గీత రచన: రావు తల్లాప్రగడ

సంగీతం: సాయి మానాప్రగడ

ఈ గీతం వినడానికి:  
          (బటన్ నొక్కాక పాట వినడానికి అవసరమైతే కొంచెం వేచి ఉండగలరు)                                   

 

టీవల సిలికానాంధ్ర నిర్వహించిన ఆంధ్రసాంస్కృతికోత్సవంలో ప్రియభారతం అనే నృత్యరూపకంలో, వివిధ రాష్త్రాలకు సంబంధించిన సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, వారి బాణీలపై తెలుగులో పాటలు కట్టి, వాటికి నృత్యరూపకలపన జరిపి, ప్రదర్శించడం జరిగింది. ఆ సంధర్భంగా ఈ పాటల CDని కూడా విడుదలచేయడం జరిగింది. ఇందులో మొదటి పాట ఈ మాసం మీ ముందుకు తెస్తున్నాము.

 

గుజరాతీ (గర్భా) పాట

 

పల్లవి)

రేపల్లె ఊగుతు నల్లనివానికై,   పొద్దోయిన నిద్దరనే వద్దన సాగె  

నిశిబెదిరి కలవరమై, నలుపు వాని మెరుపెదుర, మాధవ నీనలుపె పొద్దన సాగె

చరణం 1)

బృందా వనిమొత్తం ఒకటే మాటది, అందరు గోపికల ఒకటే పాటది,

మెరుపు లయా నడకలకూ, మొలక నగవు నటన లకూ, రేయిని వదిలేస్తే ముద్దన సాగే

చరణం 2)

గరుడపచ్చ పూసై కాంతులు విరజిమ్మే, చింతా మణివాడే, నీలము మణివాడే,  

అసలు మణే తలమెరువ, సిసలు వనిత బృందావని, తన వెలుగులొ తనెతడసి ముద్దవ సాగె!

చరణం 3)

గొల్లెత పిల్లలకీ చేతికి దక్కిన, వెలిగే మాణిక్యం వెంటనే యుండగ

నిశితానే  పరవశమై, అతని నలుపె మెరుగనుచూ, ఓటమినే ఒప్పుకొని సద్దుకు సాగె!

 

 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech