జగమెరిగిన సత్యం

ద్వాదశి రామలక్ష్మి

 విలీన గగనంలో విహరించే గాలిపటమా
సూత్రమే తెగినచో నీపాత్ర ఎమగునో?
కరిమబ్బు తలచునులే గగనమంత నాదని
గాలివీచ మబ్బుతునక కరిగి నీరై పోవులే
కాలనాగు ఆడునులే పడగ విప్పి అడవిలో
అందమైన నెమలి దాన్ని అణచునని తెలియక
అందమైన కొలనులో తేలియాడు నీటి బుడగ
శాస్వతమని నాట్యమాడు క్షణమే తన బతుకని తెలియక
జాబిల్లి తనవాడని వికసించు కలువభామ
తెలియలేదు రవికిరణము తనని సోక ముకులించునని
పదవులు శాస్వతమని భ్రమచందే మానవులు
బంతి వలే పైకెగిరి గెంతుదురు స్థిరములేక
జననమే మరణమని, మరణమే జననమని
ఈ సత్యము తెలియలేక మమతలతో మునుగుతారు
ఏదీ శాస్వతమని తలచబోకె నీ మదిలో
రెక్కలు తెగిన పక్షిలాగ దిక్కులేక పడిపోదువు

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం