మార్చి, 2010

me.jpg

జ్యోతిష్యులు - డా. పిడపర్తి సుబ్రహ్మణ్యం.

బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో ఆచార్య(MA) మరియు చక్రవర్తి(Ph.D) పట్టాలను పొంది రాష్ట్రీయ సంస్కృత సంస్థానంలో జ్యోతిష్య శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.               జ్యొతిష్య శాస్త్ర సంబంధిత అధ్యయనంలో విశేషమైన కృషిని, సేవలను అందిస్తున్న డా. పిడపర్తి సుబ్రహ్మణ్యంగారిని సుజనరంజని పాఠకులకు పరిచయం చేయడానికి గర్విస్తున్నాము..

  

http://www.jagjituppal.com/images/2aries.gif

            మేషరాశి

అశ్విని (అన్ని  పాదాలు), భరణి (అన్ని  పాదాలు), కృత్తిక (మొదటి పాదం) 

 

పూర్వార్థము ఈ రాశివారికి పూర్తిగా అనుకూలమైనది. కుజుడు తప్ప అన్ని గ్రహములు అనుకూలస్థానములందుండుటచే వీరికి అన్ని కార్యములందున అనుకూలములైన ఫలితములు లభించును. కుజుని కారణముగా ఆరోగ్యము క్షీణించుట మరియు చెడువారి సహవాసము చేయు అవకాశములున్ననూ వీనిపై శ్రద్ధ చూపవలసిన అవసరము లేదు. దీనికి కారణము మిగిలిన గ్రహముల అనుకూల ప్రభావమే. విద్యావ్యాపారవివాహాదిప్రయత్నములన్నియూ సత్ఫలితములను ఇవ్వగలవు. కావున ఆ ప్రయత్నములయందు శ్రద్ధ చూపగలరు.

ఉత్తరార్థమునందు అనుకూలత కొంతమేర తగ్గగలదు. ప్రభుత్వపరమైన కార్యములు మరియు అధికారులతో పనులు సజావుగా జరిగే అవకాశములు తక్కువ. ధన లాభము పూర్తిగా కనబడుతున్నది కావున వ్యాపార లావాదేవీలను సలుపుకొనుటకు ఇది అనువైన సమయము.

ఈ మాసమంతయూ కుజుడు శుభుడు కాడు. స్నానము చేయు నీటియందు మారేడుదలములను ఉంచి స్నానము చేసిన కుజుడు శాంతించగలడు. రవి ఉత్తరార్థమునందు అశుభుడు కావున ఆదిత్య హృదయ స్తోత్రమును పఠించగలరు.

http://www.jagjituppal.com/images/2taurus.gif

వృషభరాశి

కృత్తిక (2,3,4 పాదములు), రోహిణి (అన్ని పాదాలు), మృగశిర (1,2 పాదాలు

 

మానసికముగ ఒత్తిడి అధికముగా ఉండుటకు అవకాశమున్నది. ఎప్పటికప్పుడు ఉత్సాహమును నింపుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రాశివారు ముఖ్యముగా ఈ సమయములో వారిని వారు ప్రభావశూన్యులుగా ఊహించుకొనే అవకాశమున్నది. ఈ విధముగా చేయడమువలన వారి కార్య కుశలత చాలా వరకు దెబ్బ తిను అవకాశమున్నది కావున జాగ్రత్త అవసరము.
ఈ రాశివారు పనిచేయు స్థానముయందు వీరికి ప్రాముఖ్యము కొంతవరకు తగ్గగలదు. అధికారులు వీరి పట్ల నిర్లక్ష్యముతో వ్యవహరించు అవకాశమున్నది. కానీ ఉద్రేకములకు లోను కారాదు. ఇటువంటి తలపోటుల నుండి వీరికి అతి త్వరలోనే విముక్తి లభించును కావున వారి కార్యములపైన మాత్రమే వీరు దృష్టి సారించాలి.
ఈ మాసపు ఉత్తరార్థములో చాలా వరకు గ్రహములు శుభస్థానమును చేరుతున్నాయి కావున ఉత్తరార్థము వీరికి చాలా వరకు అనుకూలముగా ఉండును. ఈ రాశివారికి ఈ మాసముయందు పెద్ద అండ కుజుడు. కుజ ప్రభావమువలన వీరు ఈ మాసమును ధైర్యముగా ఎదుర్కొనే శక్తిని కలిగియుందురు. ఈ కుజప్రభావము కారణముగా వీరు తమ కార్యములను శీఘ్రముగా మరియు అనుకూలముగా పూర్తి చేసుకోగలరు. కానీ ఇది వీరు గుర్తించినపుడు మాత్రమే సాధ్యము. అనగ వీరిలో నిరుత్సాహము మరియు భయమును నింపు గ్రహము బలముగా నుండుటచే వీరు ధైర్యముచేయ ప్రయత్నించరు. కావున ధైర్యముచేసిన కార్యములు పూర్తి అగునని వీరు గ్రహించి ఆ దిశలో ప్రయత్నించగలరు.
వీరికి ఈ మాసమునందు ఇబ్బంది కలిగిస్తున్న గ్రహములు శని గురులు. గురుడు అతిత్వరలో శుభుడుగా మారుతున్నాడు. శని ప్రభావము తగ్గించుకోవడానికి వీరు కొంచము నల్లని నువ్వులు కలిపిన నీటితో స్నానము చేసిన కొంత ఊరట లభించగలదు.
 

http://www.jagjituppal.com/images/2gemini.gif

మిథునరాశి

మృగశిర (3,4 పాదాలు), ఆరుద్ర (అన్ని పాదాలు), పునర్వసు (1,2,3 పాదాలు)

 

 

ఏ పని యందు మనస్సు లగ్నము కాని సమయము ఇది. చాలా పరిస్థితులు అగమ్య గోచరముగా కనిపిస్తాయి.  మానసిక దైన్యము బాధలను మరింత ఉధృతము చేసే అవకాశమున్నది. కలహములు సర్వ సాధారణములు. అధికారులనుండి ఇబ్బందులు ఎదుర్కొనే సమయమిది.  శారీరికముగా కూడ ఇబ్బందులు ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశమున్నది. పూర్వార్థములో ప్రారంభించిన పనులు విఘ్నముల కారణముగా వదిలివేసే పరిస్థితులు వస్తాయి.

        స్నేహితులనుండి సహకారము లభించు అవకాశము చాలా తక్కువ. కుటుంబసభ్యలు దూరముగా నుండడానికి ప్రయత్నిస్తారు.

ఈ మాసపు ఉత్తరార్ధము కొంతవరకు వీరికి ఊరటను ప్రసాదించగలదు. వీరి కార్యకుశలత వీరికి పరిస్థితులను అనుకూలముగా మార్చడములో సహకరించగలదు. ఉత్తరార్థములో పనులను పూర్తిచేసుకొన ప్రయత్నించవలెను. ఈ సమయమునందు వీరికి పరోక్షముగా సహకరించువారు తమ వంతు ప్రయత్నములను చేయు అవకాశమున్నది. ఉత్తరార్థము ఆశావహముగా ఉన్నది కావున కార్యములను నెరవేర్చుకొనుటకు ఇది అనువైన సమయము.

బిల్వములతో శివార్చన శని ప్రాబల్యమునుండి ఊరటనివ్వగలదు. స్నానముచేయు నీటిలో కొన్ని బిల్వదళములనుంచి స్నానము చేయుట ద్వారా కుజుని ఉద్వేగభరిత ప్రభావమునుండి విముక్తులు కాగలరు.

http://www.jagjituppal.com/images/2canc.gif

కర్కరాశి

పునర్వసు (4 పాదం, పుష్యమి (అన్ని పాదాలు),ఆశ్లేష (అన్ని పాదాలు)

 

శని మినహా మిగిలిన గ్రహములన్నియూ ప్రతికూల పరిస్థితులను సూచిస్తున్నవి. పూర్వార్థము కన్న ఉత్తరార్థము కొంత ఆశాజనకముగా నుండగలదు. తత్ఫలితముగా ఈ రాశివారికి స్థిరత్వము తగ్గును. ఆందోళనలు పెరుగుట, త్రిప్పట బాధించు అవకాశమున్నది. ప్రభుత్వపరముగ వీరిపై చర్య తీసుకొను అవకాశమున్నది కావున అధికారులతో వివాదములకు దిగరాదు. వీరికి సంబంధించని కార్యక్రమములలో తల దూర్చరాదు.

జన్మరాశియందున్న కుజుడు ఉపద్రవములను సృష్టించును. ఉద్రేకమును అణచుకోవాలి. సహనముగా ఉండటానికి ప్రయత్నించవలెను. కలహములు కొంప ముంచు అవకాశమున్నది. కావున తగవులాటలకు ససేమిరా అనాలి.

ధనలాభము, దాసుల వలన సుఖము, కుటుంబమునందు ఉత్సాహమునిచ్చు కార్యములు జరుగుట, సుఖము, శతృవులు మరియు రోగముల నాశనము. ఈ ఫలములన్నియూ తృతీయములో ఉన్న శని ద్వారా ఆశించవచ్చును. కానీ మిగిలిన అన్ని గ్రహములు ప్రతీకూల పరిస్థితులలో ఉన్న ఈ సమయములో శని ఎంతవరకు ఫలములను ఇవ్వగలడన్నది ఆలోచించవలసిన విషయము. అయిననూ ఈ శని నుండి ఈ రాశివారు ఈ నెలలో చాలా వరకూ ఆశించవచ్చును. ఉత్తరార్థములో ఈ ఫలములు కనిపించగలవు.

http://www.jagjituppal.com/images/2eo.gif

సింహరాశి

మఖ(అన్ని పాదాలు), పూర్వ ఫాల్గుణి(అన్ని పాదాలు), ఉత్తర ఫాల్గుణి (1 పాదం)

 

మరియు రోగభయము పీడించు అవకాశమున్నది. వ్యయభారము ప్రస్తుతము మోయలేనిదిగా అనిపించును. బంధువులతో కలహములు సంభవించగలవు. మనస్సునకు దీనత్వము ఉత్సాహమును కలిగించు అవకాశములు చాలా తక్కువ. ఏలినాటి శని ప్రభావముకూడ వీరిపై అధికముగా కనిపించు అవకాశమున్నది. శారీరికముగా బలహీనులుగా నుండుట ఈ సమయములో సహజముగా కనిపించెడి ముఖ్య ఫలము.

ఉత్తరార్థములో కూడ పెద్ద మార్పులు కనిపించుట లేదు. ఉత్తరార్థములో రవియొక్క అశుభత్వము మరింత పెరుగుటచే మనో బలము మరింత తగ్గు అవకాశమున్నది.

ముఖ్యముగా గుర్తుంచుకోవలసినవి కొన్ని విషయములున్నాయి. ఈ రాశివారికి శుభుడైన గురుడు ప్రస్తుతము అస్తమించి ఉన్నాడు. సాధారణముగా సూర్యరశ్మి కారణముగా అస్తమించిన గురుని ప్రభావము కొంతవరకు సూర్యుని యందు కనిపించాలి. అందువలన ఈ రాశివారికి కనిపించని ఆనుకూల్యత చాలా స్థానములయందు కనిపించు అవకాశమున్నది. కావున సహనముతో కార్యములను నెరవేర్చుకొనుటకు ప్రయత్నించాలి.

సూర్యునికి అర్ఘ్యప్రదానము మరియు బిల్వదలములుంచిన నీటితో స్నానము వీరికి అనుకూలఫలములను ఇవ్వగలవు.

 

http://www.jagjituppal.com/images/2virgo.gif

కన్యా రాశి

ఉత్తర ఫాల్గుణి (2,3,4 పాదాలు), హస్త (అన్ని పాదాలు), చిత్ర (1,2 పాదాలు)

 

ఈ రాశివారికి ఈ మాసము మిశ్రమముగా నుండును.  వీరిపై శని యొక్క దుష్ప్రభావము అధికముగా నున్నది. ఆ కారణముగా స్వజనులనుండి దూరముగా ఉండవలసి వచ్చును. చేయు పనుల యందు అయివవారినుండి ఎదురయ్యే సమస్యలు ఎక్కువగా నుండును. షష్ఠములోనున్న గురుని కారణముగా నిరుత్సాహము మరింత పెరిగే అవకాశమున్నది. ఏ పనియందూ ఇష్టత కలుగకపోవడము, దేనిని గురించి లోతుగా ఆలోచించలేకపోవడము పరిస్థితులను ఇబ్బందికరముగా మార్చగలవు.

మాసపు పూర్వార్థమునందు బుధకుజులు, ఉత్తరార్థమునందు కుజుడు వీరికి అనుకూలముగానున్న గ్రహములు. కుజునికారణముచే వీరు స్థిరాస్థులద్వారా మరియు కొనసాగుతున్న వివాదములయందు లాభములను పొందగలరు. కోర్టు కేసులు గూర్చి ఆలోచించవలసిన సమయము ఇది.  ఈ సమయములో వివాదములు తీర్చకోవడానికి ప్రయత్నించడముద్వారా కార్యములను సాధించుకొనగలరు.

గురుశనులు అనుకూలించడమువలన సర్వత్ర అనుకూలత ఏర్పడగలదు. కావున శివాలయసందర్శనము మరియు గురు శనివారములయందు విశేషముగా శివపూజ మరియు రుద్రాభిషేకములను కావించుట ద్వారా ఊరటను పొందగలరు.

 

http://www.jagjituppal.com/images/2libra.gif

తులారాశి

చిత్ర (3,4 పాదాలు), స్వాతి (అన్ని పాదాలు), విశాఖ (1,2,3 పాదాలు)

 

 

        మాసపు పూర్వార్థమునందు అనారోగ్యములు ఇబ్బంది కలిగించు అవకాశమున్నది. భూ సంబంధి లావాదేవీలు మరియు వివాదములయందు సమాన స్థితి నెలకొని యుండును. అనగ వాని యందు ప్రస్తుతము తటస్థస్థితి కొనసాగును. పుతృలు మరియు భార్యతో విభేదించు అవకాశములున్నవి. కావున ఈ రాశివారు ఈ మాసమునందు సునిశిత విషయములయందు ఇంటిలో వాగ్వాదములకు దిగకుండ జాగ్రత్తగా నుండవలెను. కానీ పంచమమునందున్న గురుడు ఈ విషయమునందు అనుకూలముగా నుండుటచే వివాదములు ముదిరి ఇబ్బందికర పరిస్థితులను కలిగించు అవకాశములు తక్కువ. అయిననూ జాగ్రత్త అవసరము.

        గురుని ప్రభావకారణముగా అనుకూలఫలితములు కూడ కనబడగలవు. కానీ ఈ అనుకూలతను సర్వత్ర ఆపాదించలేము.  పనిచేయు స్థానము మరియు విద్యావ్యాసంగములయందు పరిస్థితులు అనుకూలముగా నుండగలవు. ఈ పూర్వార్థమునందు తెలియని బాధ వెంటాడు అవకాశమున్నది. ఈ ఫలము శనివలన సంభవించుచున్నది కావున తగిన ఉపాయమును అనుసరించ గలరు.

        ఉత్తరార్థమునందు మరికొన్ని గ్రహములు అశుభస్థానమును చేరుచున్నవి కావున శుభత్వము మరింత తగ్గు అవకాశమున్నది. ఈ పరిస్థితులను అధిగమించుటకు సాధ్యమయినంతవరకు నీలము పువ్వులతో శివారాధన, శ్రీ వేంకటేశ్వర దర్శనము మరియు ధ్యానము తప్పక ఆచరించగలరు.

http://www.jagjituppal.com/images/2scorp.gif

వృశ్చికరాశి

విశాఖ (4 పాదం), అనూరాధ (అన్ని పాదాలు), జ్యేష్ట (అన్ని పాదాలు)

 

పూర్వార్థమునందు అనుకూలముగా పనిచేయు గ్రహములు మరియు ప్రతికూలముగా పనిచేయుగ్రహముల బలము సమానముగా నున్నది. కావున ప్రతీపనియందు దాగుడుమూతలు తప్పదు. ఏ పని పూర్తవుతుంది ఏది కాదు అని చెప్పుట కష్టము. ఊహించినది జరగకపోవడము మరియు ఊహించనిది జరగడము ఈ సమయములో చాలా సాధారణము.

        ధనలాభము, భార్య సహకారము, క్రింద పనిచేయువారి సహకారము ఈ సమయములో ఈ రాశివారికి ఎక్కువగా సహకరించు విషయములు. విశ్రాంతి తీసుకోలేకపోవడము, బంధుజనులనుండి ఇబ్బందులు వీరిని ముఖ్యముగా ఇబ్బందికి గురిచేయు అంశములు.

        ఉత్తరార్థమునందు కూడ పెద్ద మార్పు ఉండు అవకాశములేదు. ఆరోగ్యపరముగా కొంచము ఈ సమయములో శ్రద్ధ వహించవలెను. సూర్యనమస్కారములు మరియు బిల్వదలములతో స్నానము ఈ రాశివారికి రక్తచాపము మరియు మధుమేహము వంటి ఇబ్బందులనుండి ఉపశమును చేకూర్చగలవు.

http://www.jagjituppal.com/images/2saggi.gif

ధనూరాశి

మూల (అన్ని పాదాలు), పూర్వాషాడ (అన్ని పాదాలు), ఉత్తరాషాడ (1 పాదం)

               

ఈ మాసపు పూర్వార్థము ఈ రాశివారికి పూర్తి అనుకూలముగా ఉండు సమయము.  కార్యస్థానమునందు పదోన్నతులు లభించగలవు. ధనసంగ్రహముజరుపు అవకాశమున్నది. సుఖమును పొందగలరు. విరోధులు కొంతవరకూ శాంతించెదరు. రోగములనుండి విముక్తి లభించగలదు. మితృల సహాయసహకారములు లభించగలవు.

కుజుని వంటి కొన్ని గ్రహములనుండి శారీరిక ఇబ్బందులు ఎదురయినప్పటికీ మిగిలిన గ్రహముల ఆనుకూలత వలన మాసముయొక్క ఈ భాగము వీరికి అనుకూలముగా నడవగలదు.

ఉత్తరార్థమునందు సూర్యుని రాశిమార్పుచే కొంతవరకూ పరిస్థితులయందు ప్రతికూలత ఏర్పడు అవకాశమున్నది. కావున పూర్వార్థమునందు సాధ్యమయినన్ని కార్యములను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించగలరు.  ఉత్తరార్థమునందు సూర్యనమస్కారములు మరియు సూర్యునికి అర్ఘ్యప్రదానము అనుకూలఫలములనివ్వగలవు. రాగిపాత్రలోని నీటిని, కొంచము కుంకుమ కలిపిన నీటిని స్నానముచేయుటకు ఉపయోగించుట ద్వారా సూర్యుని శుభత్వమును పొందగలరు.

 

http://www.jagjituppal.com/images/2capricon.gif

మకరరాశి

ఉత్తరాషాడ (2,3,4 పాదాలు), శ్రావణ (అన్ని పాదాలు), ధనిష్ట (1,2 పాదాలు)

ఈ రాశివారికి ఈ మాసపు పూర్వార్థము పూర్తిగా అనుకూలముగా నున్నది. కొంచము ఇబ్బంది కలిగించు విషయము భార్యాభర్తలయందు కలహములు. తిండిపై నియంత్రణ చాలా అవసరము. అజీర్ణము మరియు గుప్తజ్వరము కారణముగా కొంత ఇబ్బంది పడు అవకాశమున్నది. ధనపరముగా, మధ్యవర్తిత్వములయందు, భోజనవిషయములయందు వీరికి అనుకూల అవకాశములు ఎక్కువగా లభించును.

ఉత్తరార్థమునందు సూర్యప్రభావకారణముగా కార్యములను సాధించగలరు. కార్యస్థాలమునందు ఉత్సాహము పెరుగును. ఉన్నతస్థానములకై ప్రయత్నించుటకు మంచి సమయము. ప్రభుత్వపరమైన కార్యములయందు, ఉద్యోగపరముగ ధనము పోగుచేయు అవకాశమున్నది. ఇతరులవద్ద కొంతకాలముగా ఉన్న ధనము తిరిగి పొందగలరు.

నవమమందున్న శని శతృవులను పెంచగలడు. కావున జాగ్రత్త అవసరము. సాధ్యమయినంత వరకూ వివాదముల జోలికి పోరాదు. నీలము పువ్వులతో శివుని ఆరాధించగలరు.

http://www.jagjituppal.com/images/2aqua.gif

కుంభరాశి

ధనిష్ట (3,4 పాదాలు), శతభిష (అన్ని పాదాలు) , పూర్వాభాద్ర (1,2,3 పాదాలు)

 

ప్రస్తుతము ముఖ్యమైన గ్రహముల ఆగ్రహమును చవిచూస్తున్న ముఖ్యమైన రాశి ఇది. గత కొద్ది కాలముగా గురుని అశుభస్థితి కారణముగా ఈ రాశివారు ఉద్యోగపరముగా ఇబ్బందులనెదుర్కొనుచున్నారు. చాలామందికి ఈ సమయములో స్థానమార్పిడి జరిగే అవకాశము కూడా ఉన్నది. దానికి తోడు రవి స్థితికూడ అక్కడే ఉండడము శారీరికముగా మరియు ఆధికారికముగా వీరిని మరింత ఇబ్బందికి గురి చేస్తున్నది. వారికి తోడు అష్టమమునందున్న శని గ్రామాంతరసంచారము మరియు దేశాంతరసంచారమును కలుగజేస్తున్నాడు. ఆ కారణముగా ఏర్పడు ప్రయాణములు చాలా ఎక్కువ. కుటుంబసభ్యులకు కేటాయించగల సమయము కూడ చాలా తక్కువ.

వీరికి అనుకూలముగానున్న గ్రహము కుజుడు. ఈ కుజునికారణముగా వీరి పరాక్రమము తారాస్థాయిలో కొనసాగు సమయమిది. ఆ కారణముగా వీరు ఇతరులపై తమ ప్రభావమును ఈ సమయములో చూపెట్టు అవకాశములెక్కువ.

        ఉత్తరార్థమునందు కొంతవరకూ పరిస్థితులు మెరుగు పడ గలవు. ఆర్థికపరిస్థితి మెల్ల మెల్లగా అదుపులోకి రాగలదు, గురు శనులను ఖచ్చితముగా అనుకూలురుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. వారి సహకారములేకుండా ఏ కార్యమునందునా వీరు అనుకూలఫలములను పొందడము కష్టము.

 

http://www.jagjituppal.com/images/2psices.gif

మీనరాశి

పూర్వాభాద్ర (4 పాదం), ఉత్తరాభాద్ర (అన్ని పాదాలు), రేవతి (అన్ని పాదాలు)

 

శుకృడు మినహా ఏ గ్రహమూ అనుకూలముగా లేదు. ఆ కుజుడు ధనలాభమును మరియు వస్త్రలాభమును సూచిస్తున్నాడు. ఇంతమాత్రముచేత ఆనందించవలసినది ఏమున్నది అని అనుకొనుట కన్నా మధ్య మధ్యలో ఇదైనా ఉంది అనుకునే పరిస్థితి వీరిది. ఈ పరిస్థితి మారడానికి సమయము పడుతుంది.

త్రిప్పట ఈ సమయములో చాలా అధికము. ప్రశాంతముగా సమయమును గడపవలెనన్న కోరిక రోజు రోజకూ పెరిగితుంది. కానీ ప్రస్తుతానికి ఊరట లభించే అవకాశములు తక్కువ. మానసికమైన ఆందోళనలు ఇబ్బందికి గురి చేయగలవు.

అనుకూలములు మరియు ప్రతికూలములు ఒకదాని తరువాత        ఒకటి వస్తూ ఉంటాయి. అనుకూల సమయము వచ్చినప్పుడు కార్యములను పూర్తి చేసుకోవడము, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కర్రవ్యములను పూర్తిచేయడము, సహనముతో ఉండడము చేయవలెను.

గ్రహముల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడానికి దైవారాధన, స్నానధ్యానములు ఆచరించవలెను. కావున ఈ రాశివారు రుద్రాభిషేకములు చేయించుకొనుట ద్వారా గ్రహముల అశుభఫలములనుండి ఊరటను పొందగలరు.

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం