కవితా స్రవంతి
నాన్నకు ప్రేమ తో
- షేక్ షహనాజ్

(June19th Father's Day సందర్బంగా )

మనం అనుకున్న దానికంటే
ఎక్కువ గా కష్టపడే వాడే నాన్న !!
తను అనుకున్న దాని కంటే
ఎక్కువ విలువైన వాడే నాన్న !!

పైకి దూరంగా ఉంటూ
మనసు కు దగ్గర గా ఉండేదే .... నాన్న ప్రేమ

నలుగురూ మేచ్చేలా పిల్లల
అభివృద్ధి కి గుర్తింపే .... నాన్న గర్వం

తప్పటడుగులు లేని సక్రమ మార్గం లో
నడిపించాలనే జాగ్రత్తే .... నాన్న కోపం

వెన్ను తట్టి వెనుకే ఉన్నానంటూ
ఇచ్చే ధైర్యమే ....నాన్న గుణం

అడగనిదీ ముఖ్యముగా అడిగినదీ
సమకూర్చే దే .... నాన్న శక్తి

మనదాక రాకుండా కష్టాల్ని ఎదుర్కొని
వటవృక్షమై ఉండ గలిగేదే .... నాన్న సామర్థ్యం

ఎదిగిన పిల్లల్ని స్నేహితులు గా
చేసేదే .... నాన్న అనుబంధం

కడ వరకూ ఇవ్వడమే (ఆస్తుల ని) కానీ
తీస్కోవడం తెలియని తనమే .... నాన్న ఆత్మగౌరవం

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)