నేనేనా?

                                                                                   - సురేంద్ర బాబు

  పసితనం లో పది మందికి పాఠాలు చెప్పింది నీవేనా? అని ప్రశ్నిస్తుంది మనసు..
ఎక్కడ నన్ను మించిపోతారో అని నేడు నా విజ్ఞానాన్ని పంచడానికి సంసయిస్తున్న ఈ క్షణాన ...

అప్పుడు ఎవరు లేని అనాధను ఆదుకుంది నీవేనా? అని ప్రశ్నిస్తుంది మనసు..
నా వాళ్ళు సైతం మృత్యువుతో పోరాడుతున్నపుడు కోట్లకు పడగలెత్తిన నేను వెనుకాడుతున్న ఈ క్షణాన..

ఆనాడు అవినీతి పై ఉపన్యాసం తో అందరి మనసుల్ని దోచుకుంది నీవేనా? అని ప్రశ్నిస్తుంది మనసు..
ఇపుడు అదే మనుషుల్ని దోచుకోటానికి రాజకీయ నేతగ రంగు వేసుకున్న ఈ క్షణాన ...

ఆనాడు అభిమానం అనుబంధాలను పంచింది నీవేనా? అని ప్రశ్నిస్తుంది మనసు
ఇప్పుడు V.I.P అనే పేరుతో అద్దాల అబధ్ధం లో నన్ను నేను బంధించుకుంటూ విర్ర వీగుతున్న ఈ క్షణాన

అందుకే ఇప్పుడు నాకనిపిస్తుంది..

విలువ లేని విజ్ఞానపు మనిషి గా ఎదిగిపోతున్ననేమో ...కానీ
ఒక మనసున్న మనిషిగ ఒదగలేక ఓడిపోతూ ఒరిగిపోతున్నానేమో ...
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech