ఉండగలదు. ప్రత్యేకమయిన రంగము లేక ప్రత్యేకములయిన పరిస్థితులు వీరికి అనుకూలముగా లేక ప్రతికూలముగా ఉండగలవు అన్న విషయమును ఇతమిత్థముగా చెప్పజాలము. అనుకూలముగా సమయము ఉన్ననూ, కార్యములు నెరవేరుచున్ననూ వానిని ఆ విధముగా చూడటంలో మరియు వాని ఫలితములను అనుకూలముగా మార్చుకొనుటలో వీరు సఫలులు అయ్యే అవకాశములు తక్కువ.


గురు శనుల ప్రతికూల
ప్రభావము వీరిని గత కొద్ది కాలముగా వెంటాడుచున్నది. మరియు ప్రస్తుతము అధికారిక, అనధికారిక, వ్యాపార, విద్యాదిరంగములలో వీరికి ప్రతికూలతే అధికముగా కనబడుతున్న కారణముగ ఉత్సాహము కరువయ్యే అవకాశములు ఎక్కువ. కావున ప్రస్తుత పరిస్థితులయందు కొత్త కార్యములను ప్రారంభించకుండుట మరియు వ్యాపారలావాదేవీలకు దూరముగ ఉండుట శ్రేయస్కరము. వారమునకు ఒక సారి రుద్రాభిషేకము జరిపించుటద్వారా పరిస్థితులను అనుకూలముగా మార్చుకొనగలరు.

 

http://www.jagjituppal.com/images/2canc.gif

ర్కాటక రాశి

పునర్వసు (4 పాదం, పుష్యమి (అన్ని పాదాలు),ఆశ్లేష (అన్ని పాదాలు)

 

 

ఆరోగ్యము మరియు ద్రవ్యపరముగ ఇది అనుకూలమైన మాసము కాదు. ఈ మాసము ఆరోగ్యముపై అధికప్రభావమును కనబరచు అవకాశమున్నది. జ్వరము, పిత్తవికారము, కీళ్లనొప్పులు మొదలుగునవి వీరి దైనందిన జీవనమునకు అవరోధమును కలిగించే అవకాశములు అధికము. కావున వీరు అధిక సమయమును ఆరోగ్యముపై కేంద్రీకరించవలసి ఉండును.

          ఉత్తరార్థములో ఆరోగ్యము కుదుటపడిననూ కర్తవ్యవిముఖత మరియు కర్తవ్య విమూఢత వీరిని ఎక్కువగా ఇబ్బందిపెట్టు అవకాశములున్నవి. నిర్ణయము తీసుకొనలేకపోవడము మరియు తీసుకున్న నిర్ణయములను అమలు చేయలేకపోవడము వీరిని మానసికముగ ఇబ్బంది పెట్టు ముఖ్య అంశములు. ప్రస్తుత పరిస్థితులకు చాలా వరకు రవి కుజులు కారకులు. కావున వీరు ఆదిత్యహృదయ స్తోత్రమును నిత్యము పఠించుటద్వారా ఆరోగ్యమును కాపాడుకోగలరు. అదే విధముగ సుబ్రహ్మణ్యాలయదర్శనము మరియు గణేశస్తుతి వీరికి కార్యసాఫల్యతను మరియు ఉత్సాహమును ఇచ్చుటలో సహకరించగలవు.

 

http://www.jagjituppal.com/images/2eo.gif

సింహరాశి

మఖ(అన్ని పాదాలు), పూర్వ ఫాల్గుణి(అన్ని పాదాలు), ఉత్తర ఫాల్గుణి (1 పాదం)

 

ఉదరరోగములు మరియు కళత్రకలహములు ఈ రాశివారికి రెండు ముఖ్యమైన సమస్యలు. మాసపు పూర్వార్థము వీరికి ఉదర సంబంధమైన ఇబ్బందులు కలవు. కావున ఈ సమయములో బయటి పదార్థములను పూర్తిగా త్యజించవలెను. విందులు వినోదములు వీరికి ఇబ్బందులను తెచ్చి పెట్టగలవు కావున వానియందు కూడ తగు జాగ్రత్తలను తీసుకొనగలరు. విందులు మరియు వినోదములకు దూరముగా ఉండమని చెప్పుట కష్టము. ఈ మాసమునందు జీవితభాగస్వామితో కలహములు మరియ మనస్పర్థలు వచ్చే అవకాశములు ఉన్న కారణముచేత వీరిపై విందువినోదములకు సంబంధించి నిషేధము విధించుట శ్రేయస్కరము కాదు. మీ కారణములను సాకుగ చెప్పి కార్యములను మీరు విడిచిన అవే మీ కలహములకు కారణములయ్యే అవకాశములున్నవి. జీవిత భాగస్వాములతో కలహములకు మరియు వాగ్యుద్ధములకు ఇది అనువైన సమయము కాదు కావున సహనమును పాటించవలెను.

ఉత్తరార్థమునకు పెద్ద మినహాయింపు లేదు. ఉదరరోగములనుండి విముక్తి లభించగలదు కానీ శారీరకముగ పూర్తి సుఖమును అనుభవించలేరు. స్త్రీవిముఖత పెరుగు అవకాశమున్నది. కానీ ఈ పరిస్థితులయందు ఈ రాశివారు వారి ఆంతరంగమును బయటపెట్టకుండుట మంచిది. వివాదములకు అవకాశములు ఎక్కువగా ఉన్న కారణముగ శాంతిని మరియు సహనమును పాటించాలి. అవసరమును బట్టి మాట్లాడుట లేకున్న మౌనము వహించుట చాల మంచిది.
 

http://www.jagjituppal.com/images/2virgo.gif

కన్యా రాశి

ఉత్తర ఫాల్గుణి (2,3,4 పాదాలు), హస్త (అన్ని పాదాలు), చిత్ర (1,2 పాదాలు)

 

గతకొద్దికాలముగ నడచుచున్న ప్రతికూలసమయము ఇంకనూ నడచుచున్నది. కానీ ఈ మాసపు పూర్వార్ధములో కొన్ని గ్రహముల స్థితి కారణముగా ఈ రాశివారికి పూర్వార్థము పూర్తిగా అనుకూలముగా ఉండగలదు. మాసమంతయూ ఈ రాశివారు ఉత్సాహము మరియ (విశ్వాసము కలిగి) నమ్మకముతో పని చేయగలరు.  అన్ని రంగములయందు వీరికి మంచి ఆదరణ మరియు గుర్తింపు లభించు అవకాశములున్నవి.

ఉత్తరార్థములో పరిస్థితులయందు పెద్ద మార్పు ఉండదు. కానీ ఈ సమయములో ఉదరసంబంధమైన ఇబ్బందులు కార్యములయందు విఘ్నములను ఉత్పన్నము చేయగలవు.  ఉత్తరార్థములో ఉత్సాహము కూడ చాలా వరకు తగ్గు అవకాశమున్నది, ఈ సమయమునందు అకారణమైన కలహములు వీరిని ఇబ్బందులను కలుగజేయగలవు. కావున ఉత్తరార్థమునందు తగినంత శ్రద్ధను కనబరచగలరు. శివార్చన మరియు ఆదిత్యహృదయస్తోత్రపారాయణ వీరికి పరిస్థితులను అనుకూలముగా మార్చుకొనుటలో సహకరించగలవు.

http://www.jagjituppal.com/images/2libra.gif

తులారాశి

చిత్ర (3,4 పాదాలు), స్వాతి (అన్ని పాదాలు), విశాఖ (1,2,3 పాదాలు)

 

      

పూర్వార్థము అంతయూ రోగజనితములైన ఇబ్బందులు ఈ రాశివారికి మానసిక మరియు శారీరక శాంతిని భంగము చేయు అవకాశమున్నది. పిత్తవికారము మరియు గుప్తజ్వరములు ముఖ్యముగ ఇబ్బందికలిగించెడి అవకాశములు ఎక్కువ. నిరంతర వ్యాయామము మరియు చురుకుగా వ్యవహరించడము ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకొనగలరు.  భార్యాపుతృలతో కలహములు మరియు విరోధము గృహశాంతికి భంగము కలుగజేయగలదు.  కానవు ఈ పక్షమునందు తగినంత శ్రద్ధ వహించవలెను.

          ఉత్తరార్థమునందు పరిస్థితులయందు మార్పులు కనిపిస్తాయి. ముఖ్యముగ  అనారోగ్యమునకు కారకులగుచున్న రవికుజులలో కుజుడు ప్రతికూల స్థానమునందే ఉన్ననూ సూర్యుని యొక్క స్థానమార్పిడి కారణముగ అనుకూలత పెరిగే అవకాశములు పూర్తిగా ఉన్నవి. ఈ మార్పు వీరికి శారీరిక మరియు మానసిక బలమును ఇచ్చుటలో సఫలము కాగలదు. మరియు కార్యక్షేత్రమునందు వీరికి అనుకూల ఫలములు ప్రారంభమయ్యే సమయమిది. కావున ఈ రాశివారు ఈ మాసమునందలి ముఖ్య కార్యములను ఉత్తరార్థములో ప్రారంభించుకొన ప్రయత్నించవలెను. యోగ మరియు ప్రాణాయామము వీరికి అత్యంత ప్రయోజనముకలిగించగల ఉపాయము.

http://www.jagjituppal.com/images/2scorp.gif

వృశ్చికరాశి

విశాఖ (4 పాదం), అనూరాధ (అన్ని పాదాలు), జ్యేష్ట (అన్ని పాదాలు)

 

అనారోగ్యములకు పండగ ఈ మాసము.. ఈ రాశివారికి కొన్ని ముఖ్యమైన గ్రహముల ప్రతికూలత కారణముగా అనారోగ్యములు మరియు శారీరిక అశాంతి ఎదురయ్యే అవకాశములున్నవి. దుష్టజనసహవాసము కారణముగ అశుభములు ఎక్కువ జరుగగలవు. కావున ఈ మాసమునందు సంయమనమును ఎక్కువగా పాటించవలెను. కొత్త ఒప్పందములు, పిచ్చాపాటి కబుర్లు, అనవసర ప్రసంగములలో తలదూర్చడము, సంబంధిచని విషయములందు జోక్యము చేసుకొనడము చేయకుండు విధముగ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పరిస్థితుల మధ్య కూడ స్వకుటుంబమునందు శుభకార్యములు జరుగుటకు మరియు కుటుంబపరములైన ధనాగమనాదులకు అవకాశములున్నవి.

ఉత్తరార్థము పూర్వార్థమునకు కొంత భిన్నముగ ఉండగలదు. పూర్వార్థమువలె ఈ సమయములో ప్రతికూలతతో బాటు అనుకూలత లేదు. కొద్దిపాటి గ్రహస్థానమార్పిడి వీరికి భార్యాపిల్లలతో, లేక జీనవభాగస్వాములతో వైరమును మరియు కలహములను తెచ్చు అవకాశమున్నది. కావున కీడెంచి మేలును ఎంచగలరు. విష్ణుసహస్రనామపారాయణ వీరికి అనుకూలతను ప్రసాదించగలదు.

http://www.jagjituppal.com/images/2saggi.gif

ధనూరాశి

మూల (అన్ని పాదాలు), పూర్వాషాడ (అన్ని పాదాలు), ఉత్తరాషాడ (1 పాదం)

       

ఈ రాశివారికి పూర్వార్థము పూర్తిగా అనుకూలముగా ఉన్నది. వ్యాపారరంగములు , కార్యక్షేత్రములు వీరికి మంచి అనుకూలస్థానములు. శారీరకముగ మరియు మానసికముగ ఉల్లాసముగ ఉండు సమయము. తమ తమ పనులను వేగవంతముగ మరియు అనుకూలముగ చేయించుకొనుటకు ఈ సమయమునందు అవకాశమున్నది . కావున ఈ అవకాశమును సద్వినియోగపరచుకొనగలరు. నిర్ణయములు తొందరపాటులో తీసుకొను అవకాశములు కనిపించుచున్న కారణముగ ఒకటికి రెండుమార్లు యోచించి నిర్ణయములు తీసుకొనగలరు. ఎవరి మాటలను గుడ్డిగ నమ్మరాదు.

ఉత్తరార్థమునందు మెల్లగా ప్రతికూలత ఏర్పడడము ప్రారంభమగుచున్నది. కావున సాధ్యమయినంత వరకు కార్యములను పూర్వార్థములో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించుకోవాలి. ఉత్తరార్థములో జ్వరప్రకోపము కారణముగ వీరు మానసిక ఒత్తిడిగి గురయ్యే అవకాశమున్నది. కావున ముందుగనే అన్ని రకములైన నివారణోపాయములను ఎంచుకొనుట శ్రేయస్కరము.
 

http://www.jagjituppal.com/images/2capricon.gif

మకరరాశి

ఉత్తరాషాడ (2,3,4 పాదాలు), శ్రావణ (అన్ని పాదాలు), ధనిష్ట (1,2 పాదాలు)

 

ఈ రాశివారికి ఈ మాసపు పూర్వార్థము పూర్తిగా అనుకూలముగా ఉండు అవకాశములు లేవు. పరిస్థితులు సజావుగా సాగుచున్ననూ అధికారుల నుండి భయము మరియు అదుపులోకి రాని ధనవ్యయము వీరిని మానసిక ఒత్తిడికి గురిచేయు అవకాశములు ఎక్కువగా ఉన్నవి. విలాసములకు మరియు విహారయాత్రలకు వీరు ఈ సమయములో ఎక్కువ మక్కువ చూపే అవకాశమున్నది. వంచింపబడు అవకాశములు ఉన్న కారణముగ లావాదేవీలయందు మరియు దీర్ఘకాలిక ప్రయోజనములున్న కార్యములయందు ఎవరినీ గుడ్డిగా నమ్మరాదు. సాధ్యమయినంతవరకు పూర్వార్థములో సంప్రదింపులు జరుపకుండుట మంచిది.

ఉత్తరార్థము పూర్వార్థముతో పోల్చిన పూర్తిగా అనుకూలముగా ఉండగలదు. పూర్వార్థములోని లోపములు ఈ సమయములో పూర్తిగా తీరుతాయి. అధికారల తీరు మారుతుంది. భయము, ఆందోళనలు, వ్యవము మొదలుగునవి అన్నియూ తగ్గుముఖము పట్టి వీరికి పరిస్థితులపై పట్టు ఏర్పడుతుంది. కార్యక్షేత్రమునందు మరియు వ్యాపారరంగమునందు వీరి అభీష్టములు నెరవేరుతాయి. పూర్వార్థపు బాధలనుండి విముక్తికి సూర్యారాధన సలుపగలరు.
 

http://www.jagjituppal.com/images/2aqua.gif

కుంభరాశి

ధనిష్ట (3,4 పాదాలు), శతభిష (అన్ని పాదాలు) , పూర్వాభాద్ర (1,2,3 పాదాలు)

 

ఈ మాసపు పూర్వార్థము వీరికి ఉపద్రవములతో ఉక్కిరి బిక్కిరి చేయుకాలము. ఏ పనినీ అనుకూలముగా మరల్చుకొను అవకాశములేదు. ఒత్తడి చాలా తీవ్రముగా ఉంటుంది. అలసట వీరిని నిర్వీర్యులను చేసే అవకాశమున్నది. యోగాభ్యాసమును నిర్మొహమాటముగా ఆచరించాలి. ఉద్రేకములు కలిగించే సందర్భములు అనేకములు. కావున ఈ సమయము వీరికి సహనమునకు అగ్నిపరీక్షాకాలము. కలహములకారణముగ, దుష్టుల మాటలు వినుటద్వారా వీరికి ధనక్షయము కలుగు అవకాశమున్నది కావున ఈ సమయములో వీరు ఎటువంటి కొత్త పనులను ప్రారంభించరాదు.

          ఉత్తరార్థము కొంత ఊరటను కలిగిస్తుంది. ఉత్తరార్థములో ఒత్తిడి తగ్గుతుంది. ఉద్రిక్తపరిస్థితులు శాంతిస్తాయి. తద్వారా శారీరిక సుఖమునకు అవకాశములు ఏర్పడతాయి. కానీ ఉత్తరార్థములో కూడ మోసగింపబడు అవకాశమున్నందున జాగ్రత్త అవసరము. వ్యయము వీరి కట్టుబడిలో ఉండదు. ఈ వ్యయములు వీరిపై దీర్ఘకాలిక ప్రభావమును చూపు అవకాశమున్న కారణముగ పెద్ద పెట్టుబడులు మరియు అప్పు ఇచ్చుట వీరికి తగదు. నిత్యము నిరాటంకముగ ఆదిత్యహృదయస్తోత్రపారాయణ మరియు కనకధారాస్తోత్రపఠనము చేయుట మంచిది.

 

http://www.jagjituppal.com/images/2psices.gif

మీనరాశి

పూర్వాభాద్ర (4 పాదం), ఉత్తరాభాద్ర (అన్ని పాదాలు), రేవతి (అన్ని పాదాలు)

 

అదుపులేని ధనవ్యయముతో పూర్వార్థము ఉక్కిర బిక్కిర చేయగలదు. అక్కరకు రాని పలుకుబడి, అధీనములో ఉండని సేవకులు, మాటవినని సహచరులు, ఎక్కువ ఫలితమును ఆశించే అధికారులు, అతిగా పరిశ్రమించినా రాని ఫలితములు ఈ రాశివారిని ఈ సమయములో దిక్కు తోచనివ్వవు. ఈ పరిస్థితులు వీరి నిర్ణయాధికారమును దెబ్బ తీసే అవకాశములున్నవి. ఫలితముగ వీరికి స్థిరత్వము తగ్గగలదు. తద్వారా త్రిప్పట, అలసట వీరికి తోడుగా ఉండిపోయే అవకాశములున్నవి.

 ఉత్తరార్థము పూర్వార్థముకు భిన్నిముగా ఉన్ననూ వీరికి అనుకూలము మాత్రము కాదు. దానికి కారణము వీరిపై పెరిగే ఒత్తిడి, తెలియని ఉద్రేకము మరియు అతి ఆవేశము. ఈ పరిస్థితులు చాలా సందర్భములలో తీవ్రపరిణామములకు దారితీయు అవకాశమున్నది. కావున ఉద్రిక్తమైన ఉత్తరార్థములో వీరు ఎంత మౌనంగా మరియు ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది. సాత్వికాహారమును తీసుకొనుట మరియు అరుణోదయవేళ స్నానము మరియు ధ్యానము వీరికి మానసికశాంతిని మరియు స్థైర్యమును ప్రసాదించగలవు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech