సమస్యాపూరణం:
ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.
మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు జూన్ 20వ తేదీ లోగా పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.
ఈ మాసం సమస్య
" ఆ.వె.|| అడవిగాచె వెన్నెలంత యిటుల?"
క్రితమాసం సమస్య
" కం.|| పలుకే బంగారమాయె పలుకుల చిలకా! "
ఈ సమస్యకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.
మొదటి పూరణ - కృష్ణ ఆక్కులు, కుపర్టీనో, కాలిఫోర్నియ.
తలకును డబ్బింగు చెప్పు తప్పుడు భావం
పలుకులకు డబ్బులు కురియ
పలుకే బంగారమాయె పలుకుల చిలకా
కం|| గలగల మనువుకు ముందర
పలుకుచు చిలిపిగ తిరిగిన బాలిక కులుకున్
కిలకిల నగవులు తగ్గగ
పలుకే బంగారమాయె పలుకుల చిలకా
కలిపి మధువుల తలపులను కలిమిగ మదిలో
నిలిపి పలకవేల నిపుడు
పలుకే బంగారమాయె పలుకుల చిలకా
రెండవ పూరణ - శ్యామసుందర్ పుల్లెల, శాన్ హోసే, కాలిఫోర్నియా
వలువలన మరచి ఉతకగ పాడై పోయెన్
గిలగిల లాడుతు అతడనె
"పలుకే బంగారమాయె పలుకుల చిలకా!"
నలుగురిలో నోరుమెదప నని కూర్చుంటే
తలకొట్టుకు పలికెనతడు
"పలుకే బంగారమాయె పలుకుల చిలకా!"
గలగల ఇంగ్లీషు వాగ కాల్సెంటర్లో
సులువుగ డబ్బులు వచ్చును,
పలుకే బంగారమాయె పలుకుల చిలకా!
మూడవ పూరణ - తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియ
చిలిపి నగవు తగవులైన చీల్చగలదు, నీ
పలుకుకొరకె వేచా! నీ
పలుకే బంగారమాయె పలుకుల చిలకా!
వులకదు పలకదు! రిమోటె వున్నది గానీ
నలిగెను మోటీ చేతిలొ!
పలుకే బంగారమాయె పలుకుల చిలకా!
నాల్గవ పూరణ - శ్రీరాం, సిడ్నీ, ఆస్ట్రేలియా
కలుపులు తీస్తు నువుపాట కలుపుతువుంటే!
పొలమున నువె లేకుంటే
పలుకే బంగారమాయె పలుకుల చిలకా
పాఠకులనుంచి మరిన్ని మంచి పద్యాలు
కృష్ణ ఆక్కులు గారు పంపినవి
కర భక్తిగ చూడరాగ కసిగా పదరా
త్వరగా యని నను త్రోసిరె
నరహరి నిన్నే తలవగ నామది నిండా
కరుకు మనుషులన్న ప్రీతి గాదే నీకున్(లక్ష్మీ)
మురికి జనులందు ఎందుకు
కరుణ దలచవో భగవతి కలుములరాణీ
రందురు వారే కొలిచెదరని తమిళులదై
వం నీవనిమరికావా
అందరి వేలుపు కొలువగ అందరు నిన్నే
చల్లగ మమ్ము దయ చూసె చక్కని బాబా
ఉల్లం న నీవె వుండగ
తల్లీ తండ్రిగ పిలిచెద తలచెద నిన్నే

























