పర"దేశి" కతలు: డామిట్! ప్లాన్ తలకిందులైంది!!

-- తాటిపాముల మృత్యుంజయుడు

ఉదయం పది గంటలు. ఆఫీసులో అందరం పనిలో నిమగ్నమై ఉన్నాం. నా దగ్గరికి 'హాయ్' అంటూ హడావుడిగా వచ్చింది మా కొలీగ్ లిండా. ఆవిడలో కాస్తంత ఉద్వేగం కానవస్తుంది. 'హౌ ఆర్యూ డూయింగ్' అంటూ పలకరించాను. 'డు యూ హావ్ ఫైవ్ మినిట్స్?' అంది. బదులుగా 'ష్యూర్ ' అన్నాను.

సంతోషం పెల్లుబికుతుంటే దానికి కారణమైన వార్తను మెల్లగా చెప్పింది 'యు నో దట్ ఐ యాం గోయింగ్ టు హైద్రాబాద్ ఆన్ వర్క్' అంటూ.

'వ్వాటే సర్ప్రైజ్ న్యూస్! వెన్ ఆర్యూ గోయింగ్ అండ్ హౌ లాంగ్?' నాక్కూడా ఆ వార్త సంతోషం కలిగించింది.

'ఇన్ టూ వీక్స్. అండ్ ఐ విల్ బి దేర్ ఫర్ ఎ మంత్ ' అంటుంటే లిండా ముఖంలో ఆనందం పెల్లుబికింది.

కాలానికి ఎంతటి మహత్తరమైన శక్తి ఉంది. అది ఎన్ని అద్భుతాలైనా చెయ్యగలదు. నిన్నమొన్నటి వరకు 'అమెరికా భూతల స్వర్గం. అక్కడి వెడితే జన్మ సార్థకమైనట్టే' అని భారతీయులు భావించితే ఈరోజు అమెరికన్లు ఆఫీసు పనిమీద ఎప్పుడు ఇండియా వెళ్తామా అని ఎదురుచూస్తున్నారు. ఛాన్సొస్తే ఎగిరి గంతేస్తున్నారు.

మా మాటలు విని నా పక్క క్యూబుల్లో ఉన్న సుందర్రావు, వెంకటరమణలు చెరువులో మునిగి వున్న బుడుంగుపిట్ట నీళ్ళలోనుండి తల పైకెత్తినట్టు వాళ్ళ క్యూబుల్లోంచి తలలెత్తి మాకేసి చూసారు. వాళ్ళ ముఖాల్లో సంతోషం తొణికిసలాడగా నా క్యూబుకేసి నడిచారు.

లిండాలో అలజడి, హడావుడి మొదలైనట్టు మొహంలో సూచనలు కానవస్తున్నాయి. ఏందుకంటే, మాకు బాగా తెలుసు, ఆవిడ ఇంతవరకు అమెరికా తప్ప వేరే ఏ దేశం చూళ్ళేదు. పుట్టిబుద్ధి ఎరిగినప్పటినుండి ఇదే మొదటిసారి ఆవిడ అమెరికానుండి అడుగు బయట పెట్టడం. ఇప్పటివరకు అమెరికానే ఆమెకు ప్రపంచమంతా, ప్రపపంచమే అమెరికా అన్నమాట. ఎంత అమాయకురాలంటే ఇండియాలో 'డే లైట్ సేవింగ్స్ ' లేవని తెలుసుకొని ఒకసారి ఆశ్చర్యపడింది కూడా. ఇదంతా చూస్తుంటే నా చిన్నతనంలో మా ఊరి నుండి మొదటిసారి దగ్గర్లోనున్న పట్టణానికి వెళ్ళినప్పుడు కలిగిన ఉద్రేకం నాకు గుర్తొస్తుంది.

'ఐ విల్ బీ ఆస్కింగ్ యూ ఫర్ లాట్స్ ఇ న్ ఫర్మేషన్ ' అంటే 'ష్యూర్! లెట్ మీ నో హౌ వియ్ కన్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఇండియా ట్రిప్' అన్నాను.

ఏ కొద్ది సంతోషానైనా తనలో దాచుకోకుండా బాహాటంగా తెలిపే వెంకటరమణ "నో వర్రీస్! వియ్ విల్ ట్రైన్ యూ ఇన్ ఎవ్రి ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియా ఇన్ టూ వీక్స్" అంటూ అభయం ఇచ్చేశాడు. తిరిగి మాట్లాడుకొందామని పనుల్లో మునిగిపోయాం.

లిండా హైద్రాబాద్ ట్రిప్ సమాచారం టెలీఫొన్ల కాల్స్ ద్వారా, యాహూ ఛాటింగ్ ల్లో, మీటింగ్ అనౌన్స్ మెంట్లలో అందరికి తెలిసిపోసాగింది.

ఈ మధ్యలో మా కంపెని ఇండియాలో సాఫ్ట్ వేర్ డెవెలప్ చేయించుకోటానికి చాలా కన్సల్టింగ్ కంపెనీలకు పని ఇచ్చింది. కొద్ది మంది ఉద్యోగులతో ఓ చిన్న అFఇసు హైద్రాబాదులో మొదలెట్టింది కూడా. త్వరలో అన్నీ పనులు మేమే చేసుకోవాలని ప్రయత్నం. త్వరలోనే 'ఇండియన్ కల్చర్ ' మీద ఒక ట్రైనింగ్ కోర్స్ డెవలప్ చెయ్యాలని చూస్తొంది. అందుకు ఇండియన్లైన కొంతమంది ఉద్యోగులను సూచనలు అడిగింది కూడా.

ఇంకా ఆ ట్రైనింగ్ ఇంకా తయరు కాలేదు కాబట్టి, మా టీం నుండి హైద్రాబాద్ వెళ్ళే అమెరికన్ కొలీగ్స్ కి మేమే కావల్సిన సమాచారం ఇచ్చేది. కాని లిండా కేసు స్పెషల్ కాబట్టి మేం ముగ్గురం ఆవిడ ట్రిప్ ను కొద్దిగా సీరియస్ గానే తీసుకున్నాం.

లిండా వెళ్ళబోయే ముందు ఆ రెండువారాల్లో ప్రతీ రోజు మేం ముగ్గురం ఇండియా జీవనవిధానంపైన, ఆంధ్ర సంస్కృతి గురించి, కుటుంబసభ్యుల సంబంధాలపై, భారతదేశ చరిత్రపై ఎన్నో విషయాలు చెప్పాం. సమయం దొరికితే చాలు భారత దేశం గొప్పతనం గురించి, ఆంధ్రజాతి ఘనతను చెబుతూ క్లాసులు తీసుకొన్నాం.

మాట్లాడే ప్రతీ విషయంలోను కనీసం ఒకసారైనా ఇండియాను గుర్తుకు తెచ్చే సుందర్రావు ఇండియా 'వేదాలకు పుట్టినిల్లని ', వేదాల గురుంచి మరీ వివరిస్తూ అవి 'శృతసం హితాలు ' అలా అయ్యాయో చెప్పుకొచ్చాడు.

ఇండియా ప్రభుత్వం పద్దెనిమిది భాషలను గుర్తించిందని చెప్పినఫ్ఫుడు ఆశ్చర్యపడింది. అవన్ని డయలెక్ట్స్ అని భావించింది. అప్పూడు సుందర్రావు ఒకింత ఆవేశంతో ప్రతీ భాష దేనికదే స్వతంత్ర్య భాష అంటూ తెలుగు భాషలోని తీయదనాన్ని, తెలుగు మాట్లాడుతుంటే పాడినట్టుందని, అందుకే దానిని 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' అన్నారని చెప్పాడు. ఆఫీసులో కూడా మీటింగుల్లో తప్ప మిగతా సమయాల్లో తెలుగు మాట్లాడుతారని చెప్పాము.

ఇండియా కల్చర్ అంటే 'భిన్నత్వంలో ఏకత్వం' అని చెప్పినప్పుడు "ఓ! ఐ సీ! ఇట్ ఈజ్ లైక్ బాస్కెట్ కల్చర్ ' అని అంది.

భారతదేశం ఎన్నో మతాలకు పుట్టినిల్లని, భారతీయులందరికి మతసహనం చిన్నప్పటినుండే అలవడుతుందని కాలర్లు ఎగరేస్తూ చెప్పినపుడు 'వెరీ గుడ్ కంట్రీ' అని కొనియాడింది.

ఇండియాలో జరిగే ముఖ్యమైన పండుగల గురించి చెబుతూ, ముఖ్యంగా 'దీపావళీ ' గురించి వివరించినప్పుడు. 'ఓ! ఐ నో దిస్ బ్లూ గాడ్ బిఫోర్ ' అంది. 'నీలమేఘ శ్యామల వర్ణా'న్ని అంత ఈజీగా 'బ్లూ కలర్ ' అంటూంటే బాధేసింది, వినాయకుణ్ణి 'ఎలిఫెంట్ గాడ్' అన్నట్టు.

సినిమాలా ప్రభావం గురించి చెబుతూ చిరంజీవి ఫ్యాను అయిన వెంకటరమణ ఆ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి, తను ఇండియాలో వారానికి మూడు సినిమాలు చూసేవాడినని, సినిమాలు నిత్య జీవితంలో ఒక భాగం అని విశదపరిచాడు.

అలాగే నేను కొన్ని సున్నితమైన పాయింట్లు అందుకున్నాను. ఇప్పటికి భార్యభర్తలు బహిరంగంగా ప్రేమ చూపించుకోరని, హగ్గింగ్ మరియూ రోడ్లపై ముద్దుపెట్టుకోరని సుతిమెత్తగా చెప్పాను.

ముఖ్యమైన విషయాలన్ని ఓ నోట్ బుక్ లో రాఆసుకుంది. మరింత సమాచారం కోసం గూగ్లింగ్ చేసింది. బుక్ స్టొర్ కెళ్ళి కొన్ని పుస్తకాలు కొనుక్కొని ప్రతీ పేజీ ఒకటికి రెండుసార్లు చదివింది.

మేము ముగ్గురం లిండాకు ప్లాన్ చేసుకొని ఇచ్చిన ట్రైనింగుకు భారతదేశ పౌరులుగా, ఆంధ్రమాత ముద్దుబిడ్డలుగా చాలా గర్వపడ్డాం. ఒకరి వీపులు ఇంకొకరు చరుచుకొన్నాం.

మేము ముగ్గురం లిండాకు ప్లాన్ చేసుకొని ఇచ్చిన ట్రైనింగుకు భారతదేశ పౌరులుగా, ఆంధ్రమాత ముద్దుబిడ్డలుగా చాలా గర్వపడ్డాం. ఒకరి వీపులు ఇంకొకరు చరుచుకొన్నాం.

అనుకొన్న సమయం రానే వచ్చింది. లిండా ఇండియా వెళ్ళింది. చూస్తుండగానే నెల రోజులు గడిచాయి. లిండా తిరిగి అమెరికా వచ్చేసింది.

పుల్లారెడ్డి స్వీట్లు, లేపాక్షి నుండి కొన్ని గిఫ్టులు కొనుక్కొని వచ్చింది. అక్కడ కొందరు ఆడ ఉద్యోగులు లిండాకు పట్టుచీర కొనిపెట్టి కట్టడం కూడా నేర్పారు. ఆ ఫోటోలను చూపించింది.

మరుసటి రోజు తీరిక చూసుకొని నాక్యూబుకు వచ్చింది.

'సో, హౌ వస్ యువర్ స్టే ఇన్ హైద్రాబాద్?' అను ఆడిగాను. 'గ్రేట్ ' అంది. "థాంక్స్ ఫర్ యువర్ ఇంఫర్మేషన్. ఇట్ వస్ వెరీ హెల్ప్ ఫుల్..." అంటుటే సుందర్రావు, వెంకటరమణలు అక్కడకు చేరుకున్నారు.

'బట్ సం ఆఫ్ థె థింగ్స్ ఆర్ కంఫ్యూసింగ్ అంద్ కాంట్రడిక్టింగ్ ఆఫ్ వాట్ యూ గైస్ టోల్డ్ మీ ' అంది.

'ఏంటవి ' అని అడుగుదామనుకొంటే, తనే తిరిగి చెప్పుకొచ్చింది. దాని సారాంశం ఇది.

అక్కడి అఫీసుల్లో ఎవరు తెలుగు మాట్లాడుకోవటం లేదని, ఏ ఇద్దరు తెలుగు వాళ్ళైనా ఇంగ్లీషులోనే మాట్లాదుకొంటున్నారని చెబుతూ ఆశ్చర్యపోయింది. అలాగే బయతికెళితే అటు తెలుగు కాక, ఇటు ఇంగ్లీషు గాక అంతా హిందీమయం అని చెప్పిండి. 'కరక్టే! ఆవిడ వెళ్ళింది హైద్రాబాదు కదా! ఆ విషయాన్ని మరిచిపోయి పప్పలో కాలేసాం.' అనుకొన్నాం.

హోటల్లో ఉన్నప్పుడు పొద్దుపోనప్పుడు తెలుగు టీవీ చూసిందట. ఆ టీవీలో యాంకర్లు అటు తెలుగు గాక, ఇటు ఇంగ్లీషు గాకా, మరెటు హిందీ మరీ గాకుడా, మూడింటీని కలిపి కొడుతూ, ముద్దు ముద్దుగా అదో రకంగా మాట్లాడుతున్నారటా. అదేవైనా కొత్త బాషా అని అడిగితే ఏం చెప్పాలో తెలియక ఆ విషయాన్ని దాటేసాం.

టీవీలో ఒకటి అరా తెలుగు సినిమాలు చూసిందట. మీరేమో ఆడమగా ఇంట్లో తప్ప బయట కనీసం చేతులు కలిపి నడవరు అన్నారు కాని ఆ సినిమా అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. హీరోయిన్ హీరోను చూడగానే 'రాస్కేళ్, 'ఈడియట్, 'ఐ లవ్యూ రా' అంటు మీదపడిపోతున్నదని, ఓ పాటలో పెళ్ళవగానె సిడ్నిలో రోడ్డూ మీద పట్టపగలు పదిమంది చూస్తుండగానే దాదాపు లవ్ మేకింగు చేసుకొన్నారని వివరించి ఇంకా ఆ సినిమా వికృతాలని చెప్పుకొచ్చింది. వెంటనే వెంకటరమణ ఆ సినిమా పేరు, అందులో సిడ్నీ రోడ్లపై షూటీంగ్ చేసిన శోభనం పాటని మా చెవిలో ఉదాడు. 'హౌరా ఎంత పనయ్యింది ' అనుకున్నాం.

ఆవిడకేదో పనుండి మళ్ళీ వచ్చి మాట్లాడుతానని వెళ్ళింది. మేం ముగ్గురం ఒకళ్ళ మొహాలు ఒకరం ఓ క్షణం చూసుకొని మా పనుల్లోకి వేళ్ళాం.

లిండా మాటలు నా చెవుల్లో ఇంగుర్లు తిరుగుతుంటే అప్రయత్నంగా నా చెయ్యి ఫోను మీదకు వెళ్ళీంది. వెంటనే 'ఇండియన్ కల్చర్ ' ట్రైనింగు డిపార్ట్ మెంటూకు ఫోను చేసి 'మీరు ఎంతైనా భారతదేశ గొప్పతనాన్ని గూర్చి ఎంతైనా చెప్పండి. కాని ఒక అభ్యర్థన ఏంటంటే, తెలుగుసినిమాలు, టీవీలు చూడొద్దని రాయండి' అని చెబుదామని.