వికృతి పెండ్లి పిలుపు

 

- వేదుల బాలకృష్ణమూర్తి

 

||వె||   క్రొత్త వత్సరమున క్రొత్త చిగురుమేసి

            క్రొత్త పాటపాడె కోకిలమ్మ

            ‘వికృతి వత్సరంబు విజ్ఞానదాయియై

            శుభములొసగుకాక అభయమిడుచు

 

సీ||      నవవసంతమ్మున నందన వనమున

          చైత్రపాడ్యమి శుభసమయమందు

          ‘మాధవీలత’ ‘గున్న మామిడి ప్రేయసీ

          ప్రియులకు ఘనముగా పెండ్లిజరుగు

          మరుమల్లె చామంతి మందారపూలతో

          తోరణాల్ కట్టిరి ద్వారములకు

          గంధవహుండు సుగంధాలతో గూడి

          ఆహ్వానపత్రికలందజేసె

          పికములగానమ్ము శుకముల వాద్యమ్ము

          నెమలుల నాట్యమ్ము నింగినంట

          మలయ పవనుడును మదనుడుసాక్షిగా

          జరుగు వివాహ ఉత్సవమునందు

 

తే||గీ|| “మాధవీ లతాంగికిగున్నమావి వరుడు

          కట్టు మంగళ సూత్రము కంథమందు

          అక్షతలు చల్లరే పశుపక్షలార!

          దీ వెనలనీయరే వనదేవులార!

          ‘వికృతి సంవత్సరాదిన విందుజరుగు

          అందరును రండు! ఆతిధ్యమందుకొనుడు!

 

 
 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం