పద్యాలు

                                        -శ్రీమతి శ్రీపతి బాలసరస్వతి.

 


1.     నేటి అగారమందు మరి నేరుపు నెయ్యము నిండి ఉండగన్

        రాటు జగాన మానసము రంజిలు శాంతియె పంటపండగన్

        మేటి ఉగాది వచ్చునదె మానవులందరి మంచిచేయగన్

        సాటి నిగారమున్ కలుగు సంతసముండున నాకమందునన్

2.     తెచ్చును చింతదూరమగు తేకువనెప్పుడు చింతపండు, మా

        కిచ్చును మావి వేపపువు ఇంపగు మేలు నరోగభావమున్

        వచ్చును బెల్లమున్, చెరకువల్లనె జీవన మాధురీమదిన్

        ఎచ్చు ఉగాది పచ్చడికి ఎచ్చట ఉండదు ఏదియున్

        మెచ్చునుగాది లక్ష్మి మరి మెండుగ నిచ్చుచు దీవెనెంతయొ!

 

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం