3   వ భాగం.                                                                                   

 

 గాయత్రీం సర్వదైవత్యాం తాం ధ్యాయే వేదమాతరం
పరబ్రహ్మ ప్రకాశాఢ్యాం శబ్ద బ్రహ్మప్రకీర్తితాం

సాక్షాత్ పరబ్రహ్మ ప్రకాశంతో వప్పునది, వేదాలమే ప్రస్తుతించబడింది, సర్వ దేవతా స్వరూపిణి, చతుర్వింశత్యక్షర స్వరూపిణి, వేదమాత అయిన గాయత్రీ దేవతను ధ్యానింతును.

పరమేశ్వరీ శ్రీ గాయత్రి మాత మంత్ర మహిమ. శక్తి తెలుసుకునే ముందు ఓంకారం యొక్క విశిష్టత తెలుసుకోవాలి. సృష్టికి పూర్వమ్ విశ్వాంతరాళాలలో ఒకే ఒక నాదం ప్రతిధ్వనిస్తుండేదని, అదే ప్రమానమని, ఓంకారమని మహాత్ముల వాక్కు, సాక్షాత్ పరమాత్మచే ప్రకటీంచబడిన నాదం కనుక మహా మహిమాన్వితమైన ఓంకారాన్ని అన్ని మంత్రాలకు మూలంగా స్వీకరించారు. ఋగ్వేదంలోని మొదటి ఋక్కు ‘అగ్నిమేళేపురోహితమ్’ . ఈ మంత్రంలో మొదటి అక్షరం ‘అ’. యజుర్వేదంలో సంఖ్య.9. అందు మధ్యది అంటే ఐదవది ‘యోనిస్సముద్రోబందుః’ ఈ మంత్రంలో చివరి వర్ణం ‘మ్’ . అధర్వణం నుండి ఉచ్చరించడానికి నేర్పే స్వరాన్ని గ్రహించి ‘ఓమ్’ సిద్ధం చేశారని ఋషి వివరణ.
‘అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ధ్యాత్మముచ్యతే’ అన్నట్లు బ్రహ్మము సర్వోత్కృష్టమైన అక్షర స్వరూపం. అదే ప్రణవం. ఓంకారం, సకల దేవతలకు, త్రిమూర్తులకు, వేదాలకు కారణ స్థానం. ఆత్మ స్వరూపాన్ని ఎరుకపరిచే దివ్యమంత్రం. ‘అక్షర మంబరాన్త ధృతే’ పృథివి మొదలు ఆకాశం వరకు గల పంచభూతాలను ధరించడం వల్ల, అక్షర శబ్దంచే చెప్పబడునది శక్తియుక్తమంటే, ఓంకారోపాసన వల్ల విష్ణువు. విష్ణుత్వం పొంది పాలన శక్తి ఆర్జించాడు. బ్రహ్మ, బ్రహ్మత్వాన్ని పొంది సృష్టి శక్తిని పొందాడు. శివుడు, శివత్వాన్ని పొంది లయకారుడయ్యాడు. సమస్త మంత్రాలు, వేదాలు ఓంకారంలో అంతర్గతమై ఉన్నాయి.

బ్రహ్మరూపమైన ఓంకారాన్ని వివిధ గ్రంథాలు, అనేక విధాలుగా వర్ణించాయి. ఓంకారం యొక్క స్మరణ, మనన, కీర్తన, శ్రవణం, జపాదుల వల్ల పరమాత్మానుగ్రహ ప్రాప్తి, కైవల్యం లభిస్తుందని వేదాలు వర్ణించాయి. ‘ప్రణవం మంత్రానాం సేతుః అంటే మంత్రసిద్ధి పొందటానికి ప్రణవం వంతెన వంటిదని అర్ధం. ఓంకారానికున్న శక్తులను ఈ విధంగా వర్ణించారు.
1. భవసాగరాన్ని దాతి తరింపచేసేది.
2 సర్వావస్థ, సర్వ కాలాదులందు గతి అయినది
3 విశ్వాంతరాళాలను ప్రకాశింపచేయునది
4 భక్తులను తరింపజేయు ఆనందరూపిణి
5 తృప్తిప్రదాత
6 సర్వ ప్రాణులందలి సూక్ష్మాత్మ స్వరూపం
7 చరాచర జగత్తుకు అధికారిణి
8 సర్వైశ్వర్య యుక్తము
9 శుభేచ్చలను కలిగించునది
10 ప్రాణులందలి ఇఛ్ఛాశక్తి
11 జ్ఞాన విద్యాతేజ స్వరూపిణి
12 శుద్ధాంతఃకరణలో నిగూఢమై నిలిచి ఉండునది
13 జీవునియందు అహింస, దానం, దయ మొదలైన గుణాలను వృద్ధి చేయునది
14 ప్రళయకాలంలో జగత్తును లయం చేసుకొనునది
15 సృష్టికాలంలో సర్వాంతరాత్మయై ప్రకాశించునది

ఇన్ని గుణాలతో తేజొవంతమైన ప్రణవం ఈశ్వరీయం. ప్రణవ శబ్దంతో కూర్చి గాయత్రి మంత్రం సంకలనం చేయబడింది. గాయత్రీ మంత్రం, మంత్రం మాత్రమే కాదు. ప్రార్ధన కూడా. ప్రార్ధన అంటే ప్ర + అర్ధన. చక్కగా అర్ధించుట అని అర్ధం. చక్కగా అర్ధించిన రక్షించునది గాయత్రీ మంత్రం.

 


-సశేషం.

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech