ఫన్చాంగ శ్రవణం
 

 శ్రీ గురుభ్యోనమ:

కేవలం ప్రతీ రోజూ మారిపోతున్న రాజకీయ సమీకరణాల వల్ల అస్తవ్యస్తమౌతున్న ప్రజా జీవితానికి రిలీఫ్ కోసం సరదాకి వ్రాసిన శీర్షిక, భవిష్యత్తు తెలిపే పంచాంగాన్ని అగౌరవ పరచడం ఏమాత్రం కాదు. ఇందులోని వ్యంగ్యాన్ని ఆస్వాదించి..అశీర్వదిస్తారని ఆశిస్తూ వికృతి నామ సంవత్సర ఫలితములు...రాజకీయ సామాజిక ఫంచాంగ శ్రవణము

ముఖ్య మంత్రి రోశయ్య
సోనియా శుభదృష్టి వల్ల ముఖ్యమంత్రి పదవి దక్కినా...ఏడో ఇంట్లో ఉన్న కేసీ ఆర్ వల్ల నిత్యం సమస్యల తో తలనొప్పిగా ఉంటుంది...కొన్ని ఇతర కారణాల వల్ల ఇంటి పోరూ తప్పదు.."శ్రీ కృష్ణ "జపం..తో పాటు ప్రణబ్ మంత్రం...చిదంబర దర్శనం, సోనియాలయం పర్యటన, చేస్తూ ఉంటే ఫలితం ఉండవచ్చు..

రాజపూజ్యం : రాజ యోగం
అవమానం: గాంధీ భవనం
ఆదాయం: అనుభవం
వ్యయం: అనారోగ్యం


చంద్రబాబు నాయుడు
హైటెక్ పూజలు చేసి...పల్లె మాతను పట్టించుకోకపోవడం వల్ల కోల్పోయిన రాజ్యం. తెలంగాణా నాయకుల వక్ర దృష్టి వల్ల మరింత నష్టం... మూడో ఇంట బాలయ్య, ఐదో ఇంట ఎన్ టీ ఆర్ ఉండటం వల్ల కొంత వరకూ లాభమే అయినా ప్రస్తుతం..జే ఏ సీ వెంట కొందరు నాయకులుండడం వల్ల రోశయ్య లాగానే ఇంటి గండం ఎదుర్కునే అవకాశం..
సమ్మక్క సారలమ్మలను మొక్కుకుని..యాగం చేసి నాగం ముక్కుకు తాడెయ్యకపోతే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం.

రాజపూజ్యం : ఎన్ టీ ఆర్ ట్రస్ట్ భవనం
ఆందోళనం: తెలంగాణా నాయకుల శిబిరం
ఆదాయం : బాలయ్య తో వియ్యం
వ్యయం: తెలంగాణా విషయంలో కయ్యం


చిరంజీవి
సినీ మతం నుంచి, రాజకీయం వైపు మతం మార్చుకోవడం వల్ల, ప్రేక్షక దేవుళ్లు కరుణించినట్లుగా .ఓటరు దేవుళ్ళు పట్టించుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు..."గురువు"(అల్లు ) బలహీనమవడం వల్ల "మిత్ర " బేధాలు, "పూర్వ " జన్మ పుణ్యం వల్ల "సంతానం " లో మగధీరుల వల్ల లాభం,

రాజపూజ్యం : ప్రేక్షక హృదయాల్లో
అవమానం: అసెంబ్లీ ఎన్నికల్లో
ఆదాయం: మగధీర వసూళ్ళు
వ్యయం : రాజకీయ సవాళ్ళు

కే సీ ఆర్
తెలంగాణా తల్లి విగ్రహ ప్రతిస్టాపన వల్ల కొంత మంచి జరిగినా., వాస్తవ దోషాల వల్ల కొన్ని అపశృతులు,
(ని)గ్రహ దోషాల వల్ల ఆహార లోపం కలిగినా అదీ లాభదాయకమే. (నిరాహార దీక్ష)
ఇతర గ్రహాలన్ని కలిసి జే ఏసీ కూటమి గా మారడం వల్ల కూడా కొన్ని లాభాలు కలుగ వచ్చు, కానీ విద్యార్ధుల్లో ఆవేశాలు.ప్రాణ నష్టం ,"ఖాకీ"ల పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలి, లగడపాటి లాంటి వాళ్ళతో చిన్న చిన్న చికాకులు.

రాజ పూజ్యం: NIMS లో నిరాహార దీక్షా శిబిరం
అవమానం: ఢిల్లీలో కేంద్ర కమిటీ వ్యవహారం
ఆదాయం: జే ఏ సీ సపోర్టు
వ్యయం: శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు

 

 
  ఫణి మాధవ్ కస్తూరి :

స్వతాహాగా హాస్య స్ఫోరకత్వం కలిగిన ఫణి మాధవ్ కస్తూరి మిమిక్రీ కళాకారుడు కావటం వల్ల మరింత హాస్యం అలవడింది. నిత్యం చుట్టూ జరిగే సంఘటనలని చూసి స్పందించి అందులోని విషయాలు జనాలు విన్నప్పుడు నవ్వుకున్నా తరువాత ఆలోచించి కొంతైనా మారతారని ఆశతో వీరు వ్రాసే వ్యంగ్య రచనల సమాహారమే ' ఫన్ కౌంటర్ '. కవితలు, వ్యంగ్యరచనలు ప్రవృత్తయితే సినిమాలకు, టీవీలకు స్క్రిప్టులు వ్రాయటం వీరి వృత్తి. వ్యంగ్యమనేది కించపరిచేదిగా ఉండకూడదు. చురుక్కుమని తగిలి జాగర్తపడేలా ఉండాలి అని జాగ్రత్తలు తీసుకునే ఫణిమాధవ్ ఒక్కోసారి శ్రుతిమించితే అదుపు చేయమని కోరుతున్నారు. "ఫన్ కౌంటర్" నచ్చితే నలుగురికీ చెప్పండి. నచ్చకపోతే నాకు చెప్పండంటారు ఫణిమాథవ్.
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech