పెళ్ళి గురువు

- పి.సుబ్రహ్మణ్యం

 

 ఇది ఒకరకంగా కధ కాదు, ఇది పారడీ కాదు, మరి ఇంకేమిటి అనచ్చు. ఇది ఏరకమయిన హావభావాలు కాంప్లెక్సు లేని చర్చావేదిక. ఒక హాస్యంగా వ్యక్తీకరించిన సాధారణమయిన యువకుల సందేహాల మాలిక.

కిరణ్ ఒక యువకుడు.. సమకాలీనమయిన సమాజమనకుండా, సొసైటీ అనాలి, ఆ సొసైటీ లో ప్రతీ యువకుడూ అమాయకుడే. అలాగే అతి స్పీడు, అందులో ఆధునికత. కంప్యూటరు యుగం రంగుల సినిమాలు ఐమాక్స్ లు ఇంటర్ నెట్ లతో ఏది నిజమో ఏదబద్దమో, ఎవరిని అడగాలో, ఏమాట ని వినాలో తెలియని పరిస్థితి. తండ్రి సెక్సు గురించి చెప్పడు, తల్లి ప్రేమ గురించి చెప్పదు. కానీ వాళ్ళకు కావలసింది తన కొడుకో, కూతురో, కనీసం అల్లుడైనా సరే, అమెరికా కానీ లండన్ కానీ వెళ్ళడమే.

కిరణ్ అమాయకమయిన రాజమండ్రి వాసి. అతను కొంత కాలం క్రితం హైద్రాబాదు వచ్చేడు, అంతకన్న అతన్ని ఒక స్నేహితుడు తీసుకొచ్చాడనటం సబబుగా వుంటుంది.

కొన్నిరోజులయింది............................
ఇద్దరూ ఇంటర్నెట్ కేఫెకి వెళ్ళారు. తనపని చూసుకుని కిరణ్ వున్న కేబిన్ వైపు వచ్చి చూసాడు. వెంటనే కిరణ్ పి.సి స్ర్కీన్ మూసేశాడు. బూతుబొమ్మలు చూస్తున్నావా? అడిగాను.ఉత్తినే సరదాకి నాన్చేడు. వావి వరస లేకుండా బంధువూ పరాయి ఆడదీ అనుకోకుండా పెళ్ళయిందీ లేనిదీ బేధం లేకుండా ఆబొమ్మలు చూస్తూ ఎవరెవర్నో ఊహించుకుంటూ చూసేస్తావా? అడిగాను. ఫారిన్ వాళ్ళు కదా? అన్నాడు వాళ్ళంత చవకై పోయారా అడిగాను.
చీ. మరీ దారుణంగా మాట్లాడుతున్నావురా? డిఫెన్సులో పడ్డాడు.
మరి అన్నాను
ఏం చేయాలి అన్నాడు
ఆకలేస్తోంది అన్నం తింటావా? తిన్నట్లు నటిస్తావా ? అడిగాను
మరి మనమేదైనా చేస్తే మనం చేసుకునే అమ్మాయికి అన్యాయం అవుతుంది కదరా అన్నాడు.
అంటే మిగతా వాళ్ళకి అన్యాయం చేయగల సాహసం వుంది? అడిగాను
మాట లేదు... ఇద్దరం బయటకు వచ్చాము... సిగరెట్టు తీసుకుని ముట్టించాను.
ప్రేమ లవ్ అనేవి చాటింగ్ లో దొరకవురా .. అందులొ పుట్టవు కూడా. పదో తరగతి చదివేవాడికి లవ్ ఏమిటి?
ఇంటర్ చదివే అమ్మాయికి భవిష్యత్ గురించి ఏమి తెలసనుకుని ప్రేమలో పడింది? ఇదసలు ప్రేమా? లేక సినిమాలని మనం చూసి చూసి కాపీ కొడదామని అనుకుంటున్నామా?
లైఫ్ ని కూడా కాపీ కొడతామనుకోవచ్చా?
"ఇంత లెక్చర్ ఎందుకూ? నిజానికి కాలేజీ లో బాయ్ ఫ్రెండు లేకపోతే అమ్మాయిని కుక్కలాగ చూస్తారు, అబ్బాయిని ఫూల్ లాగా ఏడిపిస్తారు తెలుసా? అడిగాడు.
అదే, చెపుదామని. ఒకరు గతిలేక కొంచెం చిరిగిన, మాసిపోయిన ఫ్యాంటు వేసుకుని పేద్ద షాపులోకి వెల్తే, అదొక ఫ్యాషనై జీన్సయి కూచుంది. చలి ఎక్కువయిందని బనీను చొక్కామీద వేసుకుంటే అదికూడా ఫ్యాషనయింది. ఫ్యాంటు వూడి పోతే దాని తగలయ్య, అదొక సినిమాలో అదీ ఫ్యాషనయి పోయింది. అంతవరకూ బాగానే వుంది, జీవితాలకు కూడా ఫ్యాషన్ అంటుకుంటే మరేలాగ రా? అడిగాను.

ఇన్నిసినిమాలు చూసినవాడికి ఇంతో కొంతో తనూ కొంత చూపిద్దామను కోవటం తప్పా గురూ? అడిగాడు.
చూపించు తప్పులేదు దాన్ని జీవితంతో ముడిపెడతానంటేనే ప్రమాదంలో పడతావంటాను. అన్నాను
అసలు ప్రేమ అంటే అడిగాడు. అది తెలిస్తే ఇన్నిగొడవలు ఎలా వస్తాయి అన్నాడు

"పద, టీ తాగుదాం" అని నడిచాను కిరణ్ తీసుకుని నడుస్తూ.
"అదికాదు గురూ, నీకు ముప్పై దాటాయా?"
"వచ్చేయి" అన్నాను
"మరి ఈ పాటికి నీకో ప్రేమ కధ దారుణంగా పతాకసన్నివేశంలోనో, ఇంట్రవెల్ లోనో వుండాలి కదా ఇంకా పేర్లేన మొదలెట్టలేదు" అన్నాడు కిరణ్
ఇంగ్లీషు సినిమాలెప్పుడైనా చూసావా? అడిగాను మరో సిగరెట్టు తీసుకుని.
బోలెడన్ని బెన్ హర్, సౌన్డ్ ఆప్ మ్యూజిక్, టెన్ కమాండ్మెంట్స్ ... " ఇంకా చెపుతున్నాడు.
"మెకన్నస్ గోల్డ్, జురాసిక్ పార్క్ ... ఇవేనా? అవి మాఅప్పాయమ్మ వుంది చూసావూ, ఆవిడా చూసింది అవి కావు!
" మరేవీ"
ప్లేరప్" చూసావా?
"అదేమిటి అందులోకి వెళ్ళావు? "
"ఇంగ్లీషు సినిమాల్లొ పేర్లు ఆఖర్లో వస్తాయి, ముందుకాదు. " అన్నాను
"ఏడిచినట్లుంది" విసుగ్గా ఓ హోటలుముందు ఆగి చూస్తున్నాడు.
"నీ వయసెంత" కిరణ్ ని లోపలికి తోస్తూ అడిగాను.

భాగ్ లింగంపల్లి ఇరాని హాటల్ లో, కప్పులు చప్పుడు లొ గ్లాసు చప్పుళ్ళు కలిసి, అవి సర్వర్ల అరుపులుతొ మిళితమై సిగరెట్టు పొగల మేఘాలలో ఐక్యమై, మధ్యలో న్యూస్ పేపర్ల చప్పుడుకి లయ కలిపి జనాలని "అరవండోయ్, అరవండి" అని వుసి కొల్పుతున్నట్లు వుందా పరిస్థితి.
"ఇరవై రెండు" అన్నాడు. ఓ కుర్చీ లో కూర్చుని, మరోటి నాకు తోస్తూ...
నే నటూ ఇటూ చూసి, ఒక ఎర్రచొక్కా వాణ్ణి స్పాట్ చేసి, రెండు వ్రేళ్ళు చంద్రబాబు గారిలా చూపించాను.
ఆ ఎర్ర చొక్కా "దో చాయ్ ..." అనరుస్తూ మరొచోటికి వెళ్ళి పోయింది.
"అపుడే ఎన్ని చూశావు?
"ఇంకా ఏమీ చూడ లేదు " నత్తి నత్తి గా పలికేడు.
"చవట సన్నాసి. మరి నేనేదో ఎండిపోతున్నట్లు, పనికి రానివాణ్ణయినట్లు, నాశనమయినట్లు బాధపడిపోతున్నావే?
"కాదు గురూ నీ దగ్గిర ఏదయినా నేర్చుకుందావని " మెల్లిగా పలికేడు.
"అమ్మదొంగా మరి చాలా ఖబుర్లు చేపుతావు కదరా. భూగోళంలొ, మెరకెక్కడ, పీఠభూమెక్కడ, లోయలెక్కడ, పర్వతాలు ఎలావుంటాయి అన్నీ నొట్లోంచి వూట వూర్చు కుంటూ ఏకరువు పెడతావు?"
"అవన్నీ హిష్టరీ బుక్కులో చదివాను " మెల్లిగా అన్నాడు.
"అందులో మొత్తం బుక్కు యెలా పట్టింది ?"
"సగం సగం చింపి వాయిదాల ప్రకారం చధువుతామోయ్"
"సరే ఎవర్నేనా లవ్, ప్రేమ లాంటివి చేస్తున్నావా?"
"ముందు మీ సంగతి చెప్పండి గురూ" అన్నాడు.
"నా సంగతే ఎందుకు కావలిసివచ్చింది?
"నా సంగతడిగావు, మరి, నీవయితే నీకు ఆడదంటే అసహ్యం అని అన్నట్లు గుర్తు!" అడిగాడు.
"అయితే?
మగాళ్ళంటే ఇష్టమా?
అనన్నానా?
అన్నట్లే కదా మరి!
నీవనుకుంటె సరిపోయిందా?
మరి?
యూ సీ మిస్టర్ కిరణ్, నేనెందుకు ఆడదాని వెంట పడాలి?
"అవునూ అదీ పాయింటే!" అని, .
"కానీ అందరూ పడుతున్నారు కదా నీవెందుకు అలా వున్నావూ అని! " అని ముగించాడు.
అంటే నేను పడాలా? పడ నోయ్! " అన్నాను
మరెలాగ
"ఆమె, నావెంట పడాలి" అన్నాను.
"గురూ నీవింత బావుంటావు, నీ జుత్తు, నీ బుగ్గలు, నీపర్సనాలిటీ నీ నడక చాలా బావుంటాయి. ఒక్కసారి ఒక చూపు చూశావనుకో అందరూ నీ వెంటె వుంటారు అన్నాడు.
ఇంతలో రెండు టీ కప్పులు ఢభేల్ మంటూ టెబుల్ మీద వచ్చి పడ్డాయి ఆ వెనువెంటనే, రెండు గ్లాసులు చప్పుడుతోనూ నీళ్ళతొనూ వచ్చెయి.
"నీవు, చాలా పుస్తకాలు చదివేవు కదా," అడిగాను
"యెస్" అన్నాడు
"ఒక్క విషయం వివరించు, విశదీకరించు, విశ్లేషించి విపులంగా వేటికవి వేరుగా చెప్పు" అనడిగాను.
"ఓకే " అన్నాడు కిరణ్
"నేనెలా వున్నానూ? బావున్నానూ అంటావు. అదేం ఖర్మొ తెలియదు, ఏ అమ్మాయిని చూడు, పెళ్ళయినదయినా కానిదైనా, ఆమేకేసి చూడగానే, నాకే వుద్దేశ్యం లేకపోయినా, ఆమె వెంటనే పమిట సర్ధుకోవటమో, నడుస్తుంటె ఆగి నడవటమో ఎదురుగా చూసే వారు తలవంచు కోవటమో చేయటం జరుగుతూ వుంటుంది." అన్నాను.
"నీ కళ్ళలో ఒకరకమయినదేదో వుంది" అన్నాడు.
"ఏమిటది అన్నదే నాప్రశ్న"
"నిజం చెప్పనా : అడిగేడు
"అందుకేనోయ్ నేనడిగేది" అన్నాను
"నీ కళ్ళు మామూలు కళ్ళు కాదు, అవి వెతుకుతాయి, సూదితో కెలికినట్లు వుంటుంది, వీడెందుకు నావేంట పడడూ, వీడివెనకప్పుడే పదిమందున్నారనుకునే వారు, వీడికినేనచ్చుతానా అనుకునేవారు..... "
"డబ్భేనా కావాలా రా? " అడిగేను
"ఆ ప్రశ్న ఏమిటి " అడిగాడు
"నీవు మరీగా పొగుడుతూంటే? "
"నీవేగదా చెప్పమన్నావు?" అన్నాడు.
"సరేలే ఆపేసేయ్"
"నీవేనా కధ నడిపితే అందులో మజా చూద్ధామని వుంది" అన్నాడు
" ప్రతి పెళ్ళికొడుక్కీ పెళ్ళికూతురు చాలా అందంగా కనిపిస్తుంది. అలాంటి పిల్ల తనెక్కడా చూసి వుండనట్లు తనకు తానే అనుకుంటాడు అవునా" అన్నాను
"అవును? ఈ సబ్జెక్టు మొదలేట్టావేమిటి? అనడిగాడు.
" అసలు ముగ్గురు దాటి నాలుగో పెళ్ళిచూపులకు వెళ్ళినవాడికి ఆడదంటే తెలియదనే చెప్పాలి. ఎలాగంటావా? తల్లో, నాన్నో, అక్కో, చెల్లో, అత్తయ్యొ, వదినో మొదటగా చూసి బావుందిరా చేసికో అనేవరకూ చూడకూడదు. ఎందుకంటే, అప్పటి వయసు అలాంటిది, మనమేదో ఒక రకంగా వూహించికోని అల్లా వుందనుకుని ఏఅమ్మాయిని చూసినా అల్లాగే కనిపిస్తుంది. బయటివారికి మామూలుగా కనిపించే పిల్ల మనకి రంభలా వుంటుంది. ఒక్కసారి, స్టాటిస్టిక్సు తీసుకో, తనే తలచి, తనే వెదికి వెదికి జల్లెడ చేసి కోరిన అమ్మాయి నెత్తినెక్కీ కూర్చుంటుంది. అదే, అమ్మ నాన్నలు నీ వ్యవహారం బాగా తెలిసిన వాళ్ళు కనక తగిన పిల్లను తీసుకొస్తారు.
"అర్ధమవలేదు గురూ" అన్నాడు కిరణ్
"ముగ్గుర్ని కన్న చూడకు, ఈలోపులోనే ఖాయం చేసేసుకో, నీవు నమ్మినవాళ్ళని వెళ్ళి ఎంతమందినయినా చూడమను వాళ్ళు చెప్పినది విని కావాలంటె చూడు. ఫ్ర్రేమ అనేది నిజానికి నీకు స్వతహాగా వచ్చినది కాదు, నీ ఫ్రెండుని చూసొ, నెట్లో వినో, చాటింగ్ లో పడొ, సిన్మాలు చూసో నీవు వాతలు పెట్టుకున్నావు తప్ప మరోటి కాదు. ప్రేమించాలి అంటే, ఇంట్లో చెప్పకుండా అడ్డొచ్చినదాన్ని ప్రేమించ మనలేదు, కాలేజీలోనే ప్రేమించాలి, మరో కాస్టునే చూడాలి, అలాంటిరూల్సు లేవు. యూఆర్ ఒన్లీ మేకింగ్ యువర్ లైఫ్ మిజరబుల్. పెళ్ల్లిచేసుకో, ఆమెనే ముద్దుగా మర్యాదగా, అందంగా, అతి శృంగారంగా ప్రేమించవచ్చు! " అన్నాను
"అదెలా సాధ్యం! ప్రేమ వేరూ, పెళ్ళివేరూ కదరా" అన్నాడు.
"పెళ్ళవగానే శోభనం ఆతరవాత పిల్లలూ అని రూలు ఏనా వుందా?
లేదే!
మరి, పెళ్ళయిన తొమ్మిదినెలలకే, పిల్లలెందుకురా.. చక్కగా అయిదేళ్ళు అవలీలగా నిరభ్యంతరంగా సిన్మాలకెళ్తూ, మధ్యలో అత్తారింటికెళ్తూ, దాంతో విరహంలో తాగుతూ, ముక్తిని పొందుతూ, డబ్బు దాచు కోవచ్చు, సంసారం, దాంపత్యం, అన్నీ అనుభవించవచ్చు. అన్నాను.
అవునురా, నాకూ తెలీదు... అన్నాడు.
సో, ఈప్రేమ అనేది ఒకరకంగా పెళ్ళనేది లేకుండా క్రీడించే వీలుగా ఒక మధ్యే మార్గంగా ఎన్నుకుంటున్నారు ఈ జనం. ఇది తెలీని అమ్మాయిలు బలై పోతున్నారు. ఇంత తెలివయిన అమ్మాయిలు ఇలా పాడయిపోతున్నారనేది ఒకరకంగా వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లొ వున్న పెంపక లోపమా, లేక స్నేహితుల లోపమా, లేక వాళ్ళకు చదువు నేర్పటమే ఒక తప్పా లేదా ఈ సినిమాలూ కధలూ వీళ్ళని ఇలా మార్చేయా అనేవి వాళ్ళు తెలుసికోవాలి తప్ప మనం చెపితే వాళ్ళకు అంటదు.
అవునురా నిజానికి ఆడపిల్లలు నాశనమయి పోతున్నారు.
"మరిప్పుడు నేను ప్రేమా గీమా అన్నాననుకో మా ఇంట్లో వాళ్ళు గేదె ఎదకొచ్చిందని పిల్లని చూసి జొక్ చేసేనని చెప్పినా వినకుండా ఒకర్తిని చూసి కట్టేస్తారు. ఆ వచ్చేదే అలాంటిదే అనుకో, తొమ్మిది నెలలు తిరిగే సరికి పిల్లాడు పుట్టుకొస్తాడు, తర్వాత ఇక, వుచ్చలు, విరేచనాలు, ఆసుపత్రులు, రొంపలూ, దగ్గులూ, విక్సులూ, ఫారెక్సులూ, దాంతో, లేని పోని ఆర్బాటాలు, అప్పులూ, క్రెడిట్ కార్డులూ, వడ్డీలు, కొట్లాటలూ నిజానికో నరకం మనెదురుగా నిలబడి వుంటుంది.

"నీవు చెపుతూంటే భయమేస్తోందిరా! కానీ ఒక అమ్మాయి తనంతట తాను దగ్గిరదగ్గిరకి వచ్చి నీవెంత బావులేకపోయినా సరే నీతో పరిచయం పెంచుకుని, నీకోసం ఎదురుచూపులు చూసి, నీతో తిరిగి నిన్నే ప్రేమిస్తున్నా అనందనుకో, ఏం చేస్తాం? అన్నాడు కిరణ్

అదిగో అలాంటి విషయాలలో నీవు జాగ్రత్తగా అలోచించాలి. మద్రాసులో ఒక శర్మగారని వుండే వారు, మద్యకుటుంబీకులు, ఆయనకో కొడుకు కూతురు. కొడుకు చాలా పెద్దచదువు చదివాడు.. ఆ సమయంలోనే అతనికి ఒక మంగుళూరు అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రేమించుకున్నారు. అలా అని వెంటనే పేళ్ళిచేసుకోలేదు. ఆమె తన తండ్రితో ఆ విషయం చెప్పింది. ఆయనొక టీ ఎస్టేట్ కి యజమాని. పెద్ధకార్లు విమానాలలో ప్రయాణాలు. అతను తన తండ్రితో చెప్పాడు. ఇప్పుడు పెళ్ళి చేసుకోము, చదువింకా రెండు సంవత్సరాలుంది, ఆ తరువాత మరో రెండు ఏళ్ళు ఇద్దరం ఉద్యోగాలు చేస్తాము ఆ తరువాత ఒక సారి అలోచించుకుని ఓ.కే అనుకుంటే మేము రడీ అన్నాడు.ఇది విని అటు అమ్మాయి తండ్రి, అబ్బాయి తండ్రి చాలా సంతోషించారు ..ఇప్పుడు హాయి గా వున్నారు కూడా!

"నలభయ్ ఏళ్ల్లు అయిపోయాయి అంటారు, నిజానికి ఒక రోజులో ఆరు గంటలు నిద్రపోతాము, మిగిలినవి పద్ధెనిమిది, అందులో కనీసం ఎనిమిది గంటలు ఆఫీసులొ, ఆ తర్వాత ఆరు గంటలు బస్సుకోసమో, బజారుకనో, టీ వీ కో, గుడికనో, తీసేయి, భోజనానికో మరోటొ కూడా తీసేయి, మిగిలినవి ఎన్ని?"
" రెండు " అన్నాడు.
ఇదలా వుంచు... నలభై లో పదేళ్ళు చిన్నతనంలొ అయిపోయాయి. పదేళ్ళు కాలేజే తినేసింది. మిగిలింది పదిహేను అందులో ఇందాకా చెప్పిన ప్రకారం సగానికి పైగా, నిద్ర, భొజనం తీసేస్తె, ఒక్క అయిదేళ్ళు మిగులుతాయి. ఇలాంటి వ్యవస్త లో నీవూ నీ భార్య ఎంతకాలం సుఖంగా వున్నారనుకుంటారు?
"నాకు పెళ్ళిమీద విరక్తి పుట్టించావు కదరా" అన్నాడు.

ఇది జరిగిన పదిరోజులకి ...
రొడ్డు అవతలివైపు తొపుడు బళ్ళ మధ్య నించి దాటుకుంటూ కిరణ్ వెళ్ళిపోతూ వుంటే చూసి...
"హల్లో కిరణ్ వూర్లోలేవా? ఏ వూరేల్లేవు, ఎపుడొచ్చేవు" అడిగేశాను
విన్నారు కదా, మంచి ఎలిబీ కూడా ఇచ్చేను జవాబు చెప్పడానికి.
ఏదొ వూరు చెప్పి నిన్ననే వచ్చానని చెప్పచ్చు, లెదా రొడ్డు దాటే లోపల వెయ్యి అబద్దాలు అల్లవచ్చు.
మెల్లిగా వచ్చేడు "ఈ వూర్లోనే వున్నా ఇంట్లో పనేక్కువయిందీ.. " అన్నాడు.
"సరే బాగానే వున్నావా? అడిగాను
"అదేమిటొ బాస్! మీతో మాట్లాడి ఎన్నొ నెలలు అయినట్లయిపోయింది" మాట కొంచెం నీరసంగా వుంది కాని, మొఖం మాత్రం క్లీన్ గా వుంది.
"పచ్చిగుడ్లు తినటం అలవాటయిందా?"
"అవేంటండి? కిలో ఎంతట? "
"వారినీ, గుడ్లు ! కోడి గుడ్లు!! అన్నాను
"అవా! ఆమ్లెట్లు తింటాను" అన్నాడు
"గుడ్లు పగలకొట్టె పాలలో వేసుకుని, రాత్రి పడుకోబోయె ముందు తాగు, అరొగ్యము అనందము కూడా"
"సరే కానీ మీరే మరీ చిక్కినట్లు కనిపిస్తున్నారు? " అన్నాడు
ఒకసారి నాకు ఆనినంత మేర చూసుకున్నాను "ఫ్చ్! నాకేమీ అనిపించలేదొయ్! "

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech