శ్రీ రావూరి వెంకట సత్యనారాయణ    - టి. జ్ఞాన ప్రసూ 

నిర్వహణ : దుర్గ డింగరి

 

ప్రియమైన సుజనరంజని పాఠకుల్లారా,

'అమ్మకు, బ్రహ్మకు నిచ్చెన నాన్న అంటారు. నాన్నలు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో, ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తారు. చిన్నప్పటి నుండి నాన్న వీపు పై ఎక్కి ఆడుకున్న రోజుల నుండి మీరు చిన్నారి పాపలను ఎత్తుకునే వరకు ఎన్నెన్నో ఙ్ఞాపకాల దొంతరలు. అవన్నీ మా అందరితో పంచుకోవడానికి సుజనరంజని ' మా నాన్నకు జేజేలు,' శీర్షిక ద్వారా మీకు మంచి అవకాశమిస్తుంది.

నెం.వన్ తెలుగు వెబ్ మాస పత్రికలో మీ నాన్నగారి గురించి ప్రచురిస్తే ఎంత మంది చదువుతారో, స్ఫూర్తిని పొందుతారో ఆలోచించండి.

ఇంకా ఆలస్యమెందుకు? కలం, కాగితం తీసుకుని రాసి కానీ లేదా లాప్ టాప్, కంప్యూటర్లు వున్న వారు టక టకా టైపు చేసి కానీ సుజనరంజనికి పంపించేయండి ఇక!

దుర్గ డింగరి!

 
 

(ఫ్రముఖ రచయిత, శ్రీ రావూరి వెంకట సత్యనారాయణ గారి గురించి ఙ్ఞాపకాలు కొన్ని మనతో పంచుకుంటున్నారు వారి కుమార్తెఙ్ఞానప్రసూన గారు.)  -- టి. జ్ఞాన ప్రసూన


మా  నాన్న  గారిని చూస్తే హాస్య రస భరిత మైన రచనలు చేసేది   వీరేనా అనిపించేవారు.   గంభీరంగా వుండే వారు. నాన్న గారు కదా అని చనువుగా  కబుర్లు చెప్పాలన్నా భయంగా వుండేదిమానాన్నగారు ఇంట్లో ఉన్నంత  సేపు  మా అమ్మ నేను చాలా మౌనంగా వుండేవాళ్ళం.  ఇల్లు సూది పడితే   వినిపించేతంత  నిశ్శబ్దంగా  వుండేదిమా నాన్న గారికి చాలా మొహమాటం

ఏదీ సూటిగా అడిగేవారు కాదు, చెప్పే వారుకాదు. కాఫీ తాగాలని అనిపిస్తే, 'కాఫీ ఇయ్యమ్మా'! అనేవారు కాదు, మా అమ్మాయి ఇవాళ వాళ్ళ నాన్నకి కాఫీ కాచి ఇస్తుందిట అనేవారునాకు ఇదికావాలి, నాకు ఇది ఇయ్యండి అని ఎవరిని అడిగేవారు కాదు.

మిత్రులైన ఒక దంపతులు  బందరుకి   బదిలీ అయి వచ్చారు. నాన్నగారు వెళ్లి  వారిని చూసివచ్చి  "వాళ్ళు సాయంత్రం మనింటికి భోజనానికి వస్తారు, వంట చెయ్యి,"  అని చెప్పారుమా అమ్మ పీలగా బలహీనంగా వుండే వారు. అయినా ఎప్పుడూ ఆయన మాటకి ఎందుకు? అని ప్రశ్న వేయడం, వద్దు అనడం నేనెప్పుడు  వినలేదుఅమ్మ వంట చేసింది, నేను ఇల్లు సర్ది డాబాలో దుప్పట్లు పరిచి, మైనపు వత్తులు,అగరు వత్తులు సిద్ధం చేసాను.   మిత్ర దంపతులు ఏడు గంటలకల్లా వచ్చారుమా నాన్నగారు కూడా ఊరేగింపు కృష్ణా పత్రీక ఆఫీసులో పని అవగానే తొందరగా వచ్చేసారు. నాన్నగారు ఒకరిద్దరు మిత్రులతో  సాయంత్రాలప్పుడు మంజప్ప హోటల్కు వెళ్లి ఘుమ ఘుమలాడే కాఫీ తాగి, తాపీగా నడుచుకొంటూ మధ్య మధ్యలో కలిసే మిత్రులతో నిలబడి పావు గంటాఅర గంటా మాటలు వింటూ పది పదిన్నరకి ఇంటికి వచ్చేవారు.

నేను మా అమ్మ ఎదురు చూస్తూ "ఇంకా  ఈయన ఊరేగింపు  కాలేదు కాబోలు," అనుకొనే వాళ్ళంకానీ రోజు వచ్చేసారుమా ఇంటికి ఎవరు వచ్చినా విందుకు ముందు  వీనులకు విందు చేసే వాళ్ళం మా నాన్న గారి రచనలతో. మానాన్న గారికి  నేను ఆస్థాన  చదువరిని. వడగళ్ళు,వ్యాసాలు, కధలు, నవలలు, గేయాలు చదివి వినిపించేదాన్నిఆరోజు అలాగే సాహిత్య గోష్టి  జరిగింది పది అయిందిఇక వెళ్తాం అని దంపతులు లేచారు, "అదేమిటి భోజనం చెయ్యండి,"  అన్నాం  "మళ్ళినామీ ఇంటికి వస్తే కబుర్లలో టైమే తెలియదు, పొద్దుపోతుందని  అలవాటు లేకపోయినా  ఆరింటికే తిని వచ్చేసాం,"  అన్నారు వాళ్ళుఅప్పుడు  మా అమ్మ మొఖం చూడాలిఆశ్చర్య బోయి నాన్న గారు "అదేమిటండీ? రమ్మని చెప్పాను గా?" అన్నారు

ఇంతకీ తేలింది ఏమిటంటే  మా నాన్న గారు వాళ్ళతో, "సాయంత్రం  సరదాగా గడుపుదాం రండి,"  అన్నారుట గాని భోజానికి రమ్మని చెప్ప లేదుట

నా చిన్నపుడు బందరులో ఒక సారి బియ్యానికి కరువు వచ్చింది.  

బియ్యం ఎక్కడా   దొరికేవి కావు.

మా నాన్న గారికి తెలిసిన ఒక పెద్ద మనిషి  బియ్యం వ్యాపారం  చేసేవాడు.   ఆయన దగ్గర జపాను బియ్యం ఉండేవిఅవి పెద్ద   సగ్గు బియ్యం ప్రమాణంలో వుండి   రెండు గంటలు  నీళ్ళల్లో   నాన బెడితెగానీ   ఉడికేవి కావు."బియ్యం అంటూ దొరికితే ఎలాగో  అలా  అవస్థ పడి   వండుకొందాము,  తెండి," అన్నది మా అమ్మ.   నాన్న గారు  వెళ్ళారుఎప్పుడూ రాని కవిగారు వచ్చారని ఆయన హడావుడి చేసి  పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని పిలిచి అందరికి పరిచయం చేసి నాన్నగారి రచనల్ని పొగడటం ప్రారంభించాడట.    

నాన్నగారికి వాతావరణంలో "బియ్యం కావాలి" అని చెప్ప బుద్ది కాలేదుట. ఇంతలో  ఆయన ఊరక రారు మహాత్ములు 'అన్నారుట.   అప్పుడు  మా  నాన్నగారు "అబ్బే!ఏమీ  లేదు మొన్న  ఒక స్నేహితుడు బియ్యం దొరక్క అవస్థ గా  వుందండీ! అన్నాడు మీ ఇంటి ముందు నుంచి వెడుతుంటే ఆయన గుర్తుకు వచ్చాడు, మీకు వీలయితే అతనికి పంపగలరా? అన్నారుట. ఆయన  అక్కడున్న వాళ్ళతో 'చూసారా! మా  కవిగారు ఎంత గొప్ప వారో? స్నేహితునికి  బియ్యం కోసం వచ్చారు. మాత్రం దానికి మీరు రావాలాఆ కోబ్బరి చెట్టున్న ఇల్లేగా!    పావు బస్తా ఇప్పుడే పంపిస్తా అన్నాడట.   

మా నాన్న గారు ఇంటికి వస్తూ ఒక అరకిలో గోధుమ రవ్వ తెచ్చి నా చేతికిచ్చి, "ఇవాళ్ళకి  ఇదే భోజనం." అన్నారు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech