పదవిన్యాసం

నిర్వహణ: కూచిభొట్ల శాంతి

ఆధారాలు :

నిలువు:

1. వివేకము లేకుండా చేసే పనులు (6)

2. మనసులో లేకున్నా పైకి ఉన్నట్లు నటించటం (5)

3. మనసు "ఇటు"వంటిది అంటుంటారు విజ్ఞులు (2)

4. చేవ్రాలు, చిలిపి, కలిపి అన్నింట్లో ఉన్నదే (2)

5. గోడ అలమార (5)

6. ఒకరకం ధాన్యం (3)

7. పైకెక్కిన "నయనాల"తో చూస్తే ఏం లాభం? (3)

8. సరస్సు (5)

10. పొలాల్లో కంటే మాటల్తో "కోతలు కోయటం"లో పనిమంతులు చాలా మంది ఉంటారు (4)

14. అరణ్యవాసానికి ఈ బట్టలు ధరించి వెళ్ళారు (2)

18. మాయమాటలు చెప్పటం (6)

19. మంటల్లో దూకటానికి సిధ్ధంగా ఉంటుందెప్పుడూ (3)

20. పధ్ధతి (2)

21. లక్ష్మీదేవి (1)

22. ఒకరకం కూర, బొబ్బర్లు (4)

24. నీటి బొట్టు (2)

25. పుణ్య స్త్రీ (4)

26. ఒక రకమైన లత; అత్యంత మధురం (4)

27. పుట్ట గొడుగు (3)

29. గణబధ్ధం, పాదబధ్ధం కాని పదాల కూర్పు (3)

అడ్డం:

1. అటుపైన (3)

4. "ఇలాంటి"వాటికి గ్రామాదికారి దగ్గరకు వెళ్ళడం ఎంతైనా మంచిది (6)

9. ఇవి చిన్నపిల్లల ఆటవస్తువులు (6)

11. అపరాలులో ఒక రకం (3)

12. ఇంకానయం. సాంతం ఉంటే.. దీనితో తలగోక్కున్నట్లే (2)

13. ఎంత పెద్ద భవంతికైనా "ఇదే కదా" చాలా ముఖ్యం (5)

15. కొమ్ముకాయని పొలం (2)

16. ఒక రకం ఆకుకూర (4)

17. ఎంత అడ్డగోలగా ఉన్నా "చెట్టు యంత" ఎదిగిన పిల్లల్ని ఎలా మందలిస్తాం? (4)

19. ధర్మసాధనకు ఇది ప్రధానమని అంటారు (3)

22. పరిమితి (3)

23. అంత పిసినారా? (2)

25. తేలికగా చేయదగిన (3)

27. పసిపిల్లలకు జుట్టు ఆరపెట్టేందుకు "దీన్ని" కూడా వాడతారు (4)

28. ఎటువంటివారైనా పొద్దుపోయాక చేరేది ఇక్కడకే (2)

29. అక్షరలోపంతో స్త్రీ (2)

30. యుధ్ధంలో ఉపయోగించే ఒక ఆయుధం (2)

31. శీతలం (2)

32. ఒక ఆకుకూర లేక గంగ వావిలి కూర (2)

33. ఒకటి అడ్డంలోనిది సగమే (2)

ఇక మీరు చేయవలసినదల్లా...

అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
జూన్ 25, 2007

ఈ-మెయిలు: santhi@siliconandhra.org

చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014

గత మాసపు పదవిన్యాసం సమాధానాలు:గత మాసపు పదవిన్యాసంలో మాకు అందిన సమాధానాల్లో ఒక్కటీ పూర్తిగా సరైన సమాధానాలు ఉన్న పూరణలు అందలేదు. అందువల్ల మే నెల పదవిన్యాసం విజేతలుగా ఎవరినీ ప్రకటించుట లేదు.